Tuesday, April 16, 2019

2019 సివిల్స్ కి సన్నద్ధం అవ్వండి ఇలా....


సివిల్స్ సమరానికి సై....
భారతదేశంలో కాంపిటేటివ్ పరిక్షలలో శిఖరం సివిల్ సర్వీసెస్ పరిక్షలు. ఉన్నతమైన హోదాతో పాటు సమాజం కోసం ప్రభుత్వం తరపున పనిచేసే అవకాశం కల్పించే ఈ పరిక్షలు డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కర్నీ ఊరిస్తూనే ఉంటాయి. అందుకే దాదాపు 10లక్షల పైచిలుకు అభ్యర్థులు ప్రతి సంవత్సరం అప్లై చేస్తుంటారు. ఈ సంవత్సరం 896 ఖాళీలు ప్రకటించగా దాదాపు 12 లక్షల పైచిలుకు అప్లికేషన్లు రావచ్చని అంచనా.
2018 విశ్లేషణ:
గత సంవత్సరం నిర్వహించిన సివిల్స్ పరిక్ష తాలూకు తుదిఫలితాలు ఈమధ్యనే విడుదలయ్యాయి. ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే సాధారణ కేటగిరీలో 2025 మార్కులకు గానూ (మెయిన్స్ 1750 + వ్యక్తిత్వ పరిక్ష 275) 982 కటాఫ్ మార్కులుగా నిర్ణయించగా, మొదటి ర్యాంకర్ గా నిలిచిన కనిషక్ కటారియా 1121 మార్కులు  సాధించారు.  దీన్నిబట్టి చూస్తే 55% అత్యుత్తమ మార్కులు కాగా 48.5% అర్హత సాధించడానికి కావాల్సిన కనీస మార్కులుగా నిర్ణయించబడ్డాయి. పరిక్షలోని కటినత్వాన్ని అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం తేటతెల్లం చేస్తోంది.
2018 సంవత్సరంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరిక్షను గత పదిహేను సంవత్సరాల్లో జరిగిన అత్యంత కటినమైన పరీక్షగా భావిస్తున్నారు. పెరుగుతున్న పోటీ దృష్ట్యా సివిల్స్ ప్రశ్నాపత్రం కూడా మరింత కటినంగా మారుతోంది. అందువల్ల 201 8 ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఎవరైతే ఏకోన్ముఖంగా నిరంతర సాధన చేస్తూ పరీక్షకు సిద్ధం అవుతున్నారో అటువంటి అభ్యర్థులే తుది పోటీలో నిలుస్తున్నారు. ఇకముందు జరిగే పరీక్షల్లో కూడా ఇదే సాంప్రదాయం కొనసాగవచ్చునని నిపుణుల అంచనా!
ఈ విషయాన్ని గుర్తెరిగి అభ్యర్థులు జాగరూకతతో సన్నద్ధం అవ్వాల్సిన అవరసం ఉన్నది.
ఈ 50 రోజులే కీలకం:  
ఇటీవల విడుదల అయిన సివిల్స్ 2018 తుది ఫలితాల్లో ఎందఱో తెలుగువాళ్ళు అత్యుత్తతమైన ప్రతిభ చాటి మెరుగైన రాంకులతో దేశస్థాయిలో సత్తా చాటారు. అందులో చాలామంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలనుంచి వచ్చి తమ అలుపెరగని కృషితో సివిల్స్ లో రాంకుల పంట పండించి తెలుగువారికే గర్వకారణంగా నిలిచారు. మన ముందు ఎంత సమయం ఉన్నదో ముఖ్యం కాదు, దాన్ని ఎంత సమర్థవంతంగా సద్వినియోగ పరచుకున్నామో ముఖ్యం అంటారు ఈ సివిల్స్ విజేతలు. జూన్ 2 , 2019 లో జరిగే సివిల్స్ ప్రాధమిక పరీక్షకు దాదాపు 50 రోజుల కన్నా తక్కువ సమయమే ఉంది. ఈ తక్కువ సమయంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ సాగిస్తే ప్రిలిమినరీ పరిక్ష గట్టెక్కడం అంత కష్టమేమీ కాదు. దీనికి కావాల్సిందల్లా సరైన ప్రణాళిక మరియు సమయ పాలన/టైం మానేజ్మెంట్.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
గత కొన్ని సంవత్సరాలుగా సివిల్స్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ఉమ్మడిగా ఒకే ప్రిలిమినరీ పరీక్షను పెడుతున్నారు. అందువలన పర్యావరణ అంశాలు, వన్యప్రాణి రక్షణ చట్టాలు, పర్యావరణ చట్టాలు అటవీ చట్టాలు, భూగోళ శాస్త్ర సంబంధిత అంశాలపై ప్రశ్నల ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విషయన్ని పరిగణలోకి తీసుకొని సివిల్స్ అభ్యర్థులు పైన పేర్కొన్న ఉమ్మడి అంశాలపట్ల దృష్టి కేంద్రీకరించాలి.  
కేవలం ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు మాత్రమె సన్నద్ధం అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ప్రిలిమ్స్ లో సివిల్స్ అభ్యర్థుల కన్నా సుమారు 15 - 20 మార్కులు అధికంగా స్కోర్ చేస్తేనే ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరిక్షలకు అర్హులు అవుతారు.


