యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం మెయిన్స్‌లో విజయాన్ని సాధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. తక్కువ సంఖ్యలో ఖాళీలు, నాణ్యత ఉన్న అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా సాగే రాత పరీక్ష పోటీ, అభ్యర్థి అంతరంగాన్ని అన్ని కోణాల నుంచి పసిగట్టే పర్సనాలిటీ టెస్ట్ వీటన్నింటినీ తట్టుకొని విజేతల జాబితాలో చోటును సాధించడం ఆషామాషీ కాదు. విజయవంతమైన ప్రణాళిక, సడలిపోని ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే వాతావరణం, చక్కగా సూటిగా విషయంలోకి వెళ్ళిపోయే మంచి స్టడీ మెటీరియల్ ఇవన్నీ సివిల్స్ విజయానికి అభ్యర్థి వేసుకోవాల్సిన పునాదిరాళ్ళు, సివిల్ సర్వీస్ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని తెలిసిందే. వాటిలో మొదటిదశ ప్రిలిమినరీ. ఒక అభ్యర్థి తన కెరీర్‌లో సివిల్స్ కోసం యత్నిస్తున్నప్పుడు మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాస్ కావడం మంచిది. మొదటిసారి మెయిన్స్ పరీక్షాపత్రాన్ని రాసే అనుభవం చేతికి అందుతుంది. ఎంతమంది బోధించినా, మనం రాస్తే వచ్చిన అనుభూతి రాదు. ప్రథమ పర్యాయంతోనే సివిల్స్ సర్వీస్‌లో విజేతలుగా నిలిచేందుకు అవకాశాలు తక్కువే కావచ్చుగాక, కానీ ప్రిలిమినరీ పాసయ్యేందుకు మాత్రం అభ్యర్థి తప్పకుండా పోరాటం చేయాలి. ముందే చెప్పినట్టు దీనివల్ల మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. ఇకపోతే, త్వరలో జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్ని మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యంవల్ల మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు పొరపాట్లు చేయకుండా ఈ అంశాలు పనికొస్తాయి. వీటికన్నా ముందు, అసలు, అభ్యర్థి తనకు సివిల్స్‌పై నిజమైన ఆసక్తి వుందా లేదా అన్నది తేల్చుకోవాలి. ఆసక్తిలేకుండా ఊరికే రాస్తూపోవడం శుద్ధ దండుగ.
అభ్యర్థికి సదరు పోటీ పరీక్షపై ఆసక్తి ఉందా? లేదా అన్నది ఈ క్రింది ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది.
* మీకు సివిల్ సర్వీస్ పరీక్షలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలుసా?
* సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్న వారినెవరినైనా కలిశారా?
* సివిల్ పోటీలో ఘనవిజయాన్ని సాధించిన అభ్యర్థుల వివరాలు చదివారా?
* సివిల్స్‌కు అవసరమైన కార్యప్రణాళికను రూపొందించుకున్నారా?
* సివిల్స్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకుంటున్నారా?
పై ఐదు ప్రశ్నల్లో దేనికీ జవాబు చెప్పలేని అభ్యర్థి రంగంలో ఉన్నా లాభం లేదు. ఎందుకంటే గుంపులో గోవిందా అన్నట్టు తానూ ఓ అప్లికేషన్ పారేశాడు కానీ సివిల్స్ అంటే ప్రాథమిక అవగాహన కూడా లేదన్నమాట. ఆ స్థాయి వ్యక్తులు సివిల్స్ సాధించగలగడం కలలోమాట.
ప్రశ్నల్లో కొన్నింటికైనా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగిన వారు మరింత వేగంగా విజృంభించాలి. అన్ని ప్రశ్నలకు సరిగ్గా జవాబులు చెబుతున్న అభ్యర్థి సివిల్స్ పోటీలో క్రమేపీ రాటు దేలగలడు - సందేహం లేదు. ఇప్పుడు విశే్లషించుకున్నట్టుగా, పై రెండు తరగతుల వారికీ మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది. ఈ ప్రశ్నలు అందుకు ఉపయోగపడతాయి.
* మీరు దినపత్రికలు, ఇతర ఉపయోగకరమైన మేగజైన్స్‌ను చదువుతున్నారా?
* టీవీలో కరెంట్ అఫైర్స్ క్రమం తప్పకుండా చూస్తున్నారా?
* బిబిసి వింటున్నారా?
* యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలు చదువుతున్నారా?
