జీ-20 సదస్సులో పాల్గొననున్న మోదీ
అర్జెంటీనా
రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర
మోదీ పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీ-20 దేశాల
శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : నవంబర్ 30, డిశంబర్
1
ఎక్కడ : బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
పాకిస్థాన్‌లో ‘కర్తార్‌పూర్’కు
శంకుస్థాపన
సిక్కు
యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్థాన్‌లో పంజాబ్‌లోని
నరోవాల్ జిల్లా శాఖర్‌గఢ్
వద్ద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 28న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్
మాట్లడుతూ... పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు,
సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని
చెప్పారు. భారత్‌లో కర్తార్
పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నవంబర్ 26న శంకుస్థాపన
చేశారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న
కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారను, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారను కలుపుతూ నాలుగు కిలో మీటర్ల రహదారిని
అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాకిస్థాన్‌లు కలిసి
నిర్మిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌కు
శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : శాఖర్‌గఢ్, నరోవాల్
జిల్లా, పంజాబ్ , పాకిస్థాన్
తూర్పు ఆసియా దేశాల
సదస్సులో పాల్గొన్న మోదీ
సింగపూర్‌లో జరుగుతున్న 13వ తూర్పు ఆసియా దేశాలసదస్సు(ఈఏఎస్)లో
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న పాల్గొన్నారు. ఈ
సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వ్యూహాత్మక
ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య
వికేంద్రీకరణ కీలకమని చెప్పారు.
మరోవైపు ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన
తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు
జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో
గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్
కాలేజ్ బృందాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో
పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : నవంబర్ 15
ఎక్కడ : సింగపూర్
డిసెంబరు 23న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు
బంగ్లాదేశ్‌లో డిసెంబరు 23న 11వ సార్వత్రిక
ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ ఎన్నికల ప్రధానాధికారి నరుల్ హుడా
నవంబర్ 8న ప్రకటించారు. దేశంలోని మొత్తం 10.42 కోట్ల ఓటర్లు 300 మంది పార్లమెంట్ సభ్యులను
ఎన్నుకోనున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పరిమిత సంఖ్యలో ఎలక్టాన్రిక్ ఓటింగ్ యంత్రాలను
వినియోగించనున్నారు. కనీసం వంద నియోజకవర్గాల్లో లక్షా యాభైవేల ఈవీఎంలను
వినియోగించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు
ఎప్పుడు : డిసెంబరు 23
ఎవరు : బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం
దీపావళి సందర్భంగా ఐరాస
స్టాంపుల విడుదల
దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు
తెలుపుతూ ఐక్యరాజ్యసమితి నవంబర్ 7న రెండు
స్టాంపులను విడుదల చేసింది. ఈ స్టాంపులలో ఒక దానిపై హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో
కూడి లైటింగ్‌లో ఉన్న ఐరాస ప్రధాన కార్యాలయం, మరోక దానిపై
దీపాలు ఉన్నాయి. 1.15 డాలర్ల విలువైన ఈ స్టాంపులను
అంతర్జాతీయ ఎయిర్‌మేల్ లెటర్లకు ఉపయోగించుకోవచ్చు. ‘హ్యాపీ
దీవాళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే వెలుగుల
పండుగ సందర్భంగా యూన్ స్టాంప్స్’ అని ఈ సందర్భంగా ఐరాస
ట్వీట్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీపావళి సందర్భంగా రెండు స్టాంపులు విడుదల
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ఐక్యరాజ్యసమితి
సింగపూర్ ఫిన్‌టెక్
ఫెస్టివల్లో పాల్గొన్న మోదీ
సింగపూర్‌లో జరిగే ప్రపంచవ్యాప్త అతిపెద్ద
ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల సమ్మేళనం ‘ఫిన్‌టెక్ ఫెస్టివల్’ కార్యక్రమంలో ప్రధాని
నరేంద్ర మోదీ నవంబర్ 14న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ
మాట్లాడుతూ భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతగానో
అభివృద్ధి చెందుతోందన్నారు. పెట్టుబడులకు భారత్ ఇష్టమైన గమ్యంగా మారుతోందని
చెప్పారు. 2016 నుంచి ఈ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను
నిర్వహిస్తున్నారు.
అపిక్స్ అప్లికేషన్
ఫిన్‌టెక్ ఫెస్టివల్లో భాగంగా
అపిక్స్(అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఎక్స్ఛేంజ్)ను సింగపూర్ ఉప ప్రధాని
షన్ముగరత్నంతో కలిసి మోదీ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలను
చేరువ చేసేందుకు వర్చుసా కంపెనీ అపిక్స్ను రూపొందించింది. అపిక్స్ ద్వారా దేశీయ
కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంస్థలతో సులువుగా అనుసంధానం చేసుకోవచ్చు.
భారత్ సహా 23 దేశాల ప్రజలకు ఈ అప్లికేషన్ అందుబాటులో
ఉంటుంది. మరోవైపు మోదీ ఈ పర్యటనలో భాగంగా తూర్పు ఆసియా సదస్సు, ఆసియాన్-భారత అనధికారిక సమావేశంలో పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సింగపూర్
పారిస్‌లో మొదటి ప్రపంచ
యుద్ధ సంస్మరణ కార్యక్రమం
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 2018, నవంబర్11
నాటికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల
అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు.
అమెరికా, రష్యా, ఫ్రాన్స్,
టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు,
రెసెప్ తయి్యప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్
లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల
ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని
చాంప్స్-ఎలెసైస్లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి
ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా నవంబర్ 11 ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11
గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు
కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి
పైగానే గాయపడ్డారు. నవంబర్ 11న మేక్రాన్ సారథ్యంలో
దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్
సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి
నడకన వెళ్లారు.
ఫ్రాన్స్
జాతీయగీతంతో ప్రారంభం :
నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్
జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400
మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా
కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి,
మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను
చదివి వినిపించారు.
జాతీయవాదం
వెన్నుపోటు వంటిది...
ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు
మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం
వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు..
అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను
పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి
వ్యాఖ్యానించారు.
మోదీ నివాళి
:
భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు
జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని
నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా
పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల
పోరాడారు’ అని అన్నారు. ‘తొలి
ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం,
సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి
ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ
తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి
ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో
కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం
ఎప్పుడు : నవంబర్ 11న
ఎవరు : ప్రపంచ దేశాల అధినేతలు
ఎందుకు : మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికులకు ఘనంగా
నివాళులు
ఎక్కడ : పారిస్
ఇరాన్‌పై ఆంక్షలు
విధించిన అమెరికా
బ్యాంకింగ్, ఇంధన రంగాలు లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై నవంబర్ 5న ఆంక్షలను విధించింది. ఇరాన్‌కు చెందిన 600
కంపెనీలు, వ్యక్తులతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని
ప్రపంచదేశాలకు అమెరికా స్పష్టం చేసింది. వీరితో వ్యాపార లావాదేవీలు నడిపే సంస్థలు,
వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, భారీ
జరిమానాలు విధిస్తామని తెలిపింది. అయితే ఇరాన్ నుంచి భారీగా ఇంధనం కొనుగోలు
చేస్తున్న చైనా, భారత్, టర్కీ,
జపాన్, ఇటలీ సహా 8 దేశాలకు ఈ సందర్భంగా స్వల్ప మినహాయింపు ఇచ్చింది. ఇరాన్ నుంచి చమురు
దిగుమతులను 6 నెలల్లోగా పూర్తిస్థాయిలో నిలిపివేయాలని
సూచించింది.
సైబర్ దాడులు, క్షిపణి పరీక్షలు, మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న ఇరాన్ ప్రభుత్వాన్ని
దారిలోకి తెచ్చేందుకే ఈ ఆంక్షలను విధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్
పాంపియో ఈ సందర్భంగా తెలిపారు. 2015లో ఇరాన్‌తో రష్యా,
చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల సమక్షంలో అప్పటి
అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని మే నెలలో అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్ రద్దుచేశారు. కొత్త ఒప్పందం కోసం చర్చలకు రావాలంటూ గతంలో ఉన్న ఆంక్షలను
పునరుద్ధరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్‌పై
ఆంక్షలు విధింపు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : అమెరికా
పాకిస్థాన్-చైనాల మధ్య
బస్సు సర్వీసు ప్రారంభం
పాకిస్తాన్-చైనాల మధ్య విలాసవంతమైన బస్సు
సర్వీసును పాకిస్థాన్ అధికారులు నవంబర్ 6న ప్రారంభించారు. పాకిస్థాన్‌లో లాహోర్‌లోని గుల్బెర్గ్ నుంచి చైనాలోని
జిన్జియాంగ్ ప్రావిన్సులో కష్గర్ నగరానికి ఈ లగ్జరీ బస్సు బయలుదేరింది. దాదాపు 4.38 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపట్టిన చైనా పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో
భాగంగా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ‘షూజా ఎక్స్‌ప్రెస్’
అనే ప్రైవేటు సంస్థ ఈ మార్గంలో బస్సులను నడపనుంది. కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉండే ఈ బస్సు 36
గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)
మీదుగా ఈ సర్వీసు వెళ్లడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్-చైనాల మధ్య బస్సు సర్వీసు
ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : పాకిస్థాన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు ఒప్పందాలు
పరస్పర సహకారాన్ని పెంచుకునే లక్ష్యంతో భారత్, ఆస్ట్రేలియా దేశాలు ఐదు ఒప్పందాలు
కుదుర్చుకున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో
నవంబర్ 22న సంబంధిత పత్రాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
దివ్యాంగులకు సేవలందించడం, పెట్టుబడులు, శాస్త్రీయ తోడ్పాటు-నవకల్పనలు, సంయుక్త పీహెచ్డీ,
వ్యవసాయ పరిశోధనలు-విద్య అంశాలకు సంబంధించి ఈ ఒప్పందాలు
చేసుకున్నాయి.
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా
వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెర్త్‌లోని
వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మధ్య వ్యవసాయ పరిశోధనలు-విద్య అంశంలో
పరస్పరం సహకారానికి ఉద్దేశించిన ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
స్కాట్ మారిసన్‌తో సమావేశమైన కోవింద్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.
సిడ్నీలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, ఆస్ట్రేలియా
మధ్య ఐదు ఒప్పందాలు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్- ఆస్ట్రేలియా
ప్రధానమంత్రి స్కాట్ మారిసన్
ఎక్కడ : సిడ్నీ, ఆస్ట్రేలియా
సింగపూర్ రక్షణ
మంత్రితో నిర్మలా సమావేశం
సింబెక్స్ నావికా విన్యాసాల ముగింపు
కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్తో భారత రక్షణ
మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలో
నవంబర్ 20న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో
భారత్, సింగపూర్ రక్షణ బంధం మరింత దృఢమయ్యేందుకు దోహదపడే
డిఫెన్స్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(డీసీఏ)పై ఇరుదేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు.
