Thursday, September 14, 2017

సివిల్స్‌ 2018 కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

సివిల్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకోని సందిగ్ధంలో ఉన్నవారు నిజానికి  ప్రిలిమినరీలో అర్హత సాధించినట్లుగా భావించి, మెయిన్స్‌కు సన్నద్ధత ప్రారంభించడం మంచిది. ఈ ఆలోచన ఆచరణీయమేనా అనిపించొచ్చు కానీ, అమలుపరిస్తే వచ్చే ఏడాది విజయం సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. 
ప్రిలిమినరీ సిలబస్‌లోని అంశాలు మెయిన్స్‌ సిలబస్‌లో 75% కలుస్తున్నాయి.
కరంట్‌ అఫైర్‌ నుంచి జీకే, జాగ్రఫీ... ఇలా రెండు పరీక్షలకూ చదవాల్సిన అంశాలున్నాయి. వాటి జాబితాను ఇక్కడ చూడండి.

మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
మెయిన్స్‌కూ, ప్రిలిమ్స్‌కీ సన్నద్ధతకు సంబంధించిన పునాది ఒకేలా ఉంటుంది. కాన్సెప్టులను అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్సెప్టులను అర్థం చేసుకున్నాక ప్రిలిమ్స్‌ సన్నద్ధతలో వాస్తవాధారిత అంశాలుండాలి. అదే మెయిన్స్‌కు అయితే వాస్తవాలు, అభిప్రాయాలు, విశ్లేషణలను జోడించాలి.
అయినప్పటికీ చాలామంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలున్నాయి. అవి..
మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
వీటికి తగిన సమాధానాలను అన్వేషిస్తే నిశ్చింతగా పరీక్షకు సిద్ధం కావొచ్చు.
ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
ప్రాథమికాంశాలను పూర్తిచేశాక అభ్యర్థి సహజంగానే ముఖ్యమైన అంశాల చిత్రాన్ని మనసులోనే రూపొందించుకోవాలి. అది వర్తమాన వ్యవహారాలవైపునకు దారి తీస్తుంది. నిజానికి ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల ఆధారంగానే ఉంటాయి. ఒకసారి టాపిక్‌లను ఎంపిక చేసుకుంటే సన్నద్ధత ప్రారంభించవచ్చు.
ఉదాహరణకు- ఇటీవల వార్తాపత్రికల్లో ఆర్టికల్‌ 35-ఏ గురించి చదువుతున్నాం.
ఈ అంశంపై కింది ప్రశ్నలు వేసుకుని, వాటికి సమాధానాలను వివరంగా సేకరించాలి.
ఆర్టికల్‌ 35-ఏ ఏమిటి? ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?
జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి దాని ప్రాముఖ్యం ఏమిటి?
ఈ ఆర్టికల్‌ ఎందుకు చర్చనీయాంశమవుతోంది?
దీన్ని మార్చడానికి వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
ఈ సమాచారంలో వాస్తవాధారిత ప్రాథమికాంశాలు ప్రిలిమ్స్‌కు ఉపయోగపడతాయి. మిగిలిన అంశాలైన కాలక్రమానుగత పరిణామాలూ, వివిధ సంస్థల అభిప్రాయాలూ, చర్చలూ... ఇవన్నీ మెయిన్స్‌ పరీక్ష కోణంలో ముఖ్యమైనవి.

మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
సివిల్స్‌ ప్రధాన పరీక్షను మూల్యాంకనం చేసేవారు జవాబు పత్రంలో ‘పాయింట్ల’ కోసం చూస్తారు. అది 20 మార్కుల ప్రశ్న అయితే వీలైనన్ని పాయింట్లు ఉండాలని ఆశిస్తారు. దీన్ని ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇటీవల నాగార్జున సాగర్‌కు 29 కి.మీ. వాయవ్యదిశలో భూకంపం సంభవించింది. దీన్ని జాతీయ జియోఫిజికల్‌ పరిశోధన కేంద్రం (NGRI) జులై 26న కనిపెట్టింది. ఈ పరిణామం రెండు అంశాలను (భారీ రిజర్వాయర్ల వద్ద భూ ప్రకంపనాలను పరిశీలించటం, పెద్ద ఆనకట్టలకు సంబంధించిన పర్యావరణ అంశాలపై దృష్టి పెట్టాలనే భావన) వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రాదగ్గ ప్రశ్న-
Q : 'WHAT ARE THE ECOLOGICAL IMPACTS OF LARGE DAMS ?'
A: Experience from all over the world has shown that large dams have major environmental and ecological impacts. Some of these are listed below:
Upstream (including reservoir) (1) soil erosion; (2) micro-climatic changes; (3) loss of forests, flora, and fauna; (4) changes in floral and faunal density and diversity; (5) changes in fisheries, especially on spawning grounds; (6) chain effects on catchment area due to constructions, displacement, etc.; (7) landslips, siltation and sedimentation; (8) breeding of vectors in reservoir and increase in related diseases; (9) seismicity; (10) loss of non-forest land; (11) water logging around reservoir ; and (12) growth of weeds.
Downstream (including command area); (1) water logging and salinity; (2) reduced water flow and deposition in river, with related impacts on aquatic ecosystem, flora and fauna; (3) micro- climatic changes; (4) flash-floods; (5) salt-water ingress at river mouth; (6) changes in coastal ecosystem (e.g., mangroves); (7) loss of land fertility along river; and (8) vector breeding and increase in related diseases.
ఈ జవాబులో 20 పాయింట్లు ఉన్నాయి కదా! సాధారణంగా ఇది 20 మార్కుల ప్రశ్నగా రావొచ్చు. అంటే పాయింటుకో మార్కు ఉంటుందని వూహించవచ్చు.
రాత సాధన ఎందుకు అవసరం?
సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా రాయగలిగివుండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం పనికిరాదు. సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు.
సివిల్స్‌కు అవసరమైన పుస్తకాలన్నీ చదివేసి వివిధ అంశాలపై పరిజ్ఞానం సంపాదించినవారు దాన్ని రాతపూర్వకంగానే అది కూడా నియమిత కాలవ్యవధిలో ప్రదర్శించాల్సివుంటుంది. అందుకు రాత సాధన చాలా ముఖ్యం.
కొందరు... మొదట అన్ని అంశాల్లో పరిజ్ఞానాన్ని సంపాదించేదాక వేచిఉండి, ఆ తర్వాత రాయడాన్ని సాధన చేయాలని సలహా ఇస్తుంటారు. ఇది అర్థరహితమైన వాదన. అన్ని అంశాల్లో అభ్యర్థికి ‘తగినంత’ పరిజ్ఞానం ఎప్పటికి లభిస్తుంది? మెయిన్స్‌ పరీక్షకు నెలరోజుల ముందా? రెండు నెలల ముందా? అప్పుడైతే రోజుకు 4-5 గంటల రాత సాధన అవసరమవుతుంది. మరి వార్తాపత్రికలు చదవటం, తయారు చేసుకున్న నోట్సు/ పుస్తకాలను పునశ్చరణ చేయటం, నమూనా పరీక్షలు రాయటం.. వీటికి సమయం ఎక్కడ ఉంటుంది?
అందుకే సమాధానాలను రాసే సాధన సన్నద్ధతతోపాటే కొనసాగాలి. అస్పష్టమైన అవగాహన ఉన్న అంశంపైన కూడా కొన్ని పాయింట్లను రాయగలిగేలా తయారు కావాలి. మెయిన్స్‌ పరీక్షలో ఒక రోజు సమయంలో 8000 నుంచి 10,000 కుపైగా పదాలను రాయాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక నిర్ణీత సమయంపాటు రాయడాన్ని అలవాటు చేసుకోకపోతే పరీక్ష కేంద్రంలో చిక్కులు ఎదురవుతాయి.
అభ్యర్థుల రాతలు సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా ఉండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం, సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు. ప్రముఖుల కొటేషన్లనూ, జాతీయాలనూ వాడేటప్పుడు వాటిని ఇష్టం వచ్చినట్టు మార్చకుండా యథాతథంగా ఇవ్వాలి. అడిగిన ప్రశ్నకు నిర్దిష్టంగా జవాబు రాయటం, రాసే విషయాన్ని అవసరమైన పేరాగ్రాఫులుగా విడగొట్టటం, పాయింట్లు కనపడేలా అమర్చటం.. ఇవన్నీ అభ్యర్థి ఆలోచనా క్రమంలోని స్పష్టతను సూచిస్తాయి.

Saturday, August 3, 2013

2013 సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల ||

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష - 2013 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. సివిల్ స‌ర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌, ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌కు ఎంపికైన అభ్యర్థుల వివ‌రాల‌ను ఆగ‌స్టు 2న క‌మిష‌న్‌ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. మే 26న నిర్వహించిన ఈ ప‌రీక్షకు దేశ‌వ్యాప్తంగా సుమారు 10 ల‌క్షల మంది అభ్యర్థులు హాజ‌రయ్యారు. వీరిలో 10 వేల మంది డిసెంబ‌రులో జ‌రగనున్న మెయిన్స్ ప‌రీక్షకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 వేల మంది అభ్యర్థులు హాజ‌ర‌వ్వగా సుమారు 500 మంది మెయిన్స్‌కు అర్హత సాధించిన‌ట్లు అంచ‌నా. గ‌త ఏడాది కంటే ఈ సంఖ్య అధికంగానే ఉంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ ఏడాది జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో క‌టాఫ్ మార్కులు 218 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. కేట‌గిరీల‌వారీగా క‌టాఫ్ మార్కులు ఓబీసీ 200, ఎస్సీ 186, ఎస్టీ 185, పీహెచ్1 160, పీహెచ్‌2 164, పీహెచ్‌3 111 గా ఉన్నాయ‌ని అంచ‌నా. ఈసారి ఫ‌లితాలు త్వర‌గా వెలువ‌డ్డాయ‌ని, మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కు కావాల్సినంత‌ స‌మ‌యం ల‌భించింద‌ని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ద్వారా ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌కు అభ్యర్థుల‌ను ఎంపిక చేసే విధానాన్ని ఈ ఏడాది కొత్తగా ప్రవేశ‌పెట్టారు. 