* ఏదైనా క్లిష్టమైన జాతీయ లేదా అంతర్జాతీయ సంఘటనపై చిన్న వ్యాఖ్యను వెంటనే రాయగలరా?
* ఇరాన్ - అమెరికా సంక్షోభంవంటి ఒక సుదీర్ఘమైన అంశంలో ఇమిడివున్న తేదీలు, వాటి వివరాలు, ప్రముఖుల కొటేషన్సు తిరిగి చెప్పగలరా?
పై ప్రశ్నల్లో అన్నింటికీ సరిగ్గా జవాబులు చెబితే ఇక ఆ అభ్యర్థి చివరి అవకాశంలోనైనా సివిల్స్ విజేతల జాబితాలో చేరిపోతాడు.
వీటికి సరిగ్గా జవాబులు చెప్పలేని వారు పోటీలో కొంత వెనుకబడి వున్నారని తెలుసుకోవాలి.
సమాచార సేకరణ: ప్రిలిమినరీ మొదటిసారి రాసే అభ్యర్థులకు పరీక్ష విధానంపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అదనపు సమాచారం కోసం వీళ్ళంతా పాకులాడుతారు. సీనియర్ల సలహాలు తీసుకుంటారు. అయితే వీటికి కూడా కొంత పరిమితి కావాలి. సమాచార సేకరణ మాత్రమే లక్ష్యంగా మారితే అది అభ్యర్థి విలువైన సమయాన్ని నిలువునా తినేస్తుంది. అలాగని మెళుకువలు తెలియకపోవడం మంచిది కాదు. అయితే సివిల్స్‌పై సకల అంశాన్ని డిగ్రీలో తెలుసుకోవడం మంచిది. అదీ కాకుంటే ప్రిలిమ్స్‌కన్నా కొద్ది నెలల ముందే సేకరణను మానుకోవాలి. ఎందుకంటే సీనియర్లు, నిపుణుల సలహాలు అన్నీ ఒకే దశలో ఉండవు. ఎక్కువ సలహాలతో అభ్యర్థి ఒరిజినల్ ఆలోచనా ధోరణి సైతం మరుగున పడే ప్రమాదం ఉంది. కొద్దిమంది నిపుణుల సూచనల్ని సీరియస్‌గా అభ్యర్థి, మిగతా అటెంప్ట్‌లలో కూడా వాటినే పాటించడం మంచిది.
స్థాయిని అంచనా వేసుకోవడం: తనపై తాను విశ్వాసం లేనివాడు ఎందుకు కొరగాడు. మరీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా అది సమయానికి విషమ ఫలితాలనిస్తుంది. అందువల్ల వాస్తవికాధారంగా అభ్యర్థి తనను తాను అంచనా వేసుకోవాలి. మిగతా అభ్యర్థులు ఏ స్థాయిలో ఉన్నారో నిర్మాణాత్మకంగా అంచనా వేసుకోవాలి. తన బలహీనతల్ని గుర్తించాలి. కొద్దిమందికి ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ విభాగమంటేనే భయం. మరికొందరు లెక్కలంటే ఆదుర్దాపడతారు. జాగ్రఫీ మరికొద్దిమందికి విసుగును తెప్పిస్తుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే అభ్యర్థి తనకు ఫలానా సబ్జెక్టుపై వున్న అయిష్టాన్ని ముద్రగా మలచుకోకూడదు. దాన్ని సాధించే దాకా విడిచిపెట్టకూడదన్న పట్టుదల చాకచక్యం - ఈ రెండింటితో కలగలిపి పయనించాలి. బాగా ఇష్టమయ్యే అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అది అసలుకే ఎసరుగా మారుతుంది. మరోమాట, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కన్నా పెద్ద ప్రాముఖ్యత ఆప్షనల్స్‌కు వుంటుంది. దీన్ని అభ్యర్థులు మొదటినుంచి గుర్తుంచుకోవాలి.
