జనరల్ స్టడీస్..ఈ పేరు, పేపర్ పలు విద్యాఉద్యోగ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సివిల్స్, గ్రూప్స్, జూనియర్ లెక్చరర్స్, ఎస్సై, కానిస్టేబుల్స్...ఇలా అనేక పరీక్షల్లో అభ్యర్థులు రాయాల్సిన కామన్ పేపర్ జనరల్ స్టడీస్. ఇందులో ఏ..ఏ..అంశాలు వస్తాయి. దీని పరిధి ఏంటి ! సివిల్స్‌కు, కానిస్టేబుల్స్‌కు ఒకే విధంగా ప్రిపేరవ్వాలా ! వంటి సందేహాలను తీర్చడానికి
ఇక్కడ అనేక విషయాలు ఇస్తున్నాం...
ఏ పోటీ పరీక్ష పరీక్షకైనా విద్యార్థి సిద్ధమవ్వాలంటే...మూడంచెలను పాటించాలి.
1.సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2.పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన తీరును అవగాహన చేసుకోవాలి. 3.సిలబస్‌లోని అన్ని జనరల్ ఏరియాస్ చదవటంతోపాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నల ఆధారంతో) దృష్టి పెట్టాలి.
------------------------------- @@@@@ ---------------------------
సివిల్స్‌కైనా, కానిస్టేబుల్ పరీక్షకైనా ఇదే విధానం వర్తిస్తుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందుగా జనరల్ స్టడీస్‌లో ఏ విషయాలు వస్తాయి. వాటని ఎలా అధ్యయనం చేయాలన్నది తెలుసుందాం.
ఇందులో వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ-పాలన, జనరల్ సైన్స్, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు...వీటన్నింటినీ చదివి, అర్థం చేసుకొని, ప్రతీదాంట్లో ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి ! తార్కికంగా చూసినా ఉన్న మార్గం - ట్రెండ్స్‌కు గుర్తించి, అనుసరించటమే. అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరి సివిల్స్, గ్రూప్స్‌లో జనరల్ స్టడీస్ ప్రశ్నలను ఊహించటం కష్టమే. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తులో ప్రశ్నలను ఊహించలేం.
ముఖ్యంగా మన జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కొన్ని ప్రశ్నల్ని సెట్ చేస్తారు. రీజనింగ్ విభాగమూ ఉంటుంది. అంటే వీటిని ముందుగా అర్థం చేసుకోవటం కష్టం. పేపర్ సెట్ చేసిన వారి ఉద్దేశం...సమాధానాన్ని కనిపెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనే ఎత్తుగడ. ముఖ్యంగా ఈ తరహా సివిల్స్, గ్రూప్స్‌లో కనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్స్, విఆర్‌ఓ, విఆర్‌ఎ, గ్రూప్-డి స్థాయి ఉద్యోగాల్లో జనరల్ స్టడీస్ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది.
భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ....మొదలైనవి అందరూ చదవాల్సిన అంశాలు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఈ విషయాల్లో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇక ట్రెండ్స్ విషయానికొస్తే...వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, వీటికి తగిన నిర్వచనం ఇవ్వలేం. సిలబస్ అంటూ పేర్కొనలేం. గత సంవత్సరకాలంగా జరిగిన వర్తమాన వ్యవహారాలు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, పేరొందిన పథకాలు, వివిధ నివేదికలు, వాటి ప్రస్తావనలు, కమిషన్లు, దేశంలోని జరిగిన ముఖ్య సంఘటనలు...ఇలాంటివెన్నో. దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన విషయాల్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విభాగంలో మనం ఎంత సాధిస్తే అంత మంచిది. మంచి స్కోరింగ్‌కు అవకాశముంది. మోడల్ పేపర్లు సాధన చేస్తే అవగాహన వస్తుంది. గ్రిప్ దొరుకుతుంది.
------------------------------ @@@@@@@@ --------------------------
సివిల్స్, గ్రూప్స్‌కు సిద్ధమయ్యేవాళ్లు, తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి.
అవి...
