Monday, February 4, 2019

డిశెంబర్, 2018 - కరెంట్ అఫైర్స్


ఇండోనేషియాలో భారీ సునామీ 

ఇండోనేషియాలో సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధి లోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలడంతో డిసెంబర్ 22న భారీ సునామీ సంభవించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేషియాలో భారీ సునామీ 
ఎప్పుడు : డిసెంబర్ 22 
ఎందుకు : ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలడంతో

ఐరాస మంత్రుల సదస్సులో ఏకే మెహతా
పోలెండ్‌లోని కటోవైస్ నగరంలో జరుగుతున్న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సులో డిసెంబర్ 13న భారత్ తరఫున కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా పాల్గొన్నారు. క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సు 
ఎప్పుడు : డిసెంబర్ 13 
ఎవరు : కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా
ఎక్కడ : కటోవైస్, పోలెండ్ 

ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధం 
అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్ పార్లమెంట్ డిసెంబర్ 14న రాజ్యాంగ సవరణ చేసింది. 2019, జనవరి నుంచి సవరణ చట్టం అమల్లోకి వస్తుందని ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్ తెలిపారు. దీంతో గర్భం ధరించిన మహిళ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందన్న సందర్భంలో 12 వారాల వరకు ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు. కడుపులో పిండం ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు డెలివరీకి 28 రోజుల లోపులో కానీ, ఇంకా ముందుగానీ అబార్షన్ చేయించుకోవచ్చు.
ఐర్లాండ్‌లో అబార్షన్ మీద నిషేధం ఎత్తివేయాలంటూ 2018, మేలో ప్రవేశపెట్టిన రిఫరెండానికి 66 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. 1980 నుంచి ఇప్పటివరకు 7.77 లక్షల మంది ఐర్లాండ్ మహిళలు అబార్షన్ కోసం బలవంతంగా బ్రిటన్‌కు వెళ్లి వచ్చారు. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధం 
ఎప్పుడు : డిసెంబర్ 14 
ఎవరు : ఐర్లాండ్ పార్లమెంట్ 

పారిస్ ఒప్పందంముందడుగు 
కర్బన ఉద్గారాల (carbon) వెల్లువను కట్టడి చేసే దిశగా ప్రపంచ సమాజం ఓ అడుగు ముందుకేసింది. మూడు సంవత్సరాల క్రితం 2015  పారిస్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్నే కొనసాగించాలని డిసెంబర్ 16న ఉదయం జరిగిన కాప్-24 తుదిరోజు సదస్సు తీర్మానించింది. 2015లో ఫ్రాన్స్ రాజధానిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు దేశాలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ ముప్పునుంచి బయటపడాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్బన ఉద్గారాల వెల్లువను కట్టడి
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎందుకు: పర్యావరణ పరిరక్షణే లక్ష్యగా

శ్రీలంక ప్రధానిగా మళ్లీ విక్రమ సింఘే 
శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష పరిపాలనా భవనంలో డిసెంబర్ 16న జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిసేన యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)నేత విక్రమ సింఘేతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఏమిటి : శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే తిరిగి బాధ్యతలు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు: రణిల్ విక్రమ సింఘే

తాత్కాలికంగా బ్రిటన్ గోల్డెన్ వీసారద్దు 
Current Affairsగోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిసెంబర్ 6న బ్రిటన్ ప్రకటించింది. గోల్డెన్ వీసా దుర్వినియోగం అయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం ఇచ్చేందుకు గోల్డెన్ వీసాను జారీ చేస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాత్కాలికంగా గోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా) రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : బ్రిటన్ 
ఎక్కడ : బ్రిటన్ 

లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానం
ఐరోపా దేశమైన లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానంను ప్రవేశపెట్టనున్నారు.
మేరకు 2020 నుంచి దేశంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టనున్నట్టు ఆ దేశ ప్రధాని గ్జేవియర్ బెటెల్ డిసెంబర్ 6న ప్రకటించారు. దీంతో ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమలుచేయనున్న తొలి దేశంగా లక్సంబర్గ్ నిలవనుంది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా బెటెల్ చెప్పారు. 2013లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉచిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజా రవాణా ఉచితం చేయడం వల్ల ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 నుంచి ఉచిత రవాణా విధానం
ఎప్పుడు : డిసెంబర్ 6 
ఎవరు : లక్సంబర్గ్ ప్రధాని గ్జేవియర్ బెటెల్
ఎక్కడ : లక్సంబర్గ్ 