పేపర్-2 లో 33% మార్కులు వస్తే చాలు:
యుపిఎస్సి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తుంది. మూడు దశలు అయిన ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు మౌఖిక పరిక్ష ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.  మొదటి దశ అయిన ప్రిలిమినరీ పరిక్ష వడపోత పరిక్ష అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలిస్తే ప్రశ్నలు కఠినతరంగా వస్తున్నాయి. ఇందులో రెండు పేపర్లుంటాయి. పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) మరియు  పేపర్‌-2 (సిశాట్). ప్రతి పేపరుకూ 200 మార్కుల చొప్పున ఉంటాయి. పేపర్‌-1లో 100 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండు మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు. సరైన సమాధానానికి రెండున్నర మార్కులు. రుణాత్మక (నెగిటివ్‌) మార్కు కూడా ఉంది. ప్రతి తప్పు జవాబుకూ మూడవవంతు మార్కులను తగ్గిస్తారు. అయితే పేపర్-2 కేవలం క్వాలిఫైంగ్ మాత్రమె. ఇందులో 33% మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. మెయిన్స్ ఎంపిక కోసం కేవలం పేపర్-1 జనరల్ స్టడీస్ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.



ప్రిలిమినరీ పరిక్ష కటాఫ్ ఎంత ఉండొచ్చు?
ప్రిలిమినరీలో పరీక్షలో కనీసం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మెయిన్స్ కు అర్హత సాధించవచ్చు? అనేది చాలామందిలో మెదిలే ప్రశ్న. కటాఫ్ మార్కుల నిర్ణయం అనేది పరిక్షలో అడిగిన ప్రశ్నల కఠినత్వం బట్టి , అభ్యర్థుల పోటీ బట్టి ఉంటుంది. కాబట్టి, ఇది ప్రతి సంవత్సరమూ ఈ కటాఫ్ మార్కులు మారుతుంటాయి. గత కొన్నేళ్లుగా కటాఫ్ మార్కులను పరిశిలించినట్లు అయితే రానురానూ తగ్గుతూ ఉంది. అయితే జనరల్ అభ్యర్థి 105-110 మార్కుల సాధన లక్ష్యంతో ప్రిపరేషన్ సాగించాల్సివుంటుంది. దీన్ని బట్టి ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నలు ఎంత కటినంగా వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ముఖ్య భూమికను పోషిస్తున్న  ప్రిలిమినరీ పరిక్ష కోసం ప్రణాళికాబాద్ధమైన ప్రిపరేషన్ ఎంతో ముఖ్యం.

రిజర్వేషన్ల వారిగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరిక్ష కటాఫ్ మార్కుల విశ్లేషణ
Year
General
OBC
SC
ST
PH-1
PH-2
PH-3
2018
98.00
96.66
84.00
83.34
73.34
53.34
40.00
2017
105.34
102.66
88.66
88.66
85.34
61.34
40.00
2016
116.00
110.66
99.34
96.00
75.34
72.66
40.00
2015
107.34
106.00
94.00
91.34
90.66
76.66
40.00
Source: UPSC Official Website https://upsc.gov.in/


ప్రిలిమినరీ కి సన్నద్ధం ఇలా....

కరెంట్ అఫైర్స్ ప్రిలిమినరీ పరిక్షకు ఆయువు పట్టు లాంటిది. దీని కొరకు అభ్యర్థులు ముఖ్యంగా రోజువారీ వార్తాపత్రికలను చదివి జనరల్ స్టడీస్ సిలబస్ లోని అంశాలవారిగా నోట్స్ తయారుచేసుకోవాలి. వార్తల్లో తరచూ కనిపించే అంశాల పట్ల సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. జనరల్ స్టడీస్ కి సంబంధించిన స్టాటిక్ అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ జోడించి చదవడం ప్రిపరేషన్ కి బలాన్ని అందిస్తుంది.

