Monday, February 4, 2019

కృత్రిమ మేధస్సు (ఏఐ- ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)


కృత్రిమ మేధ (ఏఐ- ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)

            కృత్రిమ మేధస్సు (లేదా యంత్ర మేధస్సు) యంత్రాలుచే ప్రదర్శించబడిన మేధస్సు, ఇది మానవులు మరియు ఇతర జంతువుల యొక్క సహజ మేధస్సు వలె ప్రదర్శించబడుతుంది. కంప్యూటర్ శస్త్రంలో కృత్రిమ మేధస్సును మేధో యొక్క పరిశోధన అధ్యయనంగా నిర్వచిస్తారు: ఏ పరికరం దాని పర్యావరణాన్ని గ్రహించి లక్ష్యాన్ని సాధించేందుకు తొడ్పడుతుందో దానిని కృత్రిమ మేధస్సు అంటారు. "కృత్రిమ మేధస్సు" పదం సహజంగా ఒక యంత్రాం "జ్ఞాపకశక్తి" ప్రదర్శించినప్పుడు వర్తించబడుతుంది. ఇది మానవ మనస్సు వలె, "శిక్షణ" మరియు "సమస్య పరిష్కార" ప్రదర్శిస్తుంది.
ప్రాధాన్యం ఎందుకు?
Ø  చదరంగం, పోకర్ వంటి వూహాత్మక క్రీడల్లో A1 రాణిస్తోంది.
Ø  మనం మాట్లాడే భాషల్ని అర్థం చేసుకునే కంప్యూటర్ల తో మనం అనుసంధానం కాగలుగుతున్నాం.
Ø  యంత్రాన్ని సాఫ్ట్ వేర్ తోను, కారణాలను తెలుసుకుని సలహాలనిచ్చే ప్రత్యేకమైన సమాచారంతోను సమన్వయం చేసి నైపుణ్యవ్యవస్థలను (Expert Systems) ని ఏర్పరచడం ద్వారా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. దానిని ఉపయోగించుకునేవారికి విషయాలను వివరించడం, చేసి చూపించడం, సలహాలనివ్వడం చేస్తాయి.
Ø  వైద్యానికి సంబంధించిన నైపుణ్య వ్యవస్థలు డాక్టర్లు రోగ నిర్ధారణచేయడంలో ఉపయోగపడతాయి. మొండి రోగాలకు సైతం ఔషధాలను కనుక్కోవడం, రిమోట్ కంట్రోల్ తో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను నిర్వహించడంలో AI ఉపయోగపడుతోంది.
Ø  గూఢచారి విమానం ఒక ప్రాంతం ఫోటోలు తీసి అక్కడి సమాచారం తెలుసుకునే వీలు కల్పిస్తుంది. రిమోట్ కంట్రోల్ కేమెరా సిస్టం ఆసరాతో లక్ష్యాన్ని ఛేదించే స్మార్ట్ బాంబులు, మానవరహిత డ్రోన్లు, శతృవుల రహస్య సంకేతాల గుట్టువిప్పడం, విదేశీ భాషలను భాషలు త్వరితంగా తర్జుమా చేయడంలో AI ఉంటుంది.
Ø  నేరగాళ్ళ ముఖాలను గుర్తుపట్టే కంప్యూటర్ సాప్ట్ వేర్ ను పోలీసులు నేరపరిశోధనలో ఉపయోగిస్తున్నారు. కొన్ని తెలివైన వ్యవస్థలు మనుషులు మాట్లాడే భాషలను విని అర్థం చేసుకుంటాయి. వేర్వేరు యాసలు, ఉచ్ఛారణలను కూడా విశ్లేషిస్తాయి.
Ø  చేతి వ్రాతను గుర్తుపట్టే సాఫ్ట్ వేర్లు వాటిని చదువుతాయి.
Ø  తెలివైన రోబోలు మనిషినిర్దేశించిన పనులను చేసేందుకు కొన్ని సెన్సర్లను ఉపయోగించుకుంటాయి. కాంతి, వేడిమి, ఉష్ణోగ్రత, కదలిక, ధ్వని, కుదుపులను కనిపెట్టే సెన్సర్లు వీటిలో కొన్ని సమర్థవంతమైన ప్రొసెసర్లు,  మల్టిపుల్ సెన్సార్లు, గొప్ప మెమరీతో తెలివైన యంత్రాలుగా కూడా ఈ రోబోలు పనిచేస్తాయి. పొరపాట్లను గుణపాఠాలుగా గ్రహించి నేర్చుకుంటాయి. పరిసరాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తాయి.
Ø  మానవులు జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి.
Ø  పరిశ్రమల్లో ఉత్పాదకత ఇనుమడిస్తోంది.
Ø  అమెరికాలో వాహన చోదకుల స్థానంలో స్వయంచాలిత పరికరాలను ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
Ø  సముద్ర తీరంలో చమురు తవ్వకాలు, బొగ్గు గనులు వంటి ప్రమాదకర వాతావరణంలో మానవ వనరులకు కృత్రిమ మేధతో కూడిన యంత్రాలు ప్రత్యామ్నాయలవుతున్నాయి.
Ø  కాల్‌ సెంటర్లలో కృత్రిమ మేధ వినియోగం అధికమైంది. వినియోగదారుల అలవాట్లు, కొనుగోళ్ల సరళి ఆధారంగా భవిష్యత్తులో వారి విపణి అవసరాల అంచనాకు దీన్ని సాధనంగా వాడుతున్నారు. 
Ø  కృత్రిమ మేధ, ఆటోమేషన్‌ ప్రభావం డేటా కలెక్షన్‌, డేటా ప్రాసెసింగ్‌పై ఎక్కువగా పడుతుంది. దృష్టి, ఉపన్యాసం, భాష, గ్రహణశక్తి రంగాల్లో కృత్రిమ మేధ మానవ మేధస్సును అధిగమిస్తుంది. దీనితో సామాజిక, సాంకేతిక, గ్రహణశక్తి సంబంధమైన ఉద్యోగాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది.
Ø  శారీరక శ్రమ, కాయకష్టం చేసే పనులకు గిరాకీ తగ్గుతుంది.
Ø  రేడియాలజిస్టులకు ప్రాధాన్యం తగ్గి, నర్సుల అవసరం మరింత పెరగవచ్చు.
Ø  ఉద్యోగుల నిర్వహణ, నైపుణ్య వర్గం, సామాజిక బంధాలు పెంచే ఉద్యోగాలు వంటివాటిలో మానవశక్తితో యంత్రాలు పోటీపడలేవు. 

