(ఈ సమాచారం ముందుగానే ప్రచురించాల్సి ఉంది. సమయం కేతాయిన్చాలేకపోవడం వల్ల ఇప్పుడు రాస్తున్నాను. తెలియని అభ్యర్థులకు ఉపయోగకరం.)
సివిల్ సర్వీసు అభ్యర్ధులు తమ మాతృభాషలోనే మౌఖిక పరీక్షలకు హాజరుకావచ్చు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన పరీక్షను ఆంగ్లంలో రాసిన అభ్యర్ధులు కూడా మౌఖిక పరీక్షకు అంగ్లం కానీ, హిందీ కానీ లేదా ఇతర భారతీయా భాషల్లో ఏద్యినా ఎంచుకోవచ్చు. కానీ అది రాతపరీక్షలో భాగంగా కచ్చితంగా ఎంచుకోవలసిన భారతీయ భాషే అయ్యుండాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముంబై హైకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో స్పష్టం చేసింది. ప్రధానపరీక్షను ఆంగ్లంలో రాస్తే మౌఖిక పరీక్ష కూడా అదే భాషలో ఉండాలన్న యూపీఎస్ సీ నిబంధనను సవాలు చేస్తూ చిత్తరంజన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా యూపీఎస్ సీ ఈ ప్రమాణపత్రాన్ని కోర్టుకు అందచేసింది. ఈ వివాదానికి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులనే తాము అందచేసిన ప్రమాణపత్రంలో పేర్కొన్నట్లు యూపీఎస్ సీ తెలిపింది. అయితే ఆ సిఫార్సులను ఆమోదించిన కమిషన్ సలహాలు, సూచనలు అందచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమేకాక అవసరమైన మార్పులు చేసి అమలుచేస్తామని కోర్టుకు తెలిపింది.
santhosham...
ReplyDeleteGood sir
ReplyDeleteGood sir
ReplyDelete