ఈనాడు సౌజన్యం తో...

Tuesday, June 11, 2013

ఇకపై సివిల్స్ మార్కులు కుడా ఆన్లైన్ లో...

                       ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలు(2012) రాసిన అభ్యర్థుల మార్కులను ‘యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్’(యూపీఎస్‌సీ) బయటకు విడుదల చేసింది. ఇలా అభ్యర్థుల మార్కులను బహిరంగంగా ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి. గత నెల వెలువడిన ఈ ఫలితాలతోపాటు, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలను, మార్కులను కూడా తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
 
                       ఈ వివరాల ప్రకారం.. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 1004 మంది అభ్యర్థుల్లో టాపర్(హరిత వి. కుమార్)కు 53 శాతం మార్కులు వచ్చాయి. 2,250 మార్కులకు హరిత 1,193 మార్కులు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన వి.శ్రీరామ్‌కు 51 శాతం మార్కులు(1,149), మూడో స్థానంలో నిలిచిన స్తుతి చరణ్‌కు 51 శాతం(1,148) మార్కులు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసమే ఇలా మార్కులను వెల్లడిస్తున్నారని సిబ్బంది, శిక్షణ శాఖ అధికారి ఒకరు అన్నారు. ఇక నుంచి ఇలాగే మార్కులను ఆన్‌లైన్‌లో వెల్లడించేందుకు కమిషన్ నిర్ణయించుకుందని తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ.. యూపీఎస్‌సీకి నోడల్ విభాగంగా పనిచేస్తుంది.
 
 
- సాక్షి సౌజన్యంతో..

Friday, March 15, 2013

.::: Stay on Civils 2013 Notification:::. యూపీఎస్సీ 2013 నోటిఫికేషన్‌ నిలిపివేత

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కు సంబంధించిన 2013 సివిల్స్ నోటిఫికేషన్‌పై ఆందోళనలు చెలరేగటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించింది. ప్రాంతీయ భాషలకు విఘాతం కలిగేలా నిబంధనలు రూపొందించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజల నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Thursday, September 6, 2012

డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌

ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఫారెస్ట్‌ ఆఫీసర్‌, సిబిఐ, ఇంటలిజెన్స్‌...మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా ఖాళీలు ఏర్పడతాయి. కానీ వాటన్నింంటినీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయరు. ప్రమోషన్స్‌, డిప్యూటేషన్‌ లేదా అబ్సార్షన్‌..వంటి పద్ధతుల్లో అనుభవం గల ఆఫీసర్లకు పోస్టింగ్స్‌ ఇస్తారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం పొందాలంటే మిగిలింది డైరెక్ట్‌ రిక్రూట్‌మెంటే ! యూనియన్‌ పబ్లిక సర్వీస్‌ కమిషన్‌, స్టాటికల్‌, ఎకనామికల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో నెగ్గటమొక్కటే కేంద్ర కొలువుకు దారి. ప్రతి ఏటా నిర్దిష్ట సమయంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ లేదా సాధారణ డిగ్రీ చదువుతో ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌కు దగ్గరవుతారు. కేంద్ర స్థాయిలో జరిగే పలు పరీక్షలు రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది పోటీ పరీక్షలు. రెండోది ఎంపిక (సెలక్షన్‌) పద్ధతి.
ఆయా పోటీ పరీక్షలు, వాటి లక్ష్యం మొదలైన వివరాలు...
* సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ, మెయిన్స్‌)
* ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌
* సెంట్రల్‌ పోలీస్‌ సర్వీసెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ నియామకాలు)
* డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ (గ్రేడ్‌ బి,ఐ-సెక్షన్‌) ఆఫీసర్లు/ స్టెనోగ్రాఫర్స్‌ నియామకాలు)
* జియాలజిస్ట్‌ ఎగ్జామ్‌
* నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ ఎగ్జామ్స్‌ (ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జరుగుతాయి)
* స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ (రెండేళ్లకొకమారు జరుగుతుంది)
రెండో పద్ధతి : ఎంపిక పద్ధతిలో నేరుగా నియామకాలు జరుగుతాయి. కేంద్రంలోని గ్రూప్‌-ఎ, ఎంపిక చేసిన గ్రూప్‌-బి పోస్టులకు ఈ పద్ధతి పాటిస్తారు. ఇందులో పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగినవారిని ఉన్నత విద్యార్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్‌ : www.upsc.gov.in 
ఎస్‌ఎస్‌సి : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి)... కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాల్లోని రూ.10,500, అంతకంటే తక్కువ వేతన పరిధి కలిగిన గ్రూప్‌-బి పోస్టులకు, గ్రూప్‌-సి లోని అన్ని నాన్‌-టెక్నికల్‌ పోస్టులకు పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
సివిల్స్‌ : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సరైన రీతిలో నడిపించాలని గట్టిగా కోరుకునేవారికి సివిల్‌ సర్వీసెస్‌ మంచి మార్గం. యుపిఎస్‌సి నిర్వహించే అత్యంత కఠినమైన, విస్త్రత పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష రాసేవారికి ముందుగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రస్తుత సంవత్సరానికి పరీక్ష పాత పద్థతిలోనే కొనసాగుతుంది. అభ్యర్థులు ప్రధానంగా ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌, వాటి తర్వాత సర్వీసులైన గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి సర్వీసులలో ప్రవేశానికి సివిల్స్‌ పరీక్ష రాస్తారు.
మూడు దశలు : ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ...ఇలా మూడు దశల్లో సివిల్‌ పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ప్రతి సంవత్సరం సాధారణంగా మే 3వ వారంలో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌ పరీక్ష. అనంతరం పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. సివిల్స్‌ను జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు నాలుగుసార్లు మాత్రమే రాసేందుకు అనుమతిస్తారు.
అర్హత : భారతీయుడై ఉండి, కనీసం ఏదైనీ డిగ్రీ పాసై ఉండాలి.
ఫీజు : రూ.50 సింగిల్‌ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ స్టాంప్‌ (పోస్టాఫీసుల్లో లభ్యమవుతాయి) ద్వారా చెల్లించాలి.
ప్రిలిమినరీ : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌, 300 మార్కులకు ఆప్షనల్‌ పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు సమయం. మెయిన్స్‌కు అభ్యర్థులను వడకట్టటమే ప్రిలిమ్స్‌ ప్రధానోద్దేశం. ఆ ఏడాది అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్యకు సుమారు 12 నుంచి 13 రేట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. ఆప్షనల్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌కు జాబితాలో ఇచ్చిన 23 సబ్జెక్టుల్లో ఏదేని ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. జనరల్‌ స్డడీస్‌ పేపర్‌లో జనరల్‌సైన్స్‌, కరెంట్‌ ఈవెంట్స్‌ (జాతీయ, అంతర్జాతీయ అంశాలు), భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, భారత, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మెంటల్‌ ఎబిలిటిలపై ప్రశ్నలుంటాయి.
మెయిన్స్‌ : మెయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. అన్నీ వ్యాసరూప పద్ధతిలో రాయాలి. ప్రతి పేపర్‌కూ మూడు గంటల సమయం కేటాయిస్తారు.
ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ : అగ్రికల్చర్‌, యానిమల్‌ హజ్బెండ్రీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎటక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, జాగ్రఫీ, జియాలజీ, ఇండియన్‌ హిస్టరీ, లా, గణితం, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ, ఫిజిక్స్‌, పొలిటకల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, హిస్టరీ, మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, కింది భాషా సాహిత్యాల్లో ఏదేని ఒకటి-అరబిక్‌, అస్సామీ, బోడో, బెంగాలి, చైనీస్‌, డొగ్రి, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మళయాళం, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పాలి, పర్షియన్‌, పంజాబి, రష్యన్‌, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళ్‌, తెలుగు, ఉర్దూ.
మెయిన్స్‌ పేపర్లు : 1.పేపర్‌-1 రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఏదేని ఒక భారతీయ భాష (300 మార్కులు)
2.పేపర్‌-2-ఇంగ్లీష్‌ (300 మార్కులు)
3.పేపర్‌-3-ఎస్సే (200 మార్కులు)
4.పేపర్‌-4,5-జనరల్‌ స్డడీస్‌ (ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
5.పేపర్‌-6,7,8,9 పైన తెలిసిన ఆప్షనల్‌ జాబితాలోని అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఏవేని రెండు సబ్జెక్టులు (ప్రతి సబ్జెక్టుకూ రెండు పేపర్లు. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
అనుమతి లేని కాంబినేషన్లు : 1.పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ -పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
2.కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ-మేనేజ్‌మెంట్‌
3.ఆంత్రోపాలజీ-సోషియాలజీ
4.మ్యాథమెటిక్స్‌-స్టాటిస్టిక్స్‌
5.అగ్రికల్చర్‌-యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌
6.మేనేజ్‌మెంట్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
7.ఇక ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో...సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ వీటిలో ఒకటి కంటె ఎక్కువ సబ్జెక్టులను ఎంపిక చేసుకోరాదు.
8.యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌-మెడికల్‌ సైన్స్‌
ఇంటర్వ్యూ : దీనికి 300 మార్కులు. ఇందులో ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుపై అభ్యర్థి అవగాహన, ప్రాముఖ్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు, వ్యక్తిగత అభిరుచులను అంచనా వేస్తారు.

Saturday, May 5, 2012

2011 సివిల్స్ ద్వారా 910 మంది ఎంపిక..

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం నాడు విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో అమ్మాయిలే ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలవడం విశేషం. ఏఐఐఎంఎస్‌లో మెడిసిన్‌ చదివిన స్నేహా అగర్వాల్‌ జాతీయస్థాయిలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఎం.ఏ చదివిన రుక్మిణి రియార్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రిన్స్‌ ధావన్‌ మూడో ర్యాంక్‌ సాధించాడు. 2011 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా మొత్తం 910 మంది కేంద్ర సర్వీసులకు ఎంపికవగా వారిలో 195 మంది మహిళలున్నారు. 420 మంది జనరల్‌, 255 బీసీ, 157 ఎస్‌సీ, 78 మంది ఎస్టీ కేటగిరి కింద ఎంపికయ్యారు.

