Showing posts with label ప్రిపరేషన్. Show all posts
Showing posts with label ప్రిపరేషన్. Show all posts

Thursday, September 6, 2012

డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌

ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఫారెస్ట్‌ ఆఫీసర్‌, సిబిఐ, ఇంటలిజెన్స్‌...మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా ఖాళీలు ఏర్పడతాయి. కానీ వాటన్నింంటినీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయరు. ప్రమోషన్స్‌, డిప్యూటేషన్‌ లేదా అబ్సార్షన్‌..వంటి పద్ధతుల్లో అనుభవం గల ఆఫీసర్లకు పోస్టింగ్స్‌ ఇస్తారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం పొందాలంటే మిగిలింది డైరెక్ట్‌ రిక్రూట్‌మెంటే ! యూనియన్‌ పబ్లిక సర్వీస్‌ కమిషన్‌, స్టాటికల్‌, ఎకనామికల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో నెగ్గటమొక్కటే కేంద్ర కొలువుకు దారి. ప్రతి ఏటా నిర్దిష్ట సమయంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ లేదా సాధారణ డిగ్రీ చదువుతో ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌కు దగ్గరవుతారు. కేంద్ర స్థాయిలో జరిగే పలు పరీక్షలు రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది పోటీ పరీక్షలు. రెండోది ఎంపిక (సెలక్షన్‌) పద్ధతి.
ఆయా పోటీ పరీక్షలు, వాటి లక్ష్యం మొదలైన వివరాలు...
* సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ, మెయిన్స్‌)
* ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌
* ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌
* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌
* సెంట్రల్‌ పోలీస్‌ సర్వీసెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ నియామకాలు)
* డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ (గ్రేడ్‌ బి,ఐ-సెక్షన్‌) ఆఫీసర్లు/ స్టెనోగ్రాఫర్స్‌ నియామకాలు)
* జియాలజిస్ట్‌ ఎగ్జామ్‌
* నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ ఎగ్జామ్స్‌ (ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జరుగుతాయి)
* స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ (రెండేళ్లకొకమారు జరుగుతుంది)
రెండో పద్ధతి : ఎంపిక పద్ధతిలో నేరుగా నియామకాలు జరుగుతాయి. కేంద్రంలోని గ్రూప్‌-ఎ, ఎంపిక చేసిన గ్రూప్‌-బి పోస్టులకు ఈ పద్ధతి పాటిస్తారు. ఇందులో పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగినవారిని ఉన్నత విద్యార్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్‌ : www.upsc.gov.in 
ఎస్‌ఎస్‌సి : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి)... కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాల్లోని రూ.10,500, అంతకంటే తక్కువ వేతన పరిధి కలిగిన గ్రూప్‌-బి పోస్టులకు, గ్రూప్‌-సి లోని అన్ని నాన్‌-టెక్నికల్‌ పోస్టులకు పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
సివిల్స్‌ : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సరైన రీతిలో నడిపించాలని గట్టిగా కోరుకునేవారికి సివిల్‌ సర్వీసెస్‌ మంచి మార్గం. యుపిఎస్‌సి నిర్వహించే అత్యంత కఠినమైన, విస్త్రత పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష రాసేవారికి ముందుగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రస్తుత సంవత్సరానికి పరీక్ష పాత పద్థతిలోనే కొనసాగుతుంది. అభ్యర్థులు ప్రధానంగా ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌, వాటి తర్వాత సర్వీసులైన గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి సర్వీసులలో ప్రవేశానికి సివిల్స్‌ పరీక్ష రాస్తారు.
మూడు దశలు : ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ...ఇలా మూడు దశల్లో సివిల్‌ పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ప్రతి సంవత్సరం సాధారణంగా మే 3వ వారంలో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌ పరీక్ష. అనంతరం పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. సివిల్స్‌ను జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు నాలుగుసార్లు మాత్రమే రాసేందుకు అనుమతిస్తారు.
అర్హత : భారతీయుడై ఉండి, కనీసం ఏదైనీ డిగ్రీ పాసై ఉండాలి.
ఫీజు : రూ.50 సింగిల్‌ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ స్టాంప్‌ (పోస్టాఫీసుల్లో లభ్యమవుతాయి) ద్వారా చెల్లించాలి.
ప్రిలిమినరీ : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌, 300 మార్కులకు ఆప్షనల్‌ పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు సమయం. మెయిన్స్‌కు అభ్యర్థులను వడకట్టటమే ప్రిలిమ్స్‌ ప్రధానోద్దేశం. ఆ ఏడాది అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్యకు సుమారు 12 నుంచి 13 రేట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. ఆప్షనల్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌కు జాబితాలో ఇచ్చిన 23 సబ్జెక్టుల్లో ఏదేని ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. జనరల్‌ స్డడీస్‌ పేపర్‌లో జనరల్‌సైన్స్‌, కరెంట్‌ ఈవెంట్స్‌ (జాతీయ, అంతర్జాతీయ అంశాలు), భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, భారత, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మెంటల్‌ ఎబిలిటిలపై ప్రశ్నలుంటాయి.
మెయిన్స్‌ : మెయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. అన్నీ వ్యాసరూప పద్ధతిలో రాయాలి. ప్రతి పేపర్‌కూ మూడు గంటల సమయం కేటాయిస్తారు.
ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ : అగ్రికల్చర్‌, యానిమల్‌ హజ్బెండ్రీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎటక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, జాగ్రఫీ, జియాలజీ, ఇండియన్‌ హిస్టరీ, లా, గణితం, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ, ఫిజిక్స్‌, పొలిటకల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, హిస్టరీ, మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, కింది భాషా సాహిత్యాల్లో ఏదేని ఒకటి-అరబిక్‌, అస్సామీ, బోడో, బెంగాలి, చైనీస్‌, డొగ్రి, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మళయాళం, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పాలి, పర్షియన్‌, పంజాబి, రష్యన్‌, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళ్‌, తెలుగు, ఉర్దూ.
మెయిన్స్‌ పేపర్లు : 1.పేపర్‌-1 రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఏదేని ఒక భారతీయ భాష (300 మార్కులు)
2.పేపర్‌-2-ఇంగ్లీష్‌ (300 మార్కులు)
3.పేపర్‌-3-ఎస్సే (200 మార్కులు)
4.పేపర్‌-4,5-జనరల్‌ స్డడీస్‌ (ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
5.పేపర్‌-6,7,8,9 పైన తెలిసిన ఆప్షనల్‌ జాబితాలోని అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఏవేని రెండు సబ్జెక్టులు (ప్రతి సబ్జెక్టుకూ రెండు పేపర్లు. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
అనుమతి లేని కాంబినేషన్లు : 1.పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ -పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
2.కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ-మేనేజ్‌మెంట్‌
3.ఆంత్రోపాలజీ-సోషియాలజీ
4.మ్యాథమెటిక్స్‌-స్టాటిస్టిక్స్‌
5.అగ్రికల్చర్‌-యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌
6.మేనేజ్‌మెంట్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
7.ఇక ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో...సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ వీటిలో ఒకటి కంటె ఎక్కువ సబ్జెక్టులను ఎంపిక చేసుకోరాదు.
8.యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌-మెడికల్‌ సైన్స్‌
ఇంటర్వ్యూ : దీనికి 300 మార్కులు. ఇందులో ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుపై అభ్యర్థి అవగాహన, ప్రాముఖ్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు, వ్యక్తిగత అభిరుచులను అంచనా వేస్తారు.

Sunday, April 22, 2012

మీలో సివిల్స్ పట్ల ఆసక్తి ఉందా?

                            యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం మెయిన్స్‌లో విజయాన్ని సాధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. తక్కువ సంఖ్యలో ఖాళీలు, నాణ్యత ఉన్న అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా సాగే రాత పరీక్ష పోటీ, అభ్యర్థి అంతరంగాన్ని అన్ని కోణాల నుంచి పసిగట్టే పర్సనాలిటీ టెస్ట్ వీటన్నింటినీ తట్టుకొని విజేతల జాబితాలో చోటును సాధించడం ఆషామాషీ కాదు. విజయవంతమైన ప్రణాళిక, సడలిపోని ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే వాతావరణం, చక్కగా సూటిగా విషయంలోకి వెళ్ళిపోయే మంచి స్టడీ మెటీరియల్ ఇవన్నీ సివిల్స్ విజయానికి అభ్యర్థి వేసుకోవాల్సిన పునాదిరాళ్ళు, సివిల్ సర్వీస్ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని తెలిసిందే. వాటిలో మొదటిదశ ప్రిలిమినరీ. ఒక అభ్యర్థి తన కెరీర్‌లో సివిల్స్ కోసం యత్నిస్తున్నప్పుడు మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాస్ కావడం మంచిది. మొదటిసారి మెయిన్స్ పరీక్షాపత్రాన్ని రాసే అనుభవం చేతికి అందుతుంది. ఎంతమంది బోధించినా, మనం రాస్తే వచ్చిన అనుభూతి రాదు. ప్రథమ పర్యాయంతోనే సివిల్స్ సర్వీస్‌లో విజేతలుగా నిలిచేందుకు అవకాశాలు తక్కువే కావచ్చుగాక, కానీ ప్రిలిమినరీ పాసయ్యేందుకు మాత్రం అభ్యర్థి తప్పకుండా పోరాటం చేయాలి. ముందే చెప్పినట్టు దీనివల్ల మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. ఇకపోతే, త్వరలో జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్ని మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యంవల్ల మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు పొరపాట్లు చేయకుండా ఈ అంశాలు పనికొస్తాయి. వీటికన్నా ముందు, అసలు, అభ్యర్థి తనకు సివిల్స్‌పై నిజమైన ఆసక్తి వుందా లేదా అన్నది తేల్చుకోవాలి. ఆసక్తిలేకుండా ఊరికే రాస్తూపోవడం శుద్ధ దండుగ.