సత్ప్రభావాలు::
క్ర.సం.
రంగం
ప్రభావం
1
వ్యవసాయం
ü  ప్రజ్ఞాశీల యాంత్రీకరణ
ü  వాతావరణం, నేలను బట్టి ఏ పంటలు వేయాలో అంచనా
ü  దిగుబడి అనంతర పరిణామాల మెరుగుదల
ü  లాభదాయక వ్యవసాయం
ü  మెరుగైన మార్కెటింగ్ అన్వేషణలో సహాయం
2
వైద్యం & ఆరోగ్యం
ü  జబ్బులను బట్టి మందులు సూచించే వ్యవస్థ
ü  బిపి, గుండెవేగం, షుగర్, వంటి పరిక్షలు, ఫలితాలే కాకుండా స్కానింగ్, రోబోటిక్ సర్జరీ వంటి
ü  పేషెంట్ హిస్టరీ విశ్లేషించి ఆరోగ్య స్తాయి అంచనా, సలహాలు
3
విద్య
ü  డిజిటల్ పటాలు
ü  విద్యార్థి సామర్త్యానికి అనుగుణంగా బోధనా స్థాయి
ü  విద్యార్ధి సామర్థ్యం అంచనా, విశ్లేషణా
4
రవాణా రంగం
ü  ట్రాఫిక్ నియంత్రణ
ü  ప్రజా రవాణాలో తోడ్పాటు
5
పోలీసు మరియు నిఘా
ü  నేరస్తుల ఆచూకి పసిగట్టడం
ü  నేర చరిత్ర విశ్లేషణ
ü  నేరసతుల గుర్తింపు
ü  ఆధారాల విశ్లేషణ
6
రక్షణ రంగం
ü  డ్రోన్లు
ü  మనుషులు లేని యుద్ధం
ü  సైనిక అవసరాలు
7
పరిశ్రమలు
ü  వేగవంతమైన & మెరుగైన నాణ్యతతో కూడిన ఉత్పత్తి
ü  మార్కెటింగ్
ü  వినియోగ దారుడి అభిలషనీయత విశ్లేషించి ఆ ప్రకారం ఉత్పత్తి
8
వనరులు
ü  గనులు, మినరల్స్ గుర్తించుట
ü  మనుషులు వేల్లలేనిచోట సహజ సంపద వెలికితీత
ü  డీప్ సి ప్రయోగాలు
9
బ్యాంకింగ్
ü  మనుషులు లేకుండా అకౌంటింగ్ వ్యవస్తని సమర్థవంతంగా నడిపించడం
ü  వినియోగదారుడికి ఖచ్చితమైన వేగవంతమైన సేవలు అందించడం
10
సామాజిక అవసరాలు
ü  పిల్లలకు, వృద్ధులకు సహాయపడం
ü  ఇంటి అవసరాలకు ఉపయోగపడం (Ex: Google Home)
11
అంతరిక్షం
ü  వివిద గ్రహాల నేల , వాతవరణ విశ్లేషణ
ü  మానవ అనుకూల పరిష్థితుల ప్రయోగం
ü  వనరుల వెలికితీత
12
కాలుష్య నివారణ
ü  డంపిగ్ యార్డ్
ü  కాలుష్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి నివారణా చర్యలు సూచించడం
ü  కాలుష్య ప్రమాదాలు గుర్తించడం


