Wednesday, February 23, 2011

జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్...!!


1) విక్టోరియా సరస్సును చుట్టుముట్టి బంధించిన మూడు దేశాలు?
1. ఉగాండా, కెన్యా, టాంజానియా
2. సూడాన్, మొజాంబిక్, ఉగాండా
3. టాంజానియా, సూడాన్, జైరీ
4. ఇథియోపియా, కెన్యా, సూడాన్
2) మలేషియా దేశంలోని మలక్కా రాష్ట్రం తన పేరును ‘మాలెకా’ అనే దానినుండి గైకొనింది. ‘మలెకా’ అనేది ఒక...
1. చేప 2. పక్షి 3. చెట్టు 4. నది
3) దేశంలోని అతి పెద్దదైన యాలా నేషనల్ పార్క్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల వర్షాభావ పరిస్థితులవల్ల మూసివేసిన దేశం క్రింది వాటిలో ఏది?
1. ఫిలిప్పైన్స్ 2. మాల్దీవులు
3. ఇండోనేషియా 4. శ్రీలంక
4) ‘నైఫ్’ అనే పదము ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది?
1. భూమి యొక్క మధ్య భాగము
2. భూకంపములు
3. భూమియొక్క గట్టిదైన పై భాగము
4. మహాసముద్ర తీరము
5) ‘టోర్నడో’ అనగా...?
1. అత్యధిక శక్తిగల ఒక కేంద్రము
2. మహాసముద్రము అత్యధికమైన అల
3. గ్రహసంబంధమైన వాయు గాలులు
4. అత్యల్ప శక్తిగల ఒక కేంద్రము
6) ఎర్ర సముద్రము, ఈ క్రింది వాటిలో దేనికి ఉదాహరణలు...
1. అవశిష్టమైన నిర్మాణము
2. ముడుచుకున్న నిర్మాణము
3. లోప భూయిష్టమైన నిర్మాణము
4. లావా నిర్మాణము
7) ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది?
1. వోల్గా 2. అమెజాన్
3. గంగ 4. నైల్
8) సూర్యునికి భూమికి మధ్య అత్యంత దగ్గర దూరము ఏర్పడునది ఏ తేది?
1. జూన్ 21 2. సెప్టెంబర్ 22
3. డిసెంబర్ 22 4. జనవరి 3
9) నెల పొడవు సమయంలోని సముద్రపు పోట్లు (స్ప్రింగ్ టైడ్స్) ఏ రోజులలో కలుగును?
1. అమావాస్య 2. చంద్రుని యొక్క మూడవ త్రైమాసికము 3. చంద్రుని యొక్క మొదటి త్రైమాసికము
4. పున్నమి
10) ఈ క్రింది వాటిలో ఏది పెద్ద గోళము?
1. భూమధ్యరేఖ 2. ఉత్తర ధృవీయ వృత్తము 3. కర్కటరేఖ 4. మకర రేఖ
11) పర్వతములు సాంప్రదాయంగా విభజింపబడునది...?
1. ఆరు రకములుగా 2. రెండు రకములుగా 3. నాలుగు రకములుగా 4. మూడు రకములుగా
12) అంటార్కిటిక్ మహాసముద్రము ఈ క్రింది విధముగా కూడా పిలువబడును...
1. దక్షిణ మహాసముద్రము 2. ఉప్పు మహాసముద్రము 3. ఉత్తర మహాసముద్రము 4. పూర్వ మహాసముద్రము.
13) ఏ రెండు దేశాలను మెక్‌మోహన్ రేఖ విడదీస్తుంది?
1. పాకిస్తాన్- ఇండియా
2. ఇండియా- బంగ్లాదేశ్
3. ఇండియా -టిబెట్
4. చైనా- ఇండియా
14) 1956లో సూయజ్ కాలువను జాతీయంచేసింది?
1. ఫరూక్ రాజు 2. జనరల్ నగీబ్
3. అబ్దుల్లా రాజు
4. గమాల్ అబ్దుల్ నాసెర్
15) భూమి ఆకారాన్ని ఎలా వర్ణిస్తారు?
1. బల్లపరుపుగా ఉందని
2. గుండ్రంగా ఉందని
3. గోళాకారంగా ఉందని
4. ఏటవాలు గోళాకారంగా ఉందని
16) ఈ కింది వీటిలో దేనిని పటముగా చేయుట కష్టము?
1. మైదానాలు, పీఠభూములు
2. భూమియొక్క లోపలి భాగాల్ని 3. కొండల్ని 4. సముద్రాల్ని, వాటి లోతుల్ని
17) వర్షం ఏర్పడేందుకు ఈ క్రింది వాటిలో ఏది అవసరం లేదు?
1. వాతావరణంలో దుమ్ము కణాలు 2. నీరు ఆవిరి కావడం
3. నీరు గడ్డకట్టడం 4. గాలి
18) ఒకే రకమైన ఉష్ణోగ్రత గల ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన గీతల్ని ఏమంటారు?
1. ఐసోహైట్స్ 2. ఐసోథర్మ్స్
3. ఐసోమియర్ 4. ఐసోబార్స్
19) ‘ప్రపంచ పంచదార పాత్ర’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1. భారతదేశం 2. క్యూబా
3. కెనడా 4. యునైటెడ్ స్టేట్స్
20) ఎస్కిమోలు ఎక్కడ నివసిస్తున్నారు?
1. నార్వే 2. కెనడా 3. డెన్మార్క్ 4. స్విట్జర్లాండ్
21) ఓయాసిస్‌కి దేనితో సంబంధముంది?
1. ద్వీపాలు 2. ఎడారులు 3. మంచుచరియాలు 4. నదులు
22) ఈ క్రింది వాటిలో పెద్ద రేఖా వలయం ఏది?
1. మకర రేఖ 2. కర్కట రేఖ 3. భూమధ్య రేఖ 4. ఆర్కిటిక్ వలయం
23) దక్షిణ తూర్పు ఆసియాలో కొబ్బరి నూనెను అధికంగా ఉత్పత్తిచేయునది ఏది?
1. లావోస్ 2. ఫిలిప్పీన్స్ 3. కంబోడియా 4. మలేసియా
24) ఎర్ర సముద్రం దేనికి ఉదాహరణ?
1. మడతబడిన నిర్మాణం 2. పొరపాటు నిర్మాణం 3. లావా నిర్మాణం 4. అవశిష్ట నిర్మాణం
25) సౌరవ్యవస్థలోని మొత్తం రాశిలో సూర్యుడు ఆక్రమిచు శాతం?
1. 82.5 2. 98 3. 99.8 4. 2
26) గాలిలోని అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అగునది?
1. అర్థరాత్రి 2. సూర్యోదయం కంటెముందు 3. సూర్యాస్థమయం అయిన వెంటనే 4. తెల్లవారుజామున 2 గంటలకు
27) భారతదేశానికి, యూరప్‌కు మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ?
1. బకింగ్‌హామ్ కాలువ 2. సూయజ్ కాలువ 3. ఇందిరాగాంధీ కాలువ 4. పనామా కాలువ
28) ఈ క్రింది వాటిలో ఏది హిమానీ నదాల అధ్యయనానికి సంబంధించింది?
1. క్లెమటాలజీ 2. పెడోలజీ
3. హైడ్రాలజీ 4. గ్లాసియోలజీ
29) కర్కటరేక దేని ద్వారా వెళ్ళదు?
1 భారతదేశం 2. ఈజిప్ట్ 3. మెక్సికో 4. ఇరాన్
30) జంతువుల ఎముకలు, కళేబరాల నిక్షేపాల ద్వారా ఏర్పడు శిలలు?
1. శాండ్‌స్టోన్ 2. లైమ్ స్టోన్
3. క్వార్ట్‌జ్ 4. బసాల్ట్

జవాబులు:
1) 1, 2) 4, 3) 4, 4) 1, 5) 4, 6) 3, 7) 4, 8) 4, 9) 4, 10) 1, 11) 3, 12) 1, 13) 4, 14) 4, 15) 3, 16) 2, 17) 3, 18) 2, 19) 2, 20) 2, 21) 2, 22) 2, 23) 3, 24) 2, 25) 1, 26) 4, 27) 3, 28) 3, 29) 4, 30) 2.