సమయానికి తగిన వ్యూహం: విజేతలుగా నిలచిన అభ్యర్థులంతా వివిధ పత్రికలకిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను చదవాలని సలహా ఇస్తుంటారు. దీనిలో వంద శాతం నిజముంది. అయితే విజేతల సలహాల్ని అభ్యర్థులంతా తు.చ. తప్పకుండా అనుసరించాలని ఏమీ లేదు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఎంతో విస్తృతమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే పరీక్షకు ప్రిపేరయ్యేందుకు తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వేళల్లో అభ్యర్థులు సమయానికి అనుగుణంగా తగు వ్యూహాల్ని తయారుచేసుకోవాలి. కొద్ది రోజుల్లో పరీక్ష ఉన్నప్పుడు నాణ్యమైన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవడంవల్ల మంచి ప్రయోజనాలుంటాయి. దాన్ని కూడా ఎంపిక చేసుకొని చదివితే మరీ మంచిది. ఎంపిక ప్రక్రియకూడా గుడ్డిగా రాయి విసరడం వంటిది కాదు. దీనికో శాస్ర్తియమైన విధానముంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ప్రశ్నాపత్రాల్ని అభ్యర్థి ముందు పెట్టుకోవాలి. ఏఏ విభాగాలనుంచి ఎలాంటి తీరుతెన్నులతో ప్రశ్నల్ని అడుగుతున్నారని మదింపు వేసుకోవాలి. అదే దారిలో తానూ పయనించాలి.
మానసిక స్థిరత్వం: ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగేవారు జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. సమకాలీన సమాజం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అన్ని పోటీ పరీక్షలు వేరు. సివిల్స్ వేరు. అందువల్ల విజయాన్ని సాధించే అభ్యర్థి కఠినమైన మానసిక స్థిరత్వాన్ని సాధించేందుకు కృషిచేయాలి. ఇది చెబుతున్నంత సులువుకాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. సివిల్స్‌లో విఫలమైనంత మాత్రాన జీవితమంతా చీకటి మాయమైపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. భయంకరమైన పరాజయానికి అభ్యర్థి తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. మానసిక స్థయిర్యం లోపిస్తే అభ్యర్థిలో అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ఇవి విజయపథంలో ముళ్లకంచెల్ని వేస్తాయి. అభ్యర్థికి పరీక్షలకన్నా ఎంతో ముందునుంచే ఎవరైనా తోడుగా ఉంటే మరీ మంచిది. అలాంటి వ్యక్తి నిరంతరం అభ్యర్థి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండాలి.
అభ్యర్థి ఎక్కడా నీరస పడిపోకుండా, నీరుకారి పోకుండా జాగ్రత్త వహించాలి. సివిల్స్‌లో నెగ్గిన అభ్యర్థులు తమ విజయానికి పరోక్ష కారణం కుటుంబం నుండి లభించిన ఆదరణేనని చెప్పడం వీరంతా గమనించే ఉంటారు.
సాంకేతిక దోషాలు: మొదటిసారి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు, ప్రశ్నపత్రం చివరన ఉండే సమాచారాన్ని భర్తీ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాంకేతిక లోపాలేర్పడి ప్రశ్నపత్రం ఇన్‌వాలీడ్‌గా మారుతుంది. అహోరాత్రులు శ్రమించినదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకని అభ్యర్థి సమాచార పత్రంలోని గళ్లను సూచనల్ని గమనిస్తూ నింపాలి. మరో అంశం. ప్రశ్నపత్రంలో కఠినంగా అనిపించే వాటిని చూసి అట్టే గాభరాపడకూడదు. ముందుగా, నిశ్చయంగా సరియైనవని తోచిన సమాధానాల్ని పూర్తిచేయాలి. వాటి సంఖ్యను మనసులో గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక రానివాటిని, మెల్లమెల్లగా సాధన చేస్తూ పోవాలి. ఇటీవలి కాలంలో ప్రిలిమనరీ ప్రశ్నల్ని చాలా చాకచక్యంగా రూపొందిస్తున్నారు. ప్రశ్నను అజాగ్రత్తగా చదివినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, అంతే సంగతులు. ఇవీ ప్రిలిమినరీ పరీక్షకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న సివిల్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రిలిమినరీ మొదటిసారికే క్లియర్ చేసుకుంటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
3ప్రాథమిక2 ప్రణాళిక ఎలా?: 2012 ప్రిలిమ్స్ పరీక్ష ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. నూతన విధానం ప్రవేశపెట్టాక గత ఏడాది జూన్ 12న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ)ని తొలిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సివిల్స్‌కు సిద్ధమవబోతున్నవారు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలో స్పష్టం చేసుకోవటానికి ఇదే తరుణం! విషయాలను స్థూలంగా ఆకళింపు చేసుకోవటంతోపాటు వాటిలోని సూక్ష్మ వివరాలను కూడా పట్టించుకోవాలి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానాన్ని విశే్లషిస్తే బోధపడే సారాంశమిది వచ్చే సంవత్సరం పరీక్షకు రూపొందించుకోవాల్సిన ప్రణాళిక తీరును. ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రణాళికను 2 అంశాలుగా విభజించాలి.