పాతికేళ్ల ద్వైపాక్షిక బంధానికి ప్రతీకగా సింబెక్స్-2018
పేరుతో భారత్, సింగపూర్ దేశాలు విశాఖతీరంలో నావికా
విన్యాసాలను నిర్వహించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్తో
భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం
ఎప్పుడు : నవంబర్ 20
ఎక్కడ : తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
యుద్ధనౌకలపై భారత్, రష్యా మధ్య ఒప్పందం
భారత నావికా దళంకోసం దాదాపు రూ.3,500 వేల కోట్ల ఖర్చుతో రెండు యుద్ధ నౌకలు
నిర్మించేలా భారత్-రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన
ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, రష్యా
ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు నవంబర్ 20న ఈ
ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా భారత్‌లో 2
యుద్ధనౌకల నిర్మాణం కోసం జీఎస్‌ఎల్‌కు డిజైన్లు, సాంకేతికత,
ఇతర పరికరాలను రష్యా సరఫరా చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యుద్ధనౌకలపై భారత్, రష్యా మధ్య ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, రష్యా ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు
సింగపూర్ ప్రధాని లీ
సీన్‌తో మోదీ భేటీ
ఆసియాన్-ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు
రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 14న సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో భేటీ
అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సాంకేతికత, ప్రాంతీయ
అనుసంధానత, ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై ఇరుదేశాల
నేతలు చర్చించారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్
ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-ఓ-చాలతోనూ మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ ప్రధాని లీ సీన్‌తో భారత ప్రధాని
నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : నవంబర్ 14
ఎక్కడ : సింగపూర్
సీజీడీ నెట్వర్క్ పనులకు శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 18
రాష్ట్రాల్లో 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా
వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్వర్క్ పనులకు ప్రధాని
నరేంద్ర మోదీ ఢిల్లీలో నవంబర్ 22న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా
శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ రౌండ్ గ్యాస్ లెసైన్స్ బిడ్డింగ్‌ను
ప్రారంభించారు. ఈ 129 జిల్లాలను 50
జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు.
సీజీడీ నెట్వర్క్ పనుల శంకుస్థాపన
సందర్భంగా మోదీ మాట్లాడుతూ... స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో
పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంట వ్యర్థాలను
బయో-సీఎన్జీగా మార్చే 5వేల ప్లాంట్లను
ఏర్పాటుచేస్తామన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి
తెస్తామని తెలిపారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా
కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు
పేర్కొన్నారు.
10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా
నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ),
ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్),
మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను
ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో శంకుస్థాపనను
నిలిపివేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా
పెట్టుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్
సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్
ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ 22న కేంద్రప్రభుత్వం
తెలిపింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ
సరిహద్దు వరకు ఈ కారిడార్ ను ఏర్పాటుచేయనున్నారు. ఈ కారిడార్‌కు నవంబర్ 26న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శంకుస్థాపన చేయనున్నారు.
గురునానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం
తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కర్తార్‌పూర్‌ను భారత్ యాత్రికులు
వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్‌ను ప్రభుత్వం
ఏర్పాటు చేయనుంది. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కూడా
కారిడార్ నిర్మిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. భారత్-పాక్ అంతర్జాతీయ
సరిహద్దులకు పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల
దూరంలో కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస
విడిచిన ఇదేచోట తొలి గురుద్వారా ఏర్పాటైంది.
కేబినెట్ కమిటీ మరికొన్ని నిర్ణయాలు...
నవంబర్ 22న సమావేశమైన కేబినెట్ కమిటీ కర్తార్‌పూర్ కారిడార్
ఏర్పాటుతోపాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.
·
చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు.
·
ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం.
ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం
వంటివి ఇందులో ఉన్నాయి.
·
ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ
వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు.
·
ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు-2018కు ఆమోదం. బిల్లు ద్వారా
అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్
అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య
సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు
న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి.
·
అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే
ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20
శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్తార్‌పూర్‌కు
ప్రత్యేక కారిడార్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర
ప్రభుత్వం
ఎక్కడ : భారత్-పాకిస్థాన్
అంతర్జాతీయ సరిహద్దుల్లో
ఎందుకు : కర్తార్‌పూర్
సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు
అన్ని పాఠశాలల్లో ‘భాషా పరిచయం’
దేశంలోని
అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తప్పకుండా ‘భాషా పరిచయం’ కార్యక్రమంను అమలుచేయాలని కేంద్ర మానవ
వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 23న ఆదేశాలు జారీ చేసింది. దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహనను
కల్పించేందుకు భాషా పరిచయం కార్యక్రమంను ఎంహెచ్ఆర్డీ రూపొందించింది. ఈ
కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయిలోనే దేశ భాషలపై విద్యార్థులకు అవగాహన
కల్పిస్తే... ముఖ్యమైన పదాలపై కొంతమేర పట్టు రావడంతో పాటు జాతీయ సమగ్రత
పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రార్థన సమయంలో ఉచ్ఛారణ...
భాష పరిచయం కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా
సమయంలో కనీసం 5 పదాలను
విద్యార్థులు ఉచ్ఛరించేలా ఎంహెచ్ఆర్డీ ప్రణాళిక రూపొందించింది. నమస్కారం,
మీ పేరు ఏమిటి?, నా పేరు, మీరు ఎలా ఉన్నారు? వంటి ప్రశ్నలు, సమధానాలు ఇచ్చి వాటిపై అవగాహన కల్పించనుంది. నిర్దేశించిన వాక్యాలను
రోజుకొక భాష వంతున డిసెంబర్ 21లోపు దేశంలోని అధికారిక భాషలైన
22 భాషల్లో పరిచయం పూర్తి చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని
పాఠశాలల్లో భాషా పరిచయం కార్యక్రమం అమలు
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మానవ
వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : దేశ భాషలపై
విద్యార్థులకు కనీస అవగాహనను కల్పించేందుకు
ఒకటి, రెండు తరగతులకు ఇంటి
పని ఇవ్వకూడదు
ఒకటి, రెండు తరగతుల
పిల్లలకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎమ్హెచ్ఆర్డీ)
స్పష్టం చేసింది. ఈ మేరకు ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల సంచులు ఎంత బరువు
ఉండాలో నిర్ధారిస్తూ నవంబర్ 27న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు
జారీ చేసింది.
ఎమ్హెచ్ఆర్డీ ఆదేశాలు ప్రకారం...
·
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి,
రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి.
·
3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల
విజ్ఞానం మాత్రమే ఉండాలి.
·
విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని
చెప్పకూడదు.
·
ఎన్సీఈఆర్టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు
నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి.
పాఠశాల
విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2006లోనే చట్టం
చేసింది. ఈ చట్టం ప్రకారం.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ఎలాంటి బరువులతో కూడిన పుస్తకాల సంచులను మోయకూడదు. పై
తరగతులకు చెందిన విద్యార్థులు తమ శరీర బరువులో పుస్తకాల సంచి బరువు పది శాతానికి
మించకూడదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకటి,
రెండు తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : కేంద్ర మానవ
వనరుల మంత్రిత్వ శాఖ
పౌల్ట్రీ ఇండియా
సదస్సు ప్రారంభం
పౌల్ట్రీ
ఇండియా 12వ సదస్సును కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి
హైదరాబాద్‌లో నవంబర్ 28న ప్రారంభించారు. మూడురోజులపాటు
జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ
పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి. ఇటలీ, ఇజ్రాయెల్, చైనా, సింగపూర్,
యూఎస్ఏ, జర్మనీ, బెల్జియం,
సౌత్ కోరియా, నెదర్లాండ్స తదితర 75కుపైగా దేశాలకు చెందిన కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పౌల్ట్రీ
ఇండియా-2018 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎక్కడ : హైదరాబాద్
ఎంప్లాయబిలిటీ
ర్యాంకింగ్‌లో బెంగళూరు ఐఐఎస్సీ
‘గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్’లో
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 28వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రాన్స్ కు చెందిన హెచ్ఆర్ కన్సల్టెన్సీ
కంపెనీ రూపొందించిన నివేదికను టైమ్స్ హయ్యర్ ఎడ్యేకేషన్ నవంబర్ 15న ప్రచురించింది. ఈ జాబితాలో 150కిగాను భారత్ నుంచి
కేవలం మూడు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. బెంగళూరులోని ఐఐఎస్సీ 28వ స్థానంలో నిలవగా, ఐఐటీ-ఢిల్లీకి 53వ స్థానం, ఐఐఎం-అహ్మదాబాద్‌కి 144వ స్థానం దక్కింది. గతేడాది ఇదే ర్యాంకింగ్‌సలో ఐఐటీ-ఢిల్లీ 145వ స్థానం పొందింది. ఈ జాబితా తొలి మూడు ర్యాంకులను అమెరికా
విశ్వవిద్యాలయాలు సొంతం చేసుకున్నాయి. హెచ్ఆర్ కన్సల్టెన్సీ ‘ఎమర్జింగ్’ అంశంపై సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా 150 విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరులోని
ఐఐఎస్సీ 28వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : హెచ్ఆర్
కన్సల్టెన్సీ కంపెనీ
ఎక్కడ : గ్లోబల్ యూనివర్సిటీ
ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్‌లో
గజ తూపాను కారణంగా
26 మంది
మృతి
తమిళనాడులోని
నాగపట్టణం, వేదారణ్యంల మధ్య నవంబర్ 16న తీరం దాటిన గజ తుపాను
కారణంగా తమిళనాడులో 26 మంది మృతి చెందారు. భారీ వర్షాలు,
ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ దాటికి దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరిలు అతలాకుతలమయ్యాయి. తూపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తూపాను కారణంగా భారీ మొత్తంలో
ఆస్తి, పంట నష్టం జరిగింది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా
నిలిచిపోయింది. తూపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)
బృందాలు పడవలతో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గజ తూపాను
కారణంగా 26 మంది మృతి
ఎప్పుడు : నవంబర్ 16
ఎక్కడ : తమిళనాడు
కేఎంపీ ఎక్స్‌ప్రెస్
వే ప్రారంభం
హరియాణాలోని
గుర్‌గ్రామ్ జిల్లాలో 83 కిలోమీటర్ల కుండ్లి-మనేసర్-పల్వాల్
(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రారంభించారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్-ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.
మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం
ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటులోకి వచ్చింది.
వల్లభ్‌గఢ్- ముజేసర్ మెట్రో రైల్ లింక్
నిర్మాణానికి రూ.580 కోట్లు
ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి
రూ.989 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జాతీయ రాజధాని
ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల
రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం
పట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుండ్లి-మనేసర్-పల్వాల్
(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ
ఎక్కడ : గుర్‌గ్రామ్,
హరియాణ
ఏనుగుల ప్రత్యేక
ఆసుపత్రి ప్రారంభం
దేశంలోనే
తొలిసారిగా ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆసుపత్రిని ఆగ్రా డివిజనల్ కమిషనర్
అనిల్ కుమార్ నవంబర్ 16న ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్(యూపీ)లో
మథుర, ఆగ్రా సమీపంలో గల ఫరా బ్లాక్ ఛుర్మురా గ్రామంలో ఈ
ఆసుపత్రిని ఆ రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ఏనుగులకు వైర్లెస్ ఎక్స్-రే,
లేజర్ చికిత్స, డెంటల్ ఎక్స్-రే, థెర్మల్ ఇమేజింగ్, అల్టాస్రోనోగ్రఫీ, హైడ్రోథెరఫీ, క్వారంటైన్ సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో
అందుబాటులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి
ఏనుగుల ఆసుపత్రి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎక్కడ : ఛుర్మురా
గ్రామం, ఫరా బ్లాక్, ఉత్తరప్రదేశ్
గ్లోబల్ టాలెంట్
ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం
గ్లోబల్
యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం లభించింది. ఈ
మేరకు 63 దేశాలతో రూపొందించిన జాబితాను స్విట్జర్లాండ్‌కు
చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ నవంబర్ 20న విడుదల చేసింది. ఈ
జాబితాలో అయిదోసారీ స్విట్జర్లాండ్ అగ్రస్థానం పొందగా డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స
దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్
(గ్లోబల్ లిస్టులో 13వ స్థానం)కు మొదటి స్థానం దక్కింది. ఈ
జాబితాలో చైనా 39వ ర్యాంకు పొందింది.
