సివిల్స్ ఔత్సాహికులు తమ విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా మొట్టమొదటిగా సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన ఏర్పరచుకుని లోకజ్ఞానం పెంచుకోవాలి. దీనికోసం న్యూస్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియోలోని చర్చా కార్యక్రమాలు అనుసరించడం, దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం లాభిస్తుంది.
అదే విధంగా పుస్తకాల్లో చదివే అంశాలను సమాజంలోని పరిస్థితులతో అన్వయం చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది. వీటితోపాటు సివిల్స్‌కు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా అట్లాస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. సివిల్స్ విషయంలో తార్కిక ఆలోచన నైపుణ్యం ఎంతో అవసరం దీన్ని పెంపొందించుకోవాలి. నేను తెలుగు మీడియంలో పరీక్ష రాశాను. అందువల్ల నాకు తెలియని సాంకేతిక పదాలకు అర్థాలు అన్వేషించి ఒక జాబితాగా రూపొందించుకున్నాను.
ఇక.. గత ఏడాది నుంచి ప్రారంభించిన రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్) ఇంజనీరింగ్, మ్యాథ్స్ అభ్యర్థులకే అనుకూలం అనే అపోహ వీడి చదవాలి. సిలబస్ విస్తృతంగా ఉందనే భయాన్ని వదిలి ఇష్టపడి చదవాలి. ఎన్ని గంటలు చదివామనేది? కాకుండా.. చదివిన కొద్ది సమయమైనా కాన్‌స్టెంట్‌గా, కాన్‌సన్‌ట్రేషన్‌తో చదవాలి.
---x-x-x-x---
ఆల్ ది బెస్ట్
-సీహెచ్‌వీఏ నాయుడు (ఐపీఎస్ ట్రైనీ),
సివిల్స్ 2010 విజేత
Courtesy:Sakshi
సివిల్స్ 2010 విజేత
Courtesy:Sakshi
oh ,yes . the post is cool
ReplyDeletei like it ,thank you so much ..
ReplyDelete