బ్రిక్స్ (BRICS [BREZILE, RUSSIA, INDIA, CHINA AND SOUTH AFRICA]) దేశాధినేతల భేటీలో మోదీ ప్రసంగం
అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ఏయిర్స్‌లో నవంబర్ 30న ప్రారంభమైన జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల నాయకులతో అనధికారికంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని అన్నారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని సూచించారు. 
మరోవైపు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక (3 COUNTRY MEETING) భేటీ నవంబర్ 30న జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. జై (JAI - జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థంఅని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ దేశాధినేతల భేటీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం 
ఎప్పుడు : నవంబర్ 30 
ఎక్కడ : బ్యూనస్‌ఏయిర్స్, అర్జెంటీనా 

జీ-20 సదస్సులో పాల్గొన్న మోదీ
అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్‌లో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో జరిగిన జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల కేసుల్లో (EXAMPLE: VIJAY MALYA) జీ-20 దేశాల మధ్య బలమైన, చురుకైన సహకారం ఉండాలని కోరారు. ఇందుకోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
భారత్‌లో 2022 జీ-20 సదస్సు...  
భారత్‌లో 2022 జీ-సదస్సును నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2021లో భారత్, 2022లో ఇటలీ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, 2022లో దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోనున్నందున దీంతోపాటు జీ-20 భేటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా భారత్ చేసిన విజ్ఞప్తిని ఇటలీ అంగీకరించింది. దీని ప్రకారం 2021లో ఇటలీలో జీ-20 సమావేశం జరగనుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు
ఎప్పుడు : నవంబర్ 30, డిసెంబర్ 1
ఎక్కడ : బ్యూనోస్ ఎయిర్స్, అర్జెంటీనా 


ఒడిశాలో కలియా పథకం
ఒడిశాలో కలియా (కృషక్ అసిస్టెన్‌‌స ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డిసెంబర్ 21న ప్రకటించారు.
కలియా పథకం- అంశాలు (DONT REMEMBER FIGURES)
·         భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్‌లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే.
·         గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు.
·         వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు వంటి కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం.
·         భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా
·         50 వేల వరకు వడ్డీ లేని రుణాల మంజూరు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒడిశాలో కలియా పథకం 
ఎప్పుడు : డిసెంబర్ 21 
ఎవరు : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 

కంప్యూటర్లపై పది ప్రభుత్వ సంస్థలకు అధికారం 
దేశంలోని కంప్యూటర్లపై పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలు కల్పిస్తూ డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పది ప్రభుత్వ సంస్థలు దేశంలోని ఏ కంప్యూటర్‌లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించడంతోపాటు డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయవచ్చు. అయితే కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతిని ఆ సంస్థలు తీసుకోవాలి. దేశ భద్రత, ఇతర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పది సంస్థలకు అధికారాలు కల్పించినట్లు కేంద్రం పేర్కొంది.
కేంద్రం అధికారాలిచ్చిన పది సంస్థలు
1.   ఇంటెలిజెన్‌‌స బ్యూరో(ఐబీ)
2.   నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
3.   ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)
4.   ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ)
5.   డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్‌‌స(డీఆర్‌ఐ)
6.   సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
7.   నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)
8.   రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)
9.   డెరైక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్‌‌స(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం)
10.      ఢిల్లీ పోలిస్ కమిషనర్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోని కంప్యూటర్లపై పది ప్రభుత్వ సంస్థలకు అధికారం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : కేంద్రప్రభుత్వం 

పద్మతరహాలో జాతీయ ఏకతా పురస్కారాలు 
పద్మ అవార్డుల తరహాలో కొత్తగా జాతీయ ఏకతా పురస్కారాలు అందించనున్నుట్లు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 23న ప్రకటించారు. జాతీయ ఏకతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన కృషి నుంచి స్ఫూర్తి పొందేలా ఏడాదికోసారి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. జాతీయ ఏకతకు విశేషంగా కృషి చేసిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఏకతా పురస్కారాలు 
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : జాతీయ ఏకతకు విశేషంగా కృషిచేసిన వారికి 