భారత్... టాలెంట్ పూల్‌లో సగటు స్థాయి
కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులో
మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్
పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ,
సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్
యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 53వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఐఎండీ
బిజినెస్ స్కూల్, సింగపూర్
జమ్మూకశ్మీర్
అసెంబ్లీ రద్దు
జమ్మూకశ్మీర్
అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ నవంబర్ 21న ఉత్తర్వులు
జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న
నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని గవర్నర్ ప్రకటించారు. మెజారిటీని
నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై
ప్రభావం చూపుతుందని మరొక కారణంగా ఆయన పేర్కొన్నారు.
బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ-
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన
విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త
చేతనావస్థలో ఉంచారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 89(87+2
నామినేటెడ్) సభ్యులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్
అసెంబ్లీ రద్దు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : గవర్నర్
సత్యపాల్ మాలిక్
రక్షణ వ్యవస్థలోకి
మూడు శతఘ్నులు
దేశ రక్షణ
వ్యవస్థలోకి మూడు అధునాతన శతఘు్నలు చేరాయి. మహారాష్ట్రలోని దియోలాలి ఫీల్డ్
ఫైరింగ్ రేంజెస్‌లో నవంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి నిర్మలా
సీతారామన్ వీటిని సైన్యంలో ప్రవేశపెట్టారు. వీటిలో ఎం777 ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్లు, కె9
వజ్ర శతఘు్నలతో పాటు ఆయుధాలను సరిహద్దులకు చేరవేసే ఫీల్డ్ ఆర్టిలరీ
ట్రాక్టర్(ఫ్యాట్)లు ఉన్నాయి. అమెరికా 2016 నవంబర్‌లో రూ.5,070 కోట్లతో నుంచి కొనుగోలు చేసిన ఎం777 ఏ2(155 ఎంఎం-39 క్యాలిబర్)హోవిట్జర్ శతఘు్నలు 30 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలను తుత్తునియలు చేయగలవు. వీటిని ఎత్తైన
ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తేలికగా రవాణా చేయొచ్చు.
దక్షిణకొరియాకు చెందిన థండర్-9ను అభివృద్ధి చేసి కె9 వజ్ర(155 ఎంఎం-52 క్యాలిబర్)
యుద్ధ ట్యాంకును రూపొందించారు. స్వీయచోదక శక్తితో కూడిన కె-9
వజ్ర వేరియంట్స్‌ను బట్టి ఈ ట్యాంకులు 30 కి.మీ నుంచి 58 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. అలాగే శతఘు్నలను యుద్ధ సమయంలో
సరిహద్దుకు తరలించేందుకు అవసరమైన 6x6 ఫీల్డ్ ఆర్టిలరీ
ట్రాక్టర్(ఫ్యాట్)లను అశోక్ లేలాండ్ సంస్థ నుంచి సైన్యం కొనుగోలు చేసింది. 10
టన్నుల బరువును ఈ ట్రక్కులు అవలీలగా మోసుకెళ్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ
వ్యవస్థలోకి మూడు కొత్త శతఘు్నల ప్రవేశం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రక్షణ మంత్రి
నిర్మలా సీతారామన్
ఎక్కడ : దియోలాలి
ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్, మహారాష్ట్ర
జల మార్గాలపై తొలి టర్మినల్ ప్రారంభం
జల్ మార్గ్ వికాస్
ప్రాజెక్టులో భాగంగా దేశీయ జల మార్గాలపై నిర్మించిన తొలి మల్టీ-మోడల్ టర్మినల్‌ను
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న ప్రారంభించారు. అనంతరం కోల్ కతా నుంచి వారణాసికి వచ్చిన
తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో
గంగా నదిపై ఈ టర్మినల్ ను నిర్మించారు. టర్మినల్ సహా మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతీయ జల రహదారి-1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై
నిర్మిస్తుండగా ప్రస్తుతం ప్రారంభమైన టర్మినల్ వాటిలో మొదటిది.
ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ
(ఐడబ్ల్యూఏఐ - ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్ మార్గ్ వికాస్’ ప్రాజెక్టును చేపట్టింది.
ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర
ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల
మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ
ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మల్టీ-మోడల్ టర్మినల్
ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రధానమంత్రి న రేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
సుప్రీంకోర్టులో
ధర్మాసనాల సంఖ్య పెంపు
భారత సుప్రీంకోర్టులో
ధర్మాసనాల సంఖ్య 11 నుంచి 14కి పెంచుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
రంజన్ గొగోయ్ నవంబర్ 13న నిర్ణయించారు. కొత్తగా నలుగురు
న్యాయమూర్తులు విధుల్లో చేరడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటివరకు 24 మంది న్యాయమూర్తులతో 11 బెంచ్‌ల ద్వారా కేసుల విచారణను నిర్వహిస్తున్నారు. ఇకపై ధర్మాసనాల సంఖ్య 14 కానుండటంతో కేసుల సత్వర విచారణకు కొంతవరకు అవకాశం లభించనుంది. కొత్త
రోస్టర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. సబ్జెక్టుల
వారీగా రోస్టర్ విధానాన్ని మాజీ సీజేఐ దీపక్ మిశ్రా 2018
ఫిబ్రవరిలో ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టులో ధర్మాసనాల
సంఖ్య 14కి పెంపు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
రంజన్ గొగోయ్
పోర్టుబ్లెయిర్‌లో ప్రారంభమైన ‘సింబెక్స్-2018’
సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్ దేశాల మధ్య ఒప్పంద
విన్యాసాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నవంబర్ 10న ఘనంగా
ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు జరిగే సింబెక్స్ - 2018లో పాల్గొనేందుకు ఇరుదేశాల నౌకలు పోర్టుబ్లెయిర్‌కు చేరుకున్నాయి.
ఇప్పటికే భారత యుద్ధ నౌకలు చేరుకోగా... నవంబర్ 10న రిపబ్లిక్
ఆఫ్ సింగపూర్ యుద్ధ నౌకలు పోర్టుబ్లెయిర్‌కు వచ్చాయి. ఆ దేశ నౌకాదళానికి భారత నేవీ
బృందం ఘనంగా స్వాగతం పలికింది. నవంబర్ 12 వరకు
పోర్టుబ్లెయిర్ తీరంలో జరిగే విన్యాసాల్లో భారత యుద్ధ నౌకలైన రణ్వీర్ క్లాస్
యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కద్మత్, ఐఎన్ఎస్ కిర్చి, ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సుకన్య, ఐఎన్ఎస్ శక్తి పాల్గొననున్నాయి.
వీటితో పాటు సింధుఘోష్ తరగతికి చెందిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధుకీర్తితో పాటు
ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, రిపబ్లిక్
ఆఫ్ సింగపూర్ నేవీ తరఫున ఆర్ఎస్ఎస్ ఫర్మిడబుల్, ఆర్ఎస్ఎస్
స్టెడ్‌ఫాస్ట్, ఆర్ఎస్ఎస్ యూనిటీ, ఆర్ఎస్ఎస్
విగార్, ఆర్ఎస్ఎస్ వాలియంట్, డీప్ సీ
రెస్క్యూ వెహికల్ నౌకతో పాటు ఆర్చర్ క్లాస్ జలాంతర్గామి ఆర్ఎస్ఎస్ స్వార్డ్స్‌మాన్‌తో
పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు విన్యాసాల్లో
పాల్గొంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింబెక్స్-2018 ఉత్సవాలు
ఎప్పుడు : నవంబర్ 10 నుంచి 22 వరకు
ఎందుకు : సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్ దేశాల మధ్య ఒప్పంద
విన్యాసాలు
ఎక్కడ : పోర్టుబ్లెయిర్
25 ప్రాంతాల పేర్లు మార్పుకు కేంద్రం ఆమోదం
ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా
దాదాపు 25 నగరాలు,
గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల
మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే, పశ్చిమ
బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న
ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా,
ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా
రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్ జిల్లా ఔటర్
వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర
జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్ జిల్లా
పిండారిని పందు-పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా
సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు. ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల
ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను
కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్
రూపానీ వెల్లడించారు.
ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన..
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం
యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం
లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని
వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం
చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని
మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా 25 నగరాలు, గ్రామాల
పేర్లను మార్చేందుకు కేంద్రం ఆమోదం
ఎప్పుడు : ఈ ఏడాది కాలంలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారతదేశ వ్యాప్తంగా
59 నిమిషాల్లోనే
కోటి రూపాయల రుణం
లఘు, చిన్న, మధ్య
తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ)లు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే
రూ.కోటి దాకా రుణాలు పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను (www.psbloanin59minutes.com)
ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 2న
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లడుతూ... నిబంధనలను అనుసరించి 2 శాతం దాకా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. ఎంఎస్ఎంఈలు చేసే ఎగుమతులకు
ముందస్తుగాను, ఆ తర్వాత ఇచ్చే వడ్డీ రాయితీని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. మొత్తం
మీద ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు తీసుకున్నట్లు ఆయన
ప్రకటించారు.
ప్రస్తుతం రూ. 5 కోట్ల దాకా ఆదాయాలు ఉన్న
సంస్థలను లఘు సంస్థలుగాను, రూ. 5-75 కోట్ల
దాకా ఆదాయాలున్న వాటిని చిన్న సంస్థలుగా, అంతకు మించి రూ. 250
కోట్ల దాకా ఆదాయం ఉన్నవి మధ్య స్థాయి సంస్థలుగాను పరిగణిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 59 నిమిషాల్లోనే కోటి రూపాయల
రుణం మంజూరుకు ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీలో
సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం
ఢిల్లీలో యమునా నదిపై
నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నవంబర్ 4న ప్రారంభించారు. ఆధునిక
సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య
ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ
కూడా గణనీయంగా తగ్గనుంది. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు
కాగా వెడల్పు 35 మీటర్లు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న
ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154
మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడవచ్చు.
మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి
నిర్మాణాన్ని ప్రతిపాదించగా 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ
ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : అరవింద్ కేజ్రివాల్
ఎక్కడ : ఢిల్లీ
ఆడపులి ‘అవని’ ని కాల్చి చంపిన అటవీశాఖ
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి
‘అవని’
అలియాస్ టీ-1 ని అటవీశాఖ అధికారులు
కాల్చిచంపారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉన్న అవని
గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను చంపేసిందని అధికారులు
భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు
విఫలమవడంతో మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు
హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీ సహాయంతో నవంబర్ 2న రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని
వేటాడి కాల్చి చంపారు. అవనికి పది నెలల రెండు పిల్లలు ఉన్నాయి.
అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి
యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు
ఆదేశించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆడపులి ‘అవని’
ని కాల్చి చంపిన అటవీశాఖ
ఎప్పుడు : నవంబర్ 2
ఎక్కడ : బొరాటి అటవీ ప్రాంతం, యావత్మాల్ జిల్లా, మహారాష్ట్ర
ఎందుకు : మ్యాన్ ఈటర్‌గా మారినందుకు
అరిహంత్ తొలి అణు
నిరోధక గస్తీ పూర్తి
భారత నౌకాదళానికి చెందిన అణు
జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి
చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న వంబర్ 5న వెల్లడించారు. దేశీయంగా
తయారైన తొలి అణు జలాంతర్గామి అయిన అరిహంత్ గరిష్టంగా 3,500
కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు.
అరిహంత్ విజయవంతం కావడంతో నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే ఆరో దేశంగా
భారత్ అవతరించింది. ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్-2000 యుద్ధ
విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా
అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా,
రష్యా, బ్రిటన్, చైనా,
ఫ్రాన్స్ లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద
ఐఎన్ఎస్ అరిహంత్‌తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిది కాగా, రెండోదైన
ఐఎన్ఎస్ అరిధమన్ తయారీ 2018లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
అరిహంత్‌ను అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి
సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది.