అభ్యర్థికి సదరు పోటీ పరీక్షపై ఆసక్తి ఉందా? లేదా అన్నది ఈ క్రింది ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది.
* మీకు సివిల్ సర్వీస్ పరీక్షలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలుసా?
* సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్న వారినెవరినైనా కలిశారా?
* సివిల్ పోటీలో ఘనవిజయాన్ని సాధించిన అభ్యర్థుల వివరాలు చదివారా?
* సివిల్స్‌కు అవసరమైన కార్యప్రణాళికను రూపొందించుకున్నారా?
* సివిల్స్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకుంటున్నారా?
పై ఐదు ప్రశ్నల్లో దేనికీ జవాబు చెప్పలేని అభ్యర్థి రంగంలో ఉన్నా లాభం లేదు. ఎందుకంటే గుంపులో గోవిందా అన్నట్టు తానూ ఓ అప్లికేషన్ పారేశాడు కానీ సివిల్స్ అంటే ప్రాథమిక అవగాహన కూడా లేదన్నమాట. ఆ స్థాయి వ్యక్తులు సివిల్స్ సాధించగలగడం కలలోమాట.
ప్రశ్నల్లో కొన్నింటికైనా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగిన వారు మరింత వేగంగా విజృంభించాలి. అన్ని ప్రశ్నలకు సరిగ్గా జవాబులు చెబుతున్న అభ్యర్థి సివిల్స్ పోటీలో క్రమేపీ రాటు దేలగలడు - సందేహం లేదు. ఇప్పుడు విశే్లషించుకున్నట్టుగా, పై రెండు తరగతుల వారికీ మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది. ఈ ప్రశ్నలు అందుకు ఉపయోగపడతాయి.
* మీరు దినపత్రికలు, ఇతర ఉపయోగకరమైన మేగజైన్స్‌ను చదువుతున్నారా?
* టీవీలో కరెంట్ అఫైర్స్ క్రమం తప్పకుండా చూస్తున్నారా?
* బిబిసి వింటున్నారా?
* యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలు చదువుతున్నారా?
* ఏదైనా క్లిష్టమైన జాతీయ లేదా అంతర్జాతీయ సంఘటనపై చిన్న వ్యాఖ్యను వెంటనే రాయగలరా?
* ఇరాన్ - అమెరికా సంక్షోభంవంటి ఒక సుదీర్ఘమైన అంశంలో ఇమిడివున్న తేదీలు, వాటి వివరాలు, ప్రముఖుల కొటేషన్సు తిరిగి చెప్పగలరా?
పై ప్రశ్నల్లో అన్నింటికీ సరిగ్గా జవాబులు చెబితే ఇక ఆ అభ్యర్థి చివరి అవకాశంలోనైనా సివిల్స్ విజేతల జాబితాలో చేరిపోతాడు.
వీటికి సరిగ్గా జవాబులు చెప్పలేని వారు పోటీలో కొంత వెనుకబడి వున్నారని తెలుసుకోవాలి.
సమాచార సేకరణ: ప్రిలిమినరీ మొదటిసారి రాసే అభ్యర్థులకు పరీక్ష విధానంపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అదనపు సమాచారం కోసం వీళ్ళంతా పాకులాడుతారు. సీనియర్ల సలహాలు తీసుకుంటారు. అయితే వీటికి కూడా కొంత పరిమితి కావాలి. సమాచార సేకరణ మాత్రమే లక్ష్యంగా మారితే అది అభ్యర్థి విలువైన సమయాన్ని నిలువునా తినేస్తుంది. అలాగని మెళుకువలు తెలియకపోవడం మంచిది కాదు. అయితే సివిల్స్‌పై సకల అంశాన్ని డిగ్రీలో తెలుసుకోవడం మంచిది. అదీ కాకుంటే ప్రిలిమ్స్‌కన్నా కొద్ది నెలల ముందే సేకరణను మానుకోవాలి. ఎందుకంటే సీనియర్లు, నిపుణుల సలహాలు అన్నీ ఒకే దశలో ఉండవు. ఎక్కువ సలహాలతో అభ్యర్థి ఒరిజినల్ ఆలోచనా ధోరణి సైతం మరుగున పడే ప్రమాదం ఉంది. కొద్దిమంది నిపుణుల సూచనల్ని సీరియస్‌గా అభ్యర్థి, మిగతా అటెంప్ట్‌లలో కూడా వాటినే పాటించడం మంచిది.
స్థాయిని అంచనా వేసుకోవడం: తనపై తాను విశ్వాసం లేనివాడు ఎందుకు కొరగాడు. మరీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా అది సమయానికి విషమ ఫలితాలనిస్తుంది. అందువల్ల వాస్తవికాధారంగా అభ్యర్థి తనను తాను అంచనా వేసుకోవాలి. మిగతా అభ్యర్థులు ఏ స్థాయిలో ఉన్నారో నిర్మాణాత్మకంగా అంచనా వేసుకోవాలి. తన బలహీనతల్ని గుర్తించాలి. కొద్దిమందికి ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ విభాగమంటేనే భయం. మరికొందరు లెక్కలంటే ఆదుర్దాపడతారు. జాగ్రఫీ మరికొద్దిమందికి విసుగును తెప్పిస్తుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే అభ్యర్థి తనకు ఫలానా సబ్జెక్టుపై వున్న అయిష్టాన్ని ముద్రగా మలచుకోకూడదు. దాన్ని సాధించే దాకా విడిచిపెట్టకూడదన్న పట్టుదల చాకచక్యం - ఈ రెండింటితో కలగలిపి పయనించాలి. బాగా ఇష్టమయ్యే అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అది అసలుకే ఎసరుగా మారుతుంది. మరోమాట, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కన్నా పెద్ద ప్రాముఖ్యత ఆప్షనల్స్‌కు వుంటుంది. దీన్ని అభ్యర్థులు మొదటినుంచి గుర్తుంచుకోవాలి.
సమయానికి తగిన వ్యూహం: విజేతలుగా నిలచిన అభ్యర్థులంతా వివిధ పత్రికలకిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను చదవాలని సలహా ఇస్తుంటారు. దీనిలో వంద శాతం నిజముంది. అయితే విజేతల సలహాల్ని అభ్యర్థులంతా తు.చ. తప్పకుండా అనుసరించాలని ఏమీ లేదు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఎంతో విస్తృతమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే పరీక్షకు ప్రిపేరయ్యేందుకు తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వేళల్లో అభ్యర్థులు సమయానికి అనుగుణంగా తగు వ్యూహాల్ని తయారుచేసుకోవాలి. కొద్ది రోజుల్లో పరీక్ష ఉన్నప్పుడు నాణ్యమైన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవడంవల్ల మంచి ప్రయోజనాలుంటాయి. దాన్ని కూడా ఎంపిక చేసుకొని చదివితే మరీ మంచిది. ఎంపిక ప్రక్రియకూడా గుడ్డిగా రాయి విసరడం వంటిది కాదు. దీనికో శాస్ర్తియమైన విధానముంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ప్రశ్నాపత్రాల్ని అభ్యర్థి ముందు పెట్టుకోవాలి. ఏఏ విభాగాలనుంచి ఎలాంటి తీరుతెన్నులతో ప్రశ్నల్ని అడుగుతున్నారని మదింపు వేసుకోవాలి. అదే దారిలో తానూ పయనించాలి.
మానసిక స్థిరత్వం: ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగేవారు జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. సమకాలీన సమాజం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అన్ని పోటీ పరీక్షలు వేరు. సివిల్స్ వేరు. అందువల్ల విజయాన్ని సాధించే అభ్యర్థి కఠినమైన మానసిక స్థిరత్వాన్ని సాధించేందుకు కృషిచేయాలి. ఇది చెబుతున్నంత సులువుకాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. సివిల్స్‌లో విఫలమైనంత మాత్రాన జీవితమంతా చీకటి మాయమైపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. భయంకరమైన పరాజయానికి అభ్యర్థి తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. మానసిక స్థయిర్యం లోపిస్తే అభ్యర్థిలో అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ఇవి విజయపథంలో ముళ్లకంచెల్ని వేస్తాయి. అభ్యర్థికి పరీక్షలకన్నా ఎంతో ముందునుంచే ఎవరైనా తోడుగా ఉంటే మరీ మంచిది. అలాంటి వ్యక్తి నిరంతరం అభ్యర్థి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండాలి.
అభ్యర్థి ఎక్కడా నీరస పడిపోకుండా, నీరుకారి పోకుండా జాగ్రత్త వహించాలి. సివిల్స్‌లో నెగ్గిన అభ్యర్థులు తమ విజయానికి పరోక్ష కారణం కుటుంబం నుండి లభించిన ఆదరణేనని చెప్పడం వీరంతా గమనించే ఉంటారు.
సాంకేతిక దోషాలు: మొదటిసారి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు, ప్రశ్నపత్రం చివరన ఉండే సమాచారాన్ని భర్తీ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాంకేతిక లోపాలేర్పడి ప్రశ్నపత్రం ఇన్‌వాలీడ్‌గా మారుతుంది. అహోరాత్రులు శ్రమించినదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకని అభ్యర్థి సమాచార పత్రంలోని గళ్లను సూచనల్ని గమనిస్తూ నింపాలి. మరో అంశం. ప్రశ్నపత్రంలో కఠినంగా అనిపించే వాటిని చూసి అట్టే గాభరాపడకూడదు. ముందుగా, నిశ్చయంగా సరియైనవని తోచిన సమాధానాల్ని పూర్తిచేయాలి. వాటి సంఖ్యను మనసులో గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక రానివాటిని, మెల్లమెల్లగా సాధన చేస్తూ పోవాలి. ఇటీవలి కాలంలో ప్రిలిమనరీ ప్రశ్నల్ని చాలా చాకచక్యంగా రూపొందిస్తున్నారు. ప్రశ్నను అజాగ్రత్తగా చదివినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, అంతే సంగతులు. ఇవీ ప్రిలిమినరీ పరీక్షకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న సివిల్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రిలిమినరీ మొదటిసారికే క్లియర్ చేసుకుంటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
3ప్రాథమిక2 ప్రణాళిక ఎలా?: 2012 ప్రిలిమ్స్ పరీక్ష ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. నూతన విధానం ప్రవేశపెట్టాక గత ఏడాది జూన్ 12న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ)ని తొలిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సివిల్స్‌కు సిద్ధమవబోతున్నవారు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలో స్పష్టం చేసుకోవటానికి ఇదే తరుణం! విషయాలను స్థూలంగా ఆకళింపు చేసుకోవటంతోపాటు వాటిలోని సూక్ష్మ వివరాలను కూడా పట్టించుకోవాలి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానాన్ని విశే్లషిస్తే బోధపడే సారాంశమిది వచ్చే సంవత్సరం పరీక్షకు రూపొందించుకోవాల్సిన ప్రణాళిక తీరును. ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రణాళికను 2 అంశాలుగా విభజించాలి.
 1. ఈ ఏడాది ప్రశ్నపత్రం ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక.
 2. సాధారణ కార్యాచరణ ప్రణాళిక.
నిర్దిష్టంగా... పర్యావరణంపై సమాచారం సేకరించాలి. ప్రాథమిక అంశాలను పట్టించుకోవాలి. పర్యావరణం అంటే ఏమిటి అనే ప్రశ్న దగ్గరనుంచి ప్రారంభించి వౌలిక విషయాలను గ్రహించాలి. పునాదిని పటిష్ఠ పరుచుకుని, తర్వాత ఈ విభాగంలో వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వార్తలకెక్కిన ప్రతి సమాచారాన్ని సేకరించాలి. (ప్రాంతీయ సమాచారం అవసరం లేదు). ఈ అంశాలను ప్రాథమిక సమాచారానికి జోడించాలి. నిశజూజ్ఘ కూళ్ఘూ ఱ్య్యరీ నూ, సామాజిక రంగాలకు సంబంధించిన సాహిత్యాన్ని (్గఉది, బీహార్ నిర్మాణం మొదలైనవి) చదవాలి. ఒక్కో కార్యక్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమయిందీ మొదలైనవి విస్మరించకూడదు. ఒకసారి ఈ సమాచారం నమోదు చేసుకున్నాక వర్తమాన అంశాలను జోడించటం మొదలుపెట్టాలి. ఈ సందర్భంగా ఓ బంగారు సూత్రం గుర్తుంచుకోవాలి. సామాన్య మానవుణ్ణి ప్రభావితం చేసే ఏదైనా సివిల్ సర్వెంట్లకు ముఖ్యమే!
* పాలిటీ, హిస్టరీ, సైన్స్ మొదలైన విభాగాల్లో అందరూ పాటించే సన్నద్ధతనే సాగించాలి.
* మీ ఇంగ్లిష్ భాషానైపుణ్యాలను అంచనా వేసుకోండి. అవసరమనుకుంటే వాటిని మెరుగుపరచుకోండి. ఇది కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుందని గమనించాలి.
* ఇంటర్లో, డిగ్రీలో లెక్కలు సబ్జెక్టుగా గణితేతర విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
* ఈ సంవత్సరం మాదిరే వచ్చే ఏడాది కూడా ప్రశ్నల సంఖ్యా, క్లిష్టత స్థాయి అదే రకంగా ఉండొచ్చని భావించకూడదు. మార్పులకు సిద్ధపడి ఉండటం మేలు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది... ఇక్కడ అవసరమైనది త్యీౄఒ ళకళ పజళతీ. ముఖ్యాంశాల్లో ప్రతి ఒక్క కోణాన్ని దగ్గరగా గమనించి, క్షేత్రస్థాయలో పరిశీలన చేయటం.
ప్రయత్నాలు, వయోపరిమితిలో మార్పులు
------------------------------------------------------
పరీక్ష సంవత్సరం వయోపరిమితి ప్రయత్నాల సంఖ్య
------------------------------------------------------
1949-60 21-24 పరిమితి లేదు
1961-71 21-24 రెండుసార్లు
1972 21-26 రెండుసార్లు
1979-1986 21-28 మూడుసార్లు
1987-1989 21-26 మూడుసార్లు
1990 21-31 నాలుగుసార్లు
1999-ఇప్పటివరకు 21-30 నాలుగుసార్లు


సివిల్స్ పరీక్షలో మార్పులు
--------------------------------------
సంవత్సరం మార్పులు
--------------------------------------
1947 తప్పనిసరి (కంపల్సరీ) సబ్జెక్టుల ప్రవేశం
1948 ప్రపంచ చరిత్ర,
అంతర్జాతీయ న్యాయం సబ్జెక్టుల చేరిక
1961 ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ప్రవేశం
1966 ఆప్షనల్ సబ్జెక్టుల ప్రక్షాళన
1969 ఆధునిక భారతీయ
భాషల సాహిత్యం చేరిక
1979 ప్రిలిమ్స్ తొలిసారిగా ప్రవేశపెట్టారు
1987 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశం
1993 సబ్జెక్టుగా మెడికల్ సైన్స్ చేరిక

Friday, March 9, 2012

కూసంత అవగాహన ఉంటె చాలు సివిల్స్ కొట్టెయ్యొచ్చు.