3643 కోట్లతో శివాజీ విగ్రహం (JUST READ NOT IMPORTANT)
అరేబియా సముద్రంలో ముంబై తీరంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి(శివ్ స్మారక్) మహారాష్ట్ర ప్రభుత్వం రూ.3,643.78 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో సర్వే, స్థలాన్వేషణ మొదలు భద్రత వరకు అన్ని రకాల వ్యయాలు కలిపి ఉన్నాయి. మొత్తంగా 2022-23 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని డిసెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.3,643.78 కోట్లతో శివాజీ విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : అరేబియా సముద్రం, ముంబై తీరం 

సదైవ్ అటల్ను ప్రారంభించిన రాష్ట్రపతి 
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్ మెమోరియల్ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సదైవ్ అటల్ మెమోరియల్ ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 24 
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రీయ స్మృతి స్థల్, ఢిల్లీ 


బోగీబీల్ వంతెన ప్రారంభం 
దేశంలో అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన అయిన బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25అస్సాంలో డిబ్రూగఢ్ సమీపంలోని బోగీబీల్ వద్ద ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలో మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన వల్ల అస్సాంలోని డిబ్రూగఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ల మధ్య ప్రయాణ దూరం రోడ్డు మార్గంలో 150 కి.మీ, రైల్వే మార్గంలో 705 కి.మీ తగ్గనుంది.
బోగీబీల్ వంతెన గుండా ప్రయాణించే తొలి రైలు టిన్సుకియా-నహర్లాగున్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. అస్సాంలోని టిన్సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్లాగున్ స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని ఈ రైలు ప్రస్తుతం కంటే 10 గంటలు తగ్గిస్తుంది.
దేశ భద్రతకూ ఉపయోగం...
బోగీబీల్ వంతెన అస్సాం, అరుణాచల్ మధ్య రాకపోకలకే కాకుండా దేశ భద్రతకు కూడా తోడ్పడనుంది. అరుణాచల్‌లోని చైనా సరిహద్దు వరకు వేగంగా బలగాలను, సైనిక సామగ్రిని వేగంగా తరలించేందుకు ఇది ఉపయోగపడనుంది. అత్యవసర సందర్భాల్లో యుద్ధ విమానాలు దిగేందుకు కూడా అనుకూలంగా వంతెనను నిర్మించారు. 

క్విక్ రివ్యూ :
ఏమిటి : బోగీబీల్ వంతెన ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 25 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : బోగీబీల్, డిబ్రూగఢ్, అస్సాం 

క్రాస్‌బౌ-18 క్షిపణి విన్యాసాలు ముగింపు
క్రాసబౌ-2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు డిసెంబర్ 13న ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో డిసెంబర్ 3 నుంచి జరిగిన ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల (AIR FORCE)మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రాస్‌బౌ-18 క్షిపణి ప్రయోగ విన్యాసాలు ముగింపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత వైమానిక దళం
ఎక్కడ : ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, సూర్యలంక, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర మాతగా గోవు. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర మాతగా గోవు
ఎప్పుడు : డిసెంబర్ 14 
ఎవరు : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ 


దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన 
ప్రధానమంత్రి ఉజ్వల యోజనను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 17న తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించేందుకు ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు. తర్వాతి కాలంలో ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి దీనిని విస్తరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అమలు 
ఎప్పుడు : డిసెంబర్ 17 
ఎవరు : కేంద్రప్రభుత్వం 

లింగ అసమానతలో భారత్‌కు 108వ స్థానం
స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు సంబంధించి భారత్‌కు 108వ స్థానం దక్కింది. ఈ మేరకు గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్-2018రూపొందించిన జాబితాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) డిసెంబర్ 18న విడుదల చేసింది. ఈ జాబితాలో ఐస్‌లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థికపరమైన అవకాశాలు, రాజకీయ సాధికారికత, విద్య, ఆరోగ్యం, మనుగడలను ప్రధాన అంశాలుగా తీసుకుని జండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాను రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లింగ అసమానతలో భారత్‌కు 108వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 18 
ఎవరు : వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం (IMPORTANT- READ ALL POINTS)
సరోగసీ (రెగ్యులేషన్) బిల్లుకు డిసెంబర్ 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం 23-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు, 26-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మాత్రమే సరోగసీ(అద్దె గర్భం) కోసం దరఖాస్తు చేసుకోవాలి.