ప్రతికూల ప్రభావాలు:

Ø  ఉద్యోగాల కోత
Ø  మానవసంభందాలు కోరవడం
Ø  డేటా చౌర్యం
Ø  కృత్రిమ మేధను నియంత్రించే సామర్థ్యం లేకపోతే మానవాలికి పెను ప్రమాదం, మానవ వినాశనం
Ø  వినియోగించడంలో మానవీయత , సరైన నియమ నిబంధనలు లేకపోవడం

ఇండియా x ప్రపంచ దేశాలు మనం ఎక్కడున్నాం

Ø  మిగతా దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధలో భారత్‌ తీసికట్టుగా ఉంది. సమాచార నిధి, నిధుల కేటాయింపులు రెండింటిలోనూ వెనకబాటు సుస్పష్టం.
Ø  2014-17 మధ్య   కాలంలో మనదేశంలోని అంకుర పరిశ్రమలు 10 కోట్ల డాలర్ల కంటే తక్కువ పెట్టుబడులనే ఆకర్షించగలిగాయి.
Ø  అమెరికా, చైనా ఈ రంగానికి సంబంధించిన పరిశోధనల్లో నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవి కృత్రిమమేధపై శిక్షణ ఇస్తున్నాయి.
Ø  దాదాపు 40 చైనా పాఠశాలల్లో, అమెరికాలో ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీలోనూ బోధన సాగుతోంది.
Ø  పాఠశాల స్థాయి విద్యార్ధులకు కృత్రిమమేధపై పాఠ్యపుస్తకాన్ని రూపొందించిన ఘనత చైనాకు దక్కుతుంది. 
Ø  జర్మనీ, జపాన్‌, కెనడా, బ్రిటన్‌ వినూత్నంగా అడుగులు వేస్తున్నాయి. బెల్జియం, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ అధిక ఉత్పాదకత దిశగా ముందుకు సాగుతున్నాయి.
Ø  మూడో గ్రూపులో బ్రెజిల్‌, ఇండియా, ఇటలీ, మలేషియా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి.
Ø  కృత్రిమమేధ వల్ల భారత ఆర్ధికవ్యవస్థ 2035 నాటికి 95,700 కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా.
Ø  ఇజ్రాయెల్‌ సైనిక, వాణిజ్య అవసరాల నిమిత్తం కృత్రిమమేధను వినియోగిస్తోంది.
Ø  రష్యా కృత్రిమమేధ, రొబొటిక్స్‌ను ఇతర రంగాల కంటే సైనికరంగంలో రష్యా ఎక్కువ వాడుతోంది.
Ø  సింగపూర్‌ పెట్టుబడుల సాధనకు ప్రధానమైన ఆయుధంగా ఉపయోగిస్తోంది.
Ø  దక్షిణకొరియా నిస్సైనిక ప్రాంతాల పర్యవేక్షణకు ప్రధానంగా వినియోగిస్తోంది.

ఏం చేయాలి?

Ø  తగినంత బడ్జెట్ కేటాయించి విస్త్రుత పరిశోధనలను ప్రోత్సహించాలి
Ø  అభివృద్ధి చెందిన దేశాలతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సంబంధిన ఒప్పందాలు చేసుకోవాలి
Ø  పాటశాల స్థాయి నుంచి అవగాహన పెంచాలి
Ø  ఉన్నతఃస్తాయి విధ్యావ్యవస్తాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
Ø  కృత్రిమ మేదను ముఖ్యంగా పేదరికం, నిరుద్యోగం, విద్యా , ఆరోగ్య , మౌలిక ఆవసరాలకు వినియోగించాలి.
Ø  క్రుత్రిమమేద వినియోగం పైన చట్టాలు తీసుకురావాలి.
Ø  కృత్రిమమేధ ఆధారంగా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూసుకోవలసిన అవసరం ఉంది.
Ø  డేటా రహస్యంపై భద్రతాపరమైన రక్షణ అవసరం. ఇందుకోసం డేటా, కంప్యూటింగ్‌, ఇతర సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి.
Ø  బ్లాక్ చైన్ టెక్నాలజీ ని అభిబృద్ధి పరచి డేటా చౌర్యాన్ని నివారించాలి.
Ø  మానవసంబంధాలను మేరుగుపరిచేలా ఈ తెక్నాలజీనీ ఉపయోగించుకోవాలి
Ø  నిఘా వ్యవస్థ పటిష్ఠత, సైనిక సంబంధిత కార్యకలాపాలు, సైబర్‌ భద్రత నిర్వహణ తదితర అంశాల్లో దారి తప్పకుండా చూసుకోవాలి.
Ø  ఇందుకు ఆయా కార్పొరేట్‌ సంస్థలతో పాటు ప్రభుత్వపరమైన తోడ్పాటూ తీసుకోవాలి..
Ø  అప్పుడే సాంకేతిక ప్రగతికి నిజమైన ఫలాలు మానవాళి అందుకోగలుగుతుంది!


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...