అరిహంత్ విశేషాలు...
·
అరిహంత్ అంటే శత్రు సంహారిణి అని అర్థం.
·
జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పన్నెండు కె-15 బాలిస్టిక్ క్షిపణులను
అరిహంత్ మోసుకెళ్లగలదు.
·
ఐఎన్ఎస్ అరిహంత్ పొడవు, వెడల్పులు వరుసగా 110
మీటర్లు, 11 మీటర్లు.
·
నీటిలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగా
వాట్ల అణు విద్యుత్తు రియాక్టర్ ఇందులో ఉంటుంది.
·
ఉపరితలానికి రాకుండా సముద్ర గర్భంలోనే కొన్ని నెలలపాటు
ప్రయాణించగలదు.
·
కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2009 జూలైలో నాటి ప్రధాని
మన్మోహన్ సింగ్ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్‌ను తొలిసారిగా
సముద్రంలోకి పంపారు.
·
అనేక పరీక్షల అనంతరం 2016లో ఐఎన్ఎస్ అరిహంత్‌ను నౌకా దళంలోకి
తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్ఎస్ అరిహంత్ తొలి అణు
నిరోధక గస్తీ విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్యగా ఫైజాబాద్
పేరు మార్పు
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్
జిల్లా పేరును అయోధ్యగా మార్చనున్నారు. ఈ మేరకు అయోధ్యలో నవంబర్ 6న జరిగిన దీపోత్సవం
కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అలాగే
అయోధ్యలో రాముడి పేరిట విమానాశ్రయాన్ని, దశరథుడి పేరుతో
వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అలహాబాద్ పేరును
ప్రయాగ్‌రాజ్‌గా, లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ మైదానం
పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానంగా మార్చారు. ఫైజాబాద్ జిల్లాలోనే అయోధ్య
ఉంది.
అయోధ్య దీపోత్సవ్ కు గిన్నిస్ రికార్డ్
దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన ‘దీపోత్సవ్’
కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు మేరకు సరయూ నది ఒడ్డు వద్ద అశేష జనవాహిని
చేరుకుని 3,01,152 దీపాలను వెలిగించడంతో ’గిన్నిస్ రికార్డ్’ వరించింది. గిన్నెస్ నిర్వాహకుల
ఇందుకు సంబంధించిన ధ్రువీకరణను యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు. దీపోత్సవ్ వేడుకలకు
ప్రత్యేక అతిథిగా దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్-జుంగ్-సూక్ హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్యగా ఫైజాబాద్ పేరు మార్పు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఐటీయూలో భారత్‌కు
సభ్యత్వం
అంతర్జాతీయ
టెలికమ్యూనికేషన్స్ యూనియన్ కౌన్సిల్ (ఐటీయూ)లో భారత్‌కు మరోసారి సభ్యత్వం
లభించింది. ఈ మేరకు 2019 నుంచి 2022 దాకా నాలుగేళ్ల పాటు భారత్‌కు ఈ
సభ్యత్వం ఉంటుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా నవంబర్ 6న తెలిపారు. దుబాయ్‌లో ఐటీయూ సదస్సు సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో
భారత్‌కు 165 ఓట్లు వ చ్చాయి. ఆసియా-ఆస్ట్రలేషియా ప్రాంతం
నుంచి ఎన్నికై న 13 దేశాల్లో భారత్ మూడో ర్యాంక్‌లో నిలవగా
అంతర్జాతీయంగా మొత్తం 48 దేశాల జాబితాలో ఎనిమిదో స్థానం
దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీయూలో భారత్‌కు మరోసారి
సభ్యత్వం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్ర టెలికం శాఖ మంత్రి
మనోజ్ సిన్హా
ఏపీ, తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు
లభించింది. ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 22న జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను అంద జేశారు. పర్యాటక రంగంలో ఉత్తమ
ప్రగతి సాధించిన ఏపీ పర్యాటకశాఖకు ఇండియా టుడే అవార్డు దక్కింది. అలాగే
సుపరిపాలనలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ‘అత్యంత మెరుగైన
పెద్ద రాష్ట్రం’ అవార్డును అందుకుంది. 2017లో రాష్ట్రంలోని పాలనను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు ఈ అవార్డును
ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది
స్టేట్స్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎక్కడ : పర్యాటక రంగం, సుపరిపాలన
ఏఎన్‌యూలో ఐకాన్
సదస్సు ప్రారంభం
ఆచార్య నాగార్జున
విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో ‘వ్యర్థాల నిర్వహణ-యాజమాన్య పద్ధతుల’పై
ఎనిమిదో ఐకాన్ సదస్సు నవంబర్ 22న ప్రారంభమైంది. ఐఎస్డబ్ల్యూఎంఏడబ్ల్యూ
(ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ అండ్
వాటర్), ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సుని
నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశీ, విదేశీ
పర్యావరణ రంగ నిపుణులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిదో ఐకాన్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఐఎస్డబ్ల్యూఎంఏడబ్ల్యూ,
ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్
ఎక్కడ : ఆచార్య నాగార్జున
విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
నైపుణ్యాభివృద్ధిలో
ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్
దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవ్‌లో నవంబర్ 22న జరిగిన ‘గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్’లో ఇండియా స్కిల్స్ నివేదిక-2019ను విడుదల చేశారు. ఈ
నివేదిక ప్రకారం ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధిలో ఏపీ మొదటిస్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వరుసగా తర్వాతి
స్థానాల్లో ఉన్నాయి.
ఇండియా స్కిల్స్ నివేదిక ప్రకారం చురుకైన విద్యార్థులు కలిగిన
నగరాలలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా... చెన్నై, గుంటూరు,
లఖ్‌నవ్, ముంబై, ఢిల్లీ,
నాసిక్, పుణె వరుసగా తర్వాతి స్థానాల్లో
నిలిచాయి. అదేవిధంగా ఇంగ్లీషు, విశ్లేషణాత్మక ఆలోచనలు,
లాజికల్ సమస్యలను పరిష్కరించడం, నడవడిక వంటి
విషయాలలో ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం
విద్యార్థులు ముంద ంజలో ఉన్నారు. ఏపీ యువతకు ఉద్యోగ కల్పన కోసం పలు అంతర్జాతీయ,
జాతీయ ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యభివృద్ధి
సంస్థ ఏటా 3 లక్షల మందికి నైపుణ్యభివృద్ధిలో శిక్షణను
అందిస్తోంది. ఎంబీఏ కంటే ఇంజనీరింగ్ విద్యార్థులే రాష్ట్రంలో ఎక్కువగా, త్వరగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.
మరోవైపు నాలుగేళ్ల తర్వాత 2019లో భారీ ఎత్తున
ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఇండియా స్కిల్స్ నివేదిక పేర్కొంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆటోమోటివ్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాలు ఉద్యోగ కల్పనలో
కీలకంగా ఉండనున్నాయని వివరించింది. 2017తో ఫ్రెషర్స్
నియామకాలు 7 శాతంగా ఉండగా 2019లో 15
శాతానికి పెరుగుతాయంది. 2018లో మహిళా ఉద్యోగ
కల్పన 38 శాతం నుంచి 46 శాతానికి
పెరిగిందని, ఇదే సమయంలో పురుషు ఉద్యోగ కల్పన మాత్రం
స్వల్పంగా 47 శాతం నుంచి 48 శాతానికి
పెరిగిందని తెలిపింది.
ఇండియా స్కిల్స్ నివేదిక-2019ను
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ (యూఎన్డీపీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీయూ), పీపుల్ సా్ర్టంగ్, సీఐఐ, వీ-బాక్స్
సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి రూపొందించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నైపుణ్యాభివృద్ధిలో
ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఇండియా స్కిల్స్ నివేదిక-2019
ఎక్కడ : దేశంలో
అమరావతి ఎయిర్ షో
ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో
కష్ణానదీతీరం పున్నమిఘాట్లో నిర్వహిస్తున్న అమరావతి ఎయిర్ షో నవంబర్ 23న ప్రారంభమైంది. మూడు రోజులు
పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని యునెటైడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన గ్లోబల్ స్టార్స్
ఏరోబాటిక్ టీమ్ నిర్వహిస్తోంది. ఎయిర్ షోలో భాగంగా యూకే నుంచి వచ్చిన నాలుగు
విమానాల్లో 320 హార్స్ పవర్ ఇంజన్‌తో గంటకు 440 కి.మీ వేగంతో సెకన్‌కు 440 డైవింగ్‌తో విన్యాసాలు
నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి ఎయిర్ షో ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : పున్నమిఘాట్ , కష్ణానదీతీరం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
గోదావరి- పెన్నా
అనుసంధానం పనులకు శంకుస్థాపన
గుంటూరు జిల్లా నకరికల్లు
మండలంలో రూ.6,020.15 కోట్లతో
తలపెట్టిన గోదావరి- పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 26న శంకుస్థాపన చేశారు.
అలాగే కొండమోడు - పేరేచర్ల రహదారి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రూ.736
కోట్లతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు
మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు పెద్ద నదులను అనుసంధానం చేసి పవిత్ర సంగమానికి
శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి- పెన్నా నదుల
అనుసంధానం మొదటి దశ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు
ఎక్కడ : నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో మెడికల్
ఎలక్టాన్రిక్స్ క్లస్టర్
తిరుపతిలో గ్రీన్‌ఫీల్డ్
మెడికల్ ఎలక్టాన్రిక్స్ వస్తువుల తయారీ క్లస్టర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు
ఎలక్టాన్రిక్స్ రంగానికి చెందిన మేజెస్ ఎలక్టాన్రిక్స్ పార్కు సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మధ్య
నవంబర్ 28న ఒప్పందం కుదిరింది. సూమారు 200 ఎకరాల్లో రూ.188కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న
ఈ క్లస్టర్లో వైద్యపరమైన ఎలక్టాన్రిక్ పరికరాలను తయారుచేయనున్నారు. ఈ క్లస్టర్లో
50 అంకుర సంస్థలు అభివృద్ధి చెంది 15వేల
మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం
అంచనా వేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెడికల్ ఎలక్టాన్రిక్స్
వస్తువుల తయారీ క్లస్టర్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
మేజెస్ ఎలక్టాన్రిక్స్ పార్కు సంస్థ
ఎక్కడ : తిరుపతి, ఆంధ్రప్రదేశ్
విశాఖలో సుజల
స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం
జిల్లా చోడవరంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-వన్ ప్రాజెక్టుకు రాష్ట్ర
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 15న శంకుస్థాపన చేశారు. 2019 మేలోగా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను
పూర్తిచేసి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
మరోవైపు ఎడ్యుటెక్-2018 సదస్సును విశాఖపట్నంలో
నవంబర్ 15న సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మూడు రోజులపాటు
జరిగే ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ... విశాఖలో ఇంటెలిజెంట్ గ్లోబల్ హబ్(గేమింగ్
యూనివర్సిటీ) ఏర్పాటుకు యూనిసెఫ్ స్థలం అడిగిందని, ఇందుకు 50
ఎకరాలు కేటాయించనున్నామని తెలిపారు. యునెస్కో ఎంజీఐఈపీ తరఫున
కిర్జికిస్తాన్ మాజీ అధ్యక్షురాలు రోజా ఒతుబుయేవి ప్రారంభోపన్యాసం చేశారు.
మూడు ఎంఓయూలు...
