Saturday, December 8, 2018

సివిల్స్ లో ఏ ఆప్షనల్ తీసుకోవాలి?


సివిల్స్ 2018 ఆప్షనల్ ఎంపిక ఇలా..
________________________________________
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. మూడంచెల ఎంపిక ప్రక్రియ. తొలిదశ ప్రిలిమ్స్ జీఎస్, ఆప్టిట్యూడ్పైనే ఉంటుంది! మలిదశ మెయిన్స్లో మాత్రం ఒక ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి.
ఇందులో సాధించే మార్కులు కీలకం. సివిల్స్ (2018) దరఖాస్తుకు గడువు మార్చి 6 ముగియనుంది. జూన్ 3 జరిగే సివిల్స్ ప్రిలిమ్స్కు ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్థులు.. ఇప్పటినుంచే ఆప్షనల్ను ఎంపిక చేసుకోవాలి? ఏది స్కోరింగ్ ఆప్షనల్ ? తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించారు. నేపథ్యంలో సివిల్స్ మెయిన్స్లో ఆప్షనల్ ఎంపికపై నిపుణుల సలహాలు, సూచనలు..

ప్రస్తుతం సివిల్స్కు పెరుగుతున్న పోటీ దృష్ట్యా అభ్యర్థులు ప్రిలిమ్స్ నుంచే మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా ఆప్షనల్ ఎంపికలో అభ్యర్థులకు సాధ్యమైనంత ముందు నుంచే స్పష్టత అవసరం. ప్రిలిమ్స్లో విజయం సాధించాక చూద్దామనే ధోరణి సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మెయిన్స్లో భాషా సాహిత్యంతో సహా 26 ఆప్షనల్ సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్స్, టెక్నాలజీ, మెడికల్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్.. ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన సబ్జెక్టులను యూపీఎస్సీ పొందుపరిచింది. అభ్యర్థులు వీటినుంచి ఒక ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించి మెయిన్స్లో పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-1), పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-2) పేరుతో రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్కు 250 మార్కులు కేటాయించారు. అంటే మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించిన మొత్తం 1750 మార్కుల్లో (మెరిట్కు పరిగణనలోకి తీసుకొనే).. ఒక్క ఆప్షనల్కే 500 మార్కులున్నాయి.

ఆసక్తి, నేపథ్యం..
ఆప్షనల్ సబ్జెక్టు ఎంపికలో అభ్యర్థులు తమ ఆసక్తి, అకడమిక్ నేపథ్యం.. రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని ఆప్షనల్స్కు క్రేజీ, స్కోరింగ్ ఆప్షనల్స్గా ముద్రపడింది. ఉదాహరణకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, జాగ్రఫీ. ఇలాంటి ఆప్షనల్స్ను ఎంపిక చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల పరంగా తమ అవగాహన స్థాయిపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటే.. అందుబాటులో ఉన్న సమయం (ప్రిలిమ్స్ నోటిఫికేషన్ నుంచి మెయిన్స్ వరకు)లో సిలబస్ పూర్తిచేయగలమా? అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
 కొన్ని సబ్జెక్టులను చదువుతున్నప్పుడు ఎంతో సులువనే భావన ఏర్పడుతుంది. కానీ, వాటికి సంబంధించి పరీక్షలో వచ్చే ప్రశ్నల తీరులో వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టును పరిగణనలోకి తీసుకుంటే.. మనం నిత్యం చూసే కలెక్టర్ వ్యవస్థ మొదలు ప్రముఖ శాస్త్రవేత్తల సిద్ధాంతాల వరకు అన్నీ సమ్మిళితంగా ఉంటాయి. పరీక్ష రోజు కనిపించే ప్రశ్నలు మాత్రం పూర్తిగా లోతైన అవగాహనను పరీక్షించేలా ఉంటాయి. ఉదాహరణకు గత మెయిన్ ఎగ్జామినేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1లో అడిగిన ఒక ప్రశ్న..
"Leaders do the right things; managers do them rightly" - (Warren Bennis). Is this distinction by him valid?Explain
పై ప్రశ్నకు సమాధానం రాయాలంటే.. పాలనా వ్యవస్థతోపాటు కార్య నిర్వాహక వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలపైనా సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. ఆప్షనల్ ఎంపికలో ఇలాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