సివిల్స్ ఔత్సాహికులు తమ విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా మొట్టమొదటిగా సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన ఏర్పరచుకుని లోకజ్ఞానం పెంచుకోవాలి. దీనికోసం న్యూస్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియోలోని చర్చా కార్యక్రమాలు అనుసరించడం, దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం లాభిస్తుంది.
అదే విధంగా పుస్తకాల్లో చదివే అంశాలను సమాజంలోని పరిస్థితులతో అన్వయం చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది. వీటితోపాటు సివిల్స్‌కు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా అట్లాస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. సివిల్స్ విషయంలో తార్కిక ఆలోచన నైపుణ్యం ఎంతో అవసరం దీన్ని పెంపొందించుకోవాలి. నేను తెలుగు మీడియంలో పరీక్ష రాశాను. అందువల్ల నాకు తెలియని సాంకేతిక పదాలకు అర్థాలు అన్వేషించి ఒక జాబితాగా రూపొందించుకున్నాను.
ఇక.. గత ఏడాది నుంచి ప్రారంభించిన రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్) ఇంజనీరింగ్, మ్యాథ్స్ అభ్యర్థులకే అనుకూలం అనే అపోహ వీడి చదవాలి. సిలబస్ విస్తృతంగా ఉందనే భయాన్ని వదిలి ఇష్టపడి చదవాలి. ఎన్ని గంటలు చదివామనేది? కాకుండా.. చదివిన కొద్ది సమయమైనా కాన్‌స్టెంట్‌గా, కాన్‌సన్‌ట్రేషన్‌తో చదవాలి.
---x-x-x-x---
 
ఆల్ ది బెస్ట్
-సీహెచ్‌వీఏ నాయుడు (ఐపీఎస్ ట్రైనీ),
సివిల్స్ 2010 విజేత
Courtesy:Sakshi

Wednesday, January 18, 2012

సివిల్స్ అంటే ఎందుకు భయం.?

ప్రపంచంలోనే అతి క్లిష్టతరమైన  పరీక్షలలో ఒకటి "సివిల్స్". దేశంలోనే ప్రధానమంత్రి తర్వాత అత్యున్న స్థానానికి ఎదగడానికి దోహదపడే ఒకేఒక మార్గం ( రాజకీయ పరంగా కాకుండా ) సివిల్స్. 
 http://www.linkingsky.com/images/civil-services.jpg
సంవత్సరాలుగా రాసి రాసి విసుగేత్తక మళ్ళీ తమ పోరాట పటిమను చుపాలనుకునే అలుపెరుగని దీరుల ఆశాదీపిక ఈ సివిల్స్. పట్టా పొందిన కుర్రాడి నుండి చివరి చాన్స్ ఉన్న ఆశావాహుల వరకూ ఎంతో మందికి సివిల్స్ ఒక కలగానే మిగిలిపోతోంది. 
 సరైన మార్గం చూపే వారులేకనో, సమాచార లోపం వల్లనో , ఇంగ్లీషులో చదివే వాళ్ళే రాయొచ్చు అనే అపోహలవల్లనో, పుస్తకాల లభ్యత కొరవడడం వల్లనో, కోచింగ్ కోసం లక్షలు వెచ్చించాల్సి వస్తుందనో ఇంకా ఇతర కారణాల మనలో వల్లనో అనేకమంది ఈ సివిల్స్ పరీక్షను అందని ఆకాశం అని అనుకుంటున్నారు.
నేను కూడా "సాధించగలను" అనే ఒక్క నమ్మకం , ఆత్మ విశ్వాసం ఉంటే చాలు. IAS, IPS, IRS, IFS, ....  మీ వాకిట్లో వాలాల్సిందే.! నిజం.!  ప్రణాళికా బద్ధమైన ప్రిపరేషన్, వాడిపోని విశ్వాసం , కోరవడని కాంక్ష, అణగద్రోక్కినా పదింతలు పైకి లేచే తత్వం లాంటివి చాలా అవసరం. 
ఇక  సివిల్స్ ప్రిలిమ్స్  నోటిఫికేషన్ ఫిబ్రవరి 4 న విడుదల కానుంది. మార్చి 5 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 20 వ తేదీ ఆదివారం ప్రిలిమినరీ పరిక్ష జరుగనుంది. 

అప్లికేషన్ వేశామా, ఎక్షామ్ రాశామా అన్నట్లు కాకుండా కొద్దిగా బుర్ర పెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ గట్టెక్కడం కష్టమేమీ కాదు. తెలుగు మీడియం రాసే అభ్యర్థులు జాగ్రత్త .! తెలుసు కదా .!  ప్రిలిమ్స్ ఇంగ్లిష్ లో రాయాలని . ఒక మంచి డిక్షనరీ, పెన్సిల్  పెట్టుకోండి. అర్థం తెలియని పదాలు కనిపిస్తే అండర్ లైన్ చేసి అక్కడే పెన్సిల్తో తెలుగు అర్థం రాసేసుకోండి. ఇంకోసారి చదివేటపుడు సులువవుతుంది. తెలుగు తో పాటు ఇంగ్లిష్ పేపర్ కూడా చదవడం ప్రారంబించండి.   

చివరగా  ఒక డైలాగు....
------- మీకంటే తోపు లేడెవ్వడిక్కడ. చదవాలనుకుంటే కసిగా చదివేసేయండి.------ 
     

Monday, January 16, 2012

అసలు "జనరల్ స్టడీస్" లో ఏముంటాయి?

అసలు జనరల్ స్టడీస్ అంటే అంటే ఏమిటి? దానికోసం ఎలాంటి అంశాలు చదువు కోవాలి? అనే అంశాలు తికమక పెడుతూ ఉంటాయి. ఈ నేపద్యంలో సివిల్స్ ప్రిలిమినరీ కోసం జనరల్ స్టడీస్ పూర్వ ప్రశ్నాపత్రాల ఆధారంగా ఎ ఎ అంశాలు ప్రిపేర్ అవ్వాలో వేటిలో పట్టు సాధించాలో కొద్ది సమాచారం మీకోసం.


అంశం
మార్కులు
భారత దేశ చరిత్ర 
5-7
ఇండియన్ నేషనల్ మూమెంట్
7-10
ప్రపంచ మరియు భారత దేశ భూగోళ శాస్త్రం
20-38
పాలిటి మరియు గవర్నెన్స్
12-14
ఎకానమి మరియు సాంఘీకాభివృద్ది
16-32
పర్యావరణ శాస్త్రం
10-15
జనరల్ సైన్స్ ఫిజిక్స్
10-12
జనరల్ సైన్స్ బయో సైన్సెస్
12-20
జనరల్ సైన్స్ కెమిస్ట్రీ
8- 11
జెనరల్ నాలెడ్జ్
2-5
కర్రెంట్ అఫ్ఫైర్స్
5-20

Sunday, December 4, 2011

సివిల్స్ కి తెలుగు మీడియం వారు చదవాల్సిన పుస్తకాలు .

సివిల్స్‌ అభ్యర్థులందరూ ప్రిలిమినరీలో రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
2) పేపర్‌-2:

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

ఇన్ని అంశాలనూ కవర్‌ చేసి, ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి? తార్కికంగా చూసినా ఉన్న ఒకే మార్గం- trendsను గుర్తించి, అనుసరించటమే! అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను ముందస్తుగా ఊహించటం కష్టం.

ఇది 'నల్లహంస' దృగ్విషయం లాంటిది. 
 (నల్లహంసల జాతి ఒకటుందని పదిహేడో శతాబ్దిలో కనిపెట్టేదాకా హంసలన్నీ తెల్లగా ఉంటాయనే నమ్మకం కొనసాగింది. లెబనీస్‌ రచయిత టాలెబ్‌ దీన్ని Black swan phenomenon గాcoinచేశారు. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటానికి సాధ్యం కాని స్థితి!...

పరీక్షల సందర్భానికొస్తే పాత ప్రశ్నపత్రాల సాయంతో రాబోయే ప్రశ్నలను వూహించలేకపోవటం.)

ప్రిలిమినరీలో పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ నిశ్చయంగా Black Swan. ఎవరూ వూహించటానికి వీల్లేకుండా యూపీఎస్‌సీ దీన్ని రూపొందిస్తుంది. మరి కర్తవ్యం?

మొదట మీ విశ్లేషణ కచ్చితంగా ఉండాలి. ఇది జ్ఞాపకశక్తిని పరీక్షించే factual paper అని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. ఈ కారణంతోనే చాలామంది మంచి అభ్యర్థులకు ఇది మొదటినుంచీ సమస్యగా ఉంటూ వచ్చింది. ఈ పేపర్‌తో సంబంధమున్న రీజనింగ్‌ భాగాన్ని చాలామంది అర్థం చేసుకోరు. 2011 నుంచి UPSCఅధికారికంగా 'ఆప్టిట్యూడ్‌' పరీక్షను ప్రవేశపెట్టింది కానీ, గత 4-5 ఏళ్ళ నుంచీ జనరల్‌స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ పరోక్షంగా కరిక్యులమ్‌లో భాగంగానే ఉంది.

ప్రాథమిక factualసమాచారంతో పాటు బలమైన రీజనింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యేలా UPSCప్రశ్నలను రూపొందిస్తోంది. కాబట్టి సారాంశంలో ఇది జనరల్‌స్టడీసూ కాదు; జనరల్‌ నాలెడ్జీ కాదు! ఇది జనరల్‌ స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (GSAT).

స్థిర, పరిణామశీల అంశాలు
* స్థిర (static)అంశాలు- భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ

* పరిణామశీల అంశాలు - వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జి. వీటికి తగిన నిర్వచనం, సిలబస్‌ అంటూ లేవు.

స్థిర అంశాల్లో సాధారణంగా స్కోరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. వీటిలో ఎంత ఎక్కువ సాధించగలిగితే అనిర్దిష్ట అంశాలైన వర్తమాన వ్యవహారాలూ, జి.కె.లపై ఆధారపడటం అంత తగ్గుతుంది. వీటిని మౌలిక అంశాల నుంచి నేర్చుకుని, నోట్సు ద్వారా పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవాలి. భావనలు (concepts) పటిష్ఠపరచుకోవాలి. నమూనా టెస్టులు రాస్తే పరిజ్ఞానం విస్తృతమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

నిర్దిష్టత ఉండని వర్తమాన, జి.కె.లలో ప్రాథమిక వివరాలతో పాటు సూత్రాలూ, అమలూ కూడా అవగాహన చేసుకోవాలి. చాలినంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు థియరిటికల్‌ అంశాల జాబితా తయారుచేసి, రోజువారీగా తాజా పరిణామాలను జోడించుకుంటూ ఉండాలి. ఈ తరహా ప్రశ్నలకు రీజనింగ్‌, factual data అవసరం కాబట్టి పైన చెప్పిన విధానం పాటిస్తే వాటిని పెంపొందించుకోవచ్చు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు
2) తెలుగు అకాడమీ ప్రచురణలు
3) హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ) లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు
4) తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు
5) పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌'
6) తెలుగు, ఇంగ్లిష్‌ల్లో ప్రచురితమయ్యే 'యోజన'
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు ఈ పేపర్‌ గురించి మరీ ఇబ్బందిపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు అంశాలతో తేలిగ్గానే పరిచయం పెంచుకోవచ్చు.