Monday, February 21, 2011

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎక్షామ్ నోటిఫికేషన్ -2011

civils notification 2011 in telugu, upsc civils notification - 2011, civils 2011 notification, civils 2011 notification in telugu , సివిల్స్ నోటిఫికేషన్ 2011 , తెలుగులో సివిల్స్ రాయొచ్చా? 
 మనందరమూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల నోటిఫికషన్ ను UPSC విడుదల చేసింది.
వివిధ కేంద్ర సర్వీసులలో ఖాళీల సంఖ్య    
  
885

విద్యార్హత  

గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ( తత్సమానం ) , చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే.

వయస్సు

2011 ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల మద్య ఉండాలి. (ఎస్సి,ఎస్టి లకు 5 , బిసి లకు 3 సంవత్సరాల గరిష్ట వయో సడలింపు.) .



పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు


1.జనరల్‌ అభ్యర్థులు-4 సార్లు
2. ఒబిసి అభ్యర్థులు-7సార్లు
3. వికలాంగులు (జనరల్‌)- 7 సార్లు
4. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు.



అనర్హతలు


సివిల్స్ మెయిన్స్‌లో అర్హత సాధించిన ఐఎఎస్‌లు, ఐఎఎఫ్‌లు.

దరకాస్తు  విధానం

ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా చేసుకోవచ్చు.

ఆన్లైన్  ద్వారా దరకాస్తు చేయు విధానం 

దీనికోసం  వెబ్ సైట్ ఇక్కడ క్లిక్ చేయండి.
 
ఆఫ్లైన్  ద్వారా దరకాస్తు విధానం

ఎంపిక చేసిన హెడ్ పోస్టాఫీసులో ముప్పయి రూపాయల రుసుము చెల్లించి దరకాస్తు తీసునవలయును. 

ధరకాస్తులు పంపవలసిన చిరునామా


ధరకాస్తులు స్వీకరించు చివరి తేది

మార్చి 21

Thursday, February 17, 2011

సివిల్స్, గ్రూప్-1 , 2 రిక్రూట్‌మెంట్‌కు సాంఘిక అధ్యయనాలు- బోధన లక్ష్యాలు

సాంఘిక అధ్యయనాలు- బోధన లక్ష్యాలు

 
చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, అర్థశాస్త్రం, సమాజ శాస్త్రాలు ప్రముఖమైన సామాజిక శాస్త్రాలు. సమాజ ప్రగతికి, శ్రేయస్సుకు సామాజిక అధ్యయనం ఎంతగానో తోడ్పడుతుంది. చరిత్ర, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, సమాజ శాస్త్రాల సమూహ రూపమే సాంఘిక అధ్యయనాలు. సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యాల్లో కొన్ని ముఖ్యమైనవి.


* జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించుట. అంతర్జాతీయ అవగాహన కల్గించుట. సాంఘిక దురాచారాల నిర్మూలనకు తోడ్పడటం. లౌకిక వాదాన్ని పెంపొందించుట. కులం, మతం, వర్గ బేధం లేకుండా చూడటం. ఆదర్శ పౌరుడిగా తయారుచేయడం మొదలైనవి.
విద్యాలక్ష్యాల ప్రాతిపదికగా బోధనా లక్ష్యాలు ఉంటాయి. నావ గమ్యం చేరడానికి దిక్సూచి ఎంత అవసరమో పాఠం బోధించటానికి లక్ష్యం అంతే ముఖ్యం. పాఠ్య బోధనకు ముందే లక్ష్యం నిర్ధారించుకోవాలి. సాంఘిక అధ్యయనం లక్ష్యాలు సామాజిక, మనోవైజ్ఞానిక, ఆర్థిక, సాంకేతిక మార్పులపై విద్యార్థి అవసరాలు, సమస్యలు, ప్రభుత్వ ఆశయాలు, అవసరాలపై ఆధారపడతాయి.
లక్ష్యాలు- లక్షణాలు:
- విద్యా మనోవిజ్ఞానశాస్త్రం సిద్ధాంతాలతో ఆధారితమై నిర్మించబడుతుంది. విద్యార్థి ప్రవర్తనా మార్పునకు కారణమవుతాయి. ఆచరణయోగ్యంగా ఉంటుంది. బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి.
* విద్యార్థుల్లో మనం ప్రతిపాదించే అభ్యసన అనుభవాలద్వారా వారిలో ఆశించిన మార్పులు తెస్తాం. అటువంటి మార్పులను ప్రవర్తనా మార్పులంటారు. మూల్యాంకనంవల్ల వీటిని పరిశీలించవచ్చు. ఇలా విద్యార్థి మంచి అభ్యసనకోసం మనం ఆశించే స్పందనలు, మార్పులు ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని స్పష్టీకరణలు అంటారు.
స్పష్టీకరణాలు- లక్షణాలు:
- అభ్యసన ఫలితాలలో ఇవి కనిపిస్తాయి. విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. విద్యార్థి ప్రవర్తనా మార్పునకు దోహదపడతాయి. విద్యార్జనకు చెందిన ఆయా స్థాయిల్లో ఇవి పనిచేస్తాయి. మనో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల ప్రాతిపదికగా అభ్యసనకు తోడ్పడతాయి. బోధన - అభ్యసనకు లక్ష్యాలు స్పష్టీకరణలు ప్రాణం వంటివి. బోధన-అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
జ్ఞాన లక్ష్యాలు: సాధారణ, విషయ, వివేచనా జ్ఞానాలు జ్ఞాన లక్ష్యాలకు మూలం.
భావావేశ లక్ష్యాలు: ఆసక్తి, అభిమతం, అభినందన వంటి భావాలు భావావేశ లక్ష్యాలకు మూలం.
మనోచలనాత్మక లక్ష్యాలు: జ్ఞాన లక్ష్యాలను, భావావేశ లక్ష్యాలను ఆచరణలోకి తేవడమే మనోచలనాత్మక లక్ష్యానికి మూలం.
పై లక్ష్యాల మూల భావ ప్రాతిపదికగా తిరిగి ఏడు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, అభిరుచి, వైఖరి, ప్రశంస.
జ్ఞానం: విద్యార్థి సాంఘిక అధ్యయనాలకు సంబంధించిన నూతన పదాలు, వాస్తవాలు, సూత్రాలు, సాధారణీకరణాలు, ధోరణులు, భావనలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జిస్తాడు.
స్పష్టీకరణలు: విద్యార్థి.....
* జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించటం.
అవగాహన (లక్ష్యం): విద్యార్థి సాంఘిక అధ్యయన బోధన వల్ల వాటికి సంబంధించిన పూర్వాపరాలను గ్రహించి, అవగాహన పొందుతాడు. ఇక్కడ అవగాహనకు ‘జ్ఞానం’ సోపానం.
వినియోగం (లక్ష్యం): విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో తన అవసరాన్నిబట్టి వినియోగించుకుంటాడు.
* సమస్యను విశే్లషించి దాని కీలకమైన అంశాలను గుర్తిస్తాడు. సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకుంటాడు. తనకు తెలిసిన దానితో సమస్య పరిష్కారానికి సంబంధం స్థాపిస్తాడు. ఫలితాలను ఊహిస్తాడు, జరగబోయే ఫలితాలను చెబుతాడు. నూతన పరికల్పనను రూపొందిస్తాడు. నూతన పరికల్పనను పరిశీలిస్తాడు. సేకరించిన సమాచారం సమస్య పరిష్కారానికి సరిపోతుందా? లేదా అనే వివేచన చేస్తాడు.
నైపుణ్యం (లక్ష్యం): సాంఘిక అధ్యయన విషయానికి సంబంధించిన ముద్రిత, ఆముద్రిత సమాచార సేకరణలో నైపుణ్యం పొందడం. పటాలు, చార్టులు, కాలపట్టికలు మొదలైనవి చదవగలుగుతాడు. కోటలు, పిరమిడ్లు, పనిముట్లు, నమూనాలు చక్కగా తయారుచేయగలుగుతాడు. పటాలు, చార్టులు, డయాగ్రామ్‌లు, గ్రాఫ్‌లు కచ్చితంగా గీయగలుగుతాడు. వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను నైపుణ్యంతో వినియోగించగలుగుతాడు.