సరోగసీ బిల్లు-ముఖ్యాంశాలు
-
వాణిజ్య అవసరాల కోసం సరోగసీ చేపట్టడాన్ని నిషేధించారు. 
-
ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులు, పీఐవోలు, హోమో సెక్సువల్స్, సింగిల్ పేరెంట్స్, సహ జీవనం చేసే జంటలు సరోగసీకి అనర్హులు. 
-
ఒకే సంతానం ఉన్న జంటలు సైతం సరోగసికి అర్హులు కారు. కానీ వీరు ఇతర చట్టాల ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవచ్చు. 
-
సమీప బంధువులు అంటే సోదరి లేదా మరదలు వంటివారినే సరోగసీ కోసం అనుమతిస్తారు. 
-
ఓ మహిళను సరోగసీ కోసం జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. 
-
సరోగసికి ముందుకొచ్చే మహిళకు అప్పటికే వివాహమై, ఓ కుమారుడు/కుమార్తె ఉండాలి. 
-
ఈ చట్టం జమ్మూకశ్మీర్ తప్ప దేశమంతటా వర్తిస్తుంది. 
- 3
నెలల్లోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరోగసీ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 19 
ఎవరు : లోక్‌సభ


నావికాదళంలో చేరిన డీఎస్‌ఆర్వీ (DSRV) – JSUT READ
సముద్రలోతుల్లో జలాంతర్గాములు అపాయంలో చిక్కుకున్నప్పుడు అందులోని సిబ్బందిని సురక్షితంగా కాపాడే డీఎస్‌ఆర్వీ (డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్) భారత నావికాదళంలో చేరింది. ఐఎన్‌ఎస్ నిస్తార్ గా పిలిచే ఈ వాహనాన్ని ముంబై డాక్‌యార్డులో డిసెంబర్ 13న నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా నేవీలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్‌ఎస్ నిస్తార్ పాడైపోయిన జలాంతర్గామి, అందులోని సిబ్బందిని రక్షించడంతోపాటు రహస్య మిషన్లను కూడా సమర్థవంతంగా నిర్వహించగలదు.
ఐఎన్‌ఎస్ సబర్మతి నౌకపై మోహరించిన నిస్తార్ ముంబై కేంద్రంగా పనిచేయనుంది. దీనిని స్కాట్‌లాండ్‌లోని జేఎఫ్‌డీ సంస్థ తయారు చేసింది. అదేవిధంగా ఐఎన్‌ఎస్ నిరీక్షక్ పేరుతో మరో డీఎస్‌ఆర్‌వీని కూడా నేవీ సమకూర్చుకోనుంది. దీనిని విశాఖపట్నంలో ఉంచనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నావికాదళంలో చేరిన డీఎస్‌ఆర్వీ ఐఎన్‌ఎస్ నిస్తార్ 
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర 

పార్ట్‌నర్స్ ఫోరమ్ సదస్సు ప్రారంభం 
రెండ్రోజులపాటు జరిగే పార్ట్‌నర్స్ ఫోరమ్ - 2018’ సదస్సును న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 12న ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పార్ట్‌నర్స్ ఫోరమ్ - 2018 సదస్సు ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 
ఎక్కడ : న్యూడిల్లీ 



సాక్షుల భద్రత ముసాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం (JUST READ AND KNOW)
(Julayi Movie lo Allu arjun ki protection ichinatlu)
వివిధ కేసుల్లో సాక్ష్యం చెప్పే వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీం ముసాయిదాకు సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు అన్ని రాష్ట్రాలు ఈ ముసాయిదాను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. 
రేప్ కేసులో అరెస్టయిన వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుస దాడులకు గురవడంతోపాటు అదృశ్యమవుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ)లను సంప్రదించిన అనంతరం ఈ ముసాయిదాకు కేంద్రం తుదిరూపం దాల్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీం ముసాయిదాకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : సుప్రీంకోర్టు