కృష్ణభాస్కర్‌కు రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఈ ఫలితాల్లో కృష్ణభాస్కర్‌ ఆలిండియా 9వ ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. కృష్ణ భాస్కర్‌ సోదరుడు పార్ధసారధి భాస్కర్‌ 373వ ర్యాంకు సాధించాడు. వీరిద్దరూ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీపార్థసారధి భాస్కర్‌ కుమారులు.

Sunday, April 22, 2012

మీలో సివిల్స్ పట్ల ఆసక్తి ఉందా?

                            యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం మెయిన్స్‌లో విజయాన్ని సాధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. తక్కువ సంఖ్యలో ఖాళీలు, నాణ్యత ఉన్న అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా సాగే రాత పరీక్ష పోటీ, అభ్యర్థి అంతరంగాన్ని అన్ని కోణాల నుంచి పసిగట్టే పర్సనాలిటీ టెస్ట్ వీటన్నింటినీ తట్టుకొని విజేతల జాబితాలో చోటును సాధించడం ఆషామాషీ కాదు. విజయవంతమైన ప్రణాళిక, సడలిపోని ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే వాతావరణం, చక్కగా సూటిగా విషయంలోకి వెళ్ళిపోయే మంచి స్టడీ మెటీరియల్ ఇవన్నీ సివిల్స్ విజయానికి అభ్యర్థి వేసుకోవాల్సిన పునాదిరాళ్ళు, సివిల్ సర్వీస్ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని తెలిసిందే. వాటిలో మొదటిదశ ప్రిలిమినరీ. ఒక అభ్యర్థి తన కెరీర్‌లో సివిల్స్ కోసం యత్నిస్తున్నప్పుడు మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాస్ కావడం మంచిది. మొదటిసారి మెయిన్స్ పరీక్షాపత్రాన్ని రాసే అనుభవం చేతికి అందుతుంది. ఎంతమంది బోధించినా, మనం రాస్తే వచ్చిన అనుభూతి రాదు. ప్రథమ పర్యాయంతోనే సివిల్స్ సర్వీస్‌లో విజేతలుగా నిలిచేందుకు అవకాశాలు తక్కువే కావచ్చుగాక, కానీ ప్రిలిమినరీ పాసయ్యేందుకు మాత్రం అభ్యర్థి తప్పకుండా పోరాటం చేయాలి. ముందే చెప్పినట్టు దీనివల్ల మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. ఇకపోతే, త్వరలో జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్ని మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యంవల్ల మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు పొరపాట్లు చేయకుండా ఈ అంశాలు పనికొస్తాయి. వీటికన్నా ముందు, అసలు, అభ్యర్థి తనకు సివిల్స్‌పై నిజమైన ఆసక్తి వుందా లేదా అన్నది తేల్చుకోవాలి. ఆసక్తిలేకుండా ఊరికే రాస్తూపోవడం శుద్ధ దండుగ.

