Monday, June 10, 2019

Group 1 Mains Syllabus in Telugu | గ్రూప్ 1 సిలబస్ తెలుగులో....


PAPER – 1 :: GENERAL ESSAY


 1. సమకాలీన అంశాలు
 2. సామాజిక - రాజకీయ అంశాలు
 3. సామాజిక - ఆర్థిక అంశాలు
 4. సామాజిక - పర్యావరణ అంశాలు
 5. సాంస్కృతిక, చారిత్రక అంశాలు
 6. పౌర అవగాహనకు సంబంధించిన అంశాలు
 7. ఆలోచనాత్మక అంశాలు (Reflective Topics)
  



PAPER-2
A) భారతదేశ చరిత్ర, సంస్కృతి
1. భారతదేశంలో పూర్వ చారిత్రక సంస్కృతి- సింధు నాగరికత- వేద సంస్కృతి- మహాజనపథాలు- నూతన మతాల ఆవిర్భావం- బౌద్ధం, జైన మతాలు- మగధ సామ్రాజ్య ఆవిర్భావం, మౌర్యుల యుగం- అశోకుని ధమ్మం- భారతదేశంపై విదేశీ దండయాత్రలు- కుషాణులు- శాతవాహనులు, దక్షిణ భారతదేశంలో సంగం యుగం- శుంగులు- గుప్తులు, కనౌజ్, వారి సేవలు- విదేశీ యాత్రికుల చారిత్రక ఆధారాలు- తొలిదశ విద్యాలయాలు.

2. పల్లవులు, బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, చోళులు-సామాజిక, సాంస్కృతిక రంగాలలో పాత్ర, భాష, సాహిత్యం, కళలు, వాస్తు శైలి- ఢిల్లీ సుల్తానులు- ఇస్లాం ఆగమనం, ప్రభావం-భక్తి, సూఫీ వంటి భక్తి ఉద్యమాలు, వాటి ప్రభావం- దేశ భాషల వృద్ధి, సాహిత్యం, రచనలు- లలిత కళలు- కాకతీయలు, విజయనగర, బహమనీ, కతుబ్‌ షాహీలు, సమకాలీన దక్షిణ భారతదేశ రాజ్యాలలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు.

3. మొఘలుల పరిపాలన, సాంఘిక- మత జీవనం, సాంస్కృతిక అభివృద్ధి- శివాజీ, మరాఠా సామ్రాజ్య ఉత్థానం- భారత్‌లో యూరోపిన్ల ఆగమనం- వర్తక విధానాలు- ఈస్టిండియా కంపెనీ ఎదుగుదల, ప్రభావం- పరిపాలన, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో మార్పులు- క్రిస్టియన్‌ మిషనరీల పాత్ర.

4. భారతదేశంలో 1757 నుంచి 1856 వరకు బ్రిటిష్‌ పాలన- భూమిశిస్తు ఒప్పందాలు, శాశ్వత, రైత్వారీ, మహల్వారీ- 1857 తిరుగుబాటు, ప్రభావం-విద్య, పత్రికలు, సాంస్కృతిక మార్పులు-జాతీయవాద చైతన్యం, మార్పులు- 19వ శతాబ్దంలో సాంఘిక- మత సంస్కరణ ఉద్యమాలు- రాజారామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనిబిసెంట్, సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ తదితరులు.
భారత జాతీయవాదం ఉత్థానం- - భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకలాపాలు- వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలు- ఆత్మగౌరవ ఉద్యమాలు- జ్యోతిబాపూలే, నారాయణ గురు, పెరియార్‌ రామస్వామి నాయకర్‌- మహాత్మా గాంధీ పాత్ర, సుభాష్‌ చంద్రబోస్, వల్లభాయ్‌ పటేల్‌- సత్యాగ్రహం- క్విట్‌ ఇండియా ఉద్యమం - డాక్ట‌ర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వారి సేవలు.