1. ఈ ఏడాది ప్రశ్నపత్రం ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక.
2. సాధారణ కార్యాచరణ ప్రణాళిక.
నిర్దిష్టంగా... పర్యావరణంపై సమాచారం సేకరించాలి. ప్రాథమిక అంశాలను పట్టించుకోవాలి. పర్యావరణం అంటే ఏమిటి అనే ప్రశ్న దగ్గరనుంచి ప్రారంభించి వౌలిక విషయాలను గ్రహించాలి. పునాదిని పటిష్ఠ పరుచుకుని, తర్వాత ఈ విభాగంలో వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వార్తలకెక్కిన ప్రతి సమాచారాన్ని సేకరించాలి. (ప్రాంతీయ సమాచారం అవసరం లేదు). ఈ అంశాలను ప్రాథమిక సమాచారానికి జోడించాలి. నిశజూజ్ఘ కూళ్ఘూ ఱ్య్యరీ నూ, సామాజిక రంగాలకు సంబంధించిన సాహిత్యాన్ని (్గఉది, బీహార్ నిర్మాణం మొదలైనవి) చదవాలి. ఒక్కో కార్యక్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమయిందీ మొదలైనవి విస్మరించకూడదు. ఒకసారి ఈ సమాచారం నమోదు చేసుకున్నాక వర్తమాన అంశాలను జోడించటం మొదలుపెట్టాలి. ఈ సందర్భంగా ఓ బంగారు సూత్రం గుర్తుంచుకోవాలి. సామాన్య మానవుణ్ణి ప్రభావితం చేసే ఏదైనా సివిల్ సర్వెంట్లకు ముఖ్యమే!
* పాలిటీ, హిస్టరీ, సైన్స్ మొదలైన విభాగాల్లో అందరూ పాటించే సన్నద్ధతనే సాగించాలి.
* మీ ఇంగ్లిష్ భాషానైపుణ్యాలను అంచనా వేసుకోండి. అవసరమనుకుంటే వాటిని మెరుగుపరచుకోండి. ఇది కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుందని గమనించాలి.
* ఇంటర్లో, డిగ్రీలో లెక్కలు సబ్జెక్టుగా గణితేతర విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
* ఈ సంవత్సరం మాదిరే వచ్చే ఏడాది కూడా ప్రశ్నల సంఖ్యా, క్లిష్టత స్థాయి అదే రకంగా ఉండొచ్చని భావించకూడదు. మార్పులకు సిద్ధపడి ఉండటం మేలు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది... ఇక్కడ అవసరమైనది త్యీౄఒ ళకళ పజళతీ. ముఖ్యాంశాల్లో ప్రతి ఒక్క కోణాన్ని దగ్గరగా గమనించి, క్షేత్రస్థాయలో పరిశీలన చేయటం.

ప్రయత్నాలు, వయోపరిమితిలో మార్పులు
------------------------------------------------------
పరీక్ష సంవత్సరం వయోపరిమితి ప్రయత్నాల సంఖ్య

1949-60 21-24 పరిమితి లేదు
1961-71 21-24 రెండుసార్లు
1972 21-26 రెండుసార్లు
1979-1986 21-28 మూడుసార్లు
1987-1989 21-26 మూడుసార్లు
1990 21-31 నాలుగుసార్లు
1999-ఇప్పటివరకు 21-30 నాలుగుసార్లు

సివిల్స్ పరీక్షలో మార్పులు
--------------------------------------
సంవత్సరం మార్పులు
--------------------------------------
1947 తప్పనిసరి (కంపల్సరీ) సబ్జెక్టుల ప్రవేశం
1948 ప్రపంచ చరిత్ర,
అంతర్జాతీయ న్యాయం సబ్జెక్టుల చేరిక
1961 ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ప్రవేశం
1966 ఆప్షనల్ సబ్జెక్టుల ప్రక్షాళన
1969 ఆధునిక భారతీయ
భాషల సాహిత్యం చేరిక
1979 ప్రిలిమ్స్ తొలిసారిగా ప్రవేశపెట్టారు
1987 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశం
1993 సబ్జెక్టుగా మెడికల్ సైన్స్ చేరిక