అభ్యర్థికి సదరు పోటీ పరీక్షపై ఆసక్తి ఉందా? లేదా అన్నది ఈ క్రింది ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది.
* మీకు సివిల్ సర్వీస్ పరీక్షలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలుసా?
* సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్న వారినెవరినైనా కలిశారా?
* సివిల్ పోటీలో ఘనవిజయాన్ని సాధించిన అభ్యర్థుల వివరాలు చదివారా?
* సివిల్స్‌కు అవసరమైన కార్యప్రణాళికను రూపొందించుకున్నారా?
* సివిల్స్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకుంటున్నారా?
పై ఐదు ప్రశ్నల్లో దేనికీ జవాబు చెప్పలేని అభ్యర్థి రంగంలో ఉన్నా లాభం లేదు. ఎందుకంటే గుంపులో గోవిందా అన్నట్టు తానూ ఓ అప్లికేషన్ పారేశాడు కానీ సివిల్స్ అంటే ప్రాథమిక అవగాహన కూడా లేదన్నమాట. ఆ స్థాయి వ్యక్తులు సివిల్స్ సాధించగలగడం కలలోమాట.
ప్రశ్నల్లో కొన్నింటికైనా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగిన వారు మరింత వేగంగా విజృంభించాలి. అన్ని ప్రశ్నలకు సరిగ్గా జవాబులు చెబుతున్న అభ్యర్థి సివిల్స్ పోటీలో క్రమేపీ రాటు దేలగలడు - సందేహం లేదు. ఇప్పుడు విశే్లషించుకున్నట్టుగా, పై రెండు తరగతుల వారికీ మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది. ఈ ప్రశ్నలు అందుకు ఉపయోగపడతాయి.
* మీరు దినపత్రికలు, ఇతర ఉపయోగకరమైన మేగజైన్స్‌ను చదువుతున్నారా?
* టీవీలో కరెంట్ అఫైర్స్ క్రమం తప్పకుండా చూస్తున్నారా?
* బిబిసి వింటున్నారా?
* యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలు చదువుతున్నారా?
* ఏదైనా క్లిష్టమైన జాతీయ లేదా అంతర్జాతీయ సంఘటనపై చిన్న వ్యాఖ్యను వెంటనే రాయగలరా?
* ఇరాన్ - అమెరికా సంక్షోభంవంటి ఒక సుదీర్ఘమైన అంశంలో ఇమిడివున్న తేదీలు, వాటి వివరాలు, ప్రముఖుల కొటేషన్సు తిరిగి చెప్పగలరా?
పై ప్రశ్నల్లో అన్నింటికీ సరిగ్గా జవాబులు చెబితే ఇక ఆ అభ్యర్థి చివరి అవకాశంలోనైనా సివిల్స్ విజేతల జాబితాలో చేరిపోతాడు.
వీటికి సరిగ్గా జవాబులు చెప్పలేని వారు పోటీలో కొంత వెనుకబడి వున్నారని తెలుసుకోవాలి.
సమాచార సేకరణ: ప్రిలిమినరీ మొదటిసారి రాసే అభ్యర్థులకు పరీక్ష విధానంపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అదనపు సమాచారం కోసం వీళ్ళంతా పాకులాడుతారు. సీనియర్ల సలహాలు తీసుకుంటారు. అయితే వీటికి కూడా కొంత పరిమితి కావాలి. సమాచార సేకరణ మాత్రమే లక్ష్యంగా మారితే అది అభ్యర్థి విలువైన సమయాన్ని నిలువునా తినేస్తుంది. అలాగని మెళుకువలు తెలియకపోవడం మంచిది కాదు. అయితే సివిల్స్‌పై సకల అంశాన్ని డిగ్రీలో తెలుసుకోవడం మంచిది. అదీ కాకుంటే ప్రిలిమ్స్‌కన్నా కొద్ది నెలల ముందే సేకరణను మానుకోవాలి. ఎందుకంటే సీనియర్లు, నిపుణుల సలహాలు అన్నీ ఒకే దశలో ఉండవు. ఎక్కువ సలహాలతో అభ్యర్థి ఒరిజినల్ ఆలోచనా ధోరణి సైతం మరుగున పడే ప్రమాదం ఉంది. కొద్దిమంది నిపుణుల సూచనల్ని సీరియస్‌గా అభ్యర్థి, మిగతా అటెంప్ట్‌లలో కూడా వాటినే పాటించడం మంచిది.
స్థాయిని అంచనా వేసుకోవడం: తనపై తాను విశ్వాసం లేనివాడు ఎందుకు కొరగాడు. మరీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా అది సమయానికి విషమ ఫలితాలనిస్తుంది. అందువల్ల వాస్తవికాధారంగా అభ్యర్థి తనను తాను అంచనా వేసుకోవాలి. మిగతా అభ్యర్థులు ఏ స్థాయిలో ఉన్నారో నిర్మాణాత్మకంగా అంచనా వేసుకోవాలి. తన బలహీనతల్ని గుర్తించాలి. కొద్దిమందికి ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ విభాగమంటేనే భయం. మరికొందరు లెక్కలంటే ఆదుర్దాపడతారు. జాగ్రఫీ మరికొద్దిమందికి విసుగును తెప్పిస్తుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే అభ్యర్థి తనకు ఫలానా సబ్జెక్టుపై వున్న అయిష్టాన్ని ముద్రగా మలచుకోకూడదు. దాన్ని సాధించే దాకా విడిచిపెట్టకూడదన్న పట్టుదల చాకచక్యం - ఈ రెండింటితో కలగలిపి పయనించాలి. బాగా ఇష్టమయ్యే అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అది అసలుకే ఎసరుగా మారుతుంది. మరోమాట, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కన్నా పెద్ద ప్రాముఖ్యత ఆప్షనల్స్‌కు వుంటుంది. దీన్ని అభ్యర్థులు మొదటినుంచి గుర్తుంచుకోవాలి.
సమయానికి తగిన వ్యూహం: విజేతలుగా నిలచిన అభ్యర్థులంతా వివిధ పత్రికలకిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను చదవాలని సలహా ఇస్తుంటారు. దీనిలో వంద శాతం నిజముంది. అయితే విజేతల సలహాల్ని అభ్యర్థులంతా తు.చ. తప్పకుండా అనుసరించాలని ఏమీ లేదు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఎంతో విస్తృతమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే పరీక్షకు ప్రిపేరయ్యేందుకు తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వేళల్లో అభ్యర్థులు సమయానికి అనుగుణంగా తగు వ్యూహాల్ని తయారుచేసుకోవాలి. కొద్ది రోజుల్లో పరీక్ష ఉన్నప్పుడు నాణ్యమైన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవడంవల్ల మంచి ప్రయోజనాలుంటాయి. దాన్ని కూడా ఎంపిక చేసుకొని చదివితే మరీ మంచిది. ఎంపిక ప్రక్రియకూడా గుడ్డిగా రాయి విసరడం వంటిది కాదు. దీనికో శాస్ర్తియమైన విధానముంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ప్రశ్నాపత్రాల్ని అభ్యర్థి ముందు పెట్టుకోవాలి. ఏఏ విభాగాలనుంచి ఎలాంటి తీరుతెన్నులతో ప్రశ్నల్ని అడుగుతున్నారని మదింపు వేసుకోవాలి. అదే దారిలో తానూ పయనించాలి.