5. జాతీయ ఉద్యమం మూడు దశలు- స్వాతంత్య్ర పోరాటం, 1885-1905, 1905-1920 గాంధీ శకం 1920-1947 - రైతాంగ, మహిళా, గిరిజన, కార్మిక ఉద్యమాలు-స్వాతంత్రోద్యమంలో వివిధ పార్టీల పాత్ర, స్థానిక ప్రాంతీయ ఉద్యమాలు- అంతర్‌ మత ఐక్యత, మతవాదం-స్వాతంత్య్రం, దేశ విభజన- స్వాతంత్య్రానంతరం భారతదేశం-విభజన అనంతరం పునరావాసం- భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ- భారత రాష్ట్రాల ఏకీకరణ- భారత రాజ్యాంగం- ఆర్థిక విధానాలు- విదేశాంగ విధాన కార్యక్రమం.
B) ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి

6. ప్రాచీన చరిత్ర: శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు, పల్లవులు, విష్ణుకుండినులు- సామాజిక, ఆర్థిక పరిస్థితులు- మతం, భాష (తెలుగు), సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం- ఆంధ్రలో జైనమతం, బౌద్ధ మతం- తూర్పు చాళుక్యులు, రాష్ట్ర కూటులు, రేనాటి చోళులు, ఇతరులు- సామాజిక, సాంస్కృతిక జీవనం, మతం-తెలుగు లిపి, రచనలు, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం.

7. మధ్యయుగ చరిత్ర: 1000 నుండి 1565 వరకు ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులు-తెలుగు భాషా సాహిత్యాల ప్రాచీనత, ఆరంభం, వృద్ధి (కవిత్రయం - అష్టదిగ్గజాలు) - విజయనగర, గజపతుల, రెడ్డి రాజుల, కాకతీయులు వారి సామంతుల కాలంలో లలిత కళలు, వాస్తు శిల్పం - చారిత్రక స్మారక నిర్మాణాలు - ప్రాముఖ్యం, తెలుగు చరిత్ర, భాషా వికాసాలకు కుతబ్‌షాహీల తోడ్పాటు - ప్రాంతీయ సాహిత్యం - ప్రజా కవి వేమన ఇతరులు.

8. ఆధునిక చరిత్ర: ఆంధ్రలో యూరోపియన్‌ వర్తక స్థావరాల ఏర్పాటు - కంపెనీ పాలనలో ఆంధ్ర, క్రిస్టియన్‌ మిషనరీల పాత్ర - సామాజిక - సాంస్కృతిక సాహిత్య వికాసం - సిపి బ్రౌన్, థామస్‌ మన్రో, మెకంజీ - జమీందారీ, పాలెగారీ వ్యవస్థ - స్థానిక రాజ్యాలు, చిన్నరాజులు - సంఘ సంస్కర్తల పాత్ర - గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామ్మూర్తి, అనిబిసెంట్‌ ఇతరులు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమం, వార్తా పత్రికల పాత్ర - జానపద, గిరిజన సంస్కృతి, నిమ్నస్థాయి సంస్కృతి, మహిళల పాత్ర.

9. జాతీయ ఉద్యమం - ఆంధ్ర నాయకుల పాత్ర: జస్టిస్‌ పార్టీ, బ్రాహ్మణేతర ఉద్యమం, జాతీయ వాద, విప్లవాత్మక సాహిత్యం - గుర్రం జాషువా, బోయి భీమన్న, శ్రీశ్రీ, గరిమెళ్ల సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఇతరులు.
ఆంధ్ర మహాసభలు, ఆంధ్ర ఉద్యమం- ప్రముఖ నాయకులు - అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, పోనక కనకమ్మ, డొక్కా సీతమ్మ - గ్రంథాలయ ఉద్యమం - అయ్యంకి వెంకటరత్నం, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, కాశీనాథుని నాగేశ్వరరావు - పొట్టి శ్రీరాములు, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, 1953 - ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం, 1956 - ఆంధ్రప్రదేశ్‌ 1956 నుంచి 2014 వరకు - విభజనకు కారణాలు, జూన్‌ 2, 2014 ప్రభావం.

10. ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక సాంఘిక, రాజకీయ, న్యాయ పర్యవసానాలపై దాని ప్రభావం, రాజధాని నగరం కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం, ఆర్థిక పర్యవసానాలు - ఉద్యోగుల విభజన, స్థానికత సమస్యలు - వ్యాపార వాణిజ్యాలు, పరిశ్రమలపై విభజన ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల పర్యవసానాలు, అభివృద్ధి అవకాశాలు - సామాజిక, ఆర్థిక సాంస్కృతిక, జనాభాపరంగా విభజన ప్రభావం - నదీ జలాల పంపిణీపై ప్రభావం, ఇతర అనుసంధాన అంశాలు - ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం - 2014. నిర్దిష్ట అంశాలకు సంబంధించిన పరిష్కారం.

C) భూగోళశాస్త్రం - భారతదేశం - ఆంధ్రప్రదేశ్‌

11. భౌగోళిక లక్షణాలు, వనరులు: భారతదేశం, ఆంధ్రప్రదేశ్, ప్రధాన భూస్వరూపాలు, వాతావరణ మార్పులు, నేలల రకాలు, నదులు, నీరు, ప్రవాహాలు, భూభౌతిక శాస్త్రం, శిలలు, ఖనిజ వనరులు, లోహాలు, నిర్మాణ పదార్థాలు, రిజర్వాయర్లు, డ్యామ్‌లు - అడవులు, పర్వతాలు, వృక్ష, జంతు సంపద, పీఠభూమి అడవులు, కొండప్రాంత అడవులు, ఉద్భిజ సంపద వర్గీకరణ.

12. ఆర్థిక భూగోళశాస్త్రం: వ్యవసాయం, పశుసంపద, అటవీ వనరులు, చేపలు, గనులు, తవ్వకాలు, గృహోపకరణాల తయారీ, పరిశ్రమలు - వ్యవసాయ ఖనిజ, అటవీ, ఇంధన, మానవ సామర్థ్యం, వ్యాపారం, వాణిజ్యం, కమ్యూనికేషన్, రోడ్డు, రవాణా, స్టోరేజి, ఇతర అంశాలు.

13. సాంఘిక భూగోళ శాస్త్రం: జనాభా కదలికలు, పంపిణీ, మానవ ఆవాసాలు, జనసాంద్రత, వయసు, లింగపరమైన, పట్టణ, గ్రామీణ, కుల, గిరిజన, మత, భాషా, పట్టణ వలసలు, విద్యా సంబంధ లక్షణాలు.

14. జంతు, వృక్ష భూగోళశాస్త్రం, వన్యప్రాణులు, జంతువులు, పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు, చెట్లు, మొక్కలు, ఇతర అంశాలు.

15. పర్యావరణ భూగోళశాస్త్రం సుస్థిర అభివృద్ధి, ప్రపంచీకరణ, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, మేఘావృతం, గాలులు, ప్రత్యేక వాతావరణ వ్యవస్థ, సహజ విపత్తులు - భూకంపాలు, భూపాతాలు, వరదలు, తుపాన్లు, కుండపోత వర్షాలు, విపత్తు నిర్వహణ, ప్రభావ అంచనా, పర్యావరణ కాలుష్యం, కాలుష్య నిర్వహణ.

  

PAPER-3

A) భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం

1. భారత రాజ్యాంగం, ముఖ్య లక్షణాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులు, బాధ్యతలు

2. సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్ళు - రాష్ట్రాల్లో, గవర్నర్‌ పాత్ర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ - (కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా) సమస్యలు, సవాళ్ళు.

3. గ్రామీణ, పట్టణ స్థానిక పాలన - 73, 74 రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగబద్ధ సంస్థలు - వాటి పాత్ర.

4. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, నిర్మాణం, సభా పనితీరు, నిర్వహణ, అధికారాలు, ప్రత్యేక హక్కులు, వీటిలో ఎదురయ్యే సమస్యలు.

5. భారతదేశంలో న్యాయవ్యవస్థ - నిర్మాణం, విధులు, అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ సవరణలు, న్యాయ సమీక్ష, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు.

