ఐఎఎస్, ఐపిఎస్, ఫారెస్ట్ ఆఫీసర్, సిబిఐ, ఇంటలిజెన్స్...మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా ఖాళీలు ఏర్పడతాయి. కానీ వాటన్నింంటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయరు. ప్రమోషన్స్, డిప్యూటేషన్ లేదా అబ్సార్షన్..వంటి పద్ధతుల్లో అనుభవం గల ఆఫీసర్లకు పోస్టింగ్స్ ఇస్తారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం పొందాలంటే మిగిలింది డైరెక్ట్ రిక్రూట్‌మెంటే ! యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్, స్టాటికల్, ఎకనామికల్ సర్వీసెస్ పరీక్షల్లో నెగ్గటమొక్కటే కేంద్ర కొలువుకు దారి. ప్రతి ఏటా నిర్దిష్ట సమయంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ చదువుతో ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. డిగ్రీ చదువు మధ్యలో ఉన్నవాళ్లు, ఒక సంవత్సరం ముందునుంచే ప్రణాళికా ప్రకారం సన్నద్ధమైతే సక్సెస్‌కు దగ్గరవుతారు. కేంద్ర స్థాయిలో జరిగే పలు పరీక్షలు రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. మొదటిది పోటీ పరీక్షలు. రెండోది ఎంపిక (సెలక్షన్) పద్ధతి.
ఆయా పోటీ పరీక్షలు, వాటి లక్ష్యం మొదలైన వివరాలు...
* సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ, మెయిన్స్)
* ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్
* కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్
* ఇండియన్ ఎకనమిక్ సర్వీసెస్
* ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్
* కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్
* సెంట్రల్ పోలీస్ సర్వీసెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్ నియామకాలు)
* డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ (గ్రేడ్ బి,ఐ-సెక్షన్) ఆఫీసర్లు/ స్టెనోగ్రాఫర్స్ నియామకాలు)
* జియాలజిస్ట్ ఎగ్జామ్
* నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామ్స్ (ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జరుగుతాయి)
* స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ (రెండేళ్లకొకమారు జరుగుతుంది)
రెండో పద్ధతి : ఎంపిక పద్ధతిలో నేరుగా నియామకాలు జరుగుతాయి. కేంద్రంలోని గ్రూప్-ఎ, ఎంపిక చేసిన గ్రూప్-బి పోస్టులకు ఈ పద్ధతి పాటిస్తారు. ఇందులో పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగినవారిని ఉన్నత విద్యార్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్ : www.upsc.gov.in
ఎస్‌ఎస్‌సి : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)... కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాల్లోని రూ.10,500, అంతకంటే తక్కువ వేతన పరిధి కలిగిన గ్రూప్-బి పోస్టులకు, గ్రూప్-సి లోని అన్ని నాన్-టెక్నికల్ పోస్టులకు పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
సివిల్స్ : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సరైన రీతిలో నడిపించాలని గట్టిగా కోరుకునేవారికి సివిల్ సర్వీసెస్ మంచి మార్గం. యుపిఎస్‌సి నిర్వహించే అత్యంత కఠినమైన, విస్త్రత పరీక్ష సివిల్ సర్వీసెస్. ఈ పరీక్ష రాసేవారికి ముందుగా ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రస్తుత సంవత్సరానికి పరీక్ష పాత పద్థతిలోనే కొనసాగుతుంది. అభ్యర్థులు ప్రధానంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, వాటి తర్వాత సర్వీసులైన గ్రూప్-ఎ, గ్రూప్-బి సర్వీసులలో ప్రవేశానికి సివిల్స్ పరీక్ష రాస్తారు.
మూడు దశలు : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ...ఇలా మూడు దశల్లో సివిల్ పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ప్రతి సంవత్సరం సాధారణంగా మే 3వ వారంలో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ పరీక్ష. అనంతరం పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. సివిల్స్‌ను జనరల్ కేటగిరి అభ్యర్థులకు నాలుగుసార్లు మాత్రమే రాసేందుకు అనుమతిస్తారు.
అర్హత : భారతీయుడై ఉండి, కనీసం ఏదైనీ డిగ్రీ పాసై ఉండాలి.