Monday, February 14, 2011

సివిల్స్‌ పట్ల పెరుగుతున్న ఆసక్తి..!!


 
 
ఇంజనీరో, డాక్టరో కావాలంటే ఈ రోజుల్లో ఇంటర్‌ స్థాయినుంచే వేలల్లో, లక్షల్లో ఖర్చు అవుతోంది. అదీగాక ఎక్కువ సమయం చదువు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. మరి లక్షలకొద్దీ ఫీజులు కట్టలేని పేద మధ్య తరగతి యువత పరిస్థితి ఏమిటి? ఎస్టీడి బూత్‌లోనో, బుక్‌స్టాల్‌లోనో పార్టుటైమ్‌ పనిచేస్తూ చదువుకునే విద్యార్థులు అత్యధిక సమయం స్టడీ రూమ్‌లోనే గడిపే పరిస్థితి ఎక్కడుంది? అన్నప్పుడు చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది సివిల్‌. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నవారు కూడా పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ సివిల్స్‌ దాకా ఎదిగినవారున్నారు. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టే దీనివైపు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతోంది. ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు అవకాశాన్ని ఎవ్వరైనా సొంతం చేసుకునే వీలు ఒక్క సివిల్స్‌కే సాధ్యం.
ఎంబిఎ, ఎంసిఎ, ఎంబిబిఎస్‌, ఇంజనీరింగ్‌ లాంటి ఉన్నత చదువులకయ్యే ఖర్చుకంటే సివిల్స్‌కయ్యేది చాలా తక్కువ. అదీగాక ఆర్థిక పరిస్థితి బాగోలేని వారు పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ కూడా చదువుకునే వీలుంది. కాబట్టి ఎక్కువశాతం యువతీ యువకులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ అంటేనే చాలామంది ఐఎఎస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష అని అనుకుంటుంటారు. కానీ ఇందులో 22 రకాల కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. ఐఎఎస్‌కంటే కూడా ఉన్నతమైన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ పరీక్ష ఉంది. ఐఎఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఐఎఎస్‌కే ఎక్కువ డిమాండ్‌ ఉంది. తక్కువ కాలంలో ఉన్నత హోదాకు ఎదిగే అవకాశం, సామాజిక గౌరవం, అధికారం, అవకాశం, ఉద్యోగ భద్రత అన్నీ ఉండటమేగా సేవాదృక్పథం కలిగిన వారికి ప్రజాసేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మధ్య తరగతి యువత ఎక్కువగా సివిల్స్‌పై ఆసక్తి చూపుతోంది.

హోదాతోపాటు
ప్రధానమంత్రి తర్వాత అత్యున్నత హోదాగల కేబినెట్‌ కార్యదర్శి పదవికి చేరుకునే అవకాశం ఒక్క సివిల్స్‌ సర్వీసెస్‌ ద్వారా మాత్రమే సాధ్యం. అంతేకాదు రాజ్యాంగ పరమైన అనేక పదవులు పొందే అవకాశం ఇందులో ఉంటుంది.
పాలనా వ్యవస్థకు పట్టుగొమ్మలు
ఒక ప్రజా ప్రతినిధి పదవీ కాలం ఐదేళ్లు మాత్రమే. ఒక న్యాయమూర్తి కొన్ని పరిధులకు లోబబడి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి పదవి కూడా ప్రజాస్వామ్య దేశంలో స్వల్పకాలికమైనదే. కానీ అదే ఒక సివిల్‌ సర్వీసెస్‌ అధికారి పదవి... దాదాపు 30 సంవత్సరాలు. అంటే పాలనా వ్యవస్థలో, పాలనా వ్యవహారాల్లో, ప్రణాళికల రూపకల్పనలో సివిల్‌ సర్వీసెస్‌లదే కీలకపాత్ర ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండే ఒక ఐఎఎస్‌ అభ్యర్థి సలహాలనే పాటిస్తుంటారంటే దానికుండే గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.
డిగ్రీ ఉంటే చాలు...
కచ్చితంగా ఇన్ని మార్కులుంటేనే సివిల్స్‌కు అర్హులనే నిబంధనలేమీ లేవు. 21 సంవత్సరాల వయసు ఉండి, డిగ్రీ చదువుతున్న వారు, ఫైనల్‌ ఇయర్లో ఉన్నవారు కూడా ఐఎఎస్‌ ప్రవేశ పరీక్ష రాయవచ్చు.
ప్రిలిమినరీ
ప్రతి ఏడాదీ ప్రిలిమినరీ పరీక్షకోసం నోటిఫికేషన్‌ వెలువడుతూ ఉంటుంది. ఈ పరీక్ష అంతా ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకూ 23 ఆప్షనల్స్‌ నుండి ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉండేది. కానీ 2011 నుంచి మాత్రం కొత్త ప్యాటర్న్‌ అమల్లోకి రాబోతోంది.
కొత్త ప్యాటర్న్‌లో ఏముంటుంది
కొత్త ప్యాటర్న్‌ అనగానే కఠినంగా ఉంటుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగానే ఉంటుంది. కేవలం బట్టీపట్టో, పరీక్షకోసం మాత్రమే చదివో గుర్తుపెట్టుకునే జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్షవల్ల విద్యార్థుల్లోని ప్రజ్ఞను సరైనరీతిలో అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అభ్యర్థుల్లో నైతిక విలువలు, సంక్లిష్ట పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో సమయోచితంగా వ్యవహరించగలిగే సామర్థ్యం, పరిష్కార మార్గం తదితర విషయాలపట్ల అవగాహన కల్పించే విధంగా కొత్త ప్యాటర్న్‌ ఉంటుంది. అభ్యర్థుల్లో కూడా వీటిస్థాయినే పరీక్షిస్తారు.
మెయిన్స్‌కు అర్హత
మొత్తం 450 మార్కులు ఉంటాయి. 275 ఆ పైన స్కోర్‌ చేయగలిగితే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతీ ఏడాది 1.5 లక్షల మంది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష రాస్తుంటారు. ఖాళీల ప్రాతి పదికను బట్టి సుమారు 9000 మంది దాకా మెయిన్స్‌కు ఎంపికవుతుంటారు. ఇందులో తొమ్మిది పేపర్లను డిస్ట్క్రిప్టివ్‌ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ నెలలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ఏటా సుమారు 1500 మందికి ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది.