సివిల్స్ లో జనరల్ స్టడీస్ సిలబస్ కి ఒక నిర్దిష్టమైన పరిధి అంటూ లేని కారణంగా పాత ప్రశ్నలను తిరగేసి ప్రశ్నల సరళిని, ప్రతిసంవత్సరం అందులో వస్తున్న మార్పులను క్షుణ్ణంగా గమనించాలి. దీని ప్రకారం జనరల్ స్టడీస్ కొరకు ఎటువంటి అంశాల పట్ల దృష్టి సరించాలో ఆకళింపు చేసుకోవాలి. మొత్తం పేపర్ లో సింహ భాగం ఆక్రమింది జనరల్ జనరల్ స్టడీస్ సబ్జెక్టులు అయిన హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణ అంశాలు.

అంశం
పట్టు సాధిoచాల్సిన అంశాలు

కరెంట్ అఫైర్స్
కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇటీవలి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, అంతర్జాతీయ అంశాలు, వివిధ సూచిలలో భారత్ ర్యాంకింగ్స్ మరియు అవి ప్రకటించే సంస్థలు, జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ లు, సదస్సులు, భౌగోళిక గుర్తింపు టాగ్లు (GI-Tags), ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, వార్తల్లో వచ్చిన తెగలు (Tribes), రాష్ట్రాలు- నృత్యరీతులు మొదలైన అంశాలపట్ల నిర్లక్ష్యం చేయరాదు. 

పాలిటీ
పాలిటీలో రాజ్యంగా వ్యవస్థ పై దృష్టి సారించాలి. ఇటీవలి కాలంలో వార్తాపత్రికల్లో కనిపించే రాజ్యంగా పరమైన అంశాలు, ముఖ్యమైన సుప్రీం కోర్టు తీర్పులు (శబరిమల, అధార్, LGBTQ, అడల్ట్రీ మొ...), రాజ్యంగా సవరణలు, బిల్లులు, చట్టాలు చదువుకోవాలి. అంతేకాకుండా, 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా భారత దేశంలో ఎన్నికల విధానం, సరళి, ఎన్నికల కమీషన్ విధులు, ఇటీవలి పరిణామాలు, క్షున్నంగా ఆకలింపు చేసుకోవాలి.

హిస్టరీ
చారిత్రిక నేపధ్యం, ప్రాముఖ్యత కలిగిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ హిస్టరీలో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా 50, 100, 125 సంవత్సరాలు గడచినా చారిత్రిక ఘట్టాలు గుర్తించి దృష్టి సారించాలి. ఉదాహరణకు జలియన్ వాలాబాగ్ దురాగతం, ఇంటర్నేషనల్ లేబర్ అసోసియేషన్ స్థాపన, మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు మొదలైన ఘట్టాలు జరిగి 100 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇటీవల తెరపైకి వచ్చిన ఇండియా పాకిస్తాన్ మధ్య కర్తాపూర్ నడవ నిర్మాణం బట్టి సిక్కు మత గురువులు, భక్తి ఉద్యమం మొదలైన అంశాలపట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అంతే కాకుండా వార్తాపత్రికల్లో వస్తున్న ‘గోలన్ హైట్స్’ పూర్వాపరాలు అధ్యయనం చేయాలి. ప్రశ్నల ప్రాధాన్యతల దృష్ట్యా మొదట ఆధునిక చరిత్ర, తర్వాత ప్రాచీన చరిత్ర, చివరగా మధ్యయుగ చరిత్రలపై పట్టు సాధించాలి. అంతే కాకుండా కళలు, సంస్కృతి లో భాగంగా వివిధ నాట్య రీతులు, జానపద నృత్యాలు, లలిత సంగీతం, శిల్పం, శైలి అంశాలపై పట్టు సాధించాలి.     

ఎకానమీ
ప్రపంచ ఆర్ధిక వ్యవస్తలో భారత్ పాత్ర మరియు భారత్ స్థానం, ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ వ్యవస్తలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు, విలీనాలు, సంస్కరణలు, వెనుజులా సంక్షోభం, విదేశీ మారక నిల్వలు వంటి ముఖ్యమైన అంశాలు చదువుకోవాలి. నీతి అయోగ్ విడుదల చేసిన నివేదికలు, అంతర్జాతీయ సూచీలు, వ్యవసాయ రంగం, వివిధ రకాల పథకాల అమలు, సంబంధిత మంత్రిత్వ శాఖల వివరాలు, GST వంటి కీలక అంశాలు ఖచ్చితంగా చదవాల్సివుంటుంది.