పేపర్‌-2
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)

గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యథావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడివుంటుంది కాబట్టి ఈ పేపర్‌ కూడా మరో Black swanఅవ్వగలదు.

ఈ పేపర్లో ఉన్న అంశాలన్నిటిలోనూ పట్టు సాధించటం ఎక్కువమంది అభ్యర్థులకు సాధ్యం కాదు. అందుకని గరిష్ఠ మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయికంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పటిష్ఠపరుచుకోవటం కోసం మంచి వర్క్‌బుక్‌తో సాధన చేయాలి. ఒక నిర్దిష్టమైన తర్కంపై పట్టు లభిస్తే అది ఆత్మవిశ్వాసం పెంచి, ఇతర ప్రశ్నలను చేయటానికి కూడా ఉపకరిస్తుంది. అందుకే ఈ పేపర్‌ కోసం మంచి ప్రశ్నలను solve చేయటం చాలా ముఖ్యం.

పేపర్‌-1 static section లో ప్రశ్నల సంఖ్యది ప్రధాన పాత్ర. కానీ పేపర్‌-2లో నాణ్యమైన ప్రశ్నలు (సంఖ్యలో తక్కువైనప్పటికీ) చేయటం అవసరం. అప్పుడే దానిమీద అవగాహన పెరుగుతుంది. ఈ విధంగా ఈ విభాగంలో స్కోర్‌ చేయాలంటే smart work ప్రధానాంశం.

క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం చాలా ప్రధానం. మొత్తం మార్కుల్లో వీటి భాగం ఎక్కువ. అభ్యర్థులు కష్టపడితే దీన్ని సులభంగా మల్చుకోవచ్చు. ఈ విభాగానికి సమయం కబళించటంలో చాలా పేరుంది కాబట్టి ప్రశ్నలను సత్వరం చేసేలా సమయపాలన పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిందే. లేకుంటే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను రాయగలిగే అవకాశం లేకుండాపోతుంది.

ఇంగ్లిష్‌ మాధ్యమ నేపథ్యం లేనివారూ, ఈ భాషపై అంతగా పట్టు లేనివారూ ఆందోళన పడకూడదు. ఇప్పటివరకూ అనుసరించిన ప్రిపరేషన్‌ పద్ధతినే, తీరునే కొనసాగించాలి. యూపీఎస్‌సీ పేర్కొన్నట్టు- 'టెన్త్‌ క్లాస్‌ స్థాయి' నైపుణ్యాలను మాత్రమే పరీక్షిస్తారు కాబట్టి ఆందోళన పడనవసరంలేదు. సిలబస్‌లో లేని లోతైన అంశాలను చదువుతూ ప్రిపరేషన్‌ను సంక్లిష్టం చేసుకోకూడదు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) అరిథ్‌మెటిక్‌ ప్రాథమిక పుస్తకాలు
2) ఇంగ్లిష్‌ మౌలిక విషయాలుండే పుస్తకాలు
3) 'ఇగ్నో' ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌ పుస్తకాలు
4) బ్యాంకింగ్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు
5) పేపర్‌-2కు సంబంధించిన మంచి manual
6) మంచి ఇంగ్లిష్‌ నిఘంటువు / ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువు

మొత్తమ్మీద రెండు పేపర్లకూ section వారీగా సంసిద్ధం కావాలి. మిగతా అంశాలను పకడ్బందీగా చదివివుంటే కొన్ని ఉప అంశాలను వదిలివేసినా ఇబ్బంది ఎదురవ్వదు. ప్రతి మార్కూ పెద్ద తేడాను సృష్టించే ఇలాంటి పోటీపరీక్షల్లో సమయ నిర్వహణ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.


కాబట్టి వచ్చే రోజుల్లో అభ్యర్థులు తమ సాధనను సమయ నిర్వహణతో అనుసంధానించుకోవటం శ్రేయస్కరం.
 - ఈనాడు చదువు సౌజన్యంతో......

Saturday, November 5, 2011

సివిల్స్ ఇంటర్వుకి ప్రిపరషన్ ఇలా.....!! | Civils interview

సివిల్స్‌పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూ గురించి కొంత భయపడుతుంటారు. అయితే ముందుగానే తగిన మెళకువలు పాటిస్తే, అవసరమైన విషయాలపట్ల అవగాహన పెంచుకుంటే ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఇంటర్వ్యూ కూడా చాలా కీలకం. 50 నుంచీ 240 మార్కుల వరకూ ఇందుకు కేటాయిస్తున్నారంటే దాని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా ఇంటర్వ్యూ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రయత్నించాక విఫలం కాకుండా ఉండాలంటే ఈ కింది విషయాలు గమనంలో ఉంచుకోవాలి.
ఇంటర్వ్యూ.... ఇంగ్లీష్‌లోనే ఉంటుందా? తెలుగులో కూడానా? అన్నది పలువురి సందేహం. తెలుగు మీడియం పరీక్షలు రాసే అభ్యర్థులు అనువాదకుడి సహాయంతో తమ ఇంటర్వ్యూను వినిపించవచ్చు. ఒక వేళ తెలుగులో భావ వ్యక్తీకరణ సరిగ్గా లేనప్పుడో, అనువాదకునికి సరిగ్గా అనువదించడం రానప్పుడో ఇంగ్లీష్‌ పదాలు ఉపయోగించి ఇంటర్వ్యూచేస్తున్న బోర్డు సభ్యులకు వివరించవచ్చు. ఇంగ్లీష్‌ మీడియం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులైతే అదేభాషలో ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఒక అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనావేసే మౌఖిక పరీక్ష కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముందుగానే ఇంటర్వ్యూకు ప్రిపేరవ్వాలి. కొందరు ఇంకా మెయిన్స్‌ పరీక్షలే కాలేదుకదా ఇప్పట్నించే ఇంటర్వ్యూ గురించి ఆలోచించడమెందుకు అనుకుంటుంటారు. అది కరెక్టే అయినా ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్‌లో ఒక భాగంగానే భావించాలి. పరీక్షలు రాసిన తర్వాత, ఇంటర్వ్యూ సమయం దగ్గరపడుతున్నప్పుడు హడావిడిగా ప్రిపేరైతే ఫలితం ఉండదు. అప్పటికప్పుడే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఒక ప్రణాళికా బద్ధంగా ముందునుంచే సంసిద్ధమైతే మంచిది.
ఇవి చర్చించండి
ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? అన్నదానికి కచ్చితంగా ఇదే అని చెప్పలేం. అందుకోసం ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలి. సమాజాన్నీ, మార్పులనూ, రాజకీయ, ఆర్థిక, ప్రభావిత అంశాలనూ పరిశీలిస్తుండాలి. రెగ్యులర్‌గా దినపత్రికలు చదువుతుండాలి. సమకాలీన అంశాలపట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి పరిజ్ఞానంవల్ల తప్పక రాణిస్తారు. సొంత ప్రిపరేషన్‌తోపాటు గ్రూప్‌ చర్చలు లాంటివి కూడా ఎంతో ఉపయోగపడతాయి. సమకాలీన అంశాలను ఇంగ్లీష్‌లోనే ఫ్రెండ్స్‌తో చర్చిస్తూ ఉండాలి. దీనివల్ల అవగాహన, చక్కటి భాష, స్పష్టత ఏర్పడుతుంది. ఇంటర్వ్యూలో ఇదెంతో ఉపయోగపడుతుంది. మీరు మాట్లాడే విధానం బాగున్నప్పుడు ఫ్లూయన్సీకి పెద్ద ప్రాధాన్యత కూడా ఇవ్వరు.
గమనించాల్సిన విషయాలు
ముందునుంచే ఇంటర్వ్యూను దృష్టిలో పెట్టుకోవాలి.
మెయిన్స్‌ పరీక్షలు అయిపోగానే పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.
*సబ్జెక్టుతోపాటు మిమ్మల్ని మీరు వ్యక్తపర్చుకునే విధంగా ప్రిపరేషన్‌ ఉండాలి.
*మాట తీరు ఎలా ఉంది. ముఖ కవళికలు ఎలా స్పందిస్తున్నాయి. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అద్దంలో చూస్తూ ప్రాక్టీస్‌ చేయాలి.
*మీకు ఇంటర్వ్యూపట్ల భయం పోవాలంటే ముందుగానే మీరు ఇంటర్వ్యూకు హాజరైనట్లు అందులో నెగ్గినట్లు ఊహించుకుంటూ మిమ్మల్ని మీరు మెరుగు పర్చుకోవాలి.
*నడిచే విధానం, కూర్చునే పద్ధతి, వేసుకున్న దుస్తులు, ముఖంలో ఫీలింగ్స్‌, హావభావాలు, ముఖ కవళికలు, ఆహ్లాదం, ఆనందం, వినయం, ప్రవర్తన ప్రశ్నలు అడిగిన వెంటనే స్పందించే తీరు, మీరు చెప్పే దాంట్లో స్పష్టత, సబ్జెక్టు, చివరగా బయటకు వస్తున్నప్పుడు మీ ఫీలింగ్‌ ఇవన్నీ పరిశీలిస్తారు కాబట్టి ఏ ఒక్కచోటా నిర్లక్ష్యం చేయకుండా అభ్యర్థులు జాగ్రత్త పడాలి.
*మెయిన్స్‌ అప్లికేషన్‌ ఫారం చాలా ముఖ్యమైంది దీనిమీద ఆధారపడే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి దానిని జాగ్రత్తగా నింపాలి. అవసరమైతే నిపుణుల, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
*ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు తగిన సమాధానంతోపాటు అందులో హేతుబద్ధత కూడా గమనిస్తారు.
ఇవి గుర్తుంచుకోండి
*సివిల్‌ సర్వీసుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
*సివిల్‌పట్ల ఆసక్తి ఉందనీ, అందుకు మీరు అర్హులనీ నిరూపించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. బాడీలాంగ్వేజ్‌ పాజిటివ్‌గా ఉండాలి. బోర్డుమెంబర్లు వెతుకుతున్న అభ్యర్థి మీరేనన్న విషయం వారికి తెలిసేలా ప్రవర్తించగలగాలి.
*చక్కటి భాషను ఉపయోగించాలి. స్పష్టంగా మాట్లాడాలి.
*బోర్డుమెంబర్లను తప్పుదోవపట్టించే వాదనలు చేయకూడదు.
*ఇంటర్వ్యూ సమయంలో మీలో ప్రశాంతత కనిపించాలి. ఆత్మ విశ్వాసం ఉట్టిపడాలి.
*వీలైతే ముందుగానే మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరవ్వండి దీనివల్ల నిజమైన ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తడబడకుండా ఉంటారు.
*యుపిపిఎస్సీ ఇంటర్వ్యూలో ఏం ఆశిస్తుందో తెలియాలంటే వివిధ మ్యాగజైన్లల్లో ఇచ్చే ఒరిజినల్‌ ఇంటర్వ్యూలను చదవాలి.
ఇదీ... ఇంటర్వ్యూ
*ఇంటర్వ్యూ అనేది వ్యక్తిత్వాన్ని అంచనా వేసే మౌఖిక పరీక్ష. బోర్డుమెంబర్లు అభ్యర్థిని వివిధ కోణాల్లో పరిశీలిస్తారు.
*తెలియని ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం చెప్పేకన్నా తెలియదని చెప్పడానికి సంకోచించ కూడదు. ఈ విషయం కూడా ఆత్మ విశ్వాసంతో చెప్పగలగాలి.
*ఇంటర్వ్యూ అనేది భయపడాల్సినంత ఇబ్బందికరమైంది కాదు. అదొక సహజ సంభాషణ ప్రక్రియగా ఫీలైతే తప్పకుండా నెగ్గుతారు.
అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు
*ప్రజా సంబంధాల కెరీర్‌కు తగిన వ్యక్తిత్వం
*మానసిక సామర్థ్యం
*మేధోపరమై, సామాజిక పరమైన లక్షణాలు
*సమకాలీన అంశాలపట్ల అవగాహన
*మానసిక సంసిద్ధత
*సంగ్రహ శక్తి
*స్సష్టమైన వైఖరి, తార్కికమైన వ్యక్తీకరణ
*నిర్ణయాల్లో, తీర్పుల్లో సమతుల్యత
*విభిన్న అభిరుచులపై పట్టు కలిగి ఉండటం
*నాయకత్వానికీ, సామాజిక ఐక్యతకు తగిన సామర్థ్యం
*మేధోపరమైన నైతిక పరిపూర్ణత
*అభిప్రాయాల్లో పరిపక్వత
*విభిన్న అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించడం
ఇవి అధ్యయనం చేయాలి
* రాష్ట్రానికి సంబంధించిన అంశాలు
* జాతీయ అంశాలు
* సాధారణ అంశాలు
- చేగూరి కుమార్‌