ఫీజు : రూ.50 సింగిల్ సెంట్రల్ రిక్రూట్‌మెంట్ స్టాంప్ (పోస్టాఫీసుల్లో లభ్యమవుతాయి) ద్వారా చెల్లించాలి.
ప్రిలిమినరీ : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 మార్కులకు జనరల్ స్టడీస్, 300 మార్కులకు ఆప్షనల్ పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు సమయం. మెయిన్స్‌కు అభ్యర్థులను వడకట్టటమే ప్రిలిమ్స్ ప్రధానోద్దేశం. ఆ ఏడాది అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్యకు సుమారు 12 నుంచి 13 రేట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. ఆప్షనల్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌కు జాబితాలో ఇచ్చిన 23 సబ్జెక్టుల్లో ఏదేని ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. జనరల్ స్డడీస్ పేపర్‌లో జనరల్‌సైన్స్, కరెంట్ ఈవెంట్స్ (జాతీయ, అంతర్జాతీయ అంశాలు), భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, భారత, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మెంటల్ ఎబిలిటిలపై ప్రశ్నలుంటాయి.
మెయిన్స్ : మెయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. అన్నీ వ్యాసరూప పద్ధతిలో రాయాలి. ప్రతి పేపర్‌కూ మూడు గంటల సమయం కేటాయిస్తారు.
ఆప్షనల్ సబ్జెక్ట్స్ : అగ్రికల్చర్, యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, ఎటక్ట్రికల్ ఇంజనీరింగ్, జాగ్రఫీ, జియాలజీ, ఇండియన్ హిస్టరీ, లా, గణితం, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటకల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ, ఆంత్రోపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, హిస్టరీ, మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, కింది భాషా సాహిత్యాల్లో ఏదేని ఒకటి-అరబిక్, అస్సామీ, బోడో, బెంగాలి, చైనీస్, డొగ్రి, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మళయాళం, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పాలి, పర్షియన్, పంజాబి, రష్యన్, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళ్, తెలుగు, ఉర్దూ.
మెయిన్స్ పేపర్లు : 1.పేపర్-1 రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఏదేని ఒక భారతీయ భాష (300 మార్కులు)
2.పేపర్-2-ఇంగ్లీష్ (300 మార్కులు)
3.పేపర్-3-ఎస్సే (200 మార్కులు)
4.పేపర్-4,5-జనరల్ స్డడీస్ (ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
5.పేపర్-6,7,8,9 పైన తెలిసిన ఆప్షనల్ జాబితాలోని అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఏవేని రెండు సబ్జెక్టులు (ప్రతి సబ్జెక్టుకూ రెండు పేపర్లు. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు)
అనుమతి లేని కాంబినేషన్లు : 1.పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
2.కామర్స్ అండ్ అకౌంటెన్సీ-మేనేజ్‌మెంట్
3.ఆంత్రోపాలజీ-సోషియాలజీ
4.మ్యాథమెటిక్స్-స్టాటిస్టిక్స్
5.అగ్రికల్చర్-యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్
6.మేనేజ్‌మెంట్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
7.ఇక ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో...సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వీటిలో ఒకటి కంటె ఎక్కువ సబ్జెక్టులను ఎంపిక చేసుకోరాదు.
8.యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్-మెడికల్ సైన్స్
ఇంటర్వ్యూ : దీనికి 300 మార్కులు. ఇందులో ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుపై అభ్యర్థి అవగాహన, ప్రాముఖ్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు, వ్యక్తిగత అభిరుచులను అంచనా వేస్తారు.
Hi there, I enjoy reading all of your post. I wanted to write a little comment to support
ReplyDeleteyou.
Here is my web-site; phil cardellas mugshot
Thanks for sharing your thoughts about videoconferencing.
ReplyDeleteRegards
My web page Summitt Energy Solutions
A very helpful blog for New aspirants
ReplyDeleteReally Satisfied
Thanks for sharing this information with us, i always like to read these articles, cool..!
ReplyDelete24JobsExam Government Job website
Check 24JobsExam Placement Jobs
Visit here
SSC CGL Examination Information
UPSC Recruitment Career
Employment opportunities, Job Placement
Govt Jobs Recruitment Notification online application
Exam Result
Admit cards 2018
24Jobsexam.in
Careers News Update
Exams Notification Results
Click to Read more