జాగ్రఫీ
భూగోళ శాస్త్రంలో ముఖ్యంగా వాతావరణ అంశాలు, భూమి ఆవిర్భావం, భూ అంతర్భాగం సంబంధించిన అంశాలు, ప్రకృతి వైపరీత్యాలు, మరియు కరెంట్ అఫైర్స్ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇటీవలి కాలంలో వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు అయిన ఇండోనేషియా భూకంపం, పోలార్ వర్టేక్స్, అండమాన్ లో కొన్ని దీవుల పేర్లు మార్పులు, వాతావరణ మార్పు ప్రభావం ... ఇలా వార్తాపత్రికల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అంశాలను స్టాటిక్ సిలబస్ తో జోడించి చదువుకోవాలి.  వార్తల్లోని ముఖ్యమైన ప్రదేశాలు, ద్వీపాలు, జలసంధులు, భూసందులు వంటి భౌగోళిక అంశాలను చదివేటప్పుడు వాటిని అట్లాసులో గుర్తించాలి. వివిద సముద్రాల చుట్టూ ఉన్న దేశాలు గుర్తించాలి.

పర్యావరణ అంశాలు
పర్యావరణ శాస్త్రంలో ప్రాధమిక అంశాల పట్ల దృష్టి సారించాలి. వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావం, అంతర్జాతీయ సదస్సులు, పర్యావరణ చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి. జాతీయ పార్కులు, వన్య ప్రాణి రక్షిత కేంద్రాలు, IUCN రెడ్ డాటా లిస్టు ఇటీవలి మార్పులు, చిత్తడి నేలలు, హాట్ స్పాట్స్, వన్య ప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్లు మొదలైన కీలక అంశాలు వదిలి పెట్టకూడదు.

సైన్స్ & టెక్నాలజీ
శాస్త్రసాంకేతిక రంగంలో ఇటీవలి పరిణామాలు, కొత్త ఆవిష్కరణలు, ISRO, NASA వంటి అంతరిక్ష సంస్థల ప్రయోగాలు, ముఖ్యమైన శాటిలైట్లు ఎ.షాట్, ఎమిశాట్, హైసిస్, సోలార్ పార్కర్ ప్రోబ్, అల్తిమా తూలె, క్యూపర్ బెల్ట్ , టెలిస్కోపులు వంటి అంతరిక్ష పరిజ్ఞాన అంశాలు చదువుకోవాలి. ఇటీవలి కాలంలో వార్తాపత్రికల్లో వచ్చిన  క్షిపణి వ్యవస్తలు, జలాంతర్గాములు, జికా వైరస్, పోలియో, హెచ్.ఐ.వి., మంకీ ఫీవెర్, వివిధ వ్యాక్సీన్లు  బయో టెక్నాలజీ సంభందించిన అంశాల పట్ల సాధన చేయాలి.
   

తెలుగు మీడియంలో రాసే అభ్యర్థులు ఎలా సన్నద్ధం అవ్వాలి?
తెలుగు మీడియం అభ్యర్థులు జనరల్ స్టడీస్ పేపర్-1 ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ లో ఉందని దిగులు చెందాల్సిన అవసరం లేదు. అనేక మోడల్ పేపెర్లు సాధన చేయడం ద్వారా దీన్ని అధికమించవచ్చు. రోజూ హిందూ గానీ ఇతర ఇంగ్లీష్ వార్తా పత్రికలు చదవడం వల్ల, రోజూ బేసిక్ ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా పేపర్-2 సిశాట్ ని సులువుగా అధిగమించవచ్చు.
  