Wednesday, November 2, 2011

తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి | Telugu Bhasha Charitra by Bhadriraju Krishnamurti

తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి   |    Telugu Bhasha Charitra by Bhadriraju Krishnamurti


Telugu Bhasha Charitra by Bhadriraju Krishnamurti

Monday, October 31, 2011

HOW TO CRACK CIVIL SERVICES EXAMINATION | సివిల్స్ గురించి సమగ్ర అవగాహనను అందించే ఈ పుస్తకం ఒకసారి తిరగేయండి..

సివిల్స్ గురించి సమగ్ర అవగాహన కొరకు ఒక పుస్తకం ప్రచురింపబడినది. కేవలం ఆంగ్లంలో మాత్రమె ఈ పుస్తకం ప్రచురించబడినది. పుస్తకం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. http://www.championsquest.com/assets/ClickHere_button_RedWhite_4.gif
ఒక మిత్రుడు ( Venkata krishna janam ) నాకు ఈ పుస్తకం గురించి ఈ మెయిల్ చేసాడు.

Wednesday, October 19, 2011

సివిల్స్ లో తెలుగు సాహిత్యం లో గమనించదగినవి. | Preparing Telugu Literature for ( CIVILS ) Mains

Akella Raghavendra
Cవిల్ సర్వీసెస్ పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతున్న ఆప్షనల్స్‌లో తెలుగు సాహిత్యం ఒకటి. పాతప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే తెలుగు ఆప్షనల్స్ నుంచి తికమక ప్రశ్నలు అంతగా రావడం లేదని అర్థమవుతుంది. అంటే అభ్యర్థి కాస్తంత ప్రణాళికతో, పరీక్షా దృక్పథంతో శ్రమిస్తే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు పొందడం సులువే. సివిల్స్ మెయిన్స్ తెలుగు లిటరేచర్‌కు ఇంకా రెండు వారాల వ్యవధే ఉంది. తెలుగు లిటరేచర్‌లో తప్పనిసరిగా చదవాల్సిన అధ్యాయాలు, ప్రశ్నల కోణాలు, సమాధానాలు రాయాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలు, నైపుణ్యాలు....తెలుసుకుందాం

చదవాల్సినవి ఇవీ...


ఇంటర్, డిగ్రీలాంటి అకడమిక్ పరీక్షల స్వరూపం వేరు. పోటీ పరీక్షల లక్ష్యం వేరు. అకడమిక్స్‌లో ఏవో కొన్ని అధ్యాయాలు చదివి మిగిలిన వాటిని విడిచిపెట్టినా గట్టెక్కొచ్చు. కానీ సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో అలా కాదు. కొన్ని ప్రత్యేక వ్యూహాలను అభ్యర్థి అర్థం చేసుకుంటే - కొన్ని అధ్యాయాలే చదివినప్పటికీ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మొదట సిలబస్‌లోని అన్ని అధ్యాయాల మీదా అవసర మైనంత అవగాహన ఉండాలి.


తర్వాత ఏయే అధ్యాయాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో స్పష్టంగా గుర్తించగలగాలి. దీనిద్వారా ఏయే అధ్యాయాలపై ఆధారపడితే ఎక్కువ మార్కులు వస్తాయో తెలుస్తుంది.

పైన వివరించిన వ్యూహం ఆధారంగా తప్పక చదవాల్సినవిగా పేపర్-1, పార్‌‌ట-ఎలో 1, 4, 5, 6, 7 అధ్యాయాలను వ్యాస, లఘు రూప ప్రశ్నల కోసం పూర్తిగా అధ్యయనం చే యాలి. 2, 3, 8 అధ్యాయాలు లఘురూప ప్రశ్న ల కోసం చదివితే చాలు. అదేవిధంగా పార్‌‌ట-బిలో 1, 7, 9, 10, 11, 12 అధ్యాయాల నుంచి వ్యాస, లఘురూప ప్రశ్నలు రెండింటినీ సంపూర్ణంగా చదవాలి. మిగిలిన అధ్యాయాల్లోని లఘురూప ప్రశ్నలపై పూర్తి పట్టు సాధించాలి.


విజయానికి ఐదు వ్యూహాలు...


కొన్ని అధ్యాయాల నుంచి కేవలం లఘురూప ప్రశ్నలు మాత్రమే చదివితే వాటి నుంచి వ్యాసాలు వస్తే ఎలా? అని అభ్యర్థి సందేహించడం సహజం. అలాగే ఒక్కోసారి అభ్యర్థి అసలు చదవని ప్రశ్నలు పరీక్షలో వచ్చినా - ధైర్యంగా, సమగ్రంగా సమాధానం రాసే సత్తా సాధించడం ఎలా? - అని కూడా విద్యార్థులు అడుగుతుంటారు. దీనికి ఆయుధాల్లాంటి ఐదు వ్యూహాలను అభ్యర్థి అనుసరించాలి.


1. సంక్షిప్తీకరణం: అభ్యర్థి ఒక వ్యాసరూప ప్రశ్న చదివాడనుకుందాం. అదే ప్రశ్న పరీక్షలో వ్యాసంగా కాకుండా లఘురూపంగా రావొచ్చు. అలాంటప్పుడు సమర్థంగా సంక్షిప్తీకరించడం ఎలాగో తెలియాలి. దీనికి మూడు వ్యూహాలు ఉన్నాయి. అవి...

ఎ. వ్యాసంలోని ప్రాధాన్య, అప్రాధాన్య అంశాల్ని గుర్తించగలిగి కీలక అంశాలు మాత్రమే రాయాలి.
బి. వివరణలు, విశ్లేషణలు పరిహరించాలి
సి. దృష్టాంతం, ఉదాహరణలు తగ్గించాలి.

2. విస్తరణ: ఒక లఘురూప ప్రశ్నను వ్యాసంగా విస్తరించగల నైపుణ్యాన్ని అభ్యర్థి తప్పక సాధించాలి. ఉదాహరణకు నామ్నీకరణంపై లఘురూప ప్రశ్న మాత్రమే చదివిన ఒక అభ్యర్థికి పరీక్ష గదిలో అదే అంశంపై వ్యాసం రాయాల్సిన పరిస్థితి ఎదురైందనుకుందాం. అలాంటపుడు - నామ్నీకరణం అంటే ఏమిటో కాస్త ఎక్కువగా వివరించి, ఉదాహరణలు పెంచి, అనుకరణం అనే మరో లఘురూప ప్రశ్నలోని అంశాల్ని జోడించి, విస్తరించి రాయగలగాలి. ఎందుకంటే - అనుకరణం కూడా నామ్నీకరణంలో ఒక భాగమే కాబట్టి! అలాగే ‘యక్షగానం’పై లఘుసమాధానం చదివిన అభ్యర్థి - అదే జవాబుకి రఘునాథ నాయకుడు, దక్షిణాంధ్ర కవయిత్రులు రాసిన యక్షగానాల వివరణను, విశ్లేషణను జోడిస్తే - వ్యాసం పూర్తవుతుంది.


3. అంతఃసంబంధం: సిలబస్‌లోని వివిధ అధ్యాయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం మూడో వ్యూహం. ఉదాహరణకు సిలబస్ ప్రకారం పేపర్-1, పార్‌‌ట-బిలో ‘నన్నయ భారత రచన సామాజిక నేపథ్యం’ చదివితే చాలు. కానీ 2007లో ఇదే అధ్యాయం నుంచి ‘నన్నయ భారతాంధ్రీకరణ విధానం’పై ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానం రెండో పేపర్‌లోని నన్నయ శకుంతలోపాఖ్యానం నుంచి స్వీకరించి రాయాలన్న స్పృహ అభ్యర్థికి అవసరం.


అలాగే ఆధునిక యుగంలో ఆవిర్భవించిన ధోరణి ‘స్త్రీ వాదం’. కానీ 2006లో ‘ప్రాచీనాంధ్రంలో స్త్రీవాదం’పై ప్రశ్న వచ్చింది. ఇది స్థూలంగా చూస్తే - అసందర్భ ప్రశ్న. కానీ రాయక తప్పదు. ఇలాంటప్పుడు ఎలా? మొదట స్త్రీవాదంపై రెండు పేరాలు రాయాలి. ఆపై రెండో పేపర్‌లో శకుంతల, ద్రౌపది, గుణనిధి తల్లి, సుగాత్రి, మొల్ల తదితరుల్లో కనిపించే స్త్రీచైతన్య, స్త్రీ వేదన అంశాలను స్త్రీవాదంతో అనుసంధానిస్తూ - ప్రాచీనాంధ్ర దృక్కోణంతో రాయగలగాలి.


4. పారిభాషిక పదాలు: పరీక్షలో సాధారణంగా కనిపించే పరిభాషను అభ్యర్థి అర్థం చేసుకోవాలి. వివరించండి, విశ్లేషించండి, దృష్టాంతీకరించండి, సోదాహరించండి, ఉటంకించండి, విమర్శించండి, విపులీకరించండి, క్రోడీకరించం డి, ప్రత్యక్షీకరించండి, నిరూపించండి, నిర్ణయించండి... ఇలాంటి పదాలు ప్రశ్నల్లో కనిపించినపుడు అన్నింటికీ ఒకే సమాధానం కాదని గుర్తించండి. మార్కులు రావడానికి, ఎక్కువ మా ర్కులు రావడానికి వ్యత్యాసం ఉండేది ఇక్కడే.


5. పదాలు మారవచ్చు: ఒక్కోసారి పరీక్షలో ప్రసిద్ధమైన పదంతో ప్రశ్న అడగకుండా మారుమూల పదంతోనో, అర్థంకాని పదంతోనో ప్రశ్న రావచ్చు. ఉదాహరణకు ‘శ్రీనాథుడు చాటువులు’ అని అడగకుండా 2006లో ‘శ్రీనాథుడు - దేశీయతాముద్ర’ అని అడిగారు. అలాగే ద్రావిడ భాషల్లో ‘తెలుగు స్థానం’ అని నేరుగా అడగకుండా 2004లో ‘మూల ద్రావిడ వర్ణాలు తెలుగులో పొందిన మార్పులు’ అని మార్చి అడిగారు. ఇలాంటివి సిలబస్‌లో ఎన్ని ఉన్నాయో అన్నింటిపైనా అభ్యర్థికి అవగాహన ఉండాలి. అలాగే ప్రసిద్ధ కవుల, విమర్శకుల వ్యాఖ్యల్ని ప్రశ్నలుగా అడుగుతున్నారు. ఉదాహరణకు విశ్వనాథ సత్యనారాయణ ‘తిక్కన శి ల్పంపు తెనుగుతోట’ అని పలికారు. ఇదే 2000 లో ప్రశ్నగా వచ్చింది. నన్నయ మొదలుకొని తొమ్మిది మంది ప్రాచీన కవులపై విశ్వనాథవారి వ్యాఖ్యలను అభ్యర్థి తప్పక తెలుసుకోవాలి.