మెరిట్‌ జాబితా ఇలా...
మెయిన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌ తర్వాత దాదాపు నాలుగు నెలలపాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. మెయిన్స్‌లో సాధించిన మార్కులనూ, ఇంటర్వ్యూ మార్కులనూ కలిపి చివరిగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. దీని తర్వాత సుమారు 500 మంది ఎంపిక అవుతారు. ఎంపిక కానివారు మళ్లీ ప్రిలిమినరీ నుంచి చదవాల్సి ఉంటుంది.

సబ్జెక్టు ఏదైనా
కేవలం ఆర్ట్స్‌ చదివిన వారే కాదు డిగ్రీలో సైన్స్‌, మ్యాథ్స్‌ చదివిన వారు కూడా ఆర్ట్సు సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఇలాగే తీసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఆర్ట్స్‌ ఒక సామాజిక శాస్త్రమేగాక నిత్యజీవితంతో మిళితమై ఉంటుంది. అదీగాక మెటీరియల్‌ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
సమయం సద్వినియోగం

డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే ఆప్షనల్‌ ఎంచుకోవాలా? వేరే సబ్జెక్టులు తీసుకోవడంవల్ల సమస్యలు తలెత్తుతాయా? అన్న సందేహంతోనే కొంతమంది సమయం వృథా చేస్తుంటారు. కొందరు ఏదోఒక ఆప్షనల్స్‌ ఎంచుకొని కొంతకాలం చదివి వదిలేస్తుంటారు. చివరికీ దేంట్లోనూ రాణించక ఇబ్బంది పడుతుంటారు. దేనికైనా ముందుగా ఆసక్తి, పట్టుదల, లక్ష్యం ఇవన్నీ కావాలి. ఇవి ఏర్పర్చుకొని ఏ ఆప్షనల్‌ ఎంచుకున్నా రాణించగలుగుతారు. కాబట్టి ఆసక్తి ఉన్న ఆప్షనల్‌తోపాటు జనరల్‌ స్టడీపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారు.

దేనికి ఎన్ని మార్కులు? 
  • ప్రిలిమినరీ (అర్హత పరీక్ష-ఫైనల్స్‌కు ఎంపికకు) మొత్తం మార్కులు 450
  • కంపల్సరీ జనరల్‌ స్టడీస్‌ 150
  • ఆప్షనల్‌ పేపర్‌ 300
  • మెయిన్స్‌ పరీక్షకు 2000
  • ఇంటర్వ్యూకు 300
ఎంపిక:                
మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఉంటుంది.
ప్రిలిమినరీలో మార్పులు
2011 సివిల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షా విధానంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. జనరల్‌ నాలెడ్జ్ మాత్రమే పరీక్షించే ప్రిలిమినరీలో ఇకముందు అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ను కూడా పరీక్షిస్తారు. నైతిక విలువలు, నిజాయితీ, సంక్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం, చురుకుదనం, అభిరుచి, సహజత్వం లాంటివన్నీ పరిశీలిస్తారు. కాబట్టి విద్యార్థులు ఇప్పట్నించే తగిన అవగాహన ఏర్పర్చుకుంటే ప్రిలిమినరీలో తప్పక విజయం సాధించగలుగుతారు.
ఛాన్స్‌ ఇదిగో
  • జనరల్‌ కేటగిరీ నాలుగుసార్లు
  • ఎస్సీ, ఎస్టీలు పరిమితి లేదు
  • ఒబిసి ఏడుసార్లు
నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనుంది.

ఎకానమి జాతీయాదాయం....!!

గ్రూప్స్‌, సివిల్స్‌, జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ పరీక్ష రాయగోరే అభ్యర్థులకు జాతీయాదాయానికి సంబంధించిన చాప్టర్‌ అత్యంత కీలకమైంది. ఈ చాప్టర్‌ వివిధ బేసిక్‌ భావనలతో కూడి ఉంటుంది. చాప్టర్‌ పరిధిలో అధ్యయనం చేస్తే మార్కులు ఖచ్చితంగా పొందవచ్చు. ఊహించి సమాధానాలు రాయడం కాకుండా ఖచ్చితంగా తెలిస్తేనే అటెంప్ట్‌ చేసే విధంగా ఉంటుంది. గత పరీక్షల్లో కూడా బేసిక్‌ అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
సమీకరణాలు, గణాంక వివరాలతో కూడుకొని ఉండటం వలన సైన్స్‌ విద్యార్థులకు సులభంగానూ, ఆర్ట్స్‌ విద్యార్థులకు కష్టంగానూ అన్పించవచ్చు. కానీ సాధారణంగా అందరూ తెలుసుకొనే విషయాలుంటాయి. ఉపయుక్తమైనవి ఉంటాయి. బేసిక్‌ విషయాలతోపాటు ప్రస్తుత సర్వే వివరాల వరకూ ప్రాధాన్యత ఉంటుంది. మొదట బేసిక్‌ విషయాలు, తర్వాత కరెంట్‌ అంశాలు, మూడవ భాగంలో మాదిరి ప్రశ్నలు అందివ్వడం జరిగింది. కావున అభ్యర్థులు అన్ని భాగాలూ చదవాలి.
1.ఆర్థిక వ్యవస్థలోని ప్రధానరంగాలు, స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం :
ప్రపంచంలో ఏ దేశ ఆర్థికాభివృద్ధినైనా జాతీయ, తలసరి ఆదాయాలలో కొలిచి చెప్పడం పరిపాటి. జాతీయాదాయం పెరుగుదులతో ఆర్థికాభివృద్ధిని కొలిచి చెపుతుంటారు. సాధారణంగా ఒక దేశంలోని వ్యక్తుల, సంస్థల ఆదాయ మొత్తాన్ని జాతీయాదాయంగా చెపుతారు.
జాతీయాదాయం అర్థం : ఒక దేశంలో నిర్ణీతకాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మొత్తం మార్కెట్‌ విలువ. చక్రరూప ఆదాయ ప్రవాహం ద్వారా జాతీయాదాయం అర్థం వివరించుట సర్వసాధారణం. ఎందుకనగా ఇది ఒక స్థూల భావన కాబట్టి.
కుటుంబరంగమైన ఉత్పత్తి కారకాలు తమ సేవల వ్యాపార రంగానికి అమ్ముట ద్వారా లభించిన ఆదాయం, వ్యాపార రంగానికి చెందిన వస్తుసేవల కొనుగోలుపై వెచ్చించడం ద్వారా వ్యాపార రంగానికి ఆదాయం లాభాల రూపంలో ప్రవహించును. దీని వలన వ్యాపార రంగాల శ్రమదోపిడి పెరిగి ఆర్థిక అసమానతలకు దారి తీస్తుందని, జాతీయాదాయం పంపిణిలో అసమతుల్యత ఏర్పడుతుందని, శ్రామికుల వాటా తక్కువ కావున అత్యధిక ప్రజల సంక్షేమం దెబ్బతింటుందని కారల్‌ మార్క్స్‌ పేర్కొన్నారు. జాతీయాదాయం పంపిణి-సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండవలెనని ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ అన్నారు.
నిర్వచనాలు : 1.ఎ.సి.పిగూ : ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం, విదేశాల నుండి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తిగా పేర్కొన్నారు.
2.ఇర్వింగ్‌ ఫిషర్‌ : అంతిమ వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.
జాతీయాదాయంలో వివిధ భాగాలు : 1.వినియోగ వస్తువలు 2.పెట్టుబడి 3.ప్రభుత్వ వ్యయం 4.నికర ఎగుమతులు
1929 ప్రపంచ ఆర్థిక మాంద్యానికి పూర్వం జాతీయాదాయంలో వినియోగ, పెట్టుబడి వస్తువులు మాత్రమే భాగంగా ఉండేవి. సమిష్టి డిమాండ్‌ ఎదుర్కొనుటకు జె.ఎమ్‌.కీన్స్‌ మహాశయుడు ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ వ్యయం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయం ప్రజా సంక్షేమం పెంచేదిగా అవస్థాపనా సౌకర్యాలు, బదిలీ, చెల్లింపుల రూపంలో ఉండవలెనన్నాడు. సమిష్టి డిమాండ్‌ పెంచుటకు చక్రరూప ఆదాయ ప్రవాహం కొనసాగించుటకు ఖాళీ గోతులు తీయండి, ఖాళీ గోతులు పూడ్చండి అని ఉద్భోదించాడు.
మార్షల్‌ : ఒకదేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే జాతీయాదాయం.
ఆధునిక నిర్వచనాలు కుజ్నెట్స్‌ : ఒకదేశ ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సరకాలంలో ప్రవహించే నికర ఉత్పత్తి జాతీయాదాయం.
జాతీయాదాయ అంచనాల సంఘం నిర్ణీత కాలంలో ఉత్పత్తిచేసి ఒకసారి మాత్రమే లెక్కలోనికి తీసుకున్న వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం.
సాముల్సన్‌ : ఒకదేశంలో ఒక సంవత్సరకాలంలో ప్రవహించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం.
నిర్ణయించే అంశాలు : 1.సహజ వనరులు 2.ఉత్పత్తి కారకాల లభ్యత, మూలధనం 3.సమర్థవంతమైన వ్యవస్థాపన 4.ఇతరములు