ఢిల్లీలో వృద్ధుల తీర్థయాత్ర యోజన ప్రారంభం (just remember Scheme & Place)
వృద్ధుల కోసం ఉచిత తీర్థయాత్రల పథకం ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 5న ప్రారంభించారు. ఢిల్లీలో నివసించే, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఈ యాత్రకు వెళ్లొచ్చు. ఢిల్లీలోని 70 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కొక్క స్థానం నుంచి మొత్తం 1,100 మంది వృద్ధులు.. మొత్తంగా 77 వేల మంది ఈ పథకం ప్రయోజనాలను పొందొచ్చు. మథుర, హరిద్వార్, రుషికేశ్, నీల్‌కంఠ్, పుష్కర్, బృందావన్, అమృత్‌సర్, వైష్ణోదేవి ఆలయం తదితరాలకు వృద్ధులను యాత్రకు పంపుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : న్యూఢిల్లీ

ఆంధ్రప్రదేశ్‌లో పెథాయ్తుపాను
ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 17పెథాయ్ తూపాను రెండుసార్లు తీరం దాటింది. మొదటగా కాకినాడ సమీపంలోని తాళ్లరేవు-కాట్రేనికోన మధ్య తీరాన్ని తాకిన పెథాయ్ దిశను మార్చుకుని బంగాళాఖాతంలోకి మళ్లింది. మళ్లీ దిశను మార్చుకున్న తూపాను తూర్పుగోదావరి జిల్లా యానాం-కాకినాడ మధ్య 50-70 కి.మీ. వేగంతో మరోసారి తీరం దాటింది. ఒకే తూపాను రెండుసార్లు తీరం చాలా అరుదుగా జరుగుతుంది. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : తీరం దాటిన పెథాయ్ తుపాను
ఎప్పుడు : డిసెంబర్ 17 
ఎక్కడ : యానాం-కాకినాడ మధ్య, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

పెథాయ్తుపాన్ పేరు వెనక...  (read all points below)
మొన్న తిత్లి. నిన్న గజ. నేడు పెథాయ్. పేర్లు వేరైనా అవన్నీ ఇటీవల వేర్వేరు రాష్ట్రాల్లో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లి పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న తుపానుకు పెథాయ్ అని పేరు పెట్టింది థాయిలాండ్. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజ అని అర్థం. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే తుపానులకు వాడిన పేర్లను మళ్లీ ఆరు సంవత్సరాల తరువాత వాడుతారు. ఇందుకోసం కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో సంభవించే తుపాను ఊహించిన దానికన్నా తీవ్రతరమైనా, ఆ పేరు అయోగ్యమైనదని భావించినా దాన్ని జాబితా నుంచి తొలగించి కొత్త పేరు చేర్చుతారు. కానీ ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకసారి వాడిన పేరును మళ్లీ వాడరు. భవిష్యత్‌లో సంభవించే తుపానులకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, థాయిలాండ్ దేశాలు సూచించిన పేర్లతో ఇప్పటికే జాబితా సిద్ధమైంది. రాబోయే తదుపరి తుపానుకు ఫణి, వాయు, మహా, బుల్‌బుల్‌లలో ఏదో ఒక పేరును పెట్టనున్నారు. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెథాయ్ తుపాన్
ఎందుకు: తుపానులకు పేర్లు 
ఎవరు: ఆగ్నేయాసియాలోని దేశాలు


ఏఎన్‌యూలో దస్సాల్ట్ సెంటర్ ప్రారంభం
గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో దస్సాల్ట్ సంస్థ ఏర్పాటు చేసిన త్రీడీ యానిమేషన్ మాస్టర్ సెంటర్ ప్రారంభమైంది. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్‌తో కలసి ఏపీ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిసెంబర్ 10న ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పలు కళాశాలల్లో జరిగే శిక్షణా తరగతులు పర్యవేక్షించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దస్సాల్ట్ త్రీడీ యానిమేషన్ మాస్టర్ సెంటర్ ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 10 
ఎక్కడ : ఏఎన్‌యూ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్