చివరగా...


పరీక్షకు ఇక పదిహేను రోజుల వ్యవధే ఉంది. ఇంతవరకు ఎంత చదివామన్నది కాదు ఇప్పుడు ఎలా చదివామన్నది కీలకం. పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ మనసుపై ఒత్తిడి పెరిగితే ప్రమాదం. కింది విధానాలు పాటించండి.


ఉదయాన్నే 15 నిమిషాలపాటు ధ్యానం చేయండి లేదా మౌనంగా... ఒంటరిగా... మీతో మీరు గడపండి.


అనవసర వాదనలు, మాటలు లేకుండా చూసుకోండి.

ప్రతి ప్రశ్ననూ సినాప్సిస్‌తో రాసుకోండి.
ఏ ప్రశ్ననైనా పది-పదిహేను పాయింట్లు చెప్పగలిగేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి.

కొత్త పుస్తకాలు, మెటీరియల్‌ని చదివే ప్రయత్నం చేయకండి.


పాత ప్రశ్నపత్రాలన్నింటినీ తప్పక, క్షుణ్నం గా అధ్యయనం చేయండి. ఏ ఒక్క ప్రశ్నలోని ఏ ఒక్క పదం తెలీకపోయినా - నిపుణులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే పాత ప్రశ్నలు మళ్లీ అడిగే ధోరణి కనిపిస్తోంది.


వ్యాసానికి ఆరు పేజీలు మించకూడదు. 30 నిమిషాల్లోపు రాయగలగాలి. లఘు ప్రశ్న రెండు పేజీలు మించకుండా 12 నిమిషాల్లో రాసేయగలగాలి.


పరీక్షలో - వచ్చినా రాకపోయినా - రాయాల్సిన ఐదు ప్రశ్నల్ని రాయాలి.

పరీక్షలో కొట్టివేతలు రాకుండా జాగ్రత్తపడండి. ఒకవేళ వస్తే ఆదుర్దాపడకండి.
ఎన్ని పేజీలు రాశామన్నది కాదు - నాణ్యత ముఖ్యం అని గుర్తించండి.

చివరగా - ఓడేవాడికీ గెలిచేవాడికీ తేడా ఏమిటో గుర్తించండి. ఓడేవాడు పూర్తిగా ఆడకుండానే ఆటను ఆపేస్తాడు. గెలిచేవాడు - అం తుచూసేంతవరకు ఆడుతాడు. ఆడేవాడికి ఓడే మాట తెలీదని గుర్తించండి. విజయం మీ జన్మహక్కు అని గుర్తించి ఈ పదిరోజలు కష్టపడి గెలుపుని మీ గుప్పెట్లో బంధించండి.


రెండో పేపర్ ఇలా..


చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందేది రెండో పేపరు గురించే. వ్యాఖ్యానాలు, పద్యాలు, గాఢమైన విశ్లేషణలు ఉండే ఈ పేపర్‌ని ఐదు కోణాల దృష్టితో చదివితే సులువుగా ఆకళింపు చేసుకోవచ్చు.


1.వ్యాసరూప ప్రశ్నకు - వ్యాఖ్యానికి గల అంతఃసంబంధం తెలుసుకోగలగాలి.


2.వ్యాఖ్యానాలు రాయడానికి సులభ పద్ధతులు గుర్తించగలగాలి. ఉదాహరణకు ‘సామాజిక-చారిత్రక’ దృక్కోణంతో ఒక పద్యాన్ని వ్యాఖ్యానించినపుడు అదే అంశాన్ని కాస్త విస్తరిస్తే తాత్త్విక దృక్పథం అవుతుందని గుర్తించాలి.


3.రెండో పేపర్‌లో ప్రాచీన సాహిత్యంలోని ప్రతి అంశాన్నీ ‘సామాజిక ప్రయోజన’ కోణంతో తప్పక చదవాలి. అంటే నన్నయ శకుంతలోపాఖ్యానం క్రీ.శ.11వ శతాబ్దిలో రచించారు. ఆనాటి సమాజం ఏమిటి, ఆ కథలో అది ఎలా ప్రతిబింబించింది, 21వ శతాబ్దిలో ఉన్న నేటి సమాజానికి ఏదైనా ఆ కథ ఉపయోగపడుతుందా... ఇలా విశ్లేషించగల నేర్పరితనం అభ్యర్థికి తప్పనిసరి.


4.అభ్యర్థి చదివే ప్రతి పాత్రలోనూ మానవ మనస్తత్వం ఏమిటో అనువర్తించగలగాలి. శకుంతల, దుష్యంతుడు, పాండవులు, ద్రౌపది, కృష్ణుడు, గుణనిధి, సోమిదేవమ్మ, సుగాత్రి... ఇలా సిలబస్‌లో ఉన్న పాత్రలన్నీ వాస్తవానికి పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధ పాత్రలు’ వారు మానవమాత్రులు కారు. సాధారణ మా నవుడిలో కనిపించే భావోద్వేగాలు వీరిలో ఉండకపోవచ్చు. ఈ పాత్రలను అన్ని కోణాల్లోనూ అభ్యర్థి విశ్లేషించగలగాలి.


5.ఒక కవికి ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మరొక కవికి ఆపాదించి ప్రశ్న అడగడం యూపీఎస్‌సీ ధోరణిగా అభ్యర్థి గుర్తించాలి. ఉదాహరణకు ‘శ్రమైక జీవన సౌందర్యం’ అనే శ్రీశ్రీ వ్యాఖ్యను పింగళి సూరన సుగాత్రి శాలీనుల కథకు జోడించి 2003లో ప్రశ్న అడిగారు.


ఈ అంశాల ఆధారంగా అభ్యర్థి ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన ధోరణులతో కొన్ని ప్రశ్నల్ని విశ్లేషించే అభ్యాసం చేయాలి.

ఉదాహరణకు సహదేవుడి పాత్రచిత్రణ, ద్రౌపది మాటకారితనం, రాయబార ఘట్టం - ఈనాటి పరిస్థితులు, గుణనిధికథ - నేటి తల్లిదండ్రుల పెంపకం, సుగాత్రి - ఆనాటి ఈనాటి స్త్రీ జాతికి ఇచ్చిన సందేశం, కర్పూర వసంతరాయలు - జాతివార్తా చమత్కారాలు, గురజాడ కథానికల్లోని స్త్రీ పాత్రలు... మొదలైన ప్రశ్నల తీరుతెన్నుల్ని అభ్యర్థి ముందే ఊహించుకుని విశ్లేషించుకోవాలి.
 
 
 
గమనిక: ఇది సాక్షి పత్రికలో ప్రచురించిన వ్యాసం  

Tuesday, September 6, 2011

తెలుగు మీడియం వారి కోసం ప్రత్యేకం . తెలుగు మీడియం వారు సివిల్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి.

తెలుగు మీడియం విద్యార్థులు ఎలా ప్రిపేర్‌ కావాలి? వీరు సివిల్స్‌ రాయడానికి సరిపోరా?




మనలో అనేక మంది విద్యార్థులుగానో, ఉద్యోగార్థులుగానో దినపత్రికలు తిరగేస్తున్నప్పుడు నిత్యం ఒక అధికారి మనకు తారసిల్లుతుంటాడు. ఆ జిల్లా అధికారిని అనేకమంది ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు...ఇలా అనేక మంది ఎప్పుడూ కలుస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గుర్తుకు వచ్చిందా? అతనే జిల్లా కలెక్టర్‌. అతని చుట్టూ ఉండే హంగామా, ఆధికారదర్పం దగ్గరగా చూసిన ఏ విద్యార్థి అయినా క్షణకాలం పాటు తానూ కలెక్టర్‌ అయితే ఎంత బాగుండు!! అని అనుకుంటాడు. కొంత మంది దానిని గురించి కలలు కంటారు. కానీ అంతలోనే చుట్టూ ఉన్న పరిస్థితులు, స్నేహితుల వెక్కిరింతలు, నిరుత్సాహపూరిత మాటలను గమనించి వెంటనే జావగారి పోతారు. అందుకనే వెంటనే ఆ ప్రయత్నం నుంచి విరమించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష అంటే పోటీ విపరీతంగా ఉంటుంది. ఇక జాతీయస్థాయి పరీక్షలంటే చెప్పక్కర్లేదు. చదువుతుపాటు వీటికి ఉండాల్సిన ఒకే ఒక అర్హత...తపన, తపస్సు.





చాలామంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంటుంది. ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే కేవలం అవగాహన లోపం మాత్రమే. ఎవరికి అవగాహన లేదు? అంటే తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, చుట్టూ ఉన్న వారు, టీచర్లు, లెక్చరర్‌లు...ఇలా వీరు...వారు...అనే కాకుండా అధికులకు ఈ పరీక్షల గురించి, మార్గం గురించి అవగాహన ఉండకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. అవగాహన ఉన్న వారయితే ఆ కోరికను వెలిబుచ్చిన పిల్లలను ఆ దిశగా మరల్చుతారు.చాలా మందికి ఐఎఎస్‌, ఐపిఎస్‌ పాసై జిల్లా కలెక్టరు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కావాలంటే దారి ఏమిటి? ఏ పరీక్షలు రాయాలి? దాని కోసం ఎవరిని కలవాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయాలు తెలియవు. ఒక వేళ తెలిసినా అది చాలా కష్టతరమైన పరీక్ష అనీ, ముఖ్యంగా సామాన్య పేద విద్యార్థులు రాయలేరనీ...అందుకని వాటి గురించి కలలు కనడం కూడా 'సాహసమే' అని భయపడుతూంటారు. ఇదంతా అనవసరపు అపోహ మాత్రమే. నిజానికి సివిల్‌ సర్వీస్‌ పరీక్ష కూడా అన్ని పరీక్షల్లాగే సామన్య పరీక్షలేనని, ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే వాటిలో అగ్రభాగాన నిలబడడం సాధ్యమే. అందుకని కలెక్టర్‌ కావాలనుకోవడం సాధారణమే తప్ప 'సాహసం' కానేకాదని ఏ మాత్రం భావించకండి.





ఇక్కడ మరో విషయం చెప్పుకోవడం అవసరం. డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లు చేస్తున్నప్పటికీ తరువాత ఏం చదవాలో? ఏ సబ్జెక్టులు ఎంచుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి చాలామందిలో ఉన్నది. ముఖ్యంగా ఈ తికమక పరిస్థితి సివిల్‌ సర్వీసు పరీక్షలకు సంబంధించి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. దీనికి విద్యార్థులను ఏ మాత్రం తప్పుబట్టకూడదు. ఎందుకంటే వారికి అవగాహన కలిగించే ప్రయత్నం ఇంట్లోనూ, కాలేజీల్లోనూ, బయటా ఎవరూ చేయకపోవడమే కారణం. తప్ప ఇంత చదువుకున్నా కూడా ఈ మాత్రం తెలియదా? అని వారిని చిన్న చూపు చూడటం తగని పని.మీరు విదేశాలలో మన దేశపు రాయబారిగా ఆ దేశపు ప్రధానితోనో, అధ్యక్షునితోనో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి. అలాగే ఒక కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదిని మీరు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు విచారిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో ఉన్నతాధికారులనో లేదో సినిమా నటులను ఇంటి మీదనో దాడి చేస్తున్నారు. లేదా దేశంలోనికి అక్రమంగా రవాణా అవుతున్న సరకులను పట్టుకోగలిగారు. మరో సన్నివేశంలో మరో పెద్ద రాజకీయ నాయకుడు డబ్బు, బంగారం అక్రమంగా తీసుకు వెళుతున్నపుడు దానికి లెక్క, జమ లేదని ఆయనను మీరు అరెస్ట్‌ చేయగలిగారు. మన దేశ వాణిజ్య, వ్యాపార భవిష్యత్తును నిర్ణయించే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు. టి. ఓ.) చర్చలతో మీరు స్వయంగా పాల్గొనగలిగారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక ఉదాహరణలు.