ప్రభుత్వ పాలన, గవర్నెన్స్‌

6. ప్రభుత్వ పాలన, నిర్వచనం, స్వభావం, పరిధి - భారత్‌లో పరిణామం - కౌటిల్యుని అర్ధశాస్త్రంలో పరిపాలన భావనలు; మొఘల్‌ పరిపాలన; బ్రిటిష్‌ వారసత్వం.

7. వివిధ రంగాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాలు, అమలులో వచ్చే సమస్యలు

8. అభివృద్ధి ప్రక్రియ - పౌర సమాజ పాత్ర, ఎన్‌జీఓలు, ఇతర భాగస్వాములు.

9. చట్టబద్ధ, నియంత్రణ, పాక్షిక - న్యాయ సంస్థలు - ప్రజాస్వామ్యంలో సివిల్‌ సర్వీసుల పాత్ర.

10. సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, పాలనలో సిటిజన్‌ చార్టర్, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత ఆర్‌టీఐ, ప్రజాసేవల చట్టం, వాటి పర్యవసానాలు, సామాజిక ఆడిట్‌ భావన, దాని ప్రాధాన్యం.


ప్రజాసేవలో నైతిక విలువలు: చట్ట పరిజ్ఞానం
11. నైతిక విలువలు, మానవ సమన్వయం: సారాంశం, మానవ చర్యలలో నైతికత నిర్ధారకాలు, పరిణామాలు: నైతికత కోణాలు, ప్రజా, వ్యక్తిగత సంబంధాలలో నైతిక విలువలు, ప్రజాసేవలో జవాబుదారీతనం, నైతికత - సమగ్రత.

12. మానవ విలువలు: ప్రకృతి సమాజంలో అంతర్లీనంగా ఉనికిలో ఉన్న సామరస్యాన్ని అర్థం చేసుకోవడం. మానవ సంబంధాలలో లింగ సమానత్వం. పౌరుల్లో విలువలు ఏర్పడడంలో కుటుంబం, సమాజం, విద్యాసంస్థల పాత్ర, గొప్ప నాయకులు, సంస్కర్తలు, పాలకుల జీవితాలు, సందేశాల నుంచి స్ఫూర్తి పాఠాలు.

13. దృక్పథం: విషయ అవగాహన. మనిషి ఆలోచనలు, ప్రవర్తనలకు దృక్పథానికి గల సంబంధం, దాని ప్రభావం, నైతిక, రాజకీయ వైఖరులు, సామాజికంగా వీటి ప్రభావం, ఉద్వేగాల ప్రజ్ఞ - దీని ఉపయోగాలు. పాలనలో ఉద్వేగ ప్రజ్ఞ అనువర్తన.

14. ప్రజాసేవ భావన (సిద్ధాంతం), పాలనకు తాత్వికపరమైన సంపూర్ణ సాంకేతికతలపై దృష్టి. అవగాహనల నేపథ్యంలో వృత్తిపర నైతికత, నైతికత నియమావళి, ప్రవర్తనా నియమావళి, ఆర్‌టీఐ, ప్రజాసేవ చట్టం, నాయకత్వ నైతికత, పని సంస్కృతి, సంస్థాగతపరమైన నైతిక సూత్రాలు. పాలనలో నైతిక, మానవ విలువలు, అంతర్జాతీయ సంబంధాలలో నైతిక అంశాలు, అవినీతి లోక్‌పాల్, లోకాయుక్త.