- ఎన్‌సిఈఆర్‌టి ప్రాథమిక పుస్తకాలు,
- తెలుగు అకాడమీ ప్రచురణలు,
- హ్యుమానిటీస్ (ఇండియన్ పాలిటీ, సోషియాలజీ)లలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు,
- తెలుగు, ఆంగ్ల వార్తపత్రికలు,
- పబ్లికేషన్స్ డివిజన్ 'ఇండియా ఇయర్‌బుక్',
- తెలుగు, ఇంగ్లీష్‌లలో ప్రచురితమయ్యే 'యోజన'.
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంశాలతో తేలిగ్గా పరిచయం పెంచుకోవచ్చు. ముఖ్యంగా సివిల్స్ పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్-2లో కొన్ని విషయాలపై ప్రశ్నలుంటున్నాయి. అవి...
- కాంప్రహెన్షన్,
- ఇంటర్ పర్సనల్ స్కిల్స్,
- కమ్యూనికేషన్ స్కిల్స్,
- లాజికల్ రీజనింగ్,
- అనలిటికల్ ఎబిలిటి,
- డెసిషన్ మేకింగ్,
- ప్రాబ్లమ్ సాల్వింగ్,
- జనరల్ మెంటల్ ఎబిలిటి,
- బేసిక్ న్యూమరసీ (పదో తరగతి స్థాయి),
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ( పదో తరగతి స్థాయి).
గత ఏడాది కాంప్రహెన్షన్ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యధావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు. కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడి వుంటుంది. అంటే ఇప్పటి పరిస్థితులతో అప్లై చేసి అడుగుతారు. ఈ పేపర్లో మంచి స్కోరింగ్ చేయాలంటే...కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో అడిగే అంశాలన్నింటిలో పట్టు సాధించటం సాధ్యం కాదు. అందుకని గరిష్ట మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయకంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పరిష్టపరుచుకోవడం మంచింది. ఈ సూత్రం అన్ని రకాల పరీక్షలు రాసే అభ్యర్థులకు వర్తిస్తుంది. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మన సమయాన్ని, శక్తిని వృధా చేసే వాటి నుంచి తప్పుకోవటం తెలివైన పని. లక్ష్యసాధనకు సులువైన పని.
క్వాంటిటేటివ్ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం జాతీయ స్థాయి పరీక్షల్లో కొంచెం కష్టమే. వీటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు సాధనతో ఈ కష్టమైన అంశాన్ని సలభతరం చేసుకోవచ్చు. ఈ విభాగాన్ని సెట్ చేయడం వెనుకున్న ఉద్దేశం...అభ్యర్థి సమయాన్ని హరించటమే. సరైన సాధన ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. వీలైనంత ఎక్కువ స్కోరింగ్ చేస్తే విజయానికి దగ్గరవుతాం. ఇంగ్లీష్‌పై పట్టులేనివారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పదో తరగతి లోపే ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అలాగే సిలబస్‌లో లేని అంశాలపై లోతైన అధ్యయనం చేయటం వృధా. మన ప్రిపరేషన్ క్లిష్టంగా మారుతుంది.
అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు :
- ఆర్థమెటిక్‌లో ప్రాథమిక పుస్తకాలు.
- మౌలిక విషయాలు తెలిపే ఇంగ్లీష్ బుక్స్,
- ఇగ్నో ప్రచురించిన ఫంక్షనల్ ఇంగ్లీష్ పుస్తకాలు,
- బ్యాంకింగ్ పరీక్షల పాత మోడల్ పేపర్లు,
- ఇంగ్లీష-తెలుగు నిఘంటువు.
ఏ ఉద్యోగ పరీక్ష అయినా అడిగే విధానం ఒకేవిధంగా ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయి వేరు వేరుగా ఉంటుంది. సమయ నిర్వహణపై సాధన లేకుండా ప్రశ్నలను ఎదుర్కొనలేం. కాబట్టి మోడల్ పేపర్లు సాధన చేయాలి. తద్వారా సబ్జెక్‌పై, ప్రశ్నలపై అవగాహన ఏర్పడుతుంది. మనం ఇంకా ఎలా సిద్ధమవ్వాలి అన్నది తెలుస్తుంది.
No comments:
Post a Comment