దేశంలోనే అత్యుత్తమ సర్వీస్ సివిల్ సర్వీసు. సమాజంలో మమేకమై ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ అపారమైన సేవలందించాలనుకునే అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ వారధిలా నిలుస్తుంది.
కార్యదీక్ష, కఠోర శ్రమ, సామాజిక, ఆర్థికాంశాలపై విస్తృతమైన అవగాహన, భారత రాజ్యాంగం తీరు తెన్నులు, తార్కిక విశే్లషణ, ఆలోచనా సామర్ధ్యం, నిర్ణాయక శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష వరంలా నిలుస్తుంది.
దేశంలోని వివిధ సర్వీసుల కింద ఉన్న అత్యుత్తమ ఉద్యోగాలకుగాను ఈ పరీక్షను నిర్వహిస్తారు. గత ఏడాది ఈ సర్వీసు కింద 880 మందిని ఎంపిక చేయగా ఆ సంఖ్య ప్రస్తుతం 1037కు పెరిగింది. సివిల్ సర్వీసెస్ కిందకు వచ్చే విభాగాలు :
* ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు
* ఇండియన్ ఫారెన్ సర్వీసు
* ఇండియన్ పోలీస్ సర్వీసు
* ఇండియన్ పి అండ్ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు (గ్రూప్-ఏ)
* ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ (గ్రూప్-ఎ)
* ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ)
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐటి) (గ్రూప్-ఎ)
* ఇండియన్ పోస్టల్ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ)
* ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు (గ్రూప్-ఎ)
* పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (గ్రూప్-ఎ)
* ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రూప్-ఎ, గ్రేడ్-3)
* ఇండియన్ కార్పొరేట్ ‘లా’ సర్వీసు (గ్రూప్-ఎ)
* ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసు (గ్రూప్-బి)
* ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డయుడామన్, దాద్ర అండ్ నగర హవేలీ పోలీస్ సర్వీసు (గ్రూప్-బి)
* పాండిచ్చేరి సివిల్ సర్వీసు (గ్రూప్-బి)
* పాండిచ్చేరి పోలీస్ సర్వీసు (గ్రూప్-బి)
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంనుంచి బ్యాచిలర్స్ డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెయిన్ పరీక్ష దరఖాస్తు సమయం నాటికి అభ్యర్థులు సంబంధిత సర్ట్ఫికెట్ పొంది ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. వయోపరిమితి: ఈ పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2012 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు చేసే విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: 50 రూపాయలు. చివరి తేదీ: మార్చి 5, 2012 పరీక్ష తేదీ: మే 20.
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్
పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. రెండు పేపర్లలోను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి.
పేపర్ 1: జనరల్ స్టడీస్, 200 మార్కులు
పేపర్2: జనరల్ ఆప్టిట్యూడ్ 200 మార్కులు
పేపర్-1 (సబ్జెక్టువారీ వెయిటేజి):
కరెంట్ అఫైర్స్:4 ప్రశ్నలు
హిస్టరీ:13 ప్రశ్నలు
జాగ్రఫీ: 8 ప్రశ్నలు
పాలిటీ: 14 ప్రశ్నలు
ఎకానమీ: 22 ప్రశ్నలు
ఎకాలజీ: 18 ప్రశ్నలు
జనరల్ సైన్స్: 21 ప్రశ్నలు
పేపర్-2 (సబ్జెక్టువారీ వెయిటేజి)
కాంప్రహెన్షన్: 27 ప్రశ్నలు
డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్: 8 ప్రశ్నలు
జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ: 28 ప్రశ్నలు
అనలిటికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్: 8 ప్రశ్నలు
ఇంగ్లీష్ లాంగ్వేజి కాంప్రహెన్షన్: 9 ప్రశ్నలు
సిలబస్
కరెంట్ అఫైర్స్: చరిత్ర, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, ఎకాలజీ తదితర అంశాలపై పేపర్-1 ఉంటుంది.