అలాంటి అన్ని సందర్భాల్లో పనిచేసే అవకాశం రావడం గొప్ప పరిస్థితి. సదరు అధికారి పత్రికల పతాక శీర్షికలకెక్కాతాడు. అలాంటి వ్యక్తిని దేశమంతా గౌరవిస్తూ ఉంటుంది. ఆ విధంగా పైన పేర్కొన్న విధులను నిర్వహించే అవకాశం ఒక సివిల్‌ సర్వీసులతోనే దక్కుతుంది. ఈ పరీక్షల ద్వారా ఐఎఎస్‌, ఐపిఎస్‌లే గాకుండా పైన చెప్పుకున్నటు వంటి విశేష, విచక్షణాధికారాలు గల దేశంలోనే ఉన్నతమైన సుమారు 25 సర్వీసులలో చేరే అవకాశముంది.

ఈ ఉద్యోగాల్లో చేరడం వల్ల ప్రభుత్వ విధాన రూపకల్పనల్లోనూ, వాటిని అమలు చేయడంలోనూ కీలక పాత్ర పోషించే అరుదైన అవకాశం కలుగుతుంది. వృత్తిలో భాగంగా వేలు, లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. హోదాతోపాటు ఈ విధంగా తృప్తిని కలిగించే ఉద్యోగాలు ఇవేనంటే కూడా అతిశయోక్తి కాదు. ఇటీవల అధికాదాయాన్నిస్తున్న ఉద్యోగాలుగా భావిస్తున్న కంప్యూటర్‌ (సాఫ్ట్‌వేర్‌) రంగంలోని ఉద్యోగాలతో పోలిస్తే ఇక్కడ పొందే గౌరవం, సామాజిక హోదా, సంతృప్తి అనిర్వచనీయమైనది. అధికారాల గురించైతే ఇక చెప్పనే అవసరం లేదు. ఎన్నో కంపెనీల సీఈవోలకు లభించని అధికారం, ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ సర్వీసులతో మాత్రమే లభిస్తుంది. సివిల్‌ సర్వీసులోని గొప్పదనమంతా ఇదే.





ఇంత చక్కటి కెరీర్‌ అయిన సివిల్‌ సర్వీసెస్‌లను ఎంచుకునే వారి సంఖ్య ఇటీవల తగ్గిపోతున్నట్లు ఒక సర్వే తెలిపింది. దీనికి కారణాలను కూడా అదే సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ విషయాన్నే తీసుకుంటే...ప్రతి తల్లిదండ్రి, తమ బిడ్డ ఐఐటి చేయాలనో లేదా ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌ చేయాలని కోరుకుంటున్నారు. అదీ తప్పితే కంప్యూటర్‌ రంగంలో ప్రవేశించి వేల కొద్దీ జీతం ఆర్జించాలని చూస్తున్నారు కాబట్టే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలిసింది. డబ్బు మీద 'యావ' పెరగడం ఒక సామాజిక కోణమైతే, ఈ ఉద్యోగాల గురించిన అవగాహన లేకపోవడం మరో కారణం కాగా ఫలితాలపై తల్లిదండ్రులకుండే అసందిగ్దత కూడా తోడైనందువల్లనే పిల్లలను ఈ వైపుగా మళ్ళించడం లేదని సర్వేలో తేలింది.
ఇంజనీరింగ్‌ చదివితే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతకవచ్చని అదే ఐఎఎస్‌ పరీక్షలకు ప్రిపేరై...చివరకు అది రాకపోతే ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల శ్రమ వృథా? కదా? అనే సందేహం వస్తుంది. అయితే ఇది అపోహగానే తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే...ఒక సారి సివిల్‌ సర్వీసు పరీక్షలకు ప్రిపేరయిన విద్యార్థికి ఏ'కెరీర్‌'కైనా కావలసిన స్కిల్స్‌ కంటే ఎక్కువ 'ప్రతిభ' అలవడుతుంది. కాబట్టి ఐఎఎస్‌ రాకపోతే...గ్రూప్‌-1, 2 వంటి సర్వీసులున్నాయి. బ్యాంకింగ్‌ ఉద్యోగాలున్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే...ఇలా ఏ రంగంలో అయినా కీలకమైన పోస్టులనే పొందగలుగుతారు. పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు...ప్రయివేటు సంస్థల్లోని ఉద్యోగాలను చిటికెలో చేజిక్కించుకోగలరు. సివిల్‌ సర్వీసు పరీక్షలకు సిద్ధమైన వారికి కొన్ని కంపెనీలు ఇటీవల కాలంలో ప్రాధాన్యతనిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉంది? వీరికి ఎలాంటి లక్షణాలు సిద్ధిస్తున్నాయి? వీరికెంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్‌కే కాదు జీవితానికి కావలసిన సమయ పాలన, పట్టుదల, సహనం, నిర్వహణా సామర్థ్యం, సామాజిక ప్రవర్తన వంటివన్నీ ఈ ప్రిపరేషన్‌ వల్ల విద్యార్థులకు అబ్బుతాయి. దానితో వారు సునాయాసంగా ఉద్యోగం దొరకబుచ్చుకోవడమే కాకుండా చేపట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలిగి మంచి పేరు, గుర్తింపులను తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీకున్న సందేహాలను పక్కన బెట్టి మంచి కెరీర్‌, ఉన్నతమైన భవిష్యత్తు కావాలనుకునే వారు తప్పని సరిగా ఎన్నుకోవలసిన కెరీర్‌ సివిల్‌ సర్వీసెస్‌.
ఎంచుకున్నాక ఏం చేయాలి?





సరే...! అన్నీ బేరీజు వేసుకుని సివిల్‌ సర్వీసెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారు ముందుకు సాగడం కోసం ఎక్కడ నుంచీ ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకని ప్రిపరేషన్‌ గురించిన వివరాలు తెలుసుకుందాం.చిన్ననాటి నుంచే ఈ పరీక్షలను ఎంచుకునే వారయితే పాఠశాల స్థాయి నుంచే ప్రారంభించడం మంచిది. అలా కాకున్నా ఇంటర్మీడియెట్‌, డిగ్రీలు చదువుతున్న వారయినా సరే ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. అయితే దేనికి తగ్గ ప్రణాళికను దానికి వేసుకోవాలి. అంటే ఉన్న సమయాన్ని సరయిన రీతిలో సద్వినియోగం చేసుకుంటే లక్ష్యం సాధించవచ్చు.ప్రిపరేషన్‌ అనగానే లావాటి ఉద్గ్రంథాలను ముందేసుకుని కుస్తీ పట్టడమని భావిస్తారు చాలామంది. కానీ అది కాదు. అసలంతటి పుస్తకాలను చదవాల్సిన అవసరమే లేదు. మున్ముందుగా దినపత్రికను చదవడం అలవాటు చేసుకోవాలి. కొద్ది కాలం ఇది అలవాటయ్యాక మనకు కావలసిన వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి. ఫక్తు రాజకీయాలు, టైంపాస్‌ వార్తలు, సినీ వార్తలు వంటివి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాల గురించిన వార్తలు చదవాలి. ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించిన విశ్లేషణలను చదువుతూ ఉండాలి. ప్రభుత్వాల గమనాలను, సరళులను గమనిస్తూ ఉండాలి. మొదట్లో కొద్దిగా బోర్‌ అనిపించినా నెమ్మదిగా దిన పత్రికల ఎడిటోరియల్‌ (ఒపీనియన్‌) పేజీలోని వ్యాసాలను చదవాలి. దీనితో సమస్య పూర్వాపరాల గురించిన వివరాలు తెలవడమే కాకుండా విశ్లేషణలు కూడా బోధపడతాయి. ఒక సమస్యను అర్థం చేసుకోవడంలో ఎలా? అనే విషయం అర్థమవుతుంది.




ఇవే కాదు క్రీడా వార్తలు కూడా చదవాలి? అయితే క్రీడలు అనగానే మేజర్‌గా ఒక క్రికెట్టే అనుకుంటారు. కానీ పోటీ పరీక్షల్లో క్రికెట్టేతర పోటీలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని గుర్తుంచుకోండి. క్రీడా పోటీల విజేతలను, అవి ఎక్కడవెక్కడ జరుగుతున్నాయి? వంటి విషయాలను అవగాహన చేసుకుంటూ చదవాలి? అలాగే అవార్డుల గురించీ చదవాలి? ముఖ్యమైన పదవులలో నియామకాల గురించి, పరిణామాల గురించి, ఆవిష్కరణలు-వాటి ప్రభావాల గురించి చదువుకుంటూ అవగాహన పెంచుకుంటూ ఉండాలి.

ఈ విషయాలను పత్రికల్లోనూ కాకుండా రేడియోల్లో మరింత ఎక్కువగా వస్తాయి. టీవీల్లోనయితే వార్తల్లోని కొన్ని విషయాలు పనికి వస్తాయి. మనకవసరమైన సివిల్స్‌ కోణంలో నుంచి చూస్తే టీవీకన్నా రేడియోనే మేలు. మనకు కావలసిన ఇలాంటి వివరాలు ఎక్కువగా రేడియోనే రిపోర్టు చేయాలి. రేడియో వల్ల విషయాలు తెలవడమే కాదు వినగలిగే సామర్థ్యం పెరిగి, విషయం పట్ల అటెన్షన్‌ పెరుగుతుంది. ఈ సామర్థ్యం మనకు మౌఖిక పరీక్షలో ప్రశ్నలను సరిగ్గా వినేందుకు సహాయపడుతుంది.ఇక్కడ మరో విషయం ముఖ్యంగా గమనించాలి. ఏ రంగం ఎంచుకున్నప్పటికీ సమయపాలన చాలా అవసరం. సృష్టిలో దేనినైౖనా తిరిగి సాధించగలం గానీ, గతించిన సమయాన్ని తిరిగి సంపాదించలేమన్నది అనుభవపూర్వకంగా మనకు తెలిసిన విషయమే. అందులోనూ సివిల్స్‌కు ఇది మరీ ముఖ్యం. దీనిని సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వాటిలో ప్రాథమికాంశంగా పరిగణించాలి. కాబట్టి పేపర్‌ చదవడంతో పాటు సమయ పాలనను మొదటి నుంచీ అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ముందుకు సాగితే సివిల్స్‌ 'సాధన' బాటలో మీరు సరయిన రీతిలో సాగుతున్నట్లేనని భావించాలి.