రాష్ట్రంలో 3 ప్రాజెక్టుల అమలుకు సీఎం
సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శాంసంగ్ మైడ్రీం ప్రాజెక్టు, డిజైన్ యూనివర్సిటీ, స్కిల్లింగ్ ప్రోగ్రాం ఆన్
క్రియేటివ్ డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి.
శాంసంగ్ స్మార్ట్ క్లాసుల కార్యక్రమాన్ని, తెలుగులో తొలి
గ్లోబల్ వర్సిటీ యాప్‌ను, యునెస్కో-ఎంజీఐఈపీ అభివృద్ధి పరచిన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం-కలెక్టివ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్
ను సీఎం ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
ఫేజ్-వన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : చోడవరం, విశాఖపట్నం,
ఆంధ్రప్రదేశ్
పవర్ బోట్ ప్రపంచ
చాంపియన్‌షిప్ ప్రారంభం
5వ పవర్ బోట్
ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 16న ప్రారంభించారు. విజయవాడ వద్ద కృష్ణానదిలో భవానీఘాట్ వద్ద ఈ బోట్ రేసును
నిర్వహిస్తున్నారు. బోట్ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా
నామకరణం చేశారు. ప్రపంచంలో ఎఫ్1హెచ్2వో
రేసులు ఏడు చోట్ల నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ
రేసు. ఆరో రేసును దుబాయి, ఏడవ రేసును షార్జాలో
నిర్వహించనున్నారు.
బోట్ రేసు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...
అమరావతిలో తప్ప ఇతర దేశాల్లో ఉప్పునీటిలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు.
ప్రకాశం బ్యారేజికి ఎగువున వైకుంఠపురం దిగువున చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని,
ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణా నదిలో 9 ఐలాండ్లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని
తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై
పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5వ పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్
ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఎన్టీఆర్ సాగర్ అమరావతి,
కృష్ణానది వద్ద, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
‘రైతుబంధు’కు ఐరాస గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం
ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది.
ప్రపంచవ్యాప్తంగా రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఐరాస ఎంపిక చేయగా వాటిలో రైతుబంధు, రైతుబీమాలకు
చోటు లభించింది. ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంతర్జాతీయ సదస్సులో ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా
తెలంగాణ ప్రభుత్వానికి ఐరాస ఆహ్వానం పంపింది. ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ
సంస్థ (ఎఫ్ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో నవంబర్ 21-23
తేదీల మధ్య ఈ సదస్సును నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఐక్యరాజ్యసమితి
శ్రీసిటీలో క్రియా
విశ్వవిద్యాలయం ప్రారంభం
చిత్తురూ జిల్లా శ్రీసిటీలో
ఏర్పాటు చేసిన క్రియా విశ్వవిద్యాలయాన్ని ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు
ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్లైన్ ద్వారా నవంబర్ 18న ప్రారంభించారు.
ఉద్యోగావకాశాలు కల్పించే సిలబస్‌ను క్రియా విశ్వవిద్యాలయంలో బోధించి ఉన్నత
ప్రమాణాలతో కూడిన యువ నిపుణులను అందించాలని ఈ సందర్భంగా వెంకయ్య కోరారు. ఆర్థిక,
వ్యాపారవేత్తల సహకారంతో నాణ్యమైన విద్యను అందివ్వడానికి క్రియా
విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రియా విశ్వవిద్యాలయం
ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.
వెంకయ్యనాయుడు
ఎక్కడ : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
భూదార్ కార్యక్రమం
ప్రారంభం
రాష్ట్రంలోని ప్రతి భూభాగం, స్థిరాస్తికి విశిష్ట సంఖ్య (11 అంకెలతో) అందించే ‘భూధార్’ కార్యక్రమంను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవంబర్ 20న
ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద భూదార్కి సంబంధించిన ‘భూసేవ’ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. భూసేవ
ప్రాజెక్టులో భాగంగా భూధార్‌ను చేపట్టారు. వేలిముద్రలు, కనుపాపల
ఆధారంగా మనుషులకు ఆధార్ ఇచ్చినట్లుగా.. భూములు, ఆస్తుల
గుర్తింపునకు సర్వేనెంబర్లు, సబ్డివిజన్ల ఆధారంగా అక్షాంశ,
రేఖాంశాలతో భూధార్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.32 కోట్ల పట్టణ ఆస్తులు,
0.84 కోట్ల గ్రామీణ ఆస్తులకు భూధార్ కేటాయించనున్నారు. రెవెన్యూ,
సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీ,
పురపాలక, అటవీ శాఖలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోనున్నాయి.
భూధార్ పథకంను మొదటగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 2018
ఏప్రిల్ 11న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. భూ సేవ
ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 రకాల సేవలను అందించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూదార్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
కోనాలో గ్రీన్
ఫీల్డ్ నౌకాశ్రయం
తూర్పు గోదావరి జిల్లాలోని
కోనా గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ వాణిజ్య నౌకాశ్రయంను అభివృద్ధి చేయనున్నట్లు కాకినాడ
గేట్‌వే పోర్ట్ (కేజీపీఎల్) తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం
చేసుకున్నట్లు నవంబర్ 21న వెల్లడించింది. కేఎస్ఈజెడ్కు చెందిన 1,811
ఎకరాల్లో ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ.2,123
కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పోర్ట్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్
యూనిట్ల ద్వారా సూమారు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని
కేజీపీఎల్ పేర్కొంది. కాకినాడ సెజ్ లిమిటెడ్ (కేఎస్ఈజెడ్)కు అనుబంధ సంస్థగా
కేజీపీఎల్ పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్ ఫీల్డ్ వాణిజ్య
నౌకాశ్రయం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : కాకినాడ గేట్‌వే పోర్ట్
(కేజీపీఎల్)
ఎక్కడ : కోనా గ్రామం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
దేశంలోనే అతిపెద్ద
తెలుగుతల్లి విగ్రహం ఆవిష్కరణ
దేశంలోనే అతిపెద్ద
తెలుగుతల్లి విగ్రహంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 21న ఆవిష్కరించారు. 27 అడుగుల ఎత్తై ఈ విగ్రహాన్ని కృష్ణాజిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం వారధి
వద్ద ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు ముందు ఉల్లిపాలెం గ్రామం వద్ద కృష్ణా నదిపై
రూ.77.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఉల్లిపాలెం-భవానీపురం
వారధిని సీఎం ప్రారంభించారు. ఈ వంతెన వల్ల దివిసీమ-మచిలీపట్నం మధ్య దాదాపు 30
కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. చల్లపల్లిలో గాంధీ స్మారకవనంను కూడా
చంద్రబాబు ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే అతిపెద్ద తెలుగుతల్లి
విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఎక్కడ : ఉల్లిపాలెం వారధి, కోడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
మేక్ ఇన్
ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభం
మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్
కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ
మంత్రి నారా లోకేశ్ అమరావతిలో నవంబర్ 21న ప్రారంభించారు.
అలాగే మేక్ ఇన్ ఏపీ వెబ్సైట్, పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 10వేల అంకుర సంస్థలు ఏర్పాటు
చేస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఏపీలో భాగంగా ప్రతినెల మెంటార్షిప్, హ్యాకథాన్లను నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో ఇజ్రాయేల్ భాగస్వామ్యంతో
క్రాస్ బోర్డర్ హ్యాకథాన్లను నిర్వహిస్తామన్నారు. మేక్ ఇన్ ఏపీలో భాగంగా అంకుర
సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
ఐడియాల్యాబ్స్ నాలెడ్జ్ భాగస్వామిగా నాస్కామ్ 10,000 అంకుర సంస్థలు, ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ సంయుక్తంగా
మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్
కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
విజయనగరం గిరిజన
వర్శిటీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం
జిల్లా రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం
నవంబర్ 8న ఆమోదం
తెలిపింది. ఈ మేరకు వర్సిటీ ఏర్పాటుకు మొదటి విడతలో రూ.420
కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మరోవైపు విశాఖపట్నం
కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)లో
కేంద్రప్రభుత్వానికి ఉన్న 73.44శాతం వాటాలను పూర్తిగా
ఉపసంహరించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ వాటాలను విశాఖ, కాండ్లా, ముంబయి (జేఎన్పీటీ), పారాదీప్ ఓడరేవుల సమాఖ్యకు అప్పగించంచనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం
ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్రమంత్రివర్గం
ఎక్కడ : రెల్లి, విజయనగరం
జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఏపీ సైన్స్
కాంగ్రెస్ ప్రారంభం
4వ ఏపీ సైన్స్
కాంగ్రెస్-2018 వైఎస్ఆర్ కడప జిల్లా యోగివేమన
విశ్వవిద్యాలయం (వైవీయూ)లో నవంబర్ 9న ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్ ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ
సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2019లో
నిర్వహించనున్న 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్‌ను శ్రీకాకుళంలోని
డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2018
ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : యోగివేమన విశ్వవిద్యాలయం,
వైఎస్ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్
ఏపీ మంత్రివర్గ విస్తరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ
విస్తరణ నవంబర్ 11న జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా శాసన మండలి చైర్మన్ ఎన్ఎండీ
మహ్మద్ ఫరూక్‌ను, కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి
తీసుకున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో
ప్రస్తుతం మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలపి 26కి చేరింది.
ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమంతోపాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ
కేటాయించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు నక్సల్స్ దాడిలో చనిపోవడంతో ఆయన
కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. శ్రావణ్‌కుమార్‌కు
గిరిజన సంక్షేమం-సాధికారత శాఖను అప్పగించారు. శ్రావణ్‌కుమార్ చట్టసభల్లో సభ్యుడు
కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ మంత్రివర్గంలో కొత్తగా
ఇద్దరికి చోటు
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : మహ్మద్ ఫరూక్, కిడారి శ్రావణ్కూమార్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌కు
కొత్త అధికారిక చిహ్నం
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త
అధికారిక చిహ్నంను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిహ్నాన్ని
మల్టీ కలర్, నీలం, నలుపు తెలుపు
రంగుల్లో ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించిన అధికారిక చిహ్నంలో
పలు మార్పులు చేసి...అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు.
కొత్త అధికారిక చిహ్నంలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన
అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ
చక్రం) ఉంటుంది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు
అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం (పూర్ణఘటం) చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం
చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో
అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల
బొమ్మ ఉంటుంది. చిహ్నం పైభాగంలో ‘ఆంధ్రప్రదేశ్’ అని, కింది భాగంలో ‘సత్యమేవ
జయతే’ అని తెలుగులో రాసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
చిహ్నంలో ఇవి ఆంగ్లంలో రాసి ఉండేవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో ‘పూర్ణ
కుంభం’ ఉండేది. కానీ ధాన్య కటక మహాచైత్యంలో ఉన్నది పూర్ణఘటమే
తప్ప, పూర్ణ కుంభం కాదని...ఆ మేరకు అధికారిక చిహ్నంలో
మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ప్రముఖ స్థపతి, పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తదితరులతో ఒక కమిటీని నియమించింది.
వారి సూచనల మేరకు తగిన మార్పులతో అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసింది. అధికారిక
చిహ్నాన్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదన్న విషయంలోను
స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చిహ్నం వాడేందుకు అర్హులు...
1.