జనరల్ ఆప్టిట్యూడ్: ఇక పేపర్-2లో కాంప్రహెన్షన్, ఇంటర్ ప్రిటేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లీషు లాంగ్వేజి కాంప్రహెన్షన్ స్కిల్స్ తదితర అంశాలను పొందుపరచడం జరిగింది.
ప్రిపరేషన్ ఇలా: కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చోటుచేసుకున్న సంఘటనలు తాజా సమాచారంతోపాటు సంబంధిత నేపథ్యంపై పట్టు సాధించాలి. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై కూడా దృష్టి సారించాలి. అలాగే సదస్సులు, సమావేశాల్లో విడుదల చేసిన డిక్లరేషన్లు వంటి టైటిళ్లు, ఇతర అన్ని రంగాలలో జరిగిన, జరుగుతున్న మార్పులు, సంఘటనలను ప్రతి అంశాన్నీ విడిచిపెట్టకుండా సాధన చేయాలి.
రిఫరెన్స్ బుక్స్:
కాంపిటీషన్ విజర్డ్, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, యోజన, ఎకనమిక్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే.
చదవాల్సిన పుస్తకాలు:
* ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాలు
* తెలుగు అకాడమీ చరిత్ర పుస్తకాలు
* మోడ్రన్ ఇండియా-బిపిన్ చంద్ర
* మిడీవల్ ఇండియా- సతీష్ చంద్ర
* ఏనె్షంట్ ఇండియా-ఆర్.ఎస్.శర్మ
* ఇండియన్ ఇయర్ బుక్
* ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్
* ఇండియన్ ఎకానమీ-మిశ్రా
* ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్-ఎంఎల్‌జింగస్
* ఇండియన్ ఎకానమీ-దత్
* ఇండియన్ ఎకానమీ- కపిల ఉమ
* ఎ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్
* అనలిటికల్ రీజనింగ్
* సైన్స్ రిపోర్టర్, వివిధ జాతీయ దినపత్రికల్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, విశేషాలు.
ప్రిపరేషన్ ఇలా:
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యమైనది కాదో అర్ధం కాక అభ్యర్థులు ఇబ్బంది పడుతూంటారు. అందువల్ల గతంలో ఇచ్చిన సివిల్స్ ప్రశ్నా పత్రాలను సేకరించుకుని అందులో వచ్చిన మాదిరి ప్రశ్నలను అధ్యయనం చేయడం అవసరం. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఆయా సంఘటనల మూలాన్ని కూడా గమనించాలి. అలాగే కరెంట్ ఎఫైర్స్ కోసం అభ్యర్థులు ఎక్కడి వరకు సంఘటనలను కరెంట్ అఫైర్స్ కోసం చదవాలో తెలియక ఇబ్బంది పడతారు. అయితే పరీక్ష తేదీనుంచి ఒక ఏడాది ముందు కాలం వరకు సంఘటనలను తెలుసుకుంటే సరిపోతుంది. ఇక స్టాండర్డ్ జీకే విషయంలో తేదీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్దేశిత వరుస క్రమానికి ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ అన్ని రంగాలలో చోటు చేసుకునుంటాయి. అందువల్ల ఆయా రంగాలలోని మూలాలనుంచి అంశాలను అధ్యయనం చేయడంవల్ల ఆ విషయ పరిజ్ఞానం, భవిష్యత్తులో జరగబోయే మెయిన్ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
సలహాలు సూచనలు:
*జీవ శాస్త్రంలో ప్రాధమిక విషయాలపై పట్టు సాధించిన అభ్యర్థులకే ఎకాలజీలో అంశాలు బాగా అర్ధమవుతాయి. ఈ విషయాన్ని గుర్తించి ఎకాలజీలోని అన్ని అంశాలను 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టి పుస్తకాల ద్వారా అభ్యాసంచేయాలి.
*ఇక ఎకానమీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టి పదకొండవ తరగతికి చెందిన 3ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌తోపాటు తెలుగు అకాడమీకి చెందిన 3్భరత ఆర్థిక వ్యవస్థకు చెందిన పుస్తకాలు చదువుకోవాలి. వీటితోపాటు సిలబస్‌లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే 3యోజన2, 3కురుక్షేత్ర2 వంటి మ్యాగజైన్లు చదువుకోవడం ఉపయుక్తం కాగలదు.
