Saturday, August 3, 2013

2013 సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల ||

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష - 2013 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. సివిల్ స‌ర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌, ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌కు ఎంపికైన అభ్యర్థుల వివ‌రాల‌ను ఆగ‌స్టు 2న క‌మిష‌న్‌ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. మే 26న నిర్వహించిన ఈ ప‌రీక్షకు దేశ‌వ్యాప్తంగా సుమారు 10 ల‌క్షల మంది అభ్యర్థులు హాజ‌రయ్యారు. వీరిలో 10 వేల మంది డిసెంబ‌రులో జ‌రగనున్న మెయిన్స్ ప‌రీక్షకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 వేల మంది అభ్యర్థులు హాజ‌ర‌వ్వగా సుమారు 500 మంది మెయిన్స్‌కు అర్హత సాధించిన‌ట్లు అంచ‌నా. గ‌త ఏడాది కంటే ఈ సంఖ్య అధికంగానే ఉంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ ఏడాది జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో క‌టాఫ్ మార్కులు 218 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. కేట‌గిరీల‌వారీగా క‌టాఫ్ మార్కులు ఓబీసీ 200, ఎస్సీ 186, ఎస్టీ 185, పీహెచ్1 160, పీహెచ్‌2 164, పీహెచ్‌3 111 గా ఉన్నాయ‌ని అంచ‌నా. ఈసారి ఫ‌లితాలు త్వర‌గా వెలువ‌డ్డాయ‌ని, మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కు కావాల్సినంత‌ స‌మ‌యం ల‌భించింద‌ని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ద్వారా ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌కు అభ్యర్థుల‌ను ఎంపిక చేసే విధానాన్ని ఈ ఏడాది కొత్తగా ప్రవేశ‌పెట్టారు. 


ఈనాడు సౌజన్యం తో...

Tuesday, June 11, 2013

ఇకపై సివిల్స్ మార్కులు కుడా ఆన్లైన్ లో...

                       ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలు(2012) రాసిన అభ్యర్థుల మార్కులను ‘యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్’(యూపీఎస్‌సీ) బయటకు విడుదల చేసింది. ఇలా అభ్యర్థుల మార్కులను బహిరంగంగా ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి. గత నెల వెలువడిన ఈ ఫలితాలతోపాటు, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలను, మార్కులను కూడా తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
 
                       ఈ వివరాల ప్రకారం.. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 1004 మంది అభ్యర్థుల్లో టాపర్(హరిత వి. కుమార్)కు 53 శాతం మార్కులు వచ్చాయి. 2,250 మార్కులకు హరిత 1,193 మార్కులు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన వి.శ్రీరామ్‌కు 51 శాతం మార్కులు(1,149), మూడో స్థానంలో నిలిచిన స్తుతి చరణ్‌కు 51 శాతం(1,148) మార్కులు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసమే ఇలా మార్కులను వెల్లడిస్తున్నారని సిబ్బంది, శిక్షణ శాఖ అధికారి ఒకరు అన్నారు. ఇక నుంచి ఇలాగే మార్కులను ఆన్‌లైన్‌లో వెల్లడించేందుకు కమిషన్ నిర్ణయించుకుందని తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ.. యూపీఎస్‌సీకి నోడల్ విభాగంగా పనిచేస్తుంది.
 
 
- సాక్షి సౌజన్యంతో..

Friday, March 15, 2013

.::: Stay on Civils 2013 Notification:::. యూపీఎస్సీ 2013 నోటిఫికేషన్‌ నిలిపివేత

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కు సంబంధించిన 2013 సివిల్స్ నోటిఫికేషన్‌పై ఆందోళనలు చెలరేగటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించింది. ప్రాంతీయ భాషలకు విఘాతం కలిగేలా నిబంధనలు రూపొందించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజల నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
Related Posts Plugin for WordPress, Blogger...