Thursday, February 10, 2011

వివిధ దేశాల్లో మూలకణాల అభివృద్ధి

వివిధ దేశాల్లో మూలకణాల అభివృద్ధి
అమెరికా, ఇజ్రాయిల్, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలు ఈ సాంకేతికతను విస్తృతంగా అభివృద్ధి పరిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 64 మూల కణ రేఖలను ఏర్పరచగా, ఒక్క అమెరికానే 30 దాకా మూలకణ రేఖలను సృష్టించగలిగింది. మిగిలినవి భారత్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వృద్ధిపరచబడినట్లు తెలుస్తుంది. వీటిలో 10వరకు భారతదేశంలోని రిలయన్స్ లైఫ్ సైనె్సస్ సంస్థ మరియు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైనె్సస్- బెంగుళూరు వారు అభివృద్ధిపరచినట్లు తెలుస్తుంది. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీ అనే సంస్థలు ఈ రంగంలో విస్తృత పరిశోధనలు కావిస్తున్నాయి. ఈమధ్యకాలంలో అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీ సంస్థ పిండాన్ని దెబ్బతీయకుండా పిండ మూల కణాలను సేకరించే సాంకేతికతకు అంకురార్పణ చేసింది.
మొదటిసారిగా ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ సంస్థవారు పిండ మూలకణాలనుండి మానవ గుండెను అభివృద్ధిపరిచారు. ఇదే మొట్టమొదటి మానవ/ మూలకణ నిర్మిత కృత్రిమ అవయవం. తదనంతర కాలంలో వివిధ రకాల దేశాలు వివిధ రకాల అవయవాలను ఏర్పరచి అవయవ బ్యాంకులను ఏర్పాటుచేశాయ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక అవయవ బ్యాంకులు ఉన్నాయి. మొట్టమొదటి అవయవ బ్యాంకును బ్రిటన్‌లో ఏర్పాటుచేయుట జరిగింది.
జపాన్‌కు చెందిన నేచురల్ సైనె్సస్ అనే సంస్థ మానవ పిండ మూలకణాల నుండి / ఉపయోగించి కోతి ఎముక కణాలను సృష్టించగలిగింది. దెబ్బతిన్న కోతి వెనె్నముక భాగంలోకి మానవ పిండ మూల కణాలను ప్రవేశపెట్టడం ద్వారా కోతి వెనె్నముకను సరిచేయడం జరిగింది. దీనితో ఎముక మూలకణాలను సృష్టించడమే కాకుండా మూల కణాలను ఇతర జీవులనుండి కూడా సృష్టించవచ్చునని నిరూపించబడినది.
ఆస్ట్రేలియాకు చెందిన సంస్థలు కంటి మూలకణాలు సృష్టించి అన్నిరకాల నేత్ర భాగాలను ఏర్పరచగలిగారు. బ్రెజిల్‌కు చెందిన శాస్తవ్రేత్తల తిరోగమన మూలకణ సాంకేతికతను ఉపయోగించి సాధారణ కణాలనుండి పిండ మూలకణాలను వాటినుండి అండాలు, శుక్ర కణాలను ఉత్పత్తిచేసే నూతన సాంకేతికతను ఆవిష్కరించారు. తద్వారా సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పించవచ్చునని నిరూపించారు.
ఈమధ్య కాలంలో చైనావారు మెదడు మూల కణాలను, ఆస్ట్రేలియావారు నేత్ర మూల కణాలను సాధారణ శరీరంనుండి ఉత్పత్తిచేసే నూతన సాంకేతిక విధానాన్ని అభివృద్ధిపరచారు.
భారతదేశంలో మూలకణ అభివృద్ధి:
భారతదేశంలోని ఎయి మ్స్, రిలయన్స్ లైఫ్ సైన్స్, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్, నేషనల్ బ్రెయిన్ సెంటర్, ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇనిస్టిట్యూట్, సిసిఎంబి మరియు సిఎస్‌సి (క్రిస్టియన్ మెడికల్ కాలేజి) వంటి సంస్థలు ఈ రంగంలో అత్యధిక కృషిని సాగిస్తున్నాయి.
ఢిల్లీలోని ‘నేషనల్ బ్రెయిన్ సెంటర్’ వారు మెదడుకు సంబంధించిన మూల కణాలను అభివృద్ధిపరుస్తున్నారు. హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాద్ సంస్థవారు నేత్ర మూలకణాలను సృష్టించుటలో నిమగ్నమై ఉన్నారు. వేలూరు లోని సిఎన్‌సి వారు, ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థలు అస్థి మూలకణాల సృష్టిలో నిమగ్నులై ఉన్నారు.
రిలయన్స్ లైఫ్ సైన్స్ సంస్థ ఈ రంగంలో అత్యధిక పురోగతిని సాధించి ప్రపంచంలోని పది ప్రధాన సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘్ఫరూజాఫోలిక్’ కృషివల్లనే ఈ సంస్థ అత్యధికంగా అభివృద్ధి చెందింది. భారతదేశం సృష్టించిన 10 మూలకణ రేఖలలో ఏడింటిని ఈ సంస్థ మాత్రమే సృష్టించగలిగింది. ఈమధ్య ఏర్పడిన సైన్స్ టాస్క్ఫోర్స్ మూలకణాలనుండి ఎముక మూలకణాలను, హస్థిమజ్జి/ మూలుగ కణజాలంను సృష్టించవచ్చునని తద్వారా కృత్రిమంగా రక్తాన్ని రక్త ఉత్పత్తులను ఉత్పత్తిచేయవచ్చునని పేర్కొంటుంది.
ఈమధ్యకాలంలో సిఎంసివారు ఐపిఎస్ టెక్నాలజీ అనే నూతన సాంకేతికతను ఆవిష్కరించారు. దీని ద్వారా సాధారణ శరీర కణాలను పిండ కణాలుగా మార్పుచేయవచ్చు. ఈమధ్య కాలంలో బిజిఎస్ హాస్పిటల్ బెంగళూర్‌వారు బ్రెయిన్ డెడ్ వ్యక్తికి మూలకణాలు ఉపయోగించి సాధారణ వ్యక్తిగా మార్చగలిగారు. దెబ్బతిన్న మెదడు భాగంలోకి సాధారణ మూలకణాలను ప్రవేశపెట్టి దానిని నయంచేసే విధానాన్ని బిజిఎస్ హాస్పిటల్‌వారు ఆవిష్కరించారు.
పర్యావరణ పరిశుభ్రతలో బయోటెక్నాలజీ పాత్ర
జనాభా పెరగడం, వారి అవసరాలు విస్తరించడం వలన అనేక పరిశ్రమలు వెలిశాయి. అనేక వాహనాలు రోడ్లెక్కాయి. వ్యవసాయరంగ అభివృద్ధికిగాను, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు అనేకం ప్రవేశపెట్టబడ్డాయి. శిలాజ ఇంధనాలు భారీస్థాయిలో భస్మీకరించబడుతున్నాయి. తద్వారా అనేక రకాల కాలుష్యక పదార్థాలు పర్యావరణంలో ప్రవేశించి గాలి, నీరు, నేల వంటి సహజ వనరులను కలుషితం చేస్తున్నాయి. క్రియా రహితమైన, ప్రణాళికా రహితమైన అభివృద్ధివలన పర్యావరణం విపరీతంగా మార్పుకాబడుతుంది. దీనిని నివారించుటకు జీవ సాంకేతిక శాస్త్రం అనేక నూతన శాస్ర్తియ విధానాలను ప్రవేశపెడుతున్నది. పర్యావరణ పరిశుభ్రతకు జీవ సాంకేతిక శాస్త్రం చేస్తున్న కృషిని ‘బయో రెమిడియేషన్’ అని పేర్కొంటారు.
సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్యకాలను తొలగించుటను బయోరెమిడియేషన్‌గా పేర్కొంటారు. ఇందులో పర్యావరణ జీవసాంకేతిక శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ శాఖ అనేక శాస్ర్తియ విధానాలను సాంకేతిక పద్ధతులను వెలుగులోకి తేవడమేకాకుండా కాలుష్యక పదార్థాలను కాలుష్య రహిత పదార్థాలుగా మార్పుచేయుటకు నిరంతరం కృషిచేస్తుంది.
ఇందులో భాగంగా అనేక జన్యుపరివర్తిత సూక్ష్మజీవులను ఉత్పత్తిచేయడం జరిగింది. ఈ సూక్ష్మజీవులు కాలుష్యక పదార్థాలను తినివేయడంగానీ, కాలుష్య రహిత పదార్థాలుగా మార్పుచేయడం గానీ చేస్తాయి. సూడోమోనాస్, ఈకోలీ, అజిటొబాక్టర్ వంటి సూక్ష్మజీవులను ఉపయోగించి అనేక జన్యుపరివర్తిత సూక్ష్మజీవులను ఉత్పత్తిచేయుట జరిగింది. వీటిలో నూనెలను తినివేసే సూపర్‌బగ్‌లు, కార్బన్‌మోనాక్సైడ్ మరియు సిఓ2లను గ్రహించే సూక్ష్మజీవులు ప్రధానమైనవి. ఇవికాక కాలుష్యక పదార్థాలను కాలుష్య రహిత పదార్థాలుగా మార్చే అనేక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిలో కొన్నింటని క్రింద పేర్కొనుట జరిగింది.
జన్యుమార్పిడి సూక్ష్మజీవులు:
1. సూపర్‌బగ్‌లు:
నేలపైన మరియు నీటిపైన ఒలికిపోయిన నూనెలను తొలగించుటలో వీటిని ఉపయోగిస్తారు. వీటిని జన్యుమార్పిడి ద్వారా ఎక్సోమస్ అను సూక్ష్మజీవులనుండి ఆనంద్ చక్రవర్తి సృష్టించారు.
2. రసాయన విశే్లషణ బ్యాక్టీరియాలు:
కొన్ని సూక్ష్మజీవులు వాతావరణంలోని సిఓను గ్రహించి సిఓ2గా మార్చుకొని దానిని రసాయన విశే్లషణలో ఉపయోగించుకొని జీవిస్తాయి. వీటిలోని జన్యువులను అనేక రకాల సూక్ష్మజీవులలో ప్రవేశపెట్టి రసాయన విశే్లషణ ద్వారా సిఓను తగ్గించే సూక్ష్మజీవులకు అనేకం ప్రవేశపెట్టారు.
కిరణజన్య సంయోగక్రియజరిపే సూక్ష్మజీవులు:
జన్యుమార్పిడి ద్వారా వాతావరణంలోని సిఓ2ను గ్రహించి దానిని కి.సం. క్రియలో ఉపయోగించుకునే సూక్ష్మజీవులను అనేకం సృష్టించారు. ఇవి విపరీతంగా సిఓ2ను గ్రహించి పర్యావరణ సంతులనం చేపడుతాయి. తద్వారా భూతాపంను తగ్గిస్తాయి.
జన్యుపరివర్తిత/మార్పిడి మొక్కలు
ఎ) ఎరోబిక్ రైస్
వరి మొక్కలు అత్యధికంగా మీథేన్ వాయువును విడుదల చేసి వాతావరణాన్ని కలుషిత పరుస్తాయి. తద్వారా భూతాపం కలుగుతుంది. దీనిని నివారించుటకు బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సంస్థలు సంయుక్తంగా దీనిని ఉత్పత్తి చేశాయి. ఈ మొక్కలు వాతావరణంలోని మీథేన్‌ను అత్యధికంగా గ్రహించి భూతాపంను తగ్గిస్తాయి.
బి) పిహెచ్‌బి (పోలీ హైడ్రోక్సీ బైటైసేట్)
పిహెచ్‌బి అనేది బ్యాక్టీరియా కణకవచం క్రింది భాగంలో ఉన్న ఒక పొర వంటి నిర్మాణం. దీనిని ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ కాలుష్యంను నివారించుటకు దీనిని ఉపయోగిస్తున్నారు. పిహెచ్‌బిని ఉత్పత్తిచేసే జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టి దీనిని అత్యధికంగా ఉత్పత్తిచేసి ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించాలని భావిస్తున్నారు.
సి) రుబిస్కో
కొన్ని ప్రత్యేకమైన మొక్కలు వాతావరణంలోని సిఓ2ను అధికంగా గ్రహించి అత్యధికంగా వృద్ధిచెందుతాయి. ఈ మొక్కలలో జన్యువులనే రుబిస్కో జన్యువులు అని పేర్కొంటారు. వీటిని సాధారణ మొక్కలలో ప్రవేశపెట్టి అత్యధిక సిఓ2ను గ్రహించి అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టిస్తున్నారు.
కర్బన సంబంధమైన వ్యవసాయ, గృహ వ్యర్థ పదార్థాలను బయోగ్యాస్ ఉత్పత్తిలోను, విద్యుత్, ఆల్కహాల్‌ల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.
కొన్ని సాంకేతిక పద్ధతులు:
స్వస్థానీయ బయో రెమిడియేషన్:
ఇందులో తక్కువ నూనెలు కలిసిన మట్టిని తటస్థీకరించడం జరుగుతుంది. మొదట నూనెలు కలిసిన మట్టిని నైట్రేట్‌లను, ఫాస్పేట్‌లను కలిపి దానిపై సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి కొంతకాలంపాటు వదలి వేయడం జరుగుతుంది. తద్వారా నూనెలు కలసిన మట్టి, సాధారణ మట్టిగా ఏర్పడుతుంది.
కంపోస్టింగ్
ఈ పద్ధతిలో రేడియో థార్మిక పదార్థాలను, ప్రేలుడు పదార్థాలను తటస్థీకరించడం జరుగుతుంది. రేడియో థార్మిక పదార్థాలను జీవ విచ్ఛిన్నం చెందే కర్బన పదార్థాలతో కలిపి ఒక పెద్ద గుంతలో నిలిపి దానిపై సూక్ష్మజీవులను వదిలిపెట్టి వాటిని తటస్థీకరించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఆరు నెలలులోగా పేలుడు పదార్థాలను సాధారణ పదార్థాలుగా మార్చి ఎరువులుగా వినియోగించడం జరుగుతుంది.
లాండ్ ఫార్మింగ్
ఈ విధానంలో నూనె లు కలసిన మట్టిని సాధారణ మట్టిని పొరలు పొరలుగా ఒకదానిపై ఒకటి పరచి దానిపై నైట్రేట్ మరియు ఫాస్పేట్ ఎరువులను, సున్నం పొడిని చల్లి దాని పిహెచ్ 7-8గాను, ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంచి సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి ఎదగనియ్యడం జరుగుతుంది. ఈ పద్ధతిలో 4 నెలలుగా నూనెలు కలిసిన మట్టి సాధారణ మట్టిగా కలసిపోతుంది. దీనిని గోతులు పూడ్చడానికిగానీ మొదట త్రవ్విన గోతులలో గాని వేసి పూడ్చిపెట్టడం జరుగుతుంది.
ఫెర్మింటర్:
ఇందులో పెద్ద పెద్ద కాంక్రీటు ట్యాంకులను లేదా రియాక్టర్‌లను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ట్యాంకులలోకి నూనెలు కలసిన మట్టిని 11 వృక్ష, జంతు సంబంధ వ్యర్థ పదార్థాలను, మానవ మల వ్యర్థ పదార్థాలను ప్రవేశపెట్టి అందులో సాధారణ మట్టిని బొగ్గు పొడిని చల్లి దానిపై సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి అవాయు శ్వాసక్రియ జరుపుతారు. తద్వారా నూనెలు కలిసిన మట్టి సాధారణ మట్టిగా మారుతుంది.