ముఖ్యమంత్రి, మంత్రులు
2. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
3. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు
4. అడ్వకేట్ జనరల్
5. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు
6. జిల్లా కలెక్టర్లు
7. సచివాలయ మధ్యస్థాయి అధికారులు, వారికి సమాన హోదా కలిగినవారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త
అధికారిక చిహ్నం
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటోతో పోస్టల్ కవర్
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ
బాలసుబ్రహ్మణ్యం పేరు, ఫొటోతో పోస్టల్ కవర్‌ను రూపొందించారు. నెల్లూరులో నవంబర్ 1న జరిగిన కార్యక్రమంలో తన పేరుతో ఉన్న పోస్టల్ కవర్ పోస్టర్‌ను బాలసుబ్రహ్మణ్యం
ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటో ఉండే స్టాంప్‌లను ఆయనకు చీఫ్
పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రహ్మణ్యం బహూకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటోతో
పోస్టల్ కవర్
ఎప్పుడు : నవంబర్ 1
ఎక్కడ : నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
సెంటర్ ఫర్
కోస్టల్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన
విశాఖపట్నంలోని యారాడ
డాల్ఫిన్ కొండపై నిర్మించనున్న నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీ
కేంద్రానికి కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నవంబర్ 2న
శంకుస్థాపన చేశారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ
కేంద్రం అందుబాటులోకి వస్తే తీరప్రాంత కోత, రక్షణ, సముద్ర కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. లక్షద్వీప్‌లో
కొత్తగా 6 డిసాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు
ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి హర్షవర్ధన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ జనరల్‌గా కేజే రమేష్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్
రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీ కేంద్రానికి శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర మంత్రి డాక్టర్
హర్షవర్ధన్
ఎక్కడ : యారాడ డాల్ఫిన్ కొండ, విశాఖపట్నం
క్షయ నివారణలో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ పురస్కారం
క్షయ నివారణలో ఉత్తమ ప్రతిభ
కనబరిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఉత్తమ పనితీరు’ పురస్కారం
లభించింది. ఈ మేరకు అసోంలోని కజిరంగలో ‘ఉత్తమ
విధానాలు-ఆవిష్కరణ’లపై నవంబర్ 2న
జరిగిన వార్షిక సదస్సులో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
జేపీ నడ్డా ఈ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రంలో క్షయ వ్యాధి బాధితుల నిర్ధరణ
కోసం 220 ఆధునిక యంత్రాలతో సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం
ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య ఉన్నారు.
మరోవైపు తల్లుల నుంచి శిశువులకు ఎయిడ్స వ్యాపించకుండా ఏపీ
తీసుకుంటున్న చర్యలకు కేంద్రం ప్రశంశాపత్రాన్ని అందజేసింది. అనంతపురం జిల్లా
జాతీయస్థాయిలో ప్రథమ స్థానం, తూర్పుగోదావరి ఆరో స్థానం
దక్కించుకున్నందుకు ఈఎంటీసీటీ (ఎలిమినేషన్ ఆఫ్ మదర్ టూ ఛైల్డ్ ట్రాన్సిమిషన్)
అఛీవర్స్ పురస్కారాన్ని కూడా రాష్ట్రం అందుకుంది. ఏపీలోని 18
ఎయిడ్స నిర్ధరణ కేంద్రాల(ఐసీటీసీ) పనితీరు ఉత్తమంగా ఉందని గుర్తించిన కేంద్రం ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్లెన్సు’ను అందజేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్షయ నివారణలో ఆంధ్రప్రదేశ్‌కు
ఉత్తమ పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 2
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ఉత్తమ పనీతీరు కనబరిచినందుకు
కడపలో ఉక్కు
కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం
వెఎస్సార్ జిల్లా కడపలో
ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 6న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ను ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ మేనేజింగ్ లిమిటెడ్ డెరైక్టరుగా గతంలో విశాఖ
స్టీల్ ప్లాంట్‌లో ఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించింది. కార్పొరేషన్‌కు
ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,000 కోట్లుగా అంచనా వేసింది.
మరోవైపు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం
విశాఖపట్నం మెట్రో ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని
నిర్మించేందుకు జారీచేసిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే
ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2,395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని కూడా తామే సొంతంగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం
ప్రకటించింది. మరోైవె పు గ్రామీణ ప్రాంతాల్లో రూ.22 వేల
వ్యయంతో తాగునీటి సరఫరా చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ‘అన్న
క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటుకూ ఆమోదం తెలిపింది.
ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు
చేయాలని తీర్మానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు
ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : వెఎస్సార్ జిల్లా కడప, ఆంధ్రప్రదేశ్
యూపీఏ హయాంలోని
వృద్ధి రేటు సవరణ
కాంగ్రెస్
నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ హయాంలో నమోదైన స్థూల
దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 28న
సవరించింది. ఈ మేరకు ‘సవరిత’ తాజా
లెక్కలను కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసింది. మైనింగ్, క్వారీయింగ్, టెలికం సహా ఆర్థిక వ్యవస్థలో కొన్ని
రంగాల్లో గణాంకాల తాజా మదింపు వల్లే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం
తెలిపింది.
సవరించిన వృద్ధి గణాంకాల ప్రకారం...
ఆర్థిక సంవత్సరం
|
పాత(శాతాలలో..)
|
కొత్త(శాతాలలో..)
|
2005-06
|
9.3
|
7.9
|
2006-07
|
9.3
|
8.1
|
2007-08
|
9.8
|
7.7
|
2008-09
|
3.9
|
3.1
|
2009-10
|
8.5
|
7.9
|
2010-11
|
10.3
|
8.5
|
2011-12
|
6.6
|
5.2
|
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైన జీడీపీ వృద్ధి రేటు సవరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
వరద అంచనాకు కొత్త టెక్నాలజీ
వర్షంతో పాటు వరద ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ‘ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌క్యాస్టింగ్ అప్రోచ్’ అనే
కొత్త టెక్నాలజీని భారత వాతావరణశాఖ(ఐఎండి) అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఐఎండీ చీఫ్
కె.జె.రాజేశ్ నవంబర్ 23న తెలిపారు. ఈ కొత్త సాంకేతిక
పరిజ్ఞానం ద్వారా వర్షాలు కురిసినప్పుడు నదులు, రిజర్వాయర్లలో
పెరిగే నీటి పరిమాణాన్ని కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. దీంతో సహాయక చర్యలతో పాటు
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
మరోవైపు సముద్రాల్లో వేడిగా ఉండే
ప్రాంతాలను గుర్తించేందుకు, తుపాన్ల
కదిలికల్ని అర్థం చేసుకునేందుకు మరో సాంకేతికతను కూడా ఐఎండి అభివృద్ధి చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరద అంచనాకు
‘ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌క్యాస్టింగ్ అప్రోచ్’
టెక్నాలజీ
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : భారత వాతావరణశాఖ(ఐఎండి)
అంగారక గ్రహంపై దిగిన ఇన్సైట్
అంగారక గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా
అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్ ‘ఇన్సైట్’ విజయవంతంగా గ్రహంపై దిగింది. ఈ మేరకు ఇన్సైట్
సుమారు ఆరు నెలలపాటు ప్రయాణం చేసి అంగారకుడి మధ్యరేఖ ‘ఎలీసియమ్
ప్లానీషియా’కు దగ్గర్లో దిగిందని నవంబర్ 27న నాసా వెల్లడించింది. రెండు, మూడు నెలల్లో రోబో..ఈ
మిషన్‌లో అంతర్భాగమైన సీస్మిక్ ఎక్స్పరిమెంట్ ఇంటీరియర్ స్ట్రక్చర్(సీస్),
హీట్ ఫ్లో అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ప్యాకేజ్(హెచ్‌పీ3) పరికరాల్ని మోహరిస్తుంది. వీటితోనే అంగారకుడి సమాచారం పొందడానికి
వీలవుతుంది.
ఇన్సైట్ వెంట పంపిన రెండు చిన్న
ఉపగ్రహాలు(మార్కో క్యూబ్‌శాట్స్) అంగారకుడిపై ఇన్సైట్ కదలికల్ని పరిశీలించి ఆ
చిత్రాల్ని భూమికి పంపుతాయి. ఈ ప్రయోగంతో అంగారక గ్రహంపైకి నాసా చేపట్టిన 8వ మిషన్ విజయవంతమైనట్లయింది.
కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి మే 5న ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ల్యాండర్ 2020, నవంబర్ 24 వరకు సేవలందించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంగారక గ్రహంపై దిగిన రోబో ఆధారిత ల్యాండర్ ‘ఇన్సైట్’
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా
జీన్ ఎడిటింగ్ చేసిన శాస్త్రవేత్తలు
చైనాలోని షెంజెన్‌కు చెందిన హే జియాంకుయ్ అనే
శాస్త్రవేత్త మానవ పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేసినట్లు నవంబర్ 26న ప్రకటించాడు. జీన్ ఎడిటింగ్ ద్వారా నవంబర్‌లో ఇద్దరు చిన్నారులు
జన్మించారని తెలిపాడు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డా.మైకెల్ డీమ్
పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ ప్రయోగం కోసం హెచ్ఐవీ/ఎయిడ్స సోకిన దంపతులను
ఎంపిక చేసుకున్నామన్నారు. ఫలదీకరణం తర్వాత మూడు నుంచి 5
రోజుల వయసున్న పిండాలను ఎడిట్ చేసి ఎయిడ్స సోకేందుకు కారణమయ్యే సీసీఆర్5 అనే ప్రొటీన్‌ను పిండాల నుంచి తొలగించామని వెల్లడించారు. పుట్టిన ఇద్దరు
బాలికల్లో ఒకరిలో మార్పిడి చేసిన రెండు జన్యువులు ఉండగా, మరో
చిన్నారిలో ఒకే జన్యువు ఉందని జియాంకుయ్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీన్ ఎడిటింగ్ చేసిన చైనా శాస్త్రవేత్త
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : హే జియాంకుయ్, డా.మైకెల్ డీమ్
సూపర్ ఎర్త్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో గ్రహం (సూపర్ ఎర్త్)ను బ్రిటన్‌లోని
క్వీన్ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగోన్నారు. సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ
గ్రహం నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమికి
కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమికన్నా మూడు
రెట్లు పెద్దగా ఉందని తెలిపారు. దీనిపై మైనస్ 170 డిగ్రీల
సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్ చుట్టూ
పరిభ్రమించడానికి దీనికి 233 రోజులు పడుతుందని అంచనా వేశారు.
రాళ్లు, మంచుతో కూడిన సూపర్ ఎర్త్‌పై నీటి వనరులు పుష్కలమని కానీ
కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త
గుల్లెమ్ అంగ్లడ ఎస్కుడే పేర్కొన్నారు. సూపర్ ఎర్త్‌ను రేడియల్ వెలాసిటీ పద్ధతి
సాయంతో గుర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో గ్రహం గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : బ్రిటన్‌లోని క్వీన్ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు
కక్ష్యలోకి చేరిన జీశాట్-29
జీఎస్ఎల్వీ మార్క్3డీ2 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించిన జీశాట్-29
ఉపగ్రహంను నవంబర్ 17న నిర్దేశిత కక్ష్య అయిన భూస్థిర
కక్ష్యలోకి చేర్చారు. నవంబర్ 14న షార్ కేంద్రం నుంచి మార్క్3డీ2 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపిన జీశాట్-29 ఉపగ్రహాన్ని 190 కిలోమీటర్లు పెరిజీ (భూమికి
దగ్గరగా) 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా)
ప్రవేశపెట్టారు. తర్వాత హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు
ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను
చేపట్టారు.
జీశాట్-29లోని ల్యాం ఇంజిన్‌లో ఉన్న 1,742
కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని నవంబర్ 15, 16న రెండు విడతలుగా
వినియోగించి కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు పెంచారు. 190
కిలోమీటర్లు పెరిజీని (భూమికి దగ్గరగా) 10,287 కిలోమీటర్ల
ఎత్తుకు పెంచుతూ అపోజీని (భూమికి దూరంగా) 35,873
కిలోమీటర్లకు తగ్గించారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో విజయవంతంగా స్థిరపరిచారు.
