Monday, March 7, 2011

హరప్పా మొహంజో దారో

హరప్పా

సింధూలోయలోహరప్పానగరస్థానం,సింధూలోయనాగరికతవిస్తీర్ణం(పచ్చరంగులో).
           
హరప్పా (ఆంగ్లం :Harappa) (ఉర్దూ: ہڑپہ , హిందీ: हड़प्पा), పాకిస్తాన్ పంజాబ్ కు ఈశాన్యాన సాహివాల్నగరం. పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన
నవీన పట్టణం రావీ నది దగ్గరలో గలదు. ఈ పట్టణము ప్రాచీన కోట గల నగరం, సింధూ లోయ నాగరికత లోని హెచ్ ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది.
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు - ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి పాకిస్తాన్ కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.

చరిత్ర

సింధూ లోయ నాగరికత (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర మెహర్‌గఢ్ నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు మొహంజో దారో మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి.  ఈ నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో సుక్కుర్ వద్ద, మరియు హరప్పా, పశ్చిమ పంజాబ్ మరియు లాహోర్ కు దక్షిణాన కనుగొనబడ్డాయి.
Related Posts Plugin for WordPress, Blogger...