విశాఖ జైలులో సుధార్ప్రారంభం 
విశాఖపట్నం కేంద్ర కారాగారంలో వస్తు విక్రయ కేంద్రం సుధార్ ను జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఇండ్ల శ్రీనివాసరావు డిసెంబర్ 3న ప్రారంభించారు. సుధార్ కేంద్రంలో జైలు లోపల పరిశ్రమల్లో ఖైదీలు తయారుచేసిన కలర్ డర్రీస్, డోర్ మేట్స్, యోగా మేట్స్, బెడ్‌షీట్లు, క్లాత్ సంచులు, సెంటెడ్ పినాయిల్, బేకరీ పదార్థాలు, కూరగాయలు విక్రయించనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వస్తు విక్రయ కేంద్రం సుధార్ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎక్కడ : విశాఖపట్నం కేంద్ర కారాగారం, ఆంధ్ర ప్రదేశ్ 

మూడు బ్యాంకుల విలీనానికి ఆమోదం
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోదం తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిసెంబర్ 21న ఈ విషయం వెల్లడించింది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉండనుంది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీనానికి ఆమోదం 
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ

నీతి ఆయోగ్ వ్యూహపత్రం (vision document) విడుదల
దేశ జీడీపీలో 9-10 శాతం వృద్ధి రేటును సాధించడంతోపాటు 2022-23 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 4 లక్షల కోట్ల డాలర్లకు పెంచే లక్ష్యంతో రూపొందించిన వ్యూహపత్రంను నీతిఆయోగ్ డిసెంబర్ 19న విడుదల చేసింది. ‘‘స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా @ 75’’ పేరుతో ఈ వ్యూహపత్రాన్ని రూపొందించారు. భారత్ ముందుగా వచ్చే ఐదేళ్లు (2018-23) 8-9 శాతం జీడీపీ సాధించాలని నీతి ఆయోగ్ ఈ పత్రంలో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 2.7 లక్షలకోట్ల డాలర్లున్న దేశ ఎకానమీ 2022-23 నాటికి 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని వివరించింది.
భారత్ ప్రాథమిక రంగంపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం కాబట్టి రైతులను పరిపుష్టం చేయాలని నీతిఆయోగ్ ఈ పత్రంలో సూచించింది. అయితే రైతు కష్టాలు తీర్చేందుకు రుణమాఫీ సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడింది. అధిక వృద్ధి సాధనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన 41 రంగాల గుర్తించి, వీటిపై తీసుకోవాల్సిన విసృ్తత చర్యలను వ్యూహపత్రంలో పొందుపరిచింది. భారత్ 2022నాటికి స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవం) అవుతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన చేసింది.
క్విక్ రివ్యూ : 
ఏమిటి : స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా @ 75 పేరుతో వ్యూహపత్రం విడుదల 
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : నీతి ఆయోగ్ 

రెమిటెన్స్ లో భారత్‌కు అగ్రస్థానం 
ప్రవాసులు (Foreign lo settele ayina Indians) స్వదేశాలకు పంపే నగదు(రెమిటెన్స్)లో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు వలసలు, అభివృద్ధి వార్షిక నివేదికను డిసెంబర్ 8న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు 2018లో అత్యధికంగా రూ.5.7 లక్షల కోట్ల (8,000 కోట్ల డాలర్లు) నగదును స్వదేశానికి పంపారు. భారత్ తర్వాతి స్థానాల్లో రూ.4.78 లక్షల కోట్లతో చైనా, రూ.2.42 లక్షల కోట్లు చొప్పున మెక్సికో, ఫిలిప్పీన్స్, రూ.1.85 లక్షల కోట్లతో ఈజిప్టు ఉన్నాయి. 2018లో అభివృద్ధి చెందుతున్న దేశాల రెమిటెన్స్ లు అత్యధిక స్థాయిలో 10.8 శాతం మేర పెరిగి రూ.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే అధిక ఆదాయం ఉన్న దేశాల రెమిటెన్స్ లు 10.3 శాతం పెరిగి రూ.49 లక్షల కోట్లకు చేరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెమిటెన్స్-2018లో భారత్‌కు అగ్రస్థానం 
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ చందా పెంపు
జాతీయ పింఛను పథకం (NPS – National pension Scheme)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ డిసెంబర్ 10న ప్రకటించారు.