మెటీరియల్ లభ్యత :
ఆప్షనల్ ఎంపికలో మెటీరియల్ లభ్యత కూడా కీలకం. ప్రస్తుతం ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల మెటీరియల్ లభ్యతలో ఎలాంటి సమస్య లేదు. కానీ, టెక్నికల్, సైన్స్ తదితర స్పెషలైజ్డ్ సబ్జెక్టుల విషయంలో మాత్రం మెటీరియల్ కొరత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అభ్యర్థులు తమ అకడమిక్ పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రామాణికమైన గేట్, ఐఈఎస్ మెటీరియల్ అందుబాటులో ఉంటోంది. మెడికల్ ఆప్షనల్ అభ్యర్థులకు సీఎంఎస్కు సంబంధించిన మెటీరియల్ లభిస్తోంది. ఇతర సబ్జెక్టుల (ఉదా: అగ్రికల్చర్, మేనేజ్మెంట్ తదితర)కు మెటీరియల్ లభ్యత కొంత తక్కువనే చెప్పొచ్చు. కాబట్టి ఆప్షనల్ ఎంపికలో మెటీరియల్ లభ్యత, దాని ప్రామాణికతలను పరిగణనలోకి తీసుకోవాలి.

భాషా సాహిత్యం ఆప్షనల్ :
ఇటీవల సివిల్స్ మెయిన్స్ ఫలితాల సరళిని పరిశీలిస్తే భాషా సాహిత్యం (లాంగ్వేజ్ లిటరేచర్)ను ఆప్షనల్గా ఎంపిక చేసుకొని, విజయం సాధిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించొచ్చు. అయితే భాషా సాహిత్యాన్ని ఆప్షనల్గా ఎంపికచేసుకునే అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మాతృభాషకు సంబంధించిన సాహిత్యాన్ని ఎంపిక చేసుకునే వారు కూడా.. ఆప్షనల్ సిలబస్ను పూర్తిగా పరిశీలించాలి. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. అప్పుడే భాషా సాహిత్యాన్ని ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి.

ప్రిపరేషన్ :
ఆప్షనల్ను ఎంపిక చేసుకున్నాక.. ప్రిలిమ్స్కు సమాంతరంగా కొంత సమయాన్ని ఆప్షనల్ ప్రిపరేషన్కు కేటాయించాలి. ఎకానమీ/సోషియాలజీ/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/హిస్టరీ/జాగ్రఫీ తదితర ఆప్షనల్స్ ఎంపిక చేసుకున్న వారికి కొంత అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఆయా ఆప్షనల్కు సంబంధించిన అంశాలు ప్రిలిమ్స్ సిలబస్లోనూ ఉంటాయి. మెయిన్స్లోని జీఎస్-1 నుంచి జీఎస్-4 వరకు పేపర్లలో పై సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను సిలబస్లో నిర్దేశించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా మెరుగైన మార్కులు సొంతం చేసుకోవచ్చు.

కనీసం రెండుసార్లు చదివేలా..
మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్టును పరీక్షకు ముందు కనీసం రెండుసార్లు పూర్తిగా చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనికి అనుగుణంగా సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. కొన్ని సబ్జెక్టుల నిడివి విస్తృతంగా ఉంటుంది. వీటిని ఒకసారి పూర్తిచేయడం కూడా కష్టమే. మరికొన్ని సబ్జెక్టుల సిలబస్ తక్కువగా ఉన్నప్పటికీ.. తేలిగ్గా అర్థమై ఒకటికి రెండుసార్లు చదివే వీలుంటుంది. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం మేలు అనేది నిపుణుల మాట.

స్వీయ ప్రిపరేషన్ :
స్వీయ ప్రిపరేషన్కు కూడా వీలైన సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడం మంచిది. ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులదే పైచేయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. స్వీయ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు నిరంతరం తమ నైపుణ్యాల స్థాయిని విశ్లేషించుకోవాలి. దీనికోసం మోడల్ టెస్ట్లు రాసి, వాటిని నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి.
- శ్రీరంగం శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్.

ఆసక్తి.. వనరుల లభ్యత
ఆప్షనల్ ఎంపికలో అభ్యర్థులు తొలుత ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలి. ప్రిపరేషన్కు అందుబాటులో ఉన్న వనరులను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. టెక్నికల్, సైన్స్ సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంపిక చేసుకోవాలనుకుంటే.. సదరు అభ్యర్థులు తమ అకడమిక్స్కు సంబంధించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం ఒక్కటే విజయానికి సాధనం.



19 comments:

  1. I'm planning to take Political science as my optional. is meterial avalable in TELUGU medium ? please tell me

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...