Wednesday, February 9, 2011

అంతర్జాతీయ పరిణామాలు

2010  జనవరి లో కొన్ని అంతర్జాతీయ పరిణామాలు

                                        జనరల్ స్టడీస్                                                                              

జనవరి 3: 
* బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంకల మధ్య బంగ్లాదేశ్‌లో ముక్కోణపు వనే్డ సీరిస్ ప్రారంభమైంది.
జనవరి 4: 
 మయన్మార్ దేశంలో 20 ఏళ్ళ తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ సైనిక అధికార ముఠాకు చెందిన జనరల్ ధాన్‌ష్వే ప్రకటించారు.
జనవరి 5:
* బ్లడ్ క్యాన్సర్ నివారణకు టీకాను కనుగొన్నట్లుగా బ్రిటీష్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
* ఈక్వెడార్ దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీగా వౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు రఫెల్ కొరియా తెలిపారు.
* నాసా ప్రయోగించిన కెప్టర్ టెలిస్కోప్ పూర్తిగా వేడిగా లేని, పూర్తిగా చల్లగా లేని నక్షత్రం చుట్టూ స్థిరంగా తిరిగే రెండు గ్రహాలను కనుగొన్నట్లు టెలిస్కోప్ చీఫ్ సైంటిస్ట్ బిల్ బొరుకే తెలిపారు.
* శ్రీలంక అత్యవసర పరిస్థితిని మరో నెలపాటు పొడిగించారు. 2005లో మాజీ విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్‌గమన్ హత్య తరువాత ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితిని గరిష్టంగా ఒక నెలపాటు మాత్రమే విధించవచ్చు.
జనవరి 6:
* జపాన్ ఆర్థిక మంత్రిగా గానాయోటాఖాన్‌ను ఆ దేశ ప్రధాని యోకియోహటోయామా నియమించారు.
జనవరి 7:
* ప్రపంచంలో అత్యంత పెద్ద హోటల్ రోజ్‌రెహాన్‌ను దుబాయ్‌లో ప్రారంభించారు.
* భారత సంతతికి చెందిన పర్యావరణ శాస్తవ్రేత్త సవన్నా స్టేట్ యూనివర్సిటీ కెనె్నత్ సజ్వాన్‌కు అమెరికా అధ్యక్షుని పురస్కారం లభించింది.
జనవరి 9:
* బ్రిస్సేన్ అంతర్జాతీయ టెన్నిస్ టైటిల్‌ను బెల్జియంకు చెందిన కిమ్‌క్లియ్‌స్టర్స్ గెలుపొందారు.
* స్విస్ కెమికల్ సొసైటీ ప్రదానంచేసే గ్రామాటికకిస్ నియోకాన్ అవార్డుకు ప్రవాస భారతీయుడు శివగురు జయరామన్ ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని ఫార్లోలో నార్త్ డకోటా స్టేట్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రం, మాలిక్యులర్ బయాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అవార్డు కింద 4850 అమెరికన్ డాలర్లు, డిప్లమా ప్రదానం చేస్తారు.
జనవరి 17: * పాకిస్థాన్‌లో అణ్వాయుధ స్థావరాలన్నింటిపై అమెరికా తన ఉన్నతశ్రేణి బృందం ‘క్రాక్ యూనిట్’తో భద్రతను ఏర్పాటుచేసింది.
* యునెస్కో ప్రధాన సంచాలకులు యురిన్‌బొకోవా ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీగా ఇగ్నోను ప్రకటించారు. 34 దేశాలనుంచి 30 లక్షల మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ ద్వారా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇగ్నో 1500 కోర్సులను అందిస్తోంది. విద్యకోసమే పరిమితమైన ఎడ్యుశాట్ ఉపగ్రహం ద్వారా ఇగ్నో చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు.
జనవరి 18:
* 67వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో జేమ్స్‌కామెరూన్ దర్శకత్వం వహించిన 3డి సినిమా ‘అవతార్’కు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ విభాగంలో రెండు అవార్డులు లభించాయి. 1997లో టైటానిక్ తర్వాత కామెరూన్‌కు రెండవసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఉత్తమ నటిగా సాండ్రా బుల్లక్, ఉత్తమ నటుడిగా జెఫ్‌బ్రిడ్జ్ అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డును అందుకున్న మార్టిన్ నిర్మాత మార్టిన్ స్కార్‌స్పీకు విశేష సేవలందించినందుకుగానూ సెసిల్.బి.డీమిల్లీ అవార్డు లభించింది.