మానసిక స్థిరత్వం: ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగేవారు జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. సమకాలీన సమాజం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అన్ని పోటీ పరీక్షలు వేరు. సివిల్స్ వేరు. అందువల్ల విజయాన్ని సాధించే అభ్యర్థి కఠినమైన మానసిక స్థిరత్వాన్ని సాధించేందుకు కృషిచేయాలి. ఇది చెబుతున్నంత సులువుకాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. సివిల్స్‌లో విఫలమైనంత మాత్రాన జీవితమంతా చీకటి మాయమైపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. భయంకరమైన పరాజయానికి అభ్యర్థి తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. మానసిక స్థయిర్యం లోపిస్తే అభ్యర్థిలో అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ఇవి విజయపథంలో ముళ్లకంచెల్ని వేస్తాయి. అభ్యర్థికి పరీక్షలకన్నా ఎంతో ముందునుంచే ఎవరైనా తోడుగా ఉంటే మరీ మంచిది. అలాంటి వ్యక్తి నిరంతరం అభ్యర్థి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండాలి.
అభ్యర్థి ఎక్కడా నీరస పడిపోకుండా, నీరుకారి పోకుండా జాగ్రత్త వహించాలి. సివిల్స్‌లో నెగ్గిన అభ్యర్థులు తమ విజయానికి పరోక్ష కారణం కుటుంబం నుండి లభించిన ఆదరణేనని చెప్పడం వీరంతా గమనించే ఉంటారు.
సాంకేతిక దోషాలు: మొదటిసారి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు, ప్రశ్నపత్రం చివరన ఉండే సమాచారాన్ని భర్తీ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాంకేతిక లోపాలేర్పడి ప్రశ్నపత్రం ఇన్‌వాలీడ్‌గా మారుతుంది. అహోరాత్రులు శ్రమించినదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకని అభ్యర్థి సమాచార పత్రంలోని గళ్లను సూచనల్ని గమనిస్తూ నింపాలి. మరో అంశం. ప్రశ్నపత్రంలో కఠినంగా అనిపించే వాటిని చూసి అట్టే గాభరాపడకూడదు. ముందుగా, నిశ్చయంగా సరియైనవని తోచిన సమాధానాల్ని పూర్తిచేయాలి. వాటి సంఖ్యను మనసులో గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక రానివాటిని, మెల్లమెల్లగా సాధన చేస్తూ పోవాలి. ఇటీవలి కాలంలో ప్రిలిమనరీ ప్రశ్నల్ని చాలా చాకచక్యంగా రూపొందిస్తున్నారు. ప్రశ్నను అజాగ్రత్తగా చదివినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, అంతే సంగతులు. ఇవీ ప్రిలిమినరీ పరీక్షకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న సివిల్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రిలిమినరీ మొదటిసారికే క్లియర్ చేసుకుంటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
3ప్రాథమిక2 ప్రణాళిక ఎలా?: 2012 ప్రిలిమ్స్ పరీక్ష ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. నూతన విధానం ప్రవేశపెట్టాక గత ఏడాది జూన్ 12న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ)ని తొలిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సివిల్స్‌కు సిద్ధమవబోతున్నవారు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలో స్పష్టం చేసుకోవటానికి ఇదే తరుణం! విషయాలను స్థూలంగా ఆకళింపు చేసుకోవటంతోపాటు వాటిలోని సూక్ష్మ వివరాలను కూడా పట్టించుకోవాలి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానాన్ని విశే్లషిస్తే బోధపడే సారాంశమిది వచ్చే సంవత్సరం పరీక్షకు రూపొందించుకోవాల్సిన ప్రణాళిక తీరును. ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రణాళికను 2 అంశాలుగా విభజించాలి.
 1. ఈ ఏడాది ప్రశ్నపత్రం ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక.
 2. సాధారణ కార్యాచరణ ప్రణాళిక.
నిర్దిష్టంగా... పర్యావరణంపై సమాచారం సేకరించాలి. ప్రాథమిక అంశాలను పట్టించుకోవాలి. పర్యావరణం అంటే ఏమిటి అనే ప్రశ్న దగ్గరనుంచి ప్రారంభించి వౌలిక విషయాలను గ్రహించాలి. పునాదిని పటిష్ఠ పరుచుకుని, తర్వాత ఈ విభాగంలో వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వార్తలకెక్కిన ప్రతి సమాచారాన్ని సేకరించాలి. (ప్రాంతీయ సమాచారం అవసరం లేదు). ఈ అంశాలను ప్రాథమిక సమాచారానికి జోడించాలి. నిశజూజ్ఘ కూళ్ఘూ ఱ్య్యరీ నూ, సామాజిక రంగాలకు సంబంధించిన సాహిత్యాన్ని (్గఉది, బీహార్ నిర్మాణం మొదలైనవి) చదవాలి. ఒక్కో కార్యక్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమయిందీ మొదలైనవి విస్మరించకూడదు. ఒకసారి ఈ సమాచారం నమోదు చేసుకున్నాక వర్తమాన అంశాలను జోడించటం మొదలుపెట్టాలి. ఈ సందర్భంగా ఓ బంగారు సూత్రం గుర్తుంచుకోవాలి. సామాన్య మానవుణ్ణి ప్రభావితం చేసే ఏదైనా సివిల్ సర్వెంట్లకు ముఖ్యమే!
* పాలిటీ, హిస్టరీ, సైన్స్ మొదలైన విభాగాల్లో అందరూ పాటించే సన్నద్ధతనే సాగించాలి.
* మీ ఇంగ్లిష్ భాషానైపుణ్యాలను అంచనా వేసుకోండి. అవసరమనుకుంటే వాటిని మెరుగుపరచుకోండి. ఇది కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుందని గమనించాలి.
* ఇంటర్లో, డిగ్రీలో లెక్కలు సబ్జెక్టుగా గణితేతర విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
* ఈ సంవత్సరం మాదిరే వచ్చే ఏడాది కూడా ప్రశ్నల సంఖ్యా, క్లిష్టత స్థాయి అదే రకంగా ఉండొచ్చని భావించకూడదు. మార్పులకు సిద్ధపడి ఉండటం మేలు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది... ఇక్కడ అవసరమైనది త్యీౄఒ ళకళ పజళతీ. ముఖ్యాంశాల్లో ప్రతి ఒక్క కోణాన్ని దగ్గరగా గమనించి, క్షేత్రస్థాయలో పరిశీలన చేయటం.
ప్రయత్నాలు, వయోపరిమితిలో మార్పులు
------------------------------------------------------
పరీక్ష సంవత్సరం వయోపరిమితి ప్రయత్నాల సంఖ్య
------------------------------------------------------
1949-60 21-24 పరిమితి లేదు
1961-71 21-24 రెండుసార్లు
1972 21-26 రెండుసార్లు
1979-1986 21-28 మూడుసార్లు
1987-1989 21-26 మూడుసార్లు
1990 21-31 నాలుగుసార్లు
1999-ఇప్పటివరకు 21-30 నాలుగుసార్లు