భారతదేశంలో చట్టాలపై ప్రాథమిక అవగాహన
15.
·        భారత రాజ్యాంగం: స్వభావం, ప్రత్యేక లక్షణాలు, ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా. న్యాయవ్యవస్థ అధికారాలు, కార్యనిర్వాహక, శాసనశాఖలు.
·        పౌర, క్రిమినల్‌ చట్టాలు: దేశంలో సివిల్, క్రిమినల్‌ కోర్టుల క్రమానుగత శ్రేణి - వాస్తవిక చట్టాలు, విధానపరమైన చట్టాల మధ్య భేదాలు - ఉత్తర్వు (ఆర్డర్‌), డిక్రీ - క్రిమినల్‌ చట్టాల్లో తాజా పరిణామాలు, నిర్భయ చట్టం.
·        కార్మిక (శ్రామిక) చట్టం: దేశంలో సాంఘిక సంక్షేమ చట్టాల భావన, ఉపాధిలో మారుతున్న ధోరణులు, నూతన శ్రామిక చట్టాల అవసరం.
·        సైబర్‌ చట్టాలు: సమాచార సాంకేతిక‌ చట్టం - సైబర్‌ భద్రత, సైబర్‌ నేరం- కోర్టుల్లో సైబర్‌ నేరాల సమర్థ న్యాయ పరిధిని ప్రభావితం చేసే ఇబ్బందులు
·        పన్ను చట్టాలు: ఆదాయం, లాభాలు, సంపద పన్ను, కార్పొరేట్‌ పన్నులకు సంబంధించిన చట్టాలు - జీఎస్‌టీ


PAPER-4 :: ఆర్థిక వ్యవస్థ, భారత, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి
1. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్ళు - అస్థిర వృద్ధిరేటు, వ్యవసాయం, ఉత్పత్తి రంగాల తక్కువ వృద్ధిరేట్లు, ద్రవ్యోల్బణం, చమురు ధరలు, కరెంట్‌ అకౌంట్‌ లోటు, అననుకూల విదేశీ చెల్లింపులు, రూపాయి విలువ క్షీణత, నిరర్ధక ఆస్తుల పెరుగుదల, మూలధన సమీకరణ - మనీ లాండరింగ్, నల్లద్రవ్యం - ఆర్థిక వనరుల కొరత, మూలధన లోటు, సమీకృత, సుస్థిరాభివృద్ధి లేకపోవటం - ప్రకృతి, కారణాలు, ఈ సమస్యల పర్యవసానాలు, పరిష్కారాలు.

2. భారత ఆర్థిక వ్యవస్థలో వనరుల సమీకరణ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆర్థిక వనరుల మూలాలు - బడ్జెటరీ వనరులు - పన్నుల రాబడి, పన్నేతర రాబడి - ప్రభుత్వ రుణం: మార్కెట్‌ అప్పులు, రుణాలు, గ్రాంటులు మొదలైనవి. బహుళ పాక్షిక సంస్థల నుంచి బహిర్గత రుణం - విదేశీ సంస్థాగత పెట్టుబడి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - వివిధ వనరుల వినియోగం, అవసరం, దాని పర్యవసానాలు - ద్రవ్య కోశ విధానాలు - ఫైనాన్షియల్‌ మార్కెట్స్, విత్త అభివృద్ధి సంస్థలు - పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు - భౌతిక వనరులు - శక్తి వనరులు

3. ఆంధ్రప్రదేశ్‌లో వనరుల సమీకరణ - బడ్జెటరీ వనరులు, అవరోధాలు - ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల సఫలీకృతం - కేంద్ర సహాయం, వివాదాల సమస్యలు - ప్రభుత్వ రుణం, ప్రాజెక్టుల బహిర్గత సహాయం - భౌతిక వనరులు - ఖనిజ వనరులు, అటవీ వనరులు - ప్రక్క రాష్ట్రాలతో నీటి వివాదాలు.

4. ప్రభుత్వ బడ్జెటింగ్‌: ప్రభుత్వ బడ్జెట్‌ నిర్మాణం, దాని భాగాలు - బడ్జెటింగ్‌ ప్రక్రియ, నూతన మార్పులు, బడ్జెట్‌ రకాలు - లోటు రకాలు దాని ప్రభావం, నిర్వహణ, ప్రస్తుత సంవత్సరాల్లో కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ ముఖ్యాంశాలు దాని విశ్లేషణలు - వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) సంబంధిత సమస్యలు - రాష్ట్రాలకు కేంద్ర సహాయం - దేశంలో ఫెడరల్‌ ఫైనాన్స్‌ సమస్యలు- తాజా ఆర్థిక సంఘం సిఫార్సులు.

5. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడ్జెటింగ్‌: బడ్జెట్‌ అవరోధాలు - కేంద్ర సహాయం, రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం విభేదాల సమస్యలు - లోటు నిర్వహణ- ప్రస్తుత సంవత్సర బడ్జెట్‌ ముఖ్యాంశాలు, విశ్లేషణ- రాష్ట్ర ఆర్థిక సంఘం, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక విత్తం.

6. సమ్మిళిత వృద్ధి: సమ్మిళితం అర్థం - దేశంలో ఆర్థిక ఎడబాటుకు కారణాలు - సమ్మిళిత సాధనాలు, వ్యూహాలు: పేదరిక నిర్మూలన, ఉపాధి, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, సాంఘిక సంక్షేమ పథకాలు - ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థ - సుస్థిర వ్యవసాయం - సమీకృత గ్రామీణాభివృద్ధి - ప్రాంతీయ భిన్నత్వాలు - ప్రభుత్వం, సమ్మిళిత వృద్ధికి భాగస్వామ్యం - ఆర్థిక సమ్మిళితం - ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత వృద్ధికి ప్రస్తుత పథకాలు, ఆర్థిక సమ్మిళితం - ప్రజాపంపిణీ వ్యవస్థ, డ్వాక్రా.

7. వ్యవసాయ అభివృద్ధి: ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం పాత్ర - స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ పంపిణీ - విత్తం, ఉత్పత్తి, మార్కెటింగ్‌ సమస్యలు - హరిత విప్లవం, మెట్ట వ్యవసాయం పట్ల మారుతున్న దృష్టి, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం - కనీస మద్దతు ధరలు - వ్యవసాయ విధానం - స్వామినాథన్‌ కమిషన్‌ - ఇంధ్రధనుస్సు (రెయిన్‌బో) విప్లవం.

8. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అభివృద్ధి: రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం - నీటిపారుదల, వ్యవసాయ అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు - మారుతున్న పంటల తీరు - ఉద్యాన రంగం, ఫిషరీస్, పాడి పరిశ్రమలపై ప్రధాన దృష్టి - ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ప్రోత్సాహానికి పథకాలు.

9. పారిశ్రామిక అభివృద్ధి విధానం: ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామికరంగం పాత్ర, స్వాతంత్య్రానంతరం పారిశ్రామిక విధానాల పరిణామం - 1991 పారిశ్రామిక విధానం దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం - దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ రంగం పంపిణీ - పారిశ్రామిక అభివృద్ధిపై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం - పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ - అనుబంధ పరిశ్రమల సమస్యలు - సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు, వాటి సమస్యలు, విధానం - పారిశ్రామిక రుగ్మతలు, సహాయ వ్యవస్థ - తయారీ రంగం (మాన్యుఫ్యాక్చరింగ్‌) విధానం - మేక్‌ ఇన్‌ ఇండియా - స్టార్టప్‌ కార్యక్రమం - జాతీయ పెట్టుబడి తయారీ మండళ్ళు (ఎన్‌ఐఎంజడ్‌), ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక కారిడార్లు.

10. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక విధానం: పరిశ్రమలకు ప్రోత్సాహకాలు - ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు - పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిబంధకాలు - విద్యుత్‌ ప్రాజెక్టులు.

11. భారతదేశంలో మౌలిక వసతులు: రవాణా మౌలిక వసతులు: ఓడరేవులు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు - దేశంలో ప్రధాన రవాణా మౌలిక వసతుల ప్రాజెక్టులు - కమ్యూనికేషన్‌ మౌలిక వసతులు - సమాచార సాంకేతికత - ఇ-గవర్నెన్స్‌ - డిజిటల్‌ ఇండియా - శక్తి, విద్యుత్‌ - పట్టణ మౌలిక వసతులు - స్మార్ట్‌ సిటీలు - పట్టణ పర్యావరణం - ఘన వ్యర్థాల నిర్వహణ - వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ - వివిధ మౌలిక వసతుల కల్పనలో ఆర్థిక, యాజమాన్య, కార్యనిర్వాహక, నిర్వహణ సమస్యలు - ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం సంబంధిత సమస్యలు - ప్రజా వినియోగ ధరలు, ప్రభుత్వ విధానం - మౌలిక వసతుల ప్రాజెక్టులపై పర్యావరణ ప్రభావం.

12. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి - రవాణా: శక్తి సమాచార భావ ప్రసార సాంకేతిక (ఐసీటీ) మౌలిక వసతులు - ప్రతిబంధకాలు - ప్రభుత్వ విధానం - ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులు.


PAPER-5 :: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

1. మెరుగైన మానవ జీవితం కోసం శాస్త్ర, సాంకేతికత, నవీకరణల సమీకృతం. దైనందిన జీవితంలో సైన్స్‌ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక, నవీకరణల విస్తృతిపై జాతీయ విధానాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారతదేశ పాత్ర, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వినియోగం, వ్యాప్తిలో సమస్యలు, సవాళ్లు, జాతి నిర్మాణంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర, పరిధి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన శాస్త్ర, సాంకేతికత రంగంలో భారత శాస్త్రవేత్తల విజయాలు - దేశీయ సాంకేతికతలు, నూతన సాంకేతికతల అభివృద్ధి.

2. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) - ప్రాధాన్యం, ప్రయోజనాలు, సవాళ్లు, ఇ-గవర్నెన్స్, భారతదేశం, సైబర్‌ నేరాలు, సైబర్‌ సమస్యలు ఎదుర్కోవడానికి విధానాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)పై భారత ప్రభుత్వ విధానం. భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అభివృద్ధి.\

3. భారత అంతరిక్ష కార్యక్రమం - గతం, ప్రస్తుతం, భవిష్యత్తు, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) - కార్యకలాపాలు, విజయాలు, భారతదేశ ఉపగ్రహ కార్యక్రమాలు, మానవ జీవితాలను ప్రభావితం చేసే ఆరోగ్యం, విద్య, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, వాతావరణ అంచనా వంటి వివిధ రంగాలలో ఉపగ్రహాల ఉపయోగాలు, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ).

4. భారతదేశ ఇంధన అవసరాలు - సామర్థ్యం, వనరులు, స్వచ్ఛ ఇంధన వనరులు. భారతదేశ ఇంధన విధానం -ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, సాంప్రదాయక, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన డిమాండ్లు, భారత ఇంధన శాస్త్రాలు, సాంప్రదాయక ఇంధన వనరులు - థర్మల్‌. పునరుత్పాదక శక్తి వనరులు - సౌరశక్తి, పవనశక్తి, బయో, వ్యర్థ ఆధారిత, ఇంధన విధానాలు. జియోథర్మల్, టైడల్‌ వనరులు, భారతదేశంలో ఇంధన విధానాలు, ఇంధన భద్రత.
భారతదేశ అణు విధానం ముఖ్య అంశాలు, భారతదేశంలో అణు కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయిలో అణు విధానాలు, వాటిపై భారతదేశ వైఖరి.

5. అభివృద్ధి వర్సెస్‌ ప్రకృతి/ పర్యావరణం: సహజ వనరుల క్షీణత - లోహాలు, ఖనిజాలు, సంరక్షణ విధానం, - పర్యావరణ కాలుష్యం, సహజ, మానవ సంబంధ, పర్యావరణ పరమైన క్షీణత - సుస్థిరాభివృద్ధి - అవకాశాలు, సవాళ్లు. శీతోష్ణస్థితి మార్పులు, ప్రపంచంపై ప్రభావం. శీతోష్ణస్థితి న్యాయం - ప్రపంచ విధానం; పర్యావరణ ప్రభావ అంచనా. సహజ విపత్తులు - తుపానులు, భూకంపాలు, భూ పాతాలు, సునామీలు, అంచనా నిర్వహణ.
ఆరోగ్యం, పర్యావరణం మధ్య సహ సంబంధం, సామాజిక అడవులు, అడవుల పెంపకం, అడవుల నరికివేత, భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లలో గనుల తవ్వకం. సహజ వనరులు రకాలు - పునరుత్పాదక, పురుత్పాదకం కాని సహజ వనరులు. అటవీ వనరులు - మత్స్య వనరులు, శిలాజ ఇంధనాలు, బొగ్గు పెట్రోలియం. సహజ వాయవు. ఖనిజ వనరులు. నీటి వనరులు - రకాలు, వాటర్‌ షెడ్‌ మేనేజ్‌మెంట్‌ - భూవనరులు - నేలలు రకాలు, నేలల పునరుద్ధరణ.