*జనరల్ సైన్స్‌కు సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి ప్రాధమిక సబ్జెక్టులతోపాటు టెక్నాలజీకి సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. సైన్స్ సబ్జెక్టులు చదవని అభ్యర్థులు సైన్సు సబ్జెక్టుని నిర్లక్ష్యం చేస్తారు. సైన్సు పదాలను గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడతారు. అయితే బేసిక్స్‌పై పట్టు సాధించినపుడే పదాలను గుర్తుంచుకోవడం సులభమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏ విభాగాన్నీ వదిలిపెట్టక పోవడం చాలా శ్రేయస్కరం కాగలదు.
*పాలిటీ విషయంలో రాజ్య వ్యవస్థతోపాటు దానిని ప్రభావితం చేసే పాలనా యంత్రాంగంపై కనీస అవగాహన ఉండాలి. అలాగే ఈ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారని గ్రహించి, ఆ మేరకు చదువుకోవడం ఉత్తమం.
* హిస్టరీకి సంబంధించి ఆధునిక చరిత్రపై ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా జాతీయోద్యమం, దానికి సంబంధించిన అన్ని మూలాలను గురించి క్షుణ్ణంగా చదువుకోవాలి. అలాగే ఏనె్షంట్, మిడీవియల్ హిస్టరీకి చెందిన కళలు, సాహిత్యం, ఉద్యమాలు, రాజకీయ సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
*జాగ్రఫీలో ప్రాధమిక అంశాలతోపాటు ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, విధానాలు, సమస్యలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో నెగ్గుకు రావడం తేలికేనని గుర్తించాలి.
*అభ్యర్థుల్లో నిర్ణాయక శక్తిని, సమస్యను గుర్తించే లక్షణాన్ని డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో గమనిస్తారు. అలాగే తార్కికంగా విశే్లషించే సామర్ధ్యాన్ని లాజికల్ రీజనింగ్ విభాగంలో గమనిస్తారు. ఈ రెండు విభాగాలలో రాణించాలంటే గ్రాహణ శక్తి, సమయ స్పూర్తితోపాటు పర్సనల్ స్కిల్స్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
*అభ్యర్థులలోని మేథో సామర్ధ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ విభాగానికి సంబంధించి ఈక్వేషన్స్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, కౌంటింగ్ టెక్నిక్స్, ప్రాబబిలిటీ, నంబర్స్ లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి.
*నిర్దేశిత విషయంపై అభ్యర్థికున్న అవగాహన ఏపాటిదో కాంప్రహెన్షన్ విభాగంలో నిర్ణయిస్తారు. ఈ విభాగంలో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్, ఇచ్చిన విషయంలో సారాంశాన్ని వెంటనే గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. ఇంగ్లీషుపై ప్రాధమిక పరిజ్ఞానంతోపాటు వేగంగా చదివి అర్ధం చేసుకునే లక్షణాలుండాలి.
*ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు రాబట్టేందుకు వేగం ఖచ్చితత్వం చాలా అవసరం. సబ్జెక్టుపై పట్టు, వీలైనన్ని మాక్ టెస్టులు చేయడంవల్ల ఆత్మవిశ్వాసం పెరిగి సమాధానాలు రాబట్టే ప్రక్రియలో వేగం పెరుగుతుంది. కనక నిరంతర అభ్యాసంతోనే వేగం, ఖచ్చితత్వం ఏర్పడతాయన్న విషయాన్ని గుర్తించి పరీక్షకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
Very useful information.thank you. Ee books ekkada dorkutayo cheppagala ra pls .nenu degree final year chadivutunanu. Naaku civils ante chaala istam so ipatnunchi prepare avvalanukuntunnau,mi sahayam andhichagalara pls pls pls.this is PASUPATHI from madanapalli.pasupathimadaka@gmail.com
ReplyDeleteplease visit www.menavachaitanyam.blogspot.com for GROUPS, DSC, TET, and other Competitive exams Study Materials, Practice papers
ReplyDelete