జీశాట్-29 సుమారు 10 ఏళ్ల పాటు సేవలను
అందించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూస్థిర కక్ష్యలోకి చేరిన జీశాట్-29
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఇస్రో
తొలి ఏఐ యాంకర్లను రూపొందించిన చైనా
ప్రపంచంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేసే
సింథటిక్ వర్చువల్ యాంకర్లను చైనా రూపొందించింది. చైనాలో ప్రతిఏటా జరిగే ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్’లో నవంబర్ 9న ఈ యాంకర్లను ఆవిష్కరించారు. చైనా ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ
జిన్హువాలో ఈ కృత్రిమమేధ యాంకర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక యాంకర్
చైనీస్ భాషలో వార్తలు చదివేలా, మరొకటి ఇంగ్లిష్‌లో చదివేలా
సమాచారాన్ని ఫీడ్ చేశారు. ఈ వర్చువల్ యాంకర్లు అలసట లేకుండా 24 గంటలు విధులు నిర్వహించడంతోపాటు మనుషుల్లా హావభావాలు పలికిస్తారు. చైనాలో
ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ, జిన్హువాలు సంయుక్తంగా ఈ
యాంకర్లను అభివృద్ధి చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో తొలి ఏఐ యాంకర్ల రూపకల్పన
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : సౌగౌ, జిన్హువా
ఎక్కడ : చైనా
ఆలోచించే సూపర్ కంప్యూటర్
మానవుని మెదడులాగే ఆలోచించే
సరికొత్త సూపర్ కంప్యూటర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే
అతిపెద్దదైన ఈ సూపర్ కంప్యూటర్ను బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన
శాస్త్రవే త్తలు రూపొందించారు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు.
మిలియన్-ప్రాసెసర్- న్యూరల్ కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ (స్పిన్నకర్)
ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్ సెకన్‌కు 200 మిలియన్ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు.
ఇందులో వాడిన ఒక్కో చిప్ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి
ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే
ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి
మరో పదేళ్లు పట్టడం విశేషం. ఈ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు. మానవ మెదడులోని న్యూరాన్స్ లాగే
ఈ కంప్యూటర్ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో
మరెక్కడా లేదని పేర్కొన్నారు. మానవుని మెదడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడానికి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్ కంప్యూటర్
ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్ ఫర్బర్ అనే శాస్త్రవేత్త చెప్పారు.
అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు
ఈ కంప్యూ టర్ దోహదపడుతుందని ఆయన అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్
కంప్యూటర్
ఎవరు : స్టీవ్ ఫర్బర్
ఎందుకు : అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే
మాట్లాడేందుకు, నడిచేందుకు..
ఎక్కడ : మాంచెస్టర్ యూనివర్సిటీ (బ్రిటన్)
జీఎస్ఎల్వీ మార్క్3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా
సంస్థ(ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్3-డీ2 రాకెట్ ప్రయోగం
విజయవంతమైంది. నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని ప్రయోగ
కేంద్రం నుంచి నవంబర్ 14న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. మార్క్3-డీ2 రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్29 ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్ అవసరాలను జీశాట్-29 తీర్చనుంది.
జీశాట్-29 విశేషాలు...
3,423 కిలోల బరువైన జీశాట్-29లో అధునాతన
పేలోడ్లను అమర్చారు. కేయూ-బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్స్, కేఏ-బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ భీమ్‌తో పాటు వన్ యూజర్ స్టీరిబుల్ భీమ్,
క్యూ/వీ- బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో
హైరిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్ అనే ఐదు
రకాల ఉపకరణాలను అమర్చారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇలాంటి పేలోడ్‌స పంపడం ఇదే
మొదటిసారి.
జీశాట్-29 ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ
కశ్మీర్‌లోని మారుమూల గ్రామాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తుంది. విలేజ్
రీసోర్స్ సెంటర్స్ అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని
అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్ఎల్వీ మార్క్3-డీ2 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఇస్రో
ఎక్కడ : సతీశ్ ధావన్ స్పేస్
సెంటర్(షార్), నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
ఇక్రిశాట్
శాస్త్రవేత్తకు ఏఎస్ఏ ఫెలోషిప్
ఇక్రిశాట్
శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కె.వర్షణేకు అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ (ఏఎస్ఏ)
ఫెలోషిప్-2018 లభించింది. ఈ మేరకు నవంబర్ 22న ఏఎస్ఏ
ప్రకటించింది. జెనెటిక్స్ గెయిన్స్ విభాగంలో సంచాలకుడిగా పనిచేస్తున్న రాజీవ్ పంటల
అభివృద్ధిలో భాగంగా జీనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్
అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 2018 సంవత్సరానికిగాను
ప్రపంచవ్యాప్తంగా 14 మందికి ఏఎస్ఏఫెలోషిఫ్ను ప్రకటించగా అందులో ముగ్గురు
మినహా మిగిలిన వారందరు అమెరికన్లే ఉన్నారు. భారత్ నుంచి ఈ జాబితాలో రాజీవ్
ఒక్కరికే చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికన్
సొసైటీ ఆఫ్ అగ్రానమీ ఫెలోషిప్-2018
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఇక్రిశాట్
శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కె.వర్షణే
రాజేంద్ర ప్రసాద్‌కు
జీవితకాల సాఫల్య పురస్కారం
ప్రముఖ
నటుడు డా. రాజేంద్ర ప్రసాద్‌కు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవిత కాల సాఫల్య పురస్కారం
లభించింది. ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 25న జరిగిన అకాడమీ 30వ వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలుగు
చిత్ర పరిశ్రమకు 42 ఏళ్లపాటు సేవలందించినందుకు గుర్తింపుగా
ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ప్రముఖ హాస్యనటుడు ఆలీ ప్రతిభా భారతి
పురస్కారాన్ని అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణానికి గుర్తింపుగా
ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ
తెలుగు అకాడమీ జీవిత కాల సాఫల్య పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ప్రముఖ నటుడు
డా. రాజేంద్ర ప్రసాద్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : తెలుగు చిత్ర
పరిశ్రమకు 42 ఏళ్లపాటు సేవలందించినందుకుగాను
అజీం ప్రేమ్‌జీకి
ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
ప్రముఖ ఐటీ
సంస్థ విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన ‘షెవాలీర్ డె
లా లెజియన్ డిఆనర్’ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్)
లభించింది. ఈ మేరకు నవంబర్ 26 ఫ్రాన్స్ ప్రభుత్వం
ప్రకటించింది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ప్రేమ్‌జీకి ఈ పురస్కారం
దక్కింది. 2018, నవంబర్ 28-29
తారీఖుల్లో జరిగే బెంగళూరు టెక్ సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా భారత్‌లో
ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండర్ జిగ్లర్ ఈ పురస్కారాన్ని ప్రేమ్‌జీకి ప్రదానం
చేయనున్నారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, విశ్వవిద్యాలయం
ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షెవాలీర్ డె
లా లెజియన్ డిఆనర్ పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : విప్రో
అధిపతి అజీం ప్రేమ్‌జీ
ఎందుకు : ఐటీ రంగానికి,
వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా
డాక్టర్ గున్న
రాజేందర్‌రెడ్డికి జాతీయ పురస్కారం
ఏపీ-తెలంగాణ
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డికి క్యాపిటల్
ఫౌండేషన్ జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు జస్టిస్ వి.ఆర్.కృష్ణ అయ్యర్ 104వ జయంతిని
పురస్కరించుకుని న్యూఢిల్లీలో నవంబర్ 20న క్యాపిటల్ ఫౌండేషన్
నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డును ప్రదానం
చేశారు. గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యన్నతికి పాటుపడినందుకుగాను రాజేందర్‌రెడ్డికి
ఈ అవార్డు దక్కింది. అలాగే కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్జోషి జీవిత సాఫల్య
పురస్కారం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్
జిత్‌సేన్ జస్టిస్ కులదీప్‌సింగ్ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యాపిటల్
ఫౌండేషన్ జాతీయ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : డాక్టర్
గున్న రాజేందర్‌రెడ్డి
ఎందుకు : గాంధేయ
విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యన్నతికి పాటుపడినందుకు
ముళ్లపూడి
నరేంద్రనాథ్‌కు ఏబీసీజెడ్ అవార్డు
ది ఆంధ్రా
షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు ‘ఏబీసీజెడ్
మెరిట్-2019’ అవార్డు లభించింది. ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన
జేబు కేటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ నవంబర్ 21న ప్రకటించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి చేసిన కృషికిగాను నరేంద్రనాథ్‌కు
ఈ అవార్డు దక్కింది. బ్రెజిల్‌లోని ఉబెరాబలో 2019 మే 3న జరగనున్న 85వ జేబు-ఇంటర్నేషనల్ జేబు కేటిల్ ఎక్స్‌పోలో
ఈ అవార్డుని అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏబీసీజెడ్
మెరిట్-2019 అవార్డు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ముళ్లపూడి
నరేంద్రనాథ్
ఎందుకు : అంతర్జాతీయ
స్థాయిలో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి కృషి చేసినందుకు
జర్నలిస్టు
స్వాతికి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు
భారత్‌కి
చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదికి లండన్ ప్రెస్
ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్-2018 లభించింది. ఈ మేరకు లండన్‌లో నవంబర్ 8న జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్‌డబ్ల్యూబీ)
అనే సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా
ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆన్లైన్లో భారతీయ జనతా పార్టీ ఐటీ
విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు. అలాగే ‘ఐ యామ్ ఏ ట్రోల్: ఇన్సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీ డిజిటల్
ఆర్మీ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెస్
ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్-2018
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : జర్నలిస్ట్
స్వాతి చతుర్వేది
ఎక్కడ : లండన్,
ఇంగ్లండ్
ఎందుకు : సామాజిక
మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు
భారతీయ
విద్యార్థులకు మార్కొనీ అవార్డు
భారత్‌కి చెందిన ఇంజనీరింగ్
విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక మార్కొనీ సొసైటీ అవార్డు లభించింది. స్మార్ట్‌ఫోన్‌తో
తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని గాలి నాణ్యతను అంచనా వేసే
వినూత్న యాప్‌ను రూపొందించినందుకుగాను వీరికి ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలోని
భైరవి విద్యాపీఠ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తన్మయ్ శ్రీవాస్తవ, కనిష్క్ జీత్, ప్రేరణ ఖన్నాల విద్యార్థుల బృందం ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను
వాడటం చాలా తేలిక, ఉచితం అని మార్కొనీ సొసైటీ ఈ సందర్భంగా
పేర్కొంది. విద్యార్థుల బృందం రూ.1.09 కోట్ల నగదు బహుమతి
గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ విద్యార్థులకు అమెరికా
మార్కొనీ సొసైటీ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : తన్మయ్ శ్రీవాస్తవ, కనిష్క్ జీత్, ప్రేరణ ఖన్నా
ఎందుకు : గాలి నాణ్యతను అంచనా వేసే
వినూత్న యాప్‌ను రూపొందించినందుకు
ఎన్ రామ్‌కు రాజా
రామ్మోహన్ రాయ్ అవార్డు
హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్
రామ్‌కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు లభించింది. ఈ మేరకు పాత్రికేయ
రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను రాయ్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రెస్
కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నవంబర్ 5న ప్రకటించింది. జాతీయ పత్రికా దినోత్సవం
నవంబరు 16న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
మరోవైపు గ్రామీణ పాత్రికేయ విభాగంలో రుబీ సర్కార్ (దేశ్‌బంధు
పత్రిక), రాజేశ్ పరశురామ్ (పుఢారీ పత్రిక)లకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డులను పీసీఐ
ప్రకటించింది. అలాగే అభివృద్ధి పాత్రికేయ విభాగంలో వీఎస్ రాజేశ్ (కేరళ కౌముది),
ఫోటో జర్నలిజంలో సుభాష్ పాల్ (రాష్టీయ్ర సహారా), మిహిర్ సింగ్ (పంజాబ్ కేసరి)లకు, వ్యంగ్య చిత్రాల
విభాగంలో పి నరసింహా (నవ తెలంగాణ)కు కూడా అవార్డులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్ రామ్
ఎందుకు : పాత్రికేయ రంగంలో విశేష సేవలు
అందించినందుకు
సంగీతకారుడు ఇమ్రత్
ఖాన్ కన్నుమూత
ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్
ఇమ్రత్ ఖాన్ (83) నవంబర్ 23న కన్నుముశారు. గుండెపోటు కారణంగా అమెరికాలో నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు. సితార్, సుర్‌బహర్‌లను
వాయించడంలో ఇమ్రత్ ఖాన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఇమ్రత్ ఖాన్‌కు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇవ్వగా.. తన ప్రతిభను కేంద్రం
ఆలస్యంగా గుర్తించిందంటూ అవార్డును తిరస్కరించారు. 400 ఏళ్ల
సంగీత చరిత్ర ఉన్న ఇమ్రత్ ఖాన్ కుటుంబమే బాస్ సితార్‌గా పిలిచే సుర్బహర్ వాయిద్య
పరికరాన్ని తయారు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ
శాస్త్రీయ సంగీతకారుడు కన్నమూత
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ఉస్తాద్
ఇమ్రత్ ఖాన్ (83)
ఎక్కడ : అమెరికా
ఎందుకు : గుండెపోటు
కారణంగా
కన్నడ నటుడు
అంబరీశ్ కన్నుమూత
ప్రముఖ
కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ (66)
కన్నమూశారు. గుండెపోటు కారణంగా బెంగళూరులో నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు. 200కు పైగా చిత్రాల్లో
నటించిన అంబరీశ్ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగానూ ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో
మంత్రి పదవులు చేపట్టారు.