ప్రణాళికలో పది సూత్రాలు:
మారుతున్న పరిక్షా సరళి మరియు కాంపిటేషన్ ని గమనిస్తే సివిల్ సర్వీస్ పరిక్షల్లోని అన్ని దశలకన్న ప్రిలిమినరీ దశే చాలా కటినతరంగా ఉంటోంది. అందుకు ప్రిలిమినరీ పరిక్షకోసం ప్రనాళికాబద్ధమైన ప్రిపరేషన్ ఎంతో అవసరం.
1
వార్తాపత్రికలు కరెంట్ అఫైర్స్ కి హృదయం లాంటివి. జనరల్ స్టడీస్ అంశాలవారిగా వార్తాపత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఒక వేళ ఇప్పటికీ నోట్స్ తయారు చేసుకోకపోతే ఏదైనా నెలవారీ మగజైన్ చదవడం ఉత్తమం.
2
ప్రభుత్వ సమాచారం, వివిధ పతకాలు, పాలసీల కోసం PIB, యోజన, ప్రభుత్వ వెబ్సైట్లు చూడడం మంచిది.
3
ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో నమ్మశక్యమైన వివిధ ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటికప్పుడు చేస్తున్న తప్పులను గుర్తించి సరిచేసుకుంటూ వెళ్ళాలి.
4
ప్రిలిమినరీ పరిక్షలకు రేను మూడు నెలల ముందే మెయిన్స్ ప్రిపరేషన్ ఆపివేసి కేవలం ప్రిలిమినరీపైన మాత్రమె దృష్టి కేంద్రీకరించాలి.
5
పరిమితమైన అంశాలను చదివినప్పటికీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎక్కువసార్లు నెమరు వేసుకోవాలి.
6
ఎలిమినేషన్ పద్ధతులు ప్రాక్టీస్ చేయడం, NOT, INCORRECT వంటి నకారాత్మక ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోవడం పట్ల అవగాహన పెంపొందించుకోవాలి.
7
హిందూ పేపర్ లేదా ఏదైనా ఇంగ్లిష్ పేపెర్ చదవడం వాళ్ళ పేపర్ 2 లో కాంప్రహేన్సివ్ పాసేజులు చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
8
పేపర్-2 అయిన సిశాట్ కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే అని నిర్లక్ష్యం చేయరాద. ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ పాసేజులు, సిశాట్ ప్రశ్నలు సాధన చేయాలి. వారానికి రెండుసార్లు అయినా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి.
9
తక్కువ పుస్తకాలు ఎక్కువ మననం ప్రిలిమ్స్ మార్గాన్ని సుగమం చేస్తాయి.
10
UPSC నిర్వహించే ఇతర పోటీ పరిక్షలు CISF, CDS, IES జనరల్ స్టడీస్ పేపర్లు సాధన చేయడం కూడా ఉపకరిస్తుంది.

Model Questions:
1. Consider the following statements: (Pre18)
1.        The Reserve Bank of India manages and services Government of India Securities but not any State Government Securities.
2.     Treasury bills are issued by the Government of India and there are no treasury bills issued by the State Governments.
3.      Treasury bills offer are issued at a discount from the par value.
Which of the statements given above is/are correct?
A.     1 and 2 only
B.       3 Only
C.     2 and 3 only
D.     1, 2 and 3

2. The well-known painting “Bani Thani” belongs to the (Pre18 )
A.     Bundi school
B.       Jaipur school
C.     Kangra school
D.     Kishangarh school

3. What is/are the consequence/consequences of a country becoming the member of the Nuclear Suppliers Group’?(Pre18)
1.        It will have access to the latest and most efficient nuclear technologies.
2.     It automatically becomes a member of “The Treaty on the Non-Proliferation of Nuclear Weapons (NPT)”.
Which of the statements given above is/are correct?
a.      1 only
b.      2 only
c.      Both 1 and 2
d.      Neither 1 nor 2

4. Which one of the following is an artificial lake ? (Pre18)
a.      Kodaikanal (Tamil Nadu)
b.      Kolleru (Andhra Pradesh)
c.      Nainital (Uttarakhand)
d.      Renuka (Himachal Pradesh)

5. Which of the following statements best describes “carbon fertilization”? (Pre18)
a.      Increased plant growth due to increased concentration of carbon dioxide in the atmosphere
b.      Increased temperature of Earth due to increased concentration of carbon dioxide in the atmosphere
c.      Increased acidity of oceans as a result of increased concentration of carbon dioxide in the atmosphere
d.      Adaptation of all living beings on Earth to the climate change brought about by the increased concentration of carbon dioxide in the atmosphere

Answers:
1. c
2. d
3. a
4. a
5. a



Conclusion:
పరిక్షకి కేవలం 50 రోజులు మాత్రమె ఉండడం వల్ల రోజూ తప్పనిసరిగా ఒక ప్రాక్టీస్ పరిక్ష సాధన చేస్తూఉండాలి. రోజువారీ తప్పులను గుర్తించి ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. నెగటివ్ మార్కులు సాధ్యమైనంత వరకూ తక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. పరీక్షకు వ్వారం రోజుల ముందు సమయాన్ని కేవలం పున:శ్చరణకి మాత్రమె కేటాయించి సానుకూల దృక్పదంతో పరిక్షకి సిద్ధం అయితే తప్పకుండా విజయం మీదే! 

1 comment:

  1. We Study IQ Provide you Online Coaching Classes for UPSC, IAS, PSC and all the govt exams. And also get the free Pdf download for All subject like Daily Current Affairs, Burning Issues, GK, News and more. For More information visit Study IQ Education

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...