Wednesday, February 9, 2011

అంతర్జాతీయ పరిణామాలు

2010  జనవరి లో కొన్ని అంతర్జాతీయ పరిణామాలు

                                        జనరల్ స్టడీస్                                                                              

జనవరి 3: 
* బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంకల మధ్య బంగ్లాదేశ్‌లో ముక్కోణపు వనే్డ సీరిస్ ప్రారంభమైంది.
జనవరి 4: 
 మయన్మార్ దేశంలో 20 ఏళ్ళ తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ సైనిక అధికార ముఠాకు చెందిన జనరల్ ధాన్‌ష్వే ప్రకటించారు.
జనవరి 5:
* బ్లడ్ క్యాన్సర్ నివారణకు టీకాను కనుగొన్నట్లుగా బ్రిటీష్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
* ఈక్వెడార్ దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీగా వౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు రఫెల్ కొరియా తెలిపారు.
* నాసా ప్రయోగించిన కెప్టర్ టెలిస్కోప్ పూర్తిగా వేడిగా లేని, పూర్తిగా చల్లగా లేని నక్షత్రం చుట్టూ స్థిరంగా తిరిగే రెండు గ్రహాలను కనుగొన్నట్లు టెలిస్కోప్ చీఫ్ సైంటిస్ట్ బిల్ బొరుకే తెలిపారు.
* శ్రీలంక అత్యవసర పరిస్థితిని మరో నెలపాటు పొడిగించారు. 2005లో మాజీ విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్‌గమన్ హత్య తరువాత ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితిని గరిష్టంగా ఒక నెలపాటు మాత్రమే విధించవచ్చు.
జనవరి 6:
* జపాన్ ఆర్థిక మంత్రిగా గానాయోటాఖాన్‌ను ఆ దేశ ప్రధాని యోకియోహటోయామా నియమించారు.
జనవరి 7:
* ప్రపంచంలో అత్యంత పెద్ద హోటల్ రోజ్‌రెహాన్‌ను దుబాయ్‌లో ప్రారంభించారు.
* భారత సంతతికి చెందిన పర్యావరణ శాస్తవ్రేత్త సవన్నా స్టేట్ యూనివర్సిటీ కెనె్నత్ సజ్వాన్‌కు అమెరికా అధ్యక్షుని పురస్కారం లభించింది.
జనవరి 9:
* బ్రిస్సేన్ అంతర్జాతీయ టెన్నిస్ టైటిల్‌ను బెల్జియంకు చెందిన కిమ్‌క్లియ్‌స్టర్స్ గెలుపొందారు.
* స్విస్ కెమికల్ సొసైటీ ప్రదానంచేసే గ్రామాటికకిస్ నియోకాన్ అవార్డుకు ప్రవాస భారతీయుడు శివగురు జయరామన్ ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని ఫార్లోలో నార్త్ డకోటా స్టేట్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రం, మాలిక్యులర్ బయాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అవార్డు కింద 4850 అమెరికన్ డాలర్లు, డిప్లమా ప్రదానం చేస్తారు.
జనవరి 17: * పాకిస్థాన్‌లో అణ్వాయుధ స్థావరాలన్నింటిపై అమెరికా తన ఉన్నతశ్రేణి బృందం ‘క్రాక్ యూనిట్’తో భద్రతను ఏర్పాటుచేసింది.
* యునెస్కో ప్రధాన సంచాలకులు యురిన్‌బొకోవా ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీగా ఇగ్నోను ప్రకటించారు. 34 దేశాలనుంచి 30 లక్షల మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ ద్వారా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇగ్నో 1500 కోర్సులను అందిస్తోంది. విద్యకోసమే పరిమితమైన ఎడ్యుశాట్ ఉపగ్రహం ద్వారా ఇగ్నో చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు.
జనవరి 18:
* 67వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో జేమ్స్‌కామెరూన్ దర్శకత్వం వహించిన 3డి సినిమా ‘అవతార్’కు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ విభాగంలో రెండు అవార్డులు లభించాయి. 1997లో టైటానిక్ తర్వాత కామెరూన్‌కు రెండవసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఉత్తమ నటిగా సాండ్రా బుల్లక్, ఉత్తమ నటుడిగా జెఫ్‌బ్రిడ్జ్ అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డును అందుకున్న మార్టిన్ నిర్మాత మార్టిన్ స్కార్‌స్పీకు విశేష సేవలందించినందుకుగానూ సెసిల్.బి.డీమిల్లీ అవార్డు లభించింది.
* చిలీ దేశాధ్యక్షునిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెబాస్టియన్ పినెర రెండవసారి ఎన్నికయ్యారు.
జనవరి 19:
* చైనా పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి ఆనంద్‌శర్మ బీజింగ్ సమావేశంలో ప్రసంగించారు. ఎగుమతి, దిగుమతుల విషయంలో ఇరుదేశాలు సమన్వయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఎనిమిదవ సంయుక్త ఆర్థిక సంఘం చర్చల్లో భాగంగా షాంగై కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు యుజెంగ్‌షెంగ్, చైనా వాణిజ్యశాఖామంత్రి చెన్ డె మింగ్‌లతో ఆయన సమావేశమయ్యారు.
జనవరి 20:
* భారత్‌ను అభిమానిస్తున్న దేశాల జాబితాలో 71% ఓటుతో ఆఫ్గనిస్థాన్ అగ్రస్థానాన నిలిచినట్లు బీబీసి, ఏబిసీ, ఏఆర్‌డి అభిప్రాయ సేకరణలో వెల్లడైంది.
జనవరి 21:
* ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తింటే పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని, అలా అభివృద్ధిచెందిన బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాల అభివృద్ధిలో సహకరిస్తుందని, పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుందని డెన్మార్క్ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తలు తెలిపారు.
జనవరి 22:
* మలేషియా 8వ రాజ్యాంగ నియంత సుల్తాన్ ఇస్మాండి మరణించారు.
జనవరి 23:
* క్యోటో ఒప్పందంపై న్యూఢిల్లీలో జరిగిన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా దేశాల పర్యావరణ మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి డా.మన్మోహన్‌సింగ్ ప్రసంగించారు. వర్థమాన ఆర్థిక వ్యవస్థలు ఐకమత్యాన్ని కలిగి ఉండాలని, సుహృద్భావం పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
* అధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నికలను అంగోలా దేశం రద్దుచేసింది. ఇప్పటినుండి పార్లమెంట్‌లో పార్టీ మెజారిటీ ఆధారంగా అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.
* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంనుండి ట్విట్టర్ మెసేజ్ పంపిన తొలి ఫ్లైట్ ఇంజినీర్‌గా నాసాకు చెందిన టీమోతీ టీజెక్రీమర్ అరుదైన ఘనత సాధించారు.
జనవరి 24:
* అత్యంత ఆరోగ్యకరమైన రెస్టారెంట్‌గా బ్రిటన్‌లో ప్రవాస భారతీయుడు నిర్వహిస్తున్న ఇందాలీ లాంజ్‌కు బీబీసీ ఫుడ్ ఛానల్ పురస్కరం లభించింది.
* ప్రపంచ సామాజిక వేదిక సమావేశాలు బ్రెజిల్‌లోని పోర్ట్ అలెగ్రిలో ప్రారంభమయ్యాయి.
జనవరి 25:
* మహాత్మాగాంధీ 141వ జయంతిని పురస్కరించుకొని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నైరుతి ప్రాంతంలో ఉన్న హిల్‌క్రాఫ్ట్‌కు మహాత్మాగాంధీ జిల్లా అని నామకరణం చేశారు.
జనవరి 26:
లెబనాన్ రాజధాని బీరూట్ సమీపంలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-737-800 విమానం మధ్యదరాసముద్రంలో కూలిపోవడంతో 83 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది మరణించారు.
జనవరి 27:
* శ్రీలంక అధ్యక్షునిగా వరుసగా రెండవసారి మహేంద్ర రాజపక్సే విజయం సాధించారు. ఆయన 57.8% ఓట్లు సాధించారు.
* మీర్పుర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. జహీర్‌ఖాన్ 87 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి జట్టు విజయాన్ని చేకూర్చాడు. ఈ మ్యాచ్‌లో షాదత్ వికెట్ తీయడం ద్వారా హర్బజన్‌సింగ్ 600ల అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన మూడవ భారత క్రీడాకారునిగా చరిత్రకెక్కాడు. *

Tuesday, February 8, 2011

సివిల్ సర్వీస్ పరీక్షలో ఆప్షనల్ పేపర్‌ను ఎత్తివేత..!

civils in telugu, civils preparation in telugu, does telugu medium students are eliguble for writing civils? upsc civils in telugu medium,
సివిల్ సర్వీస్ పరీక్షలో సంచలన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 
(ప్రిలిమ్స్ ) పేపర్-2 విభాగంలో ఆప్షనల్ పేపర్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆప్షనల్ పేపర్ స్థానంలో ఆప్టిటూడ్ , రీజనింగ్  మొదలగునవి  కొనసాగించాలని యుపిఎస్‌సి నిర్ణయించిందని మనందరికి తెలిసిన విషయమే . త్వరలో అనగా 19-ఫిబ్రవరి-2011 నందు నోటిఫికేషన్ విడుదల అవనున్న సందర్భంగా మళ్ళీ ఒక సారి గుర్తు చేస్తున్నాను.
దీంతో ఇకపై అభ్యర్థులందరికీ రెండు తప్పనిసరి పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకూ జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ ఒకటే ఉండేది. రెండో పేపర్‌గా ఆప్షనల్ ఉండేది. ఈ విధానం ద్వారా ప్రతిభకు పూర్తి స్థాయి పరీక్ష, న్యాయం జరగడం లేదని చాలా కాలం నుంచి ఫిర్యాదులు, విమర్శలు వస్తుండటంతో ఆప్షనల్స్‌ను తొలగించాలని యూపిఎస్‌సి భావించింది.
ఈ కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లకూ 200 చొప్పున మార్కులుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల సమయం ఉంటుంది. రెండు పేపర్లలోనూ మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ ఉంటాయని యూపిఎస్‌సి తెలిపింది. యూపిఎస్‌సి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 30 ఏళ్ళ ఆప్షనల్స్‌ పద్దతికి చరమగీతం పాడినట్లయింది.


ముందు:

పేపర్-1         జనరల్ స్టడీస్ 
పేపర్-2         ఆప్షనల్ (అభ్యర్థి ఇష్టప్రకారం ఎంచుకోనునది )

ఇప్పటినుండి: 

పేపర్-1         జనరల్ స్టడీస్ 
పేపర్-2         ఆప్టిటూడ్ , రీజనింగ్  మొదలగునవి 
మెయిన్స్ యధావిధిగానే సాగుతాయి .
Related Posts Plugin for WordPress, Blogger...