1952 మే 29న
మండ్య జిల్లా మద్దూరు తాలుకా దొడ్డరాసినకెరెలో జన్మించిన అంబరీశ్ అసలు పేరు
మలవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. 1994లో రాజకీయాల్లో
ప్రవేశించిన అంబరీశ్ 1998, 1999, 2004లో మండ్య నుంచి ఎంపీగా
గెలిచారు. 2012లో కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కన్నడలో 205 చిత్రాల్లో నటించిన అంబరీశ్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో కలిపి మొత్తం 230 సినిమాల్లో నటించారు. 1992లో ప్రముఖ తెలుగు నటి
సుమలతను వివాహం చేసుకున్నారు. 1972లో విడుదలైన తన తొలి
చిత్రం నాగరహావు సినిమాకే అంబరీశ్ జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే 2005లో ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2009లో ఫిల్మ్‌ఫేర్
లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కన్నడ
నటుడు, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : అంబరీశ్ (66)
ఎక్కడ : బెంగళూరు,
కర్ణాటక
ఎందుకు : గుండెపోటు
కారణంగా
నవ్యాంధ్రతో నా నడక పుస్తకావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంను అమరావతిలో నవంబర్ 25న ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సమస్యలు, వాటిని
పరిష్కరించడానికి అవలంభించిన విధానాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార
శైలిని ఈ పుస్తకంలో ఐవైఆర్ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఐవైఆర్ కృష్ణారావు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
తదుపరి సీఈసీగా
సునీల్ అరోరా
తదుపరి ప్రధాన ఎన్నికల
కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులయ్యారు. ఈ మేరకు అరోరా నియామకానికి నవంబర్ 26న రాష్ట్రపతి రామ్‌నాథ్
కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980 బ్యాచ్
రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017,
ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార,
నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
అలాగే ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్టైల్
శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కూడా బాధ్యతలు
నిర్వహించారు.
సాధారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా
65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తదుపరి ప్రధాన ఎన్నికల
కమిషనర్(సీఈసీ) నియామకం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : సునీల్ అరోరా
ఏఈఆర్బీ చైర్మన్‌గా
గుంటూరు నాగేశ్వరరావు
అణుశక్తి నియంత్రణ మండలి
(ఏఈఆర్బీ) చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ నవంబర్ 26న తెలిపింది. దీంతో ఏఈఆర్బీ
చైర్మన్‌గా నాగేశ్వరరావు మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రసుతం అణుశక్తి నియంత్రణ
మండలిలో ప్రాజెక్టు డిజైన్ సేఫ్టీ కమిటీ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు
నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రాజెక్టుకు
కూడా నాయకత్వం వహిస్తున్నారు.
గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో జన్మించిన నాగేశ్వరరావు అనంతపురం
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1975లో భారత అణు ఇంధన విభాగంలో చేరారు. ‘వరల్డ్
అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేషన్స్’ (వానో) నుంచి ‘న్యూక్లియర్ ఎక్స్‌లెన్స్’ పురస్కారం అందుకున్నారు.
సురక్షిత, సమర్థ, విశ్వసనీయ అణు
విద్యుత్తు కేంద్రాల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, అనుభవానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణుశక్తి నియంత్రణ మండలి
(ఏఈఆర్బీ) చైర్మన్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : గుంటూరు నాగేశ్వరరావు
మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకావిష్కరణ
‘మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ మోదీ
గవర్నమెంట్’ పుస్తకంను న్యూఢిల్లీలో నవంబర్ 27న జరిగిన కార్యక్రమంలో
ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పుస్తకం తొలి ప్రతిని రాష్ట్రపతి
రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు. విద్య, ప్రజా వైద్యం,
తదితర అంశాలపై మొత్తం 51 వ్యాసాలు ఉన్న ఈ
పుస్తకాన్ని ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రాయ్, కిశోర్ దేశాయ్,
అనిర్బన్ గంగూలీ రచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా,
ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : బిబేక్ దేబ్రాయ్, కిశోర్ దేశాయ్, అనిర్బన్ గంగూలీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఈడీ పూర్తిస్థాయి
డెరైక్టర్‌గా ఎస్కే మిశ్రా
ఎన్ఫోర్స్మెంట్
డెరైక్టరేట్(ఈడీ) పూర్తిస్థాయి డెరైక్టర్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఎస్కే
మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే
దాకా (రెంటింట్లో ఏది ముందైతే అది) పదవిలో కొనసాగనున్నారు. ఆదాయ పన్ను శాఖ
ప్రిన్సిపల్ స్పెషల్ డెరైక్టర్‌గా అక్టోబర్ 27న నియమితులైన
మిశ్రాకు మూడు నెలల కాలానికి ఈడీ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన ఈడీ బాధ్యతలు చేపట్టారు. మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈడీ పూర్తిస్థాయి డెరైక్టర్‌గా
ఎస్కే మిశ్రా నియామకం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
మాల్దీవుల నూతన
అధ్యక్షుడిగా మహ్మద్ సోలి
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా
ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబర్ 17న ప్రమాణస్వీకారం చేశారు. సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోలితో సమావేశమైన మోదీ
పలు అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం
మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాని
హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్ హయాంలో భారత్-మాల్దీవుల
మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన
యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా
ప్రమాణస్వీకారం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఇబ్రహీం మహ్మద్ సోలి
ఎక్కడ : మాల్దీవులు
ఇంటర్‌పోల్ కొత్త
అధ్యక్షుడిగా కిమ్ యాంగ్
అంతర్జాతీయ పోలీస్ సంస్థ
ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా దక్షిణకొరియాకు చెందిన కిమ్ జాంగ్ యాంగ్
నియమితులయ్యారు. ఈ మేరకు యూఏఈలోని దుబాయ్‌లో నవంబర్ 21న జరిగిన వార్షిక సమావేశంలో
కిమ్ యాంగ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్ తెలిపింది. దీంతో
కిమ్ యాంగ్ 2020 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటివరకు
ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్ హాంగ్వే 2018 సెప్టెంబర్ లో అదృశ్యం అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడి
నియామకం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : కిమ్ జాంగ్ యాంగ్
కెనడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారతీయ రైతు
కెనడాకి చెందిన ‘కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ (సీఏహెచ్ఎఫ్ఏ)’లో భారతీయ రైతు పీటర్ పావిటర్ ధిల్లాన్‌కు చోటు
లభించింది. కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికిగాను ఆయనకు ఈ గౌరవం
దక్కింది. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్ఎఫ్ఏలో చేర్చి
వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది. కెనడాలో అత్యధిక క్రాన్బెర్రీ పంటను
పండించినందుకుగాను ధిల్లాన్‌ను సంస్థ ఇలా గౌరవించింది.
పంజాబ్, హోషియార్‌పూర్‌లోని పాండోరి గ్రామం
నుంచి 1950లో ధిల్లాన్ తండ్రి రాచ్పాల్ సింగ్ ధిల్లాన్
కెనడాకి వెళ్లారు. 19 ఏళ్ళ వయస్సులోనే రాయల్ కెనడియన్
మౌంటెడ్ పోలీస్‌లో చేరిన తొలి ఇండో కెనడియన్‌గా పీటర్ ధిల్లాన్ గుర్తింపు పొందాడు.
తర్వాత కాలంలో డిప్యూటీ షరిఫ్గా ఎదిగిన ధిల్లాన్ 1993లో
వ్యాపారంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం 2000 ఎకరాల్లో క్రాన్బెర్రీ
పండిస్తున్న ధిల్లాన్ ప్రపంచంలో అత్యధిక క్రాన్బెర్రీ సాగుచేస్తున్నవారిలో రెండో
స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కెనడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారతీయ
రైతు
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : పీటర్ పావిటర్ ధిల్లాన్
ఎక్కడ : కెనడా
ఎందుకు : వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు
చేసినందుకు
ఫ్లిప్‌కార్ట్
సీఈవో బిన్నీ బన్సల్ రాజీనామా
దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్
సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ బిన్నీ బన్సల్ నవంబర్ 13న పదవికి
రాజీనామా చేశారు. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణల
కారణంగా బిన్నీ రాజీనామా చేసినట్లు వాల్‌మార్ట్ ప్రకటించింది. ఒక మహిళ చేసిన
లైంగిక వేధింపుల ఆరోపణల వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే
సంస్థలో వాటాదారుగా, బోర్డులో సభ్యుడిగా బిన్నీ
కొనసాగనున్నాడు.
మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను
స్థాపించారు. 2018 మేలో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా సచిన్ బన్సల్ తన
మొత్తం 5.5% వాటాను విక్రయించేసి తప్పుకోగా, బిన్నీ బన్సల్ మాత్రం కంపెనీలోనే కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్లిప్‌కార్ట్ సహ
వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : బిన్నీ బన్సల్
కోర్ట్ ఆఫ్
అప్పీల్స్‌కు భారతీయ-అమెరికన్
అమెరికాలో సుప్రీంకోర్టు
తర్వాత రెండో ఉన్నత న్యాయస్థానం డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా
భారతీయ-అమెరికన్ న్యాయవాది నియోమి రావు నామినేట్ అయ్యారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని
వైట్‌హౌస్‌లో నవంబర్ 14న దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్ ప్రకటించాడు. దీంతో అమెరికా సెనెట్ ఆమోదిస్తే డీసీ సర్క్యూట్లో కోర్టులో
నియోమి రావు రెండో భారతీయ అమెరికన్ జడ్జి అవుతారు. జస్టిస్ బ్రెట్ కెవెనా స్థానంలో
ఆమె నామినేట్ అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్
అప్పీల్స్ జడ్జిగా భారతీయ-అమెరికన్
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : నియోమి రావు
ఎక్కడ : అమెరికా