భాషా సమస్య
ఇదంతా అలవాటు చేసుకోవచ్చు. కానీ పరీక్ష ఇంగ్లిషులో ఉంటుంది కదా! మరి తెలుగు మీడియం విద్యార్థులు ఎలా ప్రిపేర్‌ కావాలి? వీరు సివిల్స్‌ రాయడానికి సరిపోరా? అనే సందేహం కలుగుతుంది చాలామందికి. 'వేల మైళ్ళ దూరమైనా ఒక్క అడుగుతో మొదలు పెడదాం' అని మావో చెప్పినట్లు మొదటి నుంచీ ఈ విషయంపై కూడా శ్రద్ధ పెడితే సరిపోతుంది.అయితే చాలామంది అనుకుంటున్నట్లు సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే వారికి ఇంగ్లిషు అనేది ఒక సమస్య కానే కాదు. ఎందుకంటే అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించే దశలైన మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో మాతృభాష(తెలుగు)తోనూ పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు తెలుగు రాకుంటే వారే 'ట్రాన్స్‌లేటర్‌'ను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ప్రిలిమినరీ పరీక్షలో మాత్రం ప్రశ్నలను ఇంగ్లిషులోనే ఇస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. కాబట్టి జవాబులను ఎ, బి, సి, డి,గా గుర్తించడమే ఉంటుంది. అందుకని ప్రశ్నను అర్థం చేసుకునే కనీస ఇంగ్లిషు పరిజ్ఞానముంటే సరిపోతుంది. ప్రస్తుతం తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పరిజ్ఞానం ఉంటుంది. అది కూడా లేని వారు కొద్ది కాలం పాటు ప్రాక్టీసు చేస్తే సరిపోతుంది.
మన రాష్ట్ర విద్యార్థులు తెలుగుతోనే విజయాలు సాధించారు, సాధిస్తూన్నారు. జాతీయ స్థాయి 'టాప్‌టెన్‌'లో ఒకరిగా స్థానం పొందిన భానుప్రతాప్‌, మొదటిస్థానంలో నిలిచిన ముత్యాలరాజు, కార్తిక్‌...మొదలైవారు పూర్తిగా తెలుగు మీడియంతోనే విజయం సాధించారు. పైగా తెలుగు మీడియంతో రాస్తున్న విద్యార్థుల్లో సక్సెస్‌ శాతం కూడా ఎక్కువేననే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే నమ్మకం కుదురుతుంది. కాబట్టి మీడియం గురించి ఏ మాత్రం కంగారు పడవద్దు. రోజుకు కొన్ని పదాలకు అర్థాలు చదువుకుంటే కావలసిన పరిజ్ఞానం వస్తుంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల మనసులను తొలిచే మరో ముఖ్యమైన అంశం 'డబ్బు'. పుస్తకాలు కొనడానికీ, కోచింగ్‌ తీసుకోవడానికీ లక్షలు వెచ్చించాల్సి వస్తుంది కదా!' అనేది. సరయిన రీతిలో కష్టపడే వారు ఏ మాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా సివిల్స్‌కు ప్రిపేరయ్యే మార్గాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిళ్ళున్నాయి. ప్రభుత్వం నిర్వహించే వీటిలో ఈ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు వీటి ద్వారా హాస్టలు వసతితో పాటు, ఉచిత కోచింగ్‌ కూడా లభిస్తుంది. ఈ కేటగిరీకి చెందని విద్యార్థులు కాలేజీ, యూనివర్సిటీ లైబ్రరీలను ఉపయోగించుకుంటే పుస్తకాలను కొనే బాధ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు కూడా పెరిగాయి. అందుకని కోచింగ్‌ కూడా తక్కువ డబ్బుతోనే పొందే అవకాశాలున్నాయి. అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి కొన్ని కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఉచితంగానూ శిక్షణనిస్తున్నాయి. ఇలాంటి సౌకర్యాలుపయోగించుకునే ఎంతో మంది సివిల్స్‌లో విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న బుర్రా వెంకటేశం వీటి సహాయంగా చదువుకుని విజయం సాధించిన వారే కావడం గమనార్హం.




'మనసుంటే మార్గముంటుంది' అన్నట్లు సివిల్స్‌ సాధించాలనే కోరిక...కాదు...తపన ఉంటే మీడియం, పేదరికం వంటివేవీ అడ్డుకాదు. విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహముంటే విద్యార్థులు సివిల్స్‌లో విజయం సాధించడం గొప్ప విషయమేమీ కాదు.ఇక్కడ చర్చించిన దానితో మీకున్న సందేహాలన్నీ తీరి ఉంటాయని భావిస్తున్నాను. కాబట్టి సివిల్స్‌ సాధించాలనే 'కిల్లర్‌ ఇన్‌స్టింక్ట్‌'ను పెంచుకోండి.
ఆల్‌ ది బెస్ట్‌ !!






PREPARING FOR CIVILS IN TELUGU


ఇంజనీరో, డాక్టరో కావాలంటే ఈ రోజుల్లో ఇంటర్‌ స్థాయినుంచే వేలల్లో, లక్షల్లో ఖర్చు అవుతోంది. అదీగాక ఎక్కువ సమయం చదువు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. మరి లక్షలకొద్దీ ఫీజులు కట్టలేని పేద మధ్య తరగతి యువత పరిస్థితి ఏమిటి? ఎస్టీడి బూత్‌లోనో, బుక్‌స్టాల్‌లోనో పార్టుటైమ్‌ పనిచేస్తూ చదువుకునే విద్యార్థులు అత్యధిక సమయం స్టడీ రూమ్‌లోనే గడిపే పరిస్థితి ఎక్కడుంది? అన్నప్పుడు చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది సివిల్‌. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నవారు కూడా పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ సివిల్స్‌ దాకా ఎదిగినవారున్నారు. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టే దీనివైపు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతోంది. ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు అవకాశాన్ని ఎవ్వరైనా సొంతం చేసుకునే వీలు ఒక్క సివిల్స్‌కే సాధ్యం.
ఎంబిఎ, ఎంసిఎ, ఎంబిబిఎస్‌, ఇంజనీరింగ్‌ లాంటి ఉన్నత చదువులకయ్యే ఖర్చుకంటే సివిల్స్‌కయ్యేది చాలా తక్కువ. అదీగాక ఆర్థిక పరిస్థితి బాగోలేని వారు పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ కూడా చదువుకునే వీలుంది. కాబట్టి ఎక్కువశాతం యువతీ యువకులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ అంటేనే చాలామంది ఐఎఎస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష అని అనుకుంటుంటారు. కానీ ఇందులో 22 రకాల కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. ఐఎఎస్‌కంటే కూడా ఉన్నతమైన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ పరీక్ష ఉంది. ఐఎఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఐఎఎస్‌కే ఎక్కువ డిమాండ్‌ ఉంది. తక్కువ కాలంలో ఉన్నత హోదాకు ఎదిగే అవకాశం, సామాజిక గౌరవం, అధికారం, అవకాశం, ఉద్యోగ భద్రత అన్నీ ఉండటమేగా సేవాదృక్పథం కలిగిన వారికి ప్రజాసేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మధ్య తరగతి యువత ఎక్కువగా సివిల్స్‌పై ఆసక్తి చూపుతోంది.
హోదాతోపాటు
ప్రధానమంత్రి తర్వాత అత్యున్నత హోదాగల కేబినెట్‌ కార్యదర్శి పదవికి చేరుకునే అవకాశం ఒక్క సివిల్స్‌ సర్వీసెస్‌ ద్వారా మాత్రమే సాధ్యం. అంతేకాదు రాజ్యాంగ పరమైన అనేక పదవులు పొందే అవకాశం ఇందులో ఉంటుంది.
పాలనా వ్యవస్థకు పట్టుగొమ్మలు
ఒక ప్రజా ప్రతినిధి పదవీ కాలం ఐదేళ్లు మాత్రమే. ఒక న్యాయమూర్తి కొన్ని పరిధులకు లోబబడి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి పదవి కూడా ప్రజాస్వామ్య దేశంలో స్వల్పకాలికమైనదే. కానీ అదే ఒక సివిల్‌ సర్వీసెస్‌ అధికారి పదవి... దాదాపు 30 సంవత్సరాలు. అంటే పాలనా వ్యవస్థలో, పాలనా వ్యవహారాల్లో, ప్రణాళికల రూపకల్పనలో సివిల్‌ సర్వీసెస్‌లదే కీలకపాత్ర ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండే ఒక ఐఎఎస్‌ అభ్యర్థి సలహాలనే పాటిస్తుంటారంటే దానికుండే గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.
డిగ్రీ ఉంటే చాలు...
కచ్చితంగా ఇన్ని మార్కులుంటేనే సివిల్స్‌కు అర్హులనే నిబంధనలేమీ లేవు. 21 సంవత్సరాల వయసు ఉండి, డిగ్రీ చదువుతున్న వారు, ఫైనల్‌ ఇయర్లో ఉన్నవారు కూడా ఐఎఎస్‌ ప్రవేశ పరీక్ష రాయవచ్చు.
ప్రిలిమినరీ
ప్రతి ఏడాదీ ప్రిలిమినరీ పరీక్షకోసం నోటిఫికేషన్‌ వెలువడుతూ ఉంటుంది. ఈ పరీక్ష అంతా ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. 2011 కొత్త పాటర్న్ అమలులోకి వచ్చింది.
కొత్త ప్యాటర్న్‌లో ఏముంటుంది
కొత్త ప్యాటర్న్‌ అనగానే కఠినంగా ఉంటుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగానే ఉంటుంది. కేవలం బట్టీపట్టో, పరీక్షకోసం మాత్రమే చదివో గుర్తుపెట్టుకునే జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్షవల్ల విద్యార్థుల్లోని ప్రజ్ఞను సరైనరీతిలో అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అభ్యర్థుల్లో నైతిక విలువలు, సంక్లిష్ట పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో సమయోచితంగా వ్యవహరించగలిగే సామర్థ్యం, పరిష్కార మార్గం తదితర విషయాలపట్ల అవగాహన కల్పించే విధంగా కొత్త ప్యాటర్న్‌ ఉంటుంది. అభ్యర్థుల్లో కూడా వీటిస్థాయినే పరీక్షిస్తారు.
మెయిన్స్‌కు అర్హత
మొత్తం 450 మార్కులు ఉంటాయి. 275 ఆ పైన స్కోర్‌ చేయగలిగితే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతీ ఏడాది 1.5 లక్షల మంది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష రాస్తుంటారు. ఖాళీల ప్రాతి పదికను బట్టి సుమారు 9000 మంది దాకా మెయిన్స్‌కు ఎంపికవుతుంటారు. ఇందులో తొమ్మిది పేపర్లను డిస్ట్క్రిప్టివ్‌ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ నెలలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ఏటా సుమారు 1500 మందికి ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది.
మెరిట్‌ జాబితా ఇలా...
మెయిన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌ తర్వాత దాదాపు నాలుగు నెలలపాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. మెయిన్స్‌లో సాధించిన మార్కులనూ, ఇంటర్వ్యూ మార్కులనూ కలిపి చివరిగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. దీని తర్వాత సుమారు 500 మంది ఎంపిక అవుతారు. ఎంపిక కానివారు మళ్లీ ప్రిలిమినరీ నుంచి చదవాల్సి ఉంటుంది.
సబ్జెక్టు ఏదైనా
కేవలం ఆర్ట్స్‌ చదివిన వారే కాదు డిగ్రీలో సైన్స్‌, మ్యాథ్స్‌ చదివిన వారు కూడా ఆర్ట్సు సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఇలాగే తీసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఆర్ట్స్‌ ఒక సామాజిక శాస్త్రమేగాక నిత్యజీవితంతో మిళితమై ఉంటుంది. అదీగాక మెటీరియల్‌ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
సమయం సద్వినియోగం
డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే ఆప్షనల్‌ ఎంచుకోవాలా? వేరే సబ్జెక్టులు తీసుకోవడంవల్ల సమస్యలు తలెత్తుతాయా? అన్న సందేహంతోనే కొంతమంది సమయం వృథా చేస్తుంటారు. కొందరు ఏదోఒక ఆప్షనల్స్‌ ఎంచుకొని కొంతకాలం చదివి వదిలేస్తుంటారు. చివరికీ దేంట్లోనూ రాణించక ఇబ్బంది పడుతుంటారు. దేనికైనా ముందుగా ఆసక్తి, పట్టుదల, లక్ష్యం ఇవన్నీ కావాలి. ఇవి ఏర్పర్చుకొని ఏ ఆప్షనల్‌ ఎంచుకున్నా రాణించగలుగుతారు. కాబట్టి ఆసక్తి ఉన్న ఆప్షనల్‌తోపాటు జనరల్‌ స్టడీపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారు.
దేనికి ఎన్ని మార్కులు?
ప్రిలిమినరీ (అర్హత పరీక్ష-ఫైనల్స్‌కు ఎంపికకు)
మొత్తం మార్కులు 450
కంపల్సరీ జనరల్‌ స్టడీస్‌ 150
ఆప్షనల్‌ పేపర్‌ 300
మెయిన్స్‌ పరీక్షకు 2000
ఇంటర్వ్యూకు 300
ఎంపిక: మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఉంటుంది.




Related Posts Plugin for WordPress, Blogger...