సివిల్స్ పరీక్షలో మార్పులు
--------------------------------------
సంవత్సరం మార్పులు
--------------------------------------
1947 తప్పనిసరి (కంపల్సరీ) సబ్జెక్టుల ప్రవేశం
1948 ప్రపంచ చరిత్ర,
అంతర్జాతీయ న్యాయం సబ్జెక్టుల చేరిక
1961 ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ప్రవేశం
1966 ఆప్షనల్ సబ్జెక్టుల ప్రక్షాళన
1969 ఆధునిక భారతీయ
భాషల సాహిత్యం చేరిక
1979 ప్రిలిమ్స్ తొలిసారిగా ప్రవేశపెట్టారు
1987 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశం
1993 సబ్జెక్టుగా మెడికల్ సైన్స్ చేరిక

Friday, March 9, 2012

కూసంత అవగాహన ఉంటె చాలు సివిల్స్ కొట్టెయ్యొచ్చు.

సివిల్స్ ఔత్సాహికులు తమ విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా మొట్టమొదటిగా సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన ఏర్పరచుకుని లోకజ్ఞానం పెంచుకోవాలి. దీనికోసం న్యూస్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియోలోని చర్చా కార్యక్రమాలు అనుసరించడం, దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం లాభిస్తుంది.
అదే విధంగా పుస్తకాల్లో చదివే అంశాలను సమాజంలోని పరిస్థితులతో అన్వయం చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది. వీటితోపాటు సివిల్స్‌కు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా అట్లాస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. సివిల్స్ విషయంలో తార్కిక ఆలోచన నైపుణ్యం ఎంతో అవసరం దీన్ని పెంపొందించుకోవాలి. నేను తెలుగు మీడియంలో పరీక్ష రాశాను. అందువల్ల నాకు తెలియని సాంకేతిక పదాలకు అర్థాలు అన్వేషించి ఒక జాబితాగా రూపొందించుకున్నాను.
ఇక.. గత ఏడాది నుంచి ప్రారంభించిన రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్) ఇంజనీరింగ్, మ్యాథ్స్ అభ్యర్థులకే అనుకూలం అనే అపోహ వీడి చదవాలి. సిలబస్ విస్తృతంగా ఉందనే భయాన్ని వదిలి ఇష్టపడి చదవాలి. ఎన్ని గంటలు చదివామనేది? కాకుండా.. చదివిన కొద్ది సమయమైనా కాన్‌స్టెంట్‌గా, కాన్‌సన్‌ట్రేషన్‌తో చదవాలి.
---x-x-x-x---
 
ఆల్ ది బెస్ట్
-సీహెచ్‌వీఏ నాయుడు (ఐపీఎస్ ట్రైనీ),
సివిల్స్ 2010 విజేత
Courtesy:Sakshi
Related Posts Plugin for WordPress, Blogger...