చైనా చాంగె-4 ప్రోబ్ మిషన్విజయవంతం
చంద్రుడి వెనక భాగంపై పరిశోధన చేసేందుకు చైనా డిసెంబర్ 8న చేపట్టిన చాంగె-4 ప్రోబ్ మిషన్ప్రయోగం విజయవంతమైంది. దీంతో చంద్రుడి వెనక భాగంపై పరిశోధన చేసేందుకు రోవర్‌ను పంపిన తొలి దేశంగా చైనా నిలిచింది. చంద్రుడి ఉపరితలంపై ఖనిజాల పరిశీలనకు, బంగాళాదుంపలు, ఇతర విత్తనాలు నాటేందుకున్న పరిస్థితులపై చాంగె-4 అధ్యయనం చేయనుంది. 2019లో చైనా ప్రయోగించనున్న మరో ల్యాండర్ చాంగె-5 అక్కడి నుంచి నమూనాల్ని, చాంగె-4 అవశేషాల్ని వెనక్కి తీసుకురానుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చాంగె-4 ప్రోబ్ మిషన్ప్రయోగం విజయవంతం 
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : చైనా 
ఎందుకు : చంద్రుడి వెనక భాగంపై పరిశోధన చేసేందుకు 

పీఎస్‌ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 29న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సీ43 రాకెట్ ద్వారా హైసిస్ (హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. హైసిస్‌ను భూమికి 636.3 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత సూర్యానువర్తన ధృవ కక్ష్యలో సీ43 ప్రవేశపెట్టింది. అనంతరం మిగిలిన 30 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా వివిధ కక్ష్యల్లోకి చేర్చింది.
ఇస్రో అభివృద్ధి చేసిన హైసిస్ ఉపగ్రహం వ్యవసాయం, అడవులు, భూ సర్వే, భూగర్భ శాస్త్రం, తీర ప్రాంతాలు, దేశీయ జల మార్గాలు, పర్యావరణ పర్యవేక్షణ, కాలుష్యం వంటి రంగాల్లో ఐదేళ్లపాటు సేవలందించనుంది. ఇటీవలే భారీ రాకెట్ జీఎస్‌ఎల్వీ-మార్క్3-డీ2 ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎస్‌ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 
ఎక్కడ : సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 


జీశాట్-11 ప్రయోగం విజయవంతం
సమాచార ఉపగ్రహం జీశాట్-11ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా డిసెంబర్ 4న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 5,854 కిలోల పరిమాణంలో ఉన్న జీశాట్-11 ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల అన్నింటికంటే బరువైంది. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది.
డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్-11 ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా.. తాజా ప్రయోగం మూడోది. బిగ్ బర్డ్గా పిలుచుకునే జీశాట్-11 తయారీకి ఇస్రో రూ.600 కోట్లు వెచ్చించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీశాట్-11 ప్రయోగం విజయవంతం 
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఇస్రో
ఎక్కడ : ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం, దక్షిణ అమెరికా

ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్‌కు జ్ఞాన్‌పీఠ్
ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్‌కు 54జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించింది. ఈ మేరకు డిసెంబర్ 14న భారతీయ జ్ఞాన్‌పీఠ్ బోర్డు ప్రకటించింది. వినూత్న రచనలకు పేరొందిన ఘోష్ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని సృ్పశించాడని, గతాన్ని వర్తమానంతో అనుసంధానించాడని జ్ఞాన్‌పీఠ్ అకాడమీ కొనియాడింది.
1956
లో కోల్‌కతాలో జన్మించిన అమితవ్ ఘోష్ దిల్లీ, ఆక్స్‌ఫర్డ్, అలెగ్జాండ్రియాల్లో చదువుకున్నారు. షాడోలైన్స్, ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్, సీ ఆఫ్ పపీస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ వంటి నవలలు రాశారు. ఘోష్ రాసిన తాజా నవల ది గ్రేట్ డిరేంజ్‌మెంట్’ 2016లో విడుదలైంది. ఇప్పటికే పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులను ఆయన అందుకున్నారు. 
క్విక్ రివ్యూ :
ఏమిటి : 54వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : అమితవ్ ఘోష్ 
ఎక్కడ : భారత్ 

కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం
ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2018 లభించింది.  తెలుగు భాష నుంచి ఇనాక్ రచించిన విమర్శిని వ్యాస రచనకు ఈ పురస్కారం లభించింది.

అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్ 
అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాలో భారత రాయబారి నియామకం 
ఎప్పుడు : డిసెంబర్ 20 
ఎవరు : హర్షవర్ధన్ ష్రింగ్లా 
ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా రమఫోసా
2019 భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరు కానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథి
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...