6. పర్యావరణ కాలుష్యం, ఘన వ్యర్థాల నిర్వహణ: వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆధారాలు, ప్రభావం, నియంత్రణ, ఘనవ్యర్థాల నిర్వహణ - ఘన వ్యర్థాల రకాలు, ఘన వ్యర్థాల ప్రభావం, రీసైక్లింగ్, పునర్వియోగం. మృత్తికా క్రమక్షయం, తీరప్రాంత కోత, పరిష్కార చర్యలు. ప్రపంచ పర్యావరణ అంశాలు, మానవ ఆరోగ్యం, ఓజోన్‌ పొర క్షీణత, ఆమ్ల వర్షాలు. గ్లోబల్‌ వార్మింగ్‌ పర్యావరణంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పాత్ర, ప్రభావం.
పర్యావరణ చట్టాలు: అంతర్జాతీయ చట్టాలు, మాంట్రియల్‌ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్, సీఐటీఈఎస్, పర్యావరణ (పరిరక్షణ) చట్టం - 1986, అటవీ సంరక్షణ చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం. భారత జీవ వైవిధ్య బిల్లు - కాప్‌ 21 - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు - జాతీయ విపత్తు, నిర్వహణ విధానం, 2016, భారతదేశంలో విపత్తు, నిర్వహణ కార్యక్రమాలు. శ్వేత విప్లవం, హరిత విప్లవం, గ్రీన్‌ ఫార్మసీ.

7. భారతదేశంలో బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ స్వభావం పరిధి, వాటి అనువర్తనాలు; నైతిక, సామాజిక, న్యాయపరమైన అంశాలు, ప్రభుత్వ విధానాలు; జెనటిక్‌ ఇంజనీరింగ్, సంబంధిత సమస్యలు, మానవ జీవితంపై ప్రభావం. జీవ వైవిధ్యం, కిణ్వణం, వ్యాధి సంబంధ నిర్ధారణ విధానాలు.

8. మానవుల వ్యాధులు - సూక్ష్మ జీవుల ద్వారా వ్యాధులు, సాధారణ వ్యాధులు, ముందు జాగ్రత్త చర్యలు, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్‌ సంబంధిత వ్యాధుల పరిచయం - డయేరియా, రక్త విరేచనాలు, కలరా, క్షయ, మలేరియా, హెచ్‌ఐవి, ఎన్‌సెఫలైటిస్, చికున్‌ గున్యా, బర్డ్‌ ఫ్లూ వంటి వైరస్‌ వ్యాధులపై ప్రాథమిక అవగాహణ - వ్యాధులు సంబంవించిన సమయంలో ముందు జాగ్రత్తలు. జన్యు ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ పరిచయం, జెనెటిక్‌ ఇంజనీరింగ్, ప్రాథమిక భావనలు. కణజాల వర్ధనం, పద్ధతులు, అనువర్తనాలు. వ్యవసాయంలో బయో టెక్నాలజీ - జీవ కీటకనాశనులు, జీవ ఎరువులు, జీవ ఇంధనాలు, జన్యు మార్పిడి పంటలు. పశు సంపద - జన్యు మార్పిడి జంతువులు. టీకాలు: రోగ నిరోధక పరిచయం, టీకాలు వేయడంలో ప్రాథమిక భావనలు, ఆధునిక టీకాల ఉత్పత్తి (హెపటైటిస్‌ టీకా ఉత్పత్తి).

9. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన సమస్యలు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో సైన్స్‌కు ప్రోత్సాహం.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...