* చిలీ దేశాధ్యక్షునిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెబాస్టియన్ పినెర రెండవసారి ఎన్నికయ్యారు.
జనవరి 19:
* చైనా పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి ఆనంద్‌శర్మ బీజింగ్ సమావేశంలో ప్రసంగించారు. ఎగుమతి, దిగుమతుల విషయంలో ఇరుదేశాలు సమన్వయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఎనిమిదవ సంయుక్త ఆర్థిక సంఘం చర్చల్లో భాగంగా షాంగై కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు యుజెంగ్‌షెంగ్, చైనా వాణిజ్యశాఖామంత్రి చెన్ డె మింగ్‌లతో ఆయన సమావేశమయ్యారు.
జనవరి 20:
* భారత్‌ను అభిమానిస్తున్న దేశాల జాబితాలో 71% ఓటుతో ఆఫ్గనిస్థాన్ అగ్రస్థానాన నిలిచినట్లు బీబీసి, ఏబిసీ, ఏఆర్‌డి అభిప్రాయ సేకరణలో వెల్లడైంది.
జనవరి 21:
* ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తింటే పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని, అలా అభివృద్ధిచెందిన బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాల అభివృద్ధిలో సహకరిస్తుందని, పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుందని డెన్మార్క్ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తలు తెలిపారు.
జనవరి 22:
* మలేషియా 8వ రాజ్యాంగ నియంత సుల్తాన్ ఇస్మాండి మరణించారు.
జనవరి 23:
* క్యోటో ఒప్పందంపై న్యూఢిల్లీలో జరిగిన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా దేశాల పర్యావరణ మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి డా.మన్మోహన్‌సింగ్ ప్రసంగించారు. వర్థమాన ఆర్థిక వ్యవస్థలు ఐకమత్యాన్ని కలిగి ఉండాలని, సుహృద్భావం పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
* అధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నికలను అంగోలా దేశం రద్దుచేసింది. ఇప్పటినుండి పార్లమెంట్‌లో పార్టీ మెజారిటీ ఆధారంగా అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.
* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంనుండి ట్విట్టర్ మెసేజ్ పంపిన తొలి ఫ్లైట్ ఇంజినీర్‌గా నాసాకు చెందిన టీమోతీ టీజెక్రీమర్ అరుదైన ఘనత సాధించారు.
జనవరి 24:
* అత్యంత ఆరోగ్యకరమైన రెస్టారెంట్‌గా బ్రిటన్‌లో ప్రవాస భారతీయుడు నిర్వహిస్తున్న ఇందాలీ లాంజ్‌కు బీబీసీ ఫుడ్ ఛానల్ పురస్కరం లభించింది.
* ప్రపంచ సామాజిక వేదిక సమావేశాలు బ్రెజిల్‌లోని పోర్ట్ అలెగ్రిలో ప్రారంభమయ్యాయి.
జనవరి 25:
* మహాత్మాగాంధీ 141వ జయంతిని పురస్కరించుకొని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నైరుతి ప్రాంతంలో ఉన్న హిల్‌క్రాఫ్ట్‌కు మహాత్మాగాంధీ జిల్లా అని నామకరణం చేశారు.
జనవరి 26:
లెబనాన్ రాజధాని బీరూట్ సమీపంలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-737-800 విమానం మధ్యదరాసముద్రంలో కూలిపోవడంతో 83 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది మరణించారు.
జనవరి 27:
* శ్రీలంక అధ్యక్షునిగా వరుసగా రెండవసారి మహేంద్ర రాజపక్సే విజయం సాధించారు. ఆయన 57.8% ఓట్లు సాధించారు.
* మీర్పుర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. జహీర్‌ఖాన్ 87 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి జట్టు విజయాన్ని చేకూర్చాడు. ఈ మ్యాచ్‌లో షాదత్ వికెట్ తీయడం ద్వారా హర్బజన్‌సింగ్ 600ల అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన మూడవ భారత క్రీడాకారునిగా చరిత్రకెక్కాడు. *

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...