Saturday, May 5, 2012

2011 సివిల్స్ ద్వారా 910 మంది ఎంపిక..

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం నాడు విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో అమ్మాయిలే ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలవడం విశేషం. ఏఐఐఎంఎస్‌లో మెడిసిన్‌ చదివిన స్నేహా అగర్వాల్‌ జాతీయస్థాయిలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఎం.ఏ చదివిన రుక్మిణి రియార్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రిన్స్‌ ధావన్‌ మూడో ర్యాంక్‌ సాధించాడు. 2011 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా మొత్తం 910 మంది కేంద్ర సర్వీసులకు ఎంపికవగా వారిలో 195 మంది మహిళలున్నారు. 420 మంది జనరల్‌, 255 బీసీ, 157 ఎస్‌సీ, 78 మంది ఎస్టీ కేటగిరి కింద ఎంపికయ్యారు.

కృష్ణభాస్కర్‌కు రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఈ ఫలితాల్లో కృష్ణభాస్కర్‌ ఆలిండియా 9వ ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. కృష్ణ భాస్కర్‌ సోదరుడు పార్ధసారధి భాస్కర్‌ 373వ ర్యాంకు సాధించాడు. వీరిద్దరూ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీపార్థసారధి భాస్